అనసూయకు బాగా కోపమొచ్చింది… అవును, ఆమె అంతే… ఇతర సెలబ్రిటీల్లాగా ఎవరేమైనా ట్రోలింగుకు దిగితే మూసుక్కూర్చోవడం కాదు, ఈమె మాటకుమాట సమాధానమిస్తుంది… అవసరమైతే కేసు పెట్టి, తాటతీస్తానురోయ్ అని బెదిరించగలదు కూడా… ప్రత్యేకించి ఆమె బట్టల మీదో, వేసే వేషాల మీదో కామెంట్స్ గనుక చేస్తే ఆమెకు చర్రుమంటుంది… అసహనంతో ఊగిపోతుంది… ఈమధ్య ఇన్‌స్టాలో AMA session (ask me anything) లో ఓ నెటిజన్ అడిగాడు… ‘‘నిన్ను ఆంటీ అని పిలవాలా..? అక్క అని పిలవాలా..?’’ […]
ఆహా… బాలయ్య ఓ గుడ్ హోస్ట్… మహేశ్‌బాబు ఎపిసోడ్‌కు హ్యూమన్ టచ్…
నిజం చెప్పాలంటే బాలకృష్ణ ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ అనే షోను హోస్ట్ చేయడం నాకూ నచ్చలేదు మొదట్లో… హీరోలు టీవీ షోలు చేయడం ద్వారా ప్రజల్లోకి మరింత బలంగా వెళ్తారనీ, తమ పాపులారిటీని సుస్థిరం చేసుకుంటారనీ భావించేవాళ్లలో నేనూ ఒకడిని… నాని, జూనియర్, నాగార్జున తదితరుల బిగ్‌బాస్, మీలో ఎవరు కోటీశ్వరుడు షోల హోస్టింగును అందుకే ఇష్టపడ్డాను… చిరంజీవి ఇందులో ఫ్లాప్… ఐనాసరే, బాలయ్య ఆహాలో షో చేయడం నచ్చలేదు… ఎందుకంటే..? టీవీ వేరు, ఓటీటీ వేరు… […]
చివరకు రష్మి, సుధీర్ లవ్వుకూ కత్తెర..? ఈమెతో కొత్త కథ మొదలెట్టేశారా..?!
తెలుగు టీవీ తెర సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్… తను ఏ సీరియళ్లలోనూ నటించడు… ప్రతి షోకు యాంకరింగు చేస్తానంటూ ముందుకురాడు… కానీ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది తనకు… తను ఆ ఆదరణకు అర్హుడే… డౌన్‌టుఎర్త్… స్కిట్ కోసమే అయినా సరే, తన మీదే సెటైర్లు పేల్చినా సరే, లైట్ తీసుకుంటాడు… కానీ మల్లెమాల కంపెనీ తాలూకు వర్గకలహాల్లో పడి నలుగుతున్నాడు, ఒక్కో షోలో అడ్డంగా కత్తిరించుకుంటూ వెళ్తున్నారు… అది మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం… పండుగ […]
కొడిగడుతున్న ‘కార్తీకదీపం’… ఎహె, ఫోఫోవమ్మా అనేస్తున్నారు ప్రేక్షకులు…
ఒక చిన్న డిస్‌క్లెయిమర్ :: ఈ కథనంలో చెప్పబోయే ఏ సీరియలైనా సరే… ఓ రీతి, రివాజు ఉండదు… తలాతోకా లేని కథనం, లాజిక్కుల్లేని కథ, దిక్కుమాలిన దర్శకత్వం, తలకుమాసిన కేరక్టరైజేషన్స్, ప్రేక్షకులు ఎడ్డోళ్లు అనే క్రియేటివ్ పొగరు, ప్రత్యేకించి తెలుగు ఆడవాళ్లకు బుర్రల్లేవనే పైత్యం… ఇత్యాది అవలక్షణాలతో కునారిల్లుతున్న సీరియల్సే… ఒక్కటీ మినహాయింపు కాదు… మరీ ప్రత్యేకంగా మగ వేషాలన్నీ ఆలోచనల్లో, అడుగుల్లో హిజ్రా తరహా… ఇంకా చెప్పుకుంటే పోతే దిమాక్ ఖరాబ్… కానీ కోట్ల […]
నాగ బాబుగారొచ్చారు కదా… శ్రీముఖి ఎగిరిపోయింది… దీపిక పిల్లిలా వచ్చి చేరింది…
1.67 …. ఏదైనా టీవీలో రియాలిటీ షోకు, అదీ భారీగా ఖర్చుపెడుతున్న షోకు ఈ రేటింగ్ వచ్చిందంటే… మూసుకోవోయ్, ఇక చాలు అని ప్రేక్షకుడు స్పష్టంగా తిరస్కరించినట్టు లెక్క… ఆ షోలో నాణ్యత లేదని తేల్చేసినట్టు లెక్క… బ్రహ్మాండమైన రీచ్, సాధనసంపత్తి ఉన్న చానెల్లో ఓ షోకు ఆ రేటింగ్ వస్తే ప్రేక్షకుడు అభిశంసించినట్టు లెక్క… ఈటీవీ వాడి జబర్దస్త్‌కు పోటీగా స్టార్‌మాటీవీలో ప్రసారమయ్యే కామెడీ స్టార్స్ అనే షో దుర్గతి అది… హైదరాబాద్ బార్క్ రేటింగులు […]
పండుగపూట… మరీ ఉప్పూకారం లేని పథ్యం చప్పడి తిండి వడ్డించారు కదరా…
పండుగపూట ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉన్న చౌక వినోదం టీవీ… థియేటర్లకు వెళ్తే నిలువుదోపిడీ… మన ధనిక ప్రభుత్వ అత్యంత తీవ్ర ఔదార్యం పుణ్యమాని ఈ థియేటర్ల వాళ్లు నిలబెట్టి జేబులు కత్తిరిస్తారు… పైగా ఒమిక్రాన్ భయం ఉండనే ఉంది… వేరే బయట వినోద కార్యక్రమాలు, పర్యటనలకు వెళ్లేంత సీన్ లేదు… సో, టీవీయే శరణ్యం… కానీ ఈసారి భోగి, సంక్రాంతి పండుగ వంటల్ని మన ప్రధాన టీవీలు ఈటీవీ, జీతెలుగు, స్టార్‌మా మరీ చప్పిడి పథ్యం […]
వర్షకు ఏమైంది..? హఠాత్తుగా తీసిపారేశారు… కొత్త మొహాన్ని తెచ్చి రుద్దేశారు..!!
అవును, టీవీ సీరియళ్ల గురించి కదా మనం అప్పుడప్పుడూ చెప్పుకుంటున్నది… ఏ సీరియల్ చూసినా ఏమున్నది గర్వకారణం… వేల అవలక్షణ భరితం… దుర్గంధపూరితం… కానీ అవి లేక టీవీలు లేవు, టీవీలు లేక వినోదం లేదు, వినోదం లేక జీవితం లేదు… ఇదంతా ఓ పిచ్చి సర్కిల్… వేల కోట్ల యాడ్స్ డబ్బు… మన జేబుల్లో నుంచి కాజేసేదే… అందుకని అప్పుడప్పుడూ మాట్లాడుకోవాలి… ఈ సీరియళ్లు జీడిపాకం బాపతు కదా… ఏళ్ల తరబడీ, వేల ఎపిసోడ్లు సాగుతూ […]
సతీ త్రినయని..! నాగార్జున సమర్పించు ఓ మెంటల్ టీవీ సీరియల్..!!
నిజం చెప్పండి… చిన్నప్పటి నుంచీ మీరు చదివిన పుస్తకాలు, చూసిన సినిమాలు, అనుభవించిన సీరియళ్లు గట్రా మొత్తం వడబోసి చెప్పండి… మనిషికి హఠాత్తుగా మతిమరుపు ఎందుకొస్తుంది..? గతం ఎందుకు మరిచిపోతాడు..? మళ్లీ ఎప్పుడు, ఏ సందర్భంలో పాతవన్నీ గుర్తొస్తాయి..? మన సినిమా పండితులు, మన సాహిత్యకారుల మేధస్సు చంద్రముఖి సినిమాలో రజినీకాంత్కన్నా పెద్దది కాబట్టి… సీరియళ్ల రచయితల మేధస్సు మరింత పెద్దది కాబట్టి… సింపుల్ సమాధానాలు దొరుకుతయ్… 1) యాక్సిడెంట్లలో గానీ, కొట్లాటల్లో గానీ హీరోకు తలపై […]
రోజా ఇక మారదు… మావల్లకాదని నిష్క్రమించిన సుధీర్, రాంప్రసాద్…
ఈటీవీ జబర్దస్త్ షో తనకు పెద్ద ప్లస్ అని చెబుతూ ఉంటుంది రోజా… కానీ ఆ షోకు రోజా ప్లసా, మైనసా..? అప్పుడప్పుడూ ఆ సందిగ్ధం ప్రేక్షకుల్లో కలుగుతూ ఉంటుంది… ఈ షో డైరెక్ట్ చేసే డైరెక్టర్లు, మల్లెమాల ప్రొడక్షన్స్ వాళ్లకు తప్ప ఆమె వైఖరి కొన్నిసార్లు స్కిట్లు చేసే కమెడియన్లకు కూడా చిర్రెక్కిస్తుంది… కానీ ఎవరూ ఏమీ అనలేరు పాపం… పోనీ, ఆమె ఏమైనా తెలుసుకుంటుందా..? నో… తాను ఏదో గొప్ప సాధించేసినట్టు ఫీలై, పకపకా […]
యాంకర్ ప్రదీప్ షోలకు ఏమిటీ రేటింగ్స్..? ఎక్కడ భారీగా తేడా కొడుతోంది..?!
యాంకర్ ప్రదీప్… తెలుగులో సుమ తరువాత టాప్ రేటెడ్ యాంకర్… అఫ్కోర్స్, సుమ రేంజ్ ఎవరూ అందుకోలేనిది… సున్నితమైన స్పాంటేనియస్ జోకులతో ప్రోగ్రామ్ రన్ చేయగలడు… ఏ కోణం నుంచి చూసినా ఓ గుడ్ యాంకర్ తను… కానీ తను చేసే ఏ ప్రోగ్రామూ ఎందుకు క్లిక్ కావడం లేదు..? బార్క్ రేటింగులను చూస్తుంటే హఠాత్తుగా మౌజ్ ఓచోట ఆగిపోయి, ఈ ప్రశ్న ఎదుట నిలిచింది… సూపర్ క్వీన్ అని ఓ షో చేస్తున్నాడు కదా… దాని […]
బహుశా సిద్ధార్థ్ ఇప్పట్లో లేవకపోవచ్చు… ఆ ప్రభావం శర్వానంద్‌పై కూడా…
కొందరిని చూస్తే జాలేస్తుంది… హీరో సిద్ధార్థ్‌ను చూసినా అంతే… ఒకప్పుడు తెలుగులో పాపులర్ హీరో… మంచి లవ్ బాయ్ ఇమేజీతో కుమ్మేశాడు… తరువాత గ్రహణం పట్టింది… అప్పుడప్పుడూ తన స్థాయికి మించిన ఏవో రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ నెటిజనంతో తిట్లు కూడా తింటుంటాడు… తమిళానికే పరిమితమయ్యాడు… అసలు తెలుగులో ఓ హిట్ లేక ఎన్నేళ్లయింది..? మొహంలో కూడా ఆ కళ లోపించింది… ఆమధ్య శర్వానంద్‌తో కలిసి ఓ సినిమా చేశాడు… సిద్ధార్థ్ దురదృష్టం శర్వాకు కూడా పట్టినట్టుంది… […]
ఫాఫం సుధీర్… పండుగ ప్రత్యేక షోల నుంచి కూడా వెళ్లగొట్టేశారు…
మొన్న ఏదో జబర్దస్త్ స్కిట్లో సుడిగాలి సుధీర్ అంటాడు… ‘‘ఢీ మానేశాను కదా, ఇంకేం మానేయాలిరా’’ అని… ఢీ నుంచి ఎందుకు వెళ్లగొట్టారు తనను, మల్లెమాలలో డైరెక్టర్ల గ్రూపులు ఏమిటి..? మల్లెమాల శ్యాంరెడ్డికి సుధీర్ మీద అంత ఆగ్రహం ఎందుకు కలిగింది అనే వివరాల్లోకి మళ్లీ మళ్లీ వద్దులే గానీ… సుధీర్ మీద మల్లెమాల కోపం కంటిన్యూ అవుతూనే ఉంది… తెలుగు టీవీ ప్రోగ్రాముల్ని రెగ్యులర్‌గా చూసే ప్రేక్షకుల్లో సుధీర్ అభిమానులు చాలా ఎక్కువ… ఈటీవీని, మల్లెమాలను […]
సుడి‘గాలోడు’… ఆ డైలాగ్ విని రోజా కూడా సిగ్గుతో తలపట్టుకుంది…
సాధారణంగా ఈటీవీ జబర్దస్త్ అంటేనే బూతు… ఆ షో కేరక్టరే అది… కామెడీ పేరిట కాస్త డర్టీనెస్ దట్టించి వదులుతుంటారు… వాటిల్లో జోకులు వినీ వినీ యాంకర్లకు, జడ్జిలకు కూడా ఇమ్యూనిటీ వచ్చేసింది ఎప్పుడో… సో, అలాంటి చెణుకులు, డైలాగులు వినీ విననట్టుగా విని, తమ పేమెంట్స్ దృష్టిలో పెట్టుకుని, పకపకా నవ్వేస్తారు… డ్యూటీ మరి…! అంతగా ఇమ్యూనిటీ వచ్చేసిన రోజా కూడా సుడిగాలి సుధీర్ వదిలిన ఓ డైలాగ్ విని సిగ్గుతో తలదించుకుని, తలపట్టుకుంది… మనో […]
ఓహో… ఇదంతా సిరి ప్లానింగేనా..? ఇప్పుడిక ‘బ్రహ్మ’తో సహజీవనమా…!!
ఇంత పెద్ద తెలుగు సినిమా, టీవీ, వెబ్ వీడియోల ప్రపంచంలో ఒక దీప్తి, ఒక సిరి, ఒక శ్రీహాన్, ఒక షణ్ముఖ్ చాలా చిన్న చేపలే కావచ్చుగాక… కానీ చెప్పుకోవాలి… వర్తమాన కలల ప్రపంచంలో, గ్లామర్ ఫీల్డులో ప్రేమ బంధాలు ఎంత చంచలమో, వాటిని ప్రేమబంధాలు అనాలో లేదో, జీవితాల్ని ఎంత లైట్‌గా తీసుకుంటున్నారో చెప్పుకోవాడానికి… ప్రస్తుతం వార్తల్లో ఉన్న వ్యక్తులు కాబట్టి చెప్పుకోవాలి… చైతూ, సమంత జీవితాలే కాదు, ఇవీ ఉదాహరణలే… విషయం ఏమిటంటే..? దీప్తి […]
తెగదెంపులు… ఆమే తెంపేసింది… బ్రేకప్… బిగ్‌బాస్ టీం కళ్లు చల్లబడ్డయ్..?!
సరిగ్గా పది రోజుల క్రితం… ముచ్చట ఒక స్టోరీ రాసింది… బిగ్‌బాస్ టీం రెండు జంటల ‘‘కాపురాల్లో’’ నిప్పులు పోసిందని..! 1) షణ్ముఖ్, దీప్తి సునైన జంటకు బ్రేకప్ తప్పదని… 2) సిరి, శ్రీహాన్ సహజీవనం కూడా చిక్కుల్లో పడక తప్పదని… ‘‘కనీసం నీ అంతరాత్మకైనా నువ్వు జవాబుదారీగా ఉండు’’ అని దీప్తి పెట్టిన ఇన్‌స్టా పోస్టు, షన్నూను తన లిస్టు నుంచి తీసిపారేయడం, ఫినాలే తరువాత జరిగిన ఊరేగింపుకు వెళ్లకపోవడం, శ్రీహాన్ ధోరణి కూడా అలాగే […]
ఈమె యాంకర్ రష్మికి సరిసాటియా..? మల్లెమాలకు భలే దొరుకుతారు…!!
బార్క్ రేటింగ్స్ తిరగేస్తుంటే ఓచోట మౌజ్ ఆగిపోయింది… అది ఈటీవీ వాళ్ల ఢీ షో రేటింగ్… జస్ట్, నాలుగు మాత్రమే… (హైదరాబాద్)… నవ్వొచ్చింది… ఎంచక్కా చక్కగా నడిచే షోను ఆగమాగం చేసుకున్నారు కదా అనిపించింది… ప్రేక్షకులకు కూడా రష్మి, సుధీర్ కామెడీ స్కిట్స్, కెమిస్ట్రీ ఫీట్స్ హాయిగా ఉండేవి… ఆది, దీపిక పిల్లి తదితరులు తరువాత వచ్చి చేరినవాళ్లు కదా… రష్మి, సుధీర్ మాత్రం చాలా సీజన్లుగా చేస్తున్నారు… జనానికి అలవాటయ్యారు… ఏమైందో ఏమో, ఆ మల్లెమాల […]
ఫాఫం నాగార్జున… ఎందరు స్టార్లను పట్టుకొచ్చినా ఫినాలే రేటింగ్స్ తుస్…
ఫాఫం, నాగార్జున… అంతకన్నా ఫాఫం బిగ్‌బాస్… మరీ మొన్నటి సీజన్ పూర్తిగా చంకనాకిపోయింది… (ఈ పదాన్ని వాడినందుకు క్షమించండి… ఫ్లోలో వచ్చేసింది… ఐనా ఆ సీజన్ అలాగే ఏడ్చింది, ఈ పదమూ సరిపోదు… దరిద్రపు కంటెస్టెంట్లు, వాళ్ల ప్రవర్తన, బోరింగ్ టాస్కులు, పరమ వికారపు ఎలిమినేషన్ ఎపిసోడ్లు ఎట్సెట్రా… షన్నూ, సిరి వెగటు ప్రేమాయణం సరేసరి… ఒక్క శ్రీరాంచంద్ర మినహా…) నాగార్జున హోస్టింగ్ అంత బాగా నచ్చిందా..? లేక నా హోస్టింగ్ లేకపోతే నా స్టూడియో నుంచి […]
వన్ సెకండ్… ఓంకార్ చేతికి బిగ్‌బాస్… బొచ్చెడు మార్పులుచేర్పులు…
మీరు టీవీ, సినిమాల రెగ్యులర్ ప్రేక్షకులయితే మీకు ఓంకార్ గురించి తెలిసే ఉంటుంది… అదేనండీ, వన్ సెకండ్ అంటూ ఓ విచిత్రమైన గొంతుతో ఖంగుమంటాడుగా… తనే… 2006 నుంచీ టీవీ ఫీల్డులో ఉన్నాడు… రకరకాల టీవీ షోలు హోస్ట్ చేస్తాడు, నిర్మిస్తాడు… రెండుమూడు సినిమాలు కూడా తీసినట్టున్నాడు… ఇప్పుడు తన చేతికి బిగ్‌బాస్ వెళ్లిపోనుంది… అర్థం కాలేదా..? బిగ్‌బాస్ నిర్మాణ వ్యవహారాల్ని ఈ ఓంకార్ సొంత నిర్మాణ సంస్థ ఓక్ ఎంటర్టెయిన్మెంట్స్ చేపట్టనుంది… అంటే ఇన్నాళ్లూ రకరకాల […]
ఫోన్లలో తెగ వీడియోలు చూస్తున్నారు సరే… ఓటీటీల్లో దేని ‘దమ్ము’ ఎంతో తెలుసా..?
ఈ సినిమా ఫలానా ఓటీటీలో చూడండి… ఆ వెబ్ సీరిస్ ఈ ఓటీటీలో చూడండి… ఇప్పుడు ఇలాంటి ప్రచారాలు, ముచ్చట్లు, పోస్టులు ఎక్కువైపోయాయి కదా… ఎన్ని ఓటీటీ చందాలు కట్టగలడు ఒక ప్రేక్షకుడు..? దాదాపు 40 ఓటీటీ ప్లాట్‌ఫారాలు ఉన్నాయి ఇండియాలో… ఓ 30 మనకు అక్కరలేదు అని తీసేసినా, పది ఓటీటీల్లో చూడబుల్ కంటెంట్ ఉంటుందని అనుకున్నా, వాటన్నింటికీ చందాలు కట్టేంత స్థోమత ఉందా సగటు ప్రేక్షకుడి దగ్గర..? అవును గానీ, అసలు ఇండియాలో ఎంత […]
ఇద్దరూ ఇండియన్ ఐడల్సే… రేవంతుడు వద్దట… శ్రీరామచంద్రుడే ముద్దట…
శ్రీరాంచంద్రా… బహుపరాక్… ఆహా ఓటీటీ వాళ్లు ఏదో ఓ టైం చూసి నీకూ హ్యాండిస్తారేమో అని ఒక్కసారి ఆయన్ని హెచ్చరించాలని అనిపిస్తోంది… అదేమిటి..? పాపం, బిగ్‌బాస్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు, టాప్ ఫైవ్‌లో నిలిచాడు, ఓడినాసరే, దాదాపుగా అంతిమ విజేత తనే అనిపించుకున్నాడు… ఆ బిగ్‌బాస్ టీం ఫిక్సింగ్ యవ్వారమో, షణ్ముఖ్‌తో బెడిసిన వ్యవహారమో గానీ మూడో ప్లేసులో ఆగిపోయాడు… మధ్యలో ఇస్తానన్న 20 లక్షలూ వదిలేశాడు… మొదటి నుంచీ తన ఆటతీరుతో, మాటతీరుతో ప్రశంసలు పొందాడు… […]
- « Previous Page
- 1
- …
- 27
- 28
- 29
- 30
- 31
- …
- 41
- Next Page »