పాత్రలు ఒక్కసారిగా పల్టీకొట్టడం అంటే ఇదే… అసలు ఈటీవీ జబర్దస్త్ షో అంటేనే నేను, నేను లేకపోతే అది లేదు అనుకుని, జీతెలుగు వాడి కళ్లకు గంతలు కట్టి, అదిరింది అనే కాపీ కామెడీ షో స్టార్ట్ చేసి, ఏవేవో ప్రయోగాలు చేసి, చివరకు దాన్ని ఫ్లాప్ చేసి, సొంతంగా యూట్యూబ్ చానెల్‌కు పరిమితం అయిపోయాడు నాగబాబు… ఈ దెబ్బకు బజార్నపడిన కమెడియన్లను ఇప్పుడు కామెడీ స్టార్స్ పేరిట మాటీవీ ఓ కొత్త కామెడీ షో ద్వారా […]
సుమ..? ప్రదీప్..? అనసూయ..? నో, నో… రష్మి అంటేనేే ప్రేక్షకులకు లవ్వు..!
తెలుగు టీవీ టాప్ యాంకర్ ఎవరు..? అంటే, ప్రేక్షకుల్లో పాపులర్ ఎవరు అని..! సాధారణ పాఠకుడికి ఇది పిచ్చి ప్రశ్న… కానీ రెగ్యులర్‌గా టీవీ ప్రోగ్రామ్స్ చూసేవాళ్లకు కాస్త ఇంట్రస్టింగు ప్రశ్నే… ప్రశ్న చదవగానే వెంటనే… చాలామంది ‘‘ఇందులో పెద్దగా ఆలోచించడానికి ఏముంది..? ఏజ్ బార్ కనకాల సుమ ఫిమేల్ నంబర్ వన్ యాంకర్… సేమ్ ఏజ్ బార్ ప్రదీప్ మేల్ నంబర్ వన్ యాంకర్… మిగతావాళ్లు ఎవరూ వాళ్లను రీచ్ కాలేరు’’ అని తేలికగా చెప్పేస్తారు… […]
జీతెలుగు చానెల్‌కు పగిలిపోయింది… సంక్రాంతి వంటకాలు ‘స్టమక్ అప్సెట్’…
దొరుకుతున్నది కదాని ఆబగా తినేయాలని ప్రయత్నించకూడదు… అది ఎదురు తన్నే ప్రమాదముంది…! ఈ సత్యం చాలామందికి తెలుసు… కానీ జీటీవీ వాడికి తెలియదు… అందుకే అడ్డంగా బోల్తాకొట్టాడు… తలబొప్పికట్టింది… చేతులు, మూతులు కాలినయ్… ఇప్పుడు ఆకులు పట్టుకుంటాడేమో ఇక…! అర్థం కాలేదా..? సంక్రాంతి వేళ రెండురోజులపాటు రెచ్చిపోయి ప్రత్యేక షోలు ప్రసారం చేశాడు కదా… ఇప్పుడు విశేషం ఏమిటో తెలుసా..? రేటింగ్స్‌లో ఎక్కడో కొట్టుకుపోయాయి ఆ రెండు ప్రోగ్రాములూ… తాజా రేటింగ్స్‌లో టాప్ 30 జీ చార్ట్ […]
సుమ..! కేవలం సోలో షో..! కాదంటే ఫ్లాపే… ఇదీ తాజా ఉదాహరణ…!!
సుమ..! తెలుగు జగమెరిగిన గజ వ్యాఖ్యాత… ప్రస్తుత వెబ్ భాషలో అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే… టాప్ యాంకరిణి..! ఆమె పరిచయం చెప్పడం అంటే అదొక ఫూలిష్ ప్రయత్నమే… కానీ మరీ టాప్, టాపర్, టాపెస్ట్ ఏమీ కాదు… బోలెడు ఫెయిల్యూర్స్… తాజాగా జీటీవీ కోసం చేస్తున్న బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ అనే టీవీ షో..! సుమ ఏం చేసినా సక్సెసే అనేది పెద్ద అబద్ధం… ఆమె కొన్నింటికే పరిమితం… తన స్పాంటేనిటీ, తన ఎనర్జీ, తన ఫ్లూయెన్సీ, తన […]
సుధీర్- రష్మి బంధానికీ కత్తెర..! ఆల్టర్నేట్ జోడీని రుద్దుతున్నారు..!!
ఫాఫం, సుడిగాలి సుధీర్ మీద సానుభూతి ప్రవాహం ఇంకా ఆగడం లేదు తెలుగు నెటిజన్లలో…! మునుపెన్నడూ లేనిది, అకస్మాత్తుగా ఓ పండుగ స్పెషల్ షో నుంచి ఈటీవీ, మల్లెమాల కలిపి తప్పించారు కదా… అసలు సుధీర్ లేకుండా ఈటీవీలో స్పెషల్ షో ఏమిటని తెలుగు టీవీ ప్రేక్షక సమాజం బిత్తరపోయింది కదా… ఎవరెవరో ఏదేదో రాసేశారు… ఇక సుధీర్‌కు ఈటీవీలో కత్తెరే, మల్లెమాలకు కోపం వస్తే ఇక ఎక్కడికక్కడ పీలికలే అనే వార్తలు కూడా బోలెడు రాసేశారు […]
జీటీవీ రుచిమరిగింది..! ఎందుకు వదులుతుంది… వరుస దరువులు..!!
గతంలో పండుగ లేదా ప్రత్యేక సందర్భం ఏది వచ్చినా సరే… ఈటీవీ స్పెషల్ ప్రోగ్రామ్స్‌తో ముందంజలో ఉండేది… ఆ జబర్దస్త్ టీం కమెడియన్లకే తలా కొంత తాయిలం పెట్టేసి, ఓ మూడు గంటల ప్రోగ్రామ్ చేసి వదిలేది… దీనివల్ల ఈటీవీకి యాడ్స్ డబ్బులు ప్లస్ రీచ్ ప్లస్ రేటింగ్స్ ప్లస్ నాన్-ఫిక్షన్ కేటగిరీలో పైచేయి… ఇవన్నీ దక్కేవి… మాటీవీ చేస్తే బిగ్‌బాస్ వంటి పెద్ద పెద్ద రియాలిటీ షోలు తప్ప ఈ పండుగ స్పెషల్స్ గట్రా ఆనేవి […]
ఆశిక పడుకోన్..! ఈ త్రినయని తెలుగు టీవీని దున్నేస్తున్నది..!
త్వరలో కార్తీకదీపం ముగియబోతోంది… దీపా పాత్రధారి ప్రేమి విశ్వనాథ్ ఏ కారణాల చేత టాప్ టీవీ స్టార్ అయ్యిందో పక్కనపెడితే… ఇక ఆమె తెలుగులో ఇప్పట్లో వేరే టీవీ సీరియల్లో రాకపోవచ్చు… ఆమె సినిమాల్లో నటించనుంది… వదినమ్మలోని సుజిత పని అయిపోయింది… దాని రేటింగ్స్ ఘోరంగా పడిపోయినయ్… గృహలక్ష్మి కస్తూరి, దేవత సుహాసిని ఎట్సెట్రా ఒకరిద్దరు ఏ రేటింగుల మాయ పుణ్యమో వెలుగుతున్నారు… కానీ అశిక పడుకోన్ గురించి చెప్పుకోవాలి ఓసారి… ఒక సీరియల్లో నటిస్తూ… మొదటిసారి […]
మాటీవీని దాటిన జీటీవీ..? తెలుగు టీవీ చానెళ్ల ఫైట్ ఇప్పుడు రక్తికట్టింది..!!
మాటీవీని జీటీవీ దాటేసింది..! తెలుగు టీవీ సర్కిళ్లలో ఒక్కసారిగా విపరీతంగా ప్రచారం అవుతున్న వార్త ఇది… అంతేకాదు, జీ తెలుగు వాడు ఇదుగో ఇలా ఓ మెసేజ్ బాగా సర్క్యులేట్ చేస్తున్నాడు… డీజే పెట్టుకుని జీటీమ్స్ తీన్మార్ డాన్సులు చేస్తున్నయ్… ఫుల్ జోష్… నిజమే మరి… రేటింగ్స్ మాయగాడు మాటీవీని దాటేయడం అంటే మాటలా..? దాన్ని కొట్టేయడం అంటే మజాకా..? మాటీవీ మొహం పగిలిపోవడం అంటే పెద్ద వార్తే… అయితే..? ఇక్కడ కొన్ని తిరకాసులున్నయ్… అవి చెప్పుకుందాం.,. […]
థూమీబచె..! ఇదేం ఖర్మరా తండ్రీ… సంక్రాంతి పండుగ అంటే ఇదా..?
ఒక ఈటీవీ లేదా ఒక మల్లెమాల యాజమాన్యాలకో… లేదా ఇంకెవరో టీవీ చానెల్ ప్రబుద్ధుడికో… అంత లోతయిన అవగాహన ఉంటుందని అనుకోలేం కానీ…. పండుగపూట కాసిన్ని మంచి ముచ్చట్లు చెప్పుకోవాలనే మినిమం సోయి మాత్రం ఉండాలి కదా…! ఈమాట అనడానికిముందు ఓ సంగతి చెప్పాలి… ప్రపంచవ్యాప్తంగా పత్రికలు ఇప్పుడు ఓ ట్రెండ్ పాటిస్తున్నయ్… ఓ పెద్ద పేలుడో, ప్రమాదమో, విపత్తో… వంద మంది మరణించవచ్చుగాక, రక్తం ఏరులైపారవచ్చుగాక… ఫస్ట్ పేజీలో ఆ నెత్తుటివాసన కనిపించకూడదు… మనిషిని డిస్టర్బ్ […]
డాన్స్ ప్లస్..! అంటే సర్కస్ ఫీట్లే కాదు… తెలుగు భాషపై పోట్లు కూడా…!!
మొన్నమొన్నటిదాకా సాగిన బిగ్‌బాస్ గురించి చెప్పి మళ్లీ విసిగించడం కాదు… అందులో అమ్మారాజశేఖర్ అనే కంటెస్టెంటు తన కిలికిలి భాషతో తెలుగు ప్రేక్షకుల దుంపతెంచాడు… ఆ నీచ బిగ్‌బాసుడికి ఆ భాష తెలుగులా వినిపించేది, మోనాల్‌ను మాత్రం తెలుగు నేర్చుకో అని ఉరిమేవాడు… హారిక, అభిజిత్‌లపై అరిచేవాడు… మన ఖర్మ అనుకున్నాం… రాజశేఖర్ బిగ్‌బాస్ వదిలేరోజున యావత్తు తెలుగు ప్రేక్షకజనం ఆనందాశ్రువులతో వీడ్కోలు పలికి పండుగ చేసుకున్నారు… ఎవరో అడిగారు ఫేస్బుక్లో… ‘‘ఒరేయ్ బిగ్‌బాసూ, చాలా భాషల్లో […]
ప్రదీపా, నీకు బాగా ఎక్కువైంది బిడ్డా…! వేదిక మీద ఆమెకు ఆ ర్యాగింగు ఏమిట్రోయ్..?!
ఆలియా భట్… జగమెరిగిన టాప్ స్టార్… దీపిక, ప్రియాంకలకు దీటుగా పాపులారిటీ సంపాదించిన నటి… ఏజ్ తక్కువ… కానీ రేంజ్ చాలా ఎక్కువ… నటనలో ఎంత ఇరగదీసినా, తన జనరల్ నాలెడ్జి మీద మాత్రం మస్తు జోకులు… భలే సెటైర్లు నడుస్తూ ఉంటయ్… పెద్దగా చదువుకోకపోవడం, తండ్రి కూడా ప్యూర్ సినిమాల కోసమే అన్నట్టుగా పెంచడం… ఆమెకు చాలా దైనందిన వ్యవహారాలపై పెద్దగా సోయి లేదు… నిజానికి ఆమెకు అవి అవసరం లేదు… దాన్ని ఓ తప్పుగానో, […]
సుడిగాలి సుధీర్… పక్కకు పెట్టేయడం కాదు.., చెబుతున్న సాకులే ఇన్సల్టింగు..!!
తెలుగు బుల్లితెర సూపర్ స్టార్ ఎవరు..? చెప్పడానికి వేరే ఆప్షనే లేదు…! సుడిగాలి సుధీర్..!! కాస్త సమీపంలో ప్రదీప్ కనిపిస్తాడు కానీ… ప్రదీప్ బేసిక్‌గా యాంకర్… కామెడీ టైమింగు, సున్నితంగా డీల్ చేయడం గట్రా బాగుంటుంది, కానీ అంతకుమించి పోలేడు… కానీ సుధీర్… రియల్ పర్ఫార్మర్..! యాంకరింగు, డాన్సులు, కామెడీ, మ్యాజిక్, సింగింగ్, స్టంట్స్… వాట్ నాట్… ఏదంటే అది చేయగలడు… తెలుగు టీవీకి రజినీకాంత్ తను…! మరి అలాంటి వాడిని ఈటీవీ ఎందుకు దూరం పెట్టింది…? […]
ఓంకార్ క్లిక్కయితే మాటీవీ సేఫ్… సుమ, రవి ఫెయిలైతే జీవాడి మొహం పగిలిపోవడమే…
సంక్రాంతి రాకముందే దాని పేరిట టీవీలో ఓ స్పెషల్ షో చూసేయాలా…? చూసేయాల్సిందే… డబ్బులు ఇచ్చేవాడు ఎప్పుడు ప్రసారం చేయమని అడిగితే అప్పుడు వర్జ్యం, వారం ఏమీ చూడకుండా వేసేయాల్సిందే… మొన్నటి ఆదివారం వేళాపాళా లేకుండానే ‘పార్టీకి వేళాయెరా’ అని జీవాడు న్యూఇయర్ షో వేసేశాడు కదా… ఇప్పుడూ అంతే… సంక్రాంతి ఎప్పుడైనా రానీ… ఓ షో వేసేద్దాం అంటున్నాడు… వాడి అవసరం అది… ఇవేవీ చేయకపోతే వాడి నంబర్ వన్ స్థానం కాస్తా గల్లంతయ్యే ప్రమాదం […]
ఫాఫం శ్రీముఖి..! జబర్దస్త్ వీడినవాళ్ల గతేంటి..? రోజాయే గెలిచిందా..?
బిగ్‌బాస్ మస్తు పైసలు ఇచ్చింది శ్రీముఖికి..! కానీ కెరీర్‌కు ఊపునివ్వలేదు… ప్రస్తుతం ఖాళీ… దిక్కులు చూడటమే…! నిజానికి అప్పట్లో మస్తు జోకులు పడేవి… ఏమనీ అంటే..? యాంకర్ పళ్లికిలిస్తేనే షో సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాడేమో నాగబాబు… అందుకే అదిరింది నవ్వుల షోకు ముందుగా సమీరను తీసుకున్నాడు… షో క్లిక్ కావడం లేదని ఆమెను మధ్యలోనే తరిమేశాడు… భానుశ్రీని, రవిని తీసుకొచ్చాడు… వాళ్లనూ వెళ్లగొట్టేశాడు… అసలు షోలో దమ్ముండాలి మాస్టారూ అంటే వినడు… ఈయన్ని అనవసరంగా ఈటీవీ నుంచి […]
రామోజీ సారూ… ఈటీవీని కూడా గాలికి వదిలేశారా..? ఏమిటిలా…!!
ఈనాడు పత్రికను గాలికి వదిలేసినట్టే… ఈటీవీని కూడా వదిలేశాడా రామోజీరావు…! ఈ మాట పరుషంగా ఉన్నాసరే, అంకెలు అబద్ధం ఆడవు… తను దీటుగా గేమ్ ఆడుతున్న ఫీల్డులో కూడా ఆటను వదిలేస్తున్న తీరు సహజంగానే అందరినీ ఆశ్చర్యపరుస్తుంది… ఆయన తప్పు ఎక్కడయ్యా అంటే…? సరైన వ్యక్తులకు బాధ్యతలు అప్పగించకపోవడం..! ఈటీవీ పేరిట చాలా చానెళ్లున్నయ్… ఈటీవీ, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ ప్లస్, ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్… ఇంకేమైనా ఉన్నాయో తెలియదు… ఇందులో నడిచేది […]
ఈటీవీ సూపర్ హిట్… కొత్త సంవత్సరం ఈవెంట్… మిగతా టీవీలు చేతులెత్తేశాయి…
కొత్త సంవత్సరం… బయట పార్టీలంటూ తిరిగే సీన్ ఎలాగూ లేదు… మన సర్కారు వారు అర్ధరాత్రి దాకా మందు షాపులు ఓపెన్ చేస్తామన్నారు కదాని, ఎటెటో తిరిగి, ఏదేదో తాగి, రోడ్ల మీద పడితే, పోలీసులు టెర్రరిస్టులంటూ ఇరగదీశారు… సో, ఇంట్లో అందరికీ టీవీలే దిక్కు… అందుబాటులో ఉన్న ఏకైక వినోదం కదా మరి… కానీ మన తెలుగు టీవీలు ఏం చేశాయి..? స్ట్రెయిట్ గా చెప్పాలంటే నాలుగు టీవీల్లో ఈటీవి మాత్రమే హిట్… మిగతా వాటిల్లో […]
తుస్… నాగార్జున అట్టర్ ఫ్లాప్… మాటీవీ సూపర్ ఫ్లాప్… బిగ్‌బాస్ సుప్రీం ఫ్లాప్…
బిగ్‌బాస్ నాలుగో సీజన్…. రేటింగ్స్ మాయలో గండరగండడు అనిపించుకున్న ది గ్రేట్ మాటీవీ సైతం చేతులెత్తేసింది… తుస్… తుస్సున్నర… అరె, అన్ని వెబ్సైట్లు ఆహా ఓహో… మస్తు రేటింగ్స్, 19.5 రేటింగ్స్ వచ్చాయి, దుమ్మురేపింది, నాగార్జునా సాహో, నీకు తిరుగులేదు, మాటీవీ రేటింగ్స్ మాయామర్మానికి రందిలేదు అని చెబుతున్నవేళ ‘ముచ్చట’ ఏమిటి, తుస్సుమని చెప్పడం ఏమిటి అంటారా..? ఆధారాలతో చెబుతాం… బిగ్‌బాస్ నాలుగో సీజన్ అట్టర్ ఫ్లాప్… ఎలా అంటే..? చూశారు కదా… ఇదీ బార్క్ తాజా […]
బిగ్‌బాస్..? బిగ్‌లాస్..? జెర కొన్నాళ్లు ఆగండి బాస్… కాలం చెబుతుంది…
బిగ్‌బాస్ పుణ్యమాని గంగవ్వకు ఇల్లొచ్చింది… బంగారం కొన్నది… సొహెల్‌కు మస్తు పైసలొచ్చినయ్… అభిజిత్‌కు పైసలతోపాటు కప్పొచ్చింది… అవినాష్, సొహెల్, మెహబూబ్, దివి, మోనాల్, అభిజిత్, అరియానా, అఖిల్… మస్తు సినిమా అవకాశాలు వస్తున్నట్టు ధూంధాం ప్రచారం సాగుతోంది… అయిదారు రోజులుగా మీడియా, సోషల్ మీడియా వీళ్లకొచ్చే అవకాశాలపైనే హోరెత్తిస్తున్నాయి… వాళ్లు కూడా ఈ పాపులారిటీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు… కానీ… హొవ్, హొవ్… డుర్ డుర్… కాస్త పగ్గాలు వేయండి… మబ్బుల్లో నుంచి కాస్త నేలమీదకు దిగిరండి… […]
మయూరి సుధ ఎపిసోడ్..! అంతటి బడబడ ఆలీ కూడా స్టక్ అయిపోయాడు…
ఈటీవీలో వచ్చే ‘ఆలీతో సరదాగా’ ప్రోగ్రాం చాలామంది చూస్తారు… అప్పుడప్పుడూ కొన్ని నాసిరకం కేరక్టర్లతో పిచ్చాపాటీ చేస్తాడు గానీ ఎక్కువసార్లు పాత తారల్ని మళ్లీ మన ముందుకు తీసుకొస్తాడు… పాత ముచ్చట్లన్నీ కలబోస్తాడు… ఇప్పటితరానికి పెద్ద ఆసక్తి ఉండకపోవచ్చుగాక, నలభై దాటిన సినిమా ప్రేక్షకులకు ఇంట్రస్టింగే… ప్రతి షోలో అతిథిని ఎలాగోలా ఏడిపించి, ఆ ప్రోమో కట్ చేయించే ఓ పిచ్చి స్టయిల్ ఉంది గానీ… మిగతా సంభాషణ కాస్త సరదాగానే ఉంటుంది… స్పాంటేనిటీ కూడా ఎక్కువే […]
ఢీఅంటేఢీ… జీటీవీ అదరగొట్టిన స్లాటులో… మాటీవీ ఓంకార్ ఫ్లాప్ షో…
స్టార్ మాటీవీ… దీని క్రియేటివ్ ఒకప్పుడు ఫేమస్… కానీ ఇప్పుడు వట్టిపోయినట్టుంది… క్రియేటివ్తనం కాస్తా జీతెలుగు వైపు ప్రవహించినట్టుంది… పైగా మాటీవీతో జీటీవీ ఢీఅంటేఢీ అంటోంది… ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి జరిగిన ఓ పోటీలో మాటీవీ చేతులెత్తేసింది… చతికిలపడింది… జీటీవీ జనాన్ని బాగా ఎంటర్టెయిన్ చేసింది… అఫ్కోర్స్, మాటీవీకి చేతనైన రేటింగ్స్ మాయలో మళ్లీ అదే పైచేయి సాధించినట్టు వచ్చే బార్క్ ర్యాంకింగులో కనిపించవచ్చుగాక… కానీ ఈ నాలుగైదు గంటల పోటీలో జీటీవీ గెలిచింది […]
- « Previous Page
- 1
- …
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- Next Page »