ఓ హీరో దిగుతాడు… ఆ ఊళ్లోకి వెళ్తాడు… రైతుల కష్టాల్ని చూసి భోరుమంటాడు… వీళ్లను ఉద్దరించాల్సిందే అని భీషణ ప్రతిజ్ఞ చేస్తాడు… అబ్రకదబ్ర, హాంఫట్ అంటూ ఓ పాట వేసుకుంటాడు… పాట అయిపోయేలోపు రైతులు ఉద్దరింపబడాల్సిందే… ఖతం… రైతుల ఆనందబాష్పాలతో ఆ ఊరి చెరువు మత్తడి దూకుతుంది… ఆనందం పట్టలేక కొందరు గుండె ఆగి మరణిస్తారు……… హేమిటిది అని హాశ్చర్యపోతున్నారా..? మన హీరోలు మస్తు ఉద్దరిస్తున్నారు మరి… అప్పట్ల ఓ ల్యాప్టాప్, ఓ ఛాపర్ పట్టుకుని మహేశ్ […]
వీఆర్ అర్చనలు… ఆన్లైన్ ఆర్జితసేవలు… యూట్యూబ్ వ్రతాలు… పోస్టల్ ప్రసాదాలు…
పోస్టల్ ప్రసాదం సమర్పయామి! ——————- హమ్మయ్య. ఇక దేవుడి ప్రసాదం ఇంటికే వస్తుంది. మనం దేవుడి వైపు ఒకడుగు వేస్తే- దేవుడు మనవైపు వందడుగులు వేసి వచ్చి కాపాడతాడని కంచి పరమాచార్య మహా స్వామి చెప్పేవారు. ఆ వాక్కును నిజం చేస్తూ తెలంగాణాలో తంతి తపాలా శాఖ దేవుడి ప్రసాదాలను మన ఇళ్లకే చేర్చే బాధ్యతను నెత్తికెత్తుకుంది. తంతి ప్రసాదం బుట్టలో పడడం అంటే ఇదే కాబోలు. నిజానికి ఈ మహాప్రసాదం బట్వాడా తపాలాశాఖ ఆలోచన కాదు. […]
దిగ్గజరాజు..! ఈ శిల్పం వెనుక ఓ ఆసక్తికరమైన కథ… అది మహాభారత పాత్ర…!!
రామాయణం, భారతం, భాగవతం… వీటిల్లో ఏది గొప్పది అనడిగాడు ఓ మిత్రుడు… దేని గొప్పతనం దానిదే… కానీ రామాయణం, భాగవతాల్లో కథలు చిన్నవి… ఎక్కువగా రాముడిని, కృష్ణుడిని దేవుళ్లుగా చిత్రీకరించేవి… కానీ భారతం కథ ఓ మహాసముద్రం, దాని ఉపకథలు, ఉపోపకథలు కోకొల్లలు… ఈ కథ యావత్తూ రాజతంత్రాలు… సంక్లిష్టత, మార్మికత, ధర్మాధర్మ మీమాంస వంటివి బోలెడు… నిజమే… భారతంలో మనుషులే కాదు, పిశాచాలు, రాక్షసులే కాదు… నాగులు, ఏనుగుల పాత్రలకూ కథాప్రాధాన్యం… ఒక పాత్ర గురించి […]
అబ్బే, దేవుడనేవాడే లేడోయ్… కానీ నాకిప్పుడు ఆయన కావాలి అర్జెంటుగా…
ఒకప్పుడు దేవుడు లేడు- ఇప్పుడు దేవుడే దిక్కు! డిఎంకె భక్తి మార్గం! దేవుడి దయ వల్ల నాస్తిక సంఘం మహాసభలు దిగ్విజయంగా జరిగాయి- అన్నట్లుంది తమిళనాడులో డిఎంకె ఎన్నికల ప్రచార సారాంశం. అన్నాదురై, పెరియార్ ఈ.వి. రామస్వామి సిద్ధాంతాలతో దాదాపు ఏడు దశాబ్దాలుగా వెలుగుతున్న ద్రవిడ మున్నేట్ర కజగ గజానికి అర్ధశతాబ్దం కరుణానిధి ఒక్కడే దిక్కు మొక్కు. ఆయన తరువాత ఇప్పుడు స్టాలిన్ ఆ పార్టీ అధినేత. కాబోయే ముఖ్యమంత్రి. నాస్తికత్వానికి డి ఎం కె ఒకప్పుడు పెట్టింది […]
జగనన్నా భలే చాన్స్… వదలొద్దు… ఆంధ్రజ్యోతిని స్వాధీనం చేసేస్తాడట…
సింపుల్… ఆంధ్రజ్యోతి తలుపులు మూసేయడానికి సుబ్రహ్మణ్యస్వామి వంటి మోస్ట్ లిటిగెంట్ అక్కర్లేదు… తిరుమల వెంకన్న నిధులను అప్పనంగా ఆయన జేబుల్లో పోయాల్సిన పని కూడా లేదు… 2435 వంటి నల్ల జీవోలు కూడా అవసరం లేదు… జస్ట్, జగన్ ఒక చిన్న పని చేస్తే చాలు… దాంతో ఆంధ్రజ్యోతి నోరు మూతపడిపోయి, ఇక ఆ అవకాశాన్ని వాడుకుని, తన సొంత పత్రిక సాక్షిఎకాఎకిన దేశంలోనే నెంబర్ వన్ రేంజ్కు ఎదిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు… జగన్ చేయాల్సింది ఏమిటయ్యా అంటే..? […]
మగాడికే ‘హోం సెన్స్’ ఎక్కువ అవసరం.., కళ్లు తెరిచిన యూనివర్శిటీ…
రండి అబ్బాయిలూ రండి! ఇంటిపని కోర్సు చదవండి! ——————- బెటర్ లేట్ దేన్ నెవర్. ఇప్పటికే చాలా ఆలస్యమయినా, ఇన్నాళ్లకయినా అయినందుకు సంతోషించాలి. దశాబ్దాలుగా హోమ్ సైన్స్ డిగ్రీ అమ్మాయిలకే పరిమితం. ఇకపై అబ్బాయిలకు కూడా హోం సైన్స్ డిగ్రీల్లో ప్రవేశం కల్పిస్తూ మార్పులు చేశారు. హోమ్ సైన్స్ అన్న పేరు కూడా మార్చి కమ్యూనిటీ సైన్స్ అని మారుస్తున్నారు. మంచిదే. మహిళలకు మిలటరీలో సమాన హోదా ఇవ్వడానికి ఏడు దశాబ్దాలు పట్టిందని మొన్ననే సర్వోన్నత న్యాయస్థానం […]
ఎహె… కరకు లాఠీ నవల రాయడమేంటి..? ఖాకీ బతుకు కథాంశమేంటి..?!
…… By Taadi Prakash……………. హెడ్ కానిస్టేబుల్ మోహన్ రావు…… Protest against police ——————————————— కొన్ని రోజుల క్రితం మరణించిన తెనాలి హెడ్ కానిస్టేబుల్ మాకు మిత్రుడు. 1996 – 97 లో రెడ్ హిల్స్ లోని ఆర్టిస్ట్ మోహన్ ఆఫీస్ కి వచ్చినప్పుడే నాకు పరిచయం. సరదా మనిషి. మంచి కామన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నవాడు. ఆయన గత జీవితం గురించి మాకేమీ తెలీదు. సింపుల్ మనిషి. చాలా ప్రాక్టికల్. కూతురు, […]
అబ్బే, ఇది ఉత్త ఆర్గానిక్ కాదోయ్… పవిత్రమైన కాస్మిక్ రైస్ తెలుసా..?
అంతరిక్ష భోజనంబు! ఓహోహో నాకే ముందు!! ——————– “అస్తు..అస్తు.. శాస్త్రమెప్పుడూ ఏం చెప్పినా నిష్కర్షగానూ, కర్కశంగానే చెబుతుంది. మనం సౌమ్యంగా సారాంశమే తీసుకోవాలి” ఇది తెలుగు సినిమాలకు వెలుగు దీపమయిన మాయాబజార్ లో పింగళివారి గొప్ప మాట. “పాండిత్యం కన్నా జ్ఞానమే ముఖ్యం” అని ఘటోత్కచులవారి చేత ఇందులోనే చెప్పించారు. భారతంలో అసలు జరగని కథను కల్పించి, దానికి మాయాబజార్ అని అత్యాధునిక ట్రెండీ పేరు పెట్టి, మాటల్లో, పాటల్లో తెలుగు భాష మాధుర్యాన్ని, మాటల మధ్య […]
అరణ్య..! ఏనుగులకూ కళ్లుంటయ్, కన్నీళ్లుంటయ్, హక్కులుంటయ్..!
Hastir Kanya Hastir Kanya Bamoner Nari Mathai Niya Kam Kalasio Haate Sonar Sakhio…….. ఓ గజరాజు కూతురా..? ఓ బ్రాహ్మణ మహిళా… మణికట్టుకు బంగారు కంకణం ధరించినట్టే ఎప్పుడూ కన్నీటి కడవలను మోస్తుంటావు తల్లీ… అస్సోంలో మావటీలు పాడుకునే ఓ పాపులర్ జానపదానికి రఫ్గా ఇదీ తెలుగు అనువాదం… ఏనుగులకూ మనిషికీ నడుమ బంధాన్ని చెప్పే గీతం… రానా నటించిన అరణ్య చూస్తుంటే ఈ పాటే కాదు… అస్సోంలో ఆమధ్య ఏనుగుల స్వేచ్ఛాసంచారానికీ […]
వేక్సిన్ వేసుకోవాలా..? పనిచేస్తుందా..? మళ్లీ సోకుతుందా..? చదవాల్సిన ఇన్ఫో…!
By…… Jagannadh Goud…………………. వ్యాక్సిన్ పనిచేస్తదా..? వేసుకోవచ్చా..? ఎనీ గ్యారంటీ…! మొదట వ్యాక్సిన్ అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా తయారు చేస్తారు, మనం తీసుకోబోయేది ఏ విధంగా తయారు చేశారు, మన శరీరం నిర్మాణం, మన హెల్థ్ ప్రొఫైల్ లాంటి చాలా విషయాల మీద ఇదంతా ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఏదైనా నిజమైన వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తే, వ్యాధినిరోధక కణాలు (యాంటీ బాడీస్) ఉత్పత్తి అయ్యి ఆ వైరస్ ని నిర్వీర్యం చేస్తాయి. […]
వామ్మో… జీటీవీ చంపేసింది..! గతితప్పిన సరిగమప గ్రాండ్ ఫినాలే..!!
జీతెలుగు చానెల్ బాధ్యులు ఒక్కసారి గనుక పాత పాడుతా తీయగా వీడియోలు గానీ… మన తెలుగు టీవీల్లోనే వచ్చిన సూపర్ సింగర్ ఎపిసోడ్లు గానీ…. పోనీ, ఇప్పటి ఇండియన్ ఐడల్ గానీ చూసి ఉన్నట్టయితే బాగుండు…! సరిగమప గ్రాండ్ ఫినాలే ఇంత పేలవంగా ఉండి, ఇంతగా ఇజ్జత్ పోయేది కాదు..! ఈమధ్యకాలంలో ఏ టీవీ ప్రోగ్రాం ఫినాలే కూడా ఇంత బేకార్ ఫినాలేగా ముగియలేదేమో… మూడున్నర గంటలపాటు ఇంతటి నిస్సారమైన ఫినాలేను ప్రసారం చేయడానికి నిజానికి జీవాడు […]
అమెరికా పాలిస్తోందట… తీర్థసింగ్ చెప్పాడుగా, మహాప్రసాదం…
నిజమే! అమెరికానే మనల్ను పాలిస్తోంది! ——————- భాషలో ప్రతి మాటకు అభిదార్థం, లక్ష్యార్థం అని రెండు రకాల అర్థాలుంటాయంటుంది వ్యాకరణం. ఉదాహరణకు- నిప్పులు వేడిగా ఉన్నాయి- అన్న మాటలో “నిప్పులు” అభిదార్థం. దాని అర్థం నేరుగా అలాగే వాడడం. నిప్పులు చెరుగుతున్నాడు- అన్న మాటలో “నిప్పులు” లక్ష్యార్థం. నిజానికి అక్కడ నిప్పులు లేనే లేవు. నిప్పు గుణాన్ని ఇంకో వ్యక్తీకరణకు ఆపాదించడం. ఇంతకంటే లోతుగా వెళ్ళడానికి ఇది వ్యాకరణ పాఠం కాదు. ఒకవేళ వెళ్లినా తెలుగు వ్యాకరణం […]
చంద్రబాబు అర్జెంటుగా హార్డ్కోర్ విలన్ అయిపోవాలి… లేకపోతే పార్టీ మిగలదు…
రాజకీయ పార్టీల అధినేతలపై, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల అధినేతలపై పార్టీ నాయకులు, కార్యకర్తల్లో అభిమానం, గౌరవం అయినా ఉండాలి లేదా భయం ఉండాలి. చంద్రబాబు విషయంలో తెలుగుదేశం శ్రేణులకు ఈ రెండూ లేవు. గుంటూరు నగర పాలక సంస్థలో ‘‘మాకు ఒక పది డివిజన్లు వదిలేయండి. మిగతాచోట్ల మేం బలహీనులనే పోటీకి పెడతాం’’ అని తెలుగుదేశం నాయకులే అధికార పార్టీ వారితో రాజీ కుదుర్చుకోవడం నిజం కాదా? పోటీ చేసిన పది డివిజన్లలో తొమ్మిది గెలుచుకోలేదా? నిలబడి […]
టోల్ గేట్లు తీసేస్తాం… జీపీఎస్ ద్వారా ఒక్కొక్కడి తోలు తీస్తాం…
టోల్ గేట్లు మాయం! కానీ టోల్ ఫీజు యథాతథం!! ——————– గుళ్లో దేవుడి దర్శనం అయ్యాక బయటికి వచ్చే ముందు ఆ గుడి మంటపంలో ఒక్క సెకెను అయినా కూర్చోవాలి. అదొక ఆచారం. అనాదిగా పాటిస్తున్న సంప్రదాయం. అలా కూర్చున్నప్పుడు కోరుకోవాల్సిన కోరిక- “అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం” భగవంతుడా! నాకు ఎలాంటి నొప్పి లేని చావు ఇవ్వు. ఒకరిదగ్గర చెయ్ చాచాల్సిన లేదా దయనీయమయిన రోజులు రానివ్వకు. […]
తెలంగాణ భాష అంటే ఈరోజుకూ టీవీల్లో అదే వెక్కిరింపు, అదే చీదరింపు…
తెలంగాణ వచ్చాక తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ భాష మీద, యాస మీద, సంస్కృతి మీద వివక్ష, వెక్కిరింపు తగ్గిపోయినయ్… తెలంగాణ కళాకారులకు అద్భుతమైన ప్రాధాన్యం లభిస్తోంది… తెలంగాణ కథ, తెలంగాణ పాట, తెలంగాణ ఆట, తెలంగాణతనానికి మస్త్ విలువ పెరిగినయ్… దుమ్మురేపుతున్నారు, తెలంగాణ ప్రతిభ వెలుగుతోంది……….. ఇది కదా ఇప్పుడిప్పుడే అందరూ వ్యక్తపరుస్తున్న భావన… నిజమేనా..? తెలంగాణ భాష పట్ల ఏహ్యమైన వెక్కిరింపు, తూష్ణీభావం, చిన్నచూపు పోయినట్టేనా..? కోట్ల మందికి రీచయ్యే దిక్కుమాలిన తెలుగు టీవీ […]
భాష తెలిసినవాడే బాషా… పరాయి భాషలు నేర్చితేనే బాద్షా…
భాషకు లోకం దాసోహం! ——————- భావ ప్రసారానికి భాష ఒక్కటే సాధనం. మనుషులు మాత్రమే భాషతో భాషించగలుగుతారు. అంటే కుక్కలు, నక్కలు, చిలుకలు, నెమళ్లది భాష కాదు అని తీర్మానించడానికి వీల్లేదు. యుగయుగాలుగా వాటి భాషలో అవి మాట్లాడుకుంటూ బతకగలుగుతున్నాయి. మన భాష మనకు గొప్పది. సహజంగా వాటి భాష వాటికి గొప్పదే అయి ఉంటుంది. కలవారి ఇళ్లలో కుక్కలు ఇంగ్లీషులోనే భౌ భౌ భాష మాట్లాడతాయి. నిరుపేదల ఇళ్లల్లో ఆవులు అంబా అని నిరుపేద భాషలోనే […]
దేవుళ్లు ఎక్కడో ఉండరు..! ఇలా మన మధ్యే ఉంటారు..!
పేరు – డాక్టర్ విశాల్ వాని ఊరు – బాంబే ప్రత్యేకత- బాంబేలో డాక్టర్ రాహుల్ ఘులే స్థాపించిన రైల్వే స్టేషన్ల దగ్గర పనిచేస్తున్న 25 ఒక రూపాయ క్లినిక్ లలో డాక్టర్. —————— పేరు – డాక్టర్ సుశోవన్ బెనర్జీ ఊరు – కలకత్తా వయసు – 82 ప్రత్యేకత – లండన్లో చదివి, కొంతకాలం అక్కడే పనిచేసి అర్ధ శతాబ్దంగా కలకత్తాలో ఒక రూపాయకే వైద్యం చేస్తున్న డాక్టర్. ——————- పేరు- డాక్టర్ ఎస్ […]
హేయ్ జగనూ… షెప్పేది విను… ఆ తుప్పాస్ బ్రాండ్లు బంద్ పెట్టు…
ముఖ్యమంత్రికి ఓ ఓటర్ విజ్ఞప్తితో కూడిన హెచ్చరికను జారీ చేశాడు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రాయలసీమలో చోటుచేసుకున్న ఒకింత ఆశ్చర్యపర్చి… కాస్సేపు హహ్హా అని నవ్వుకునేలా చేసే ఓ పరిణామమది. అవునూ… నిబంధనల ప్రకారం ఓటర్ పేరు బయటకు చెప్పరేమోగానీ… పోలింగ్ రోజు ఫలితాలు వెలువడే క్రమంలో పోలింగ్ సిబ్బంది మాత్రం బ్యాలెట్ బాక్సులో కనిపించిన ఆ స్లిప్పులను చూసి ఆశ్చర్యంతో నవ్వుకుంటూ… ఆ నవ్వుల్లోనే ఫలితాల లెక్కింపును అలసట తెలియకుండా ముగించేశారట. ఇంతకీ సదరు […]
ఇదీ సారంగదరియా టైపు వివాదమే… ఆ రాణి చరిత్ర కంగనాపై కేసులకొచ్చింది…
కంగనా రనౌత్ మళ్లీ వార్తల్లోకొచ్చింది… ఎహె, నాకు కాస్త మెంటల్ టైపు కదా… అసలు వార్తల్లోకి రాని రోజు ఏముంది..? తాజాగా గాంధీ మంచి భర్త కాదు, మంచి తండ్రి కాదు, కానీ మంచి లీడర్ అయ్యాడు, మగాడు కాబట్టే కదా అని ఓ ట్వీట్ పారేసుకుంది… ఆయ్ఁ బుద్దుందా, సిగ్గుందా, శరముందా, గాంధీని అంత మాటంటావా అని బోలెడు మంది తిట్టిపోస్తున్నారు… నిజానికి గాంధీ ఓ రాత్రి పెళ్లాన్ని బయటికి గెంటేయడం నిజమే… మంచి భర్త, […]
బంధం బలపడాలంటే… ఇలా బంధించుకోవాల్సిందేనోయ్ గిరీశం…
బంధం నిలబడాలంటే బేడీలు పడాల్సిందే! ——————- “తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బదుకు ఘనునికిని” పదకవితా పితామహుడు అన్నమయ్య ముప్పయ్ రెండువేల సంకీర్తనలు ముప్పయ్ రెండు వేల గ్రంథాలతో సమానం. అన్నమయ్య, పోతన, రామదాసు, త్యాగయ్య లాంటి పదిమంది కారణజన్ముల వల్ల తెలుగుకు ఆయుష్షు పెరిగింది. తెలిస్తే మోక్షం- తెలియకుంటే బంధమట. అన్నమయ్య భక్తి జ్ఞాన వైరాగ్యాల కోణంలో చెప్పి ఉంటాడు. ఉక్రెయిన్ లో ఎప్పుడూ గొడవలుపడుతూ, విడిపోతూ, మళ్లీ గొడవలు పడడానికి కలిసే ఒక […]
- « Previous Page
- 1
- …
- 98
- 99
- 100
- 101
- 102
- …
- 108
- Next Page »