Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జయప్రద – రేణుకా చౌదరి… ఇద్దరి రహస్య పంచాయితీని తీర్చిన చంద్రబాబు…

May 22, 2023 by M S R

jayaprada

Murali Buddha…….   జయప్రద , రేణుకా చౌదరి , బాబు చిదంబర రహస్యం . మూడు దశాబ్దాలైనా బయటపడని విషయం : జర్నలిస్ట్ జ్ఞాపకాలు ….. ఏదైనా వివాదంపై ముఖ్యనాయకుల సమావేశం జరిగితే , సమావేశంలో ఏం జరిగిందో తెలుసుకునేంతవరకు జర్నలిస్ట్ లకు నిద్ర పట్టదు . క్యాబినెట్ సమావేశంలో మీడియాకు విషయాలు చెబితే తాట వలుస్తా అని సీఎం హెచ్చరిస్తే క్యాబినెట్ ముగియగానే ఈ విషయం కూడా మీడియాకు తెలిసిపోతుంది . 95లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా, […]

తెల్లచీర- మల్లెపూలు… ఇదేకాదు, వేసవి- మల్లి కూడా భలే కాంబినేషన్…

May 22, 2023 by M S R

jasmine

Bharadwaja Rangavajhala ………..   మండు వేసవి… మల్లెపువ్వులూ…. సృష్టిలో కొన్ని సంగతులు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. వాటిలో ఒకటి మండు వేసవి మల్లెపువ్వుల కాంబినేషన్. మల్లె పూవు రొమాంటిక్ ఫీల్ కు సింబల్. అలాంటి మల్లెల్ని మండు వేసవిలో పూయమని ఆనతివ్వడం ఎంత దారుణం. సృష్టి వైచిత్రి ప్రకారం మల్లెలు మండు వేసవిలోనే పూస్తాయి. మరి ఆ మల్లెల మధురిమలను తెలుగు సినిమా కవులు ఎలా వర్ణించారో ఇప్పుడు చూద్దారి . మల్లెపువ్వులు అనగానే ఠక్కున గుర్తొచ్చే […]

బీర్లతో మంగళస్నానాలు… అసలే తెలుగు పెళ్లిపై ‘ఉత్తరాది బరువు’… పైగా ఈ చిత్త పైత్యాలు…

May 22, 2023 by M S R

haldi

ఒకవైపు… కొందరు ఆడపిల్లల తల్లిదండ్రులకు పెళ్లి చేసే స్థోమత లేక… మనస్సులు చంపుకుని, పెళ్లికొడుకు తల్లిదండ్రులు చేసే పెళ్లి మీద ఆధారపడే దురవస్థ…! మరోవైపు… ఆడపిల్లలు లేక, దొరక్క, అవసరమైతే తమ అబ్బాయిలకు అన్ని ఖర్చులతో పెళ్లిళ్లు చేస్తున్న ధోరణి… తప్పులేదు… ఆహ్వానిద్దాం… అవసరం మేరకే అయినా అబ్బాయి తల్లిదండ్రులు కాలంతోపాటు మారుతున్న తీరును స్వాగతిద్దాం… అదేసమయంలో హిందూ వివాహ తంతు రాను రాను మోయలేని భారంగా ఎందుకు మారుతుందనే చింతన మాత్రం మన సమాజంలో లోపించింది… […]

కాంగ్రెస్ సెక్యులరిజం ఓ డొల్ల… కావాలంటే సిక్కుల్ని అడిగి చూడండి…

May 21, 2023 by M S R

secular

Nancharaiah Merugumala…….   రాజీవ్‌ గాంధీని మీడియా మొదట ‘మిస్టర్‌ క్లీన్‌’ అంటే పిల్లలు మాత్రం మూడేళ్ల తర్వాత ‘చోర్‌’ అంటూ ఓ రేడియో కార్యక్రమంలో పాటలు పాడారు! …………………………………………………….. మా తరం కన్నా పన్నెండేళ్లు పెద్దవాడైన రాజీవ్‌ గాంధీ 1984 అక్టోబర్‌ 31 సాయంత్రం ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. అప్పుడాయన వయసు 40. మొదటి నుంచీ పండిత జేఎల్‌ నెహ్రూ కుటుంబసభ్యులంటే విపరీతమైన మోజు ఉన్న భారత మీడియా ఆయనను ‘అందగాడైన యువ ప్రధాని’ అని ప్రశంసల […]

ABN… ఓటమిలోనూ ఓ సాంత్వన… ఓ ఓదార్పు… భావిపై ఓ భరోసా…

May 21, 2023 by M S R

rk cbn

Murali Buddha………  ఆ మీడియాను నమ్మండి -బిపిని దూరం పెట్టండి…… ఆరోగ్యం కోసం ఆ మీడియానే చూడండి .. చదవండి……. ఓ జ్ఞాపకం హా … హా … ఇప్పుడేమంటావ్ ? 2018 డిసెంబర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉదయమే టివిలో చూస్తుంటే ఫోన్ లో హా … హా … ఇప్పుడేమంటావ్ ? అనే ప్రశ్న ఆమె స్వరంలో అంత సంతోషం చాలా కాలం తరువాత విన్నాను . ఫలితాలు ఎలా ఉంటాయి అనే […]

ఐసీయూలో ఎక్మోపై 2000 నోటు… సెప్టెంబరు దాటగానే ఎక్మో సపోర్ట్ పీకేస్తారు…

May 21, 2023 by M S R

2k ban

‘Two” times: భాషలో వందంటే వంద కాదు. వెయ్యంటే వెయ్యి కాదు. “శతమనంతం భవతి” అని ఒక ప్రమాణం ఉండనే ఉంది. వంద, వెయ్యి అంటే ఎక్కువ, లెక్కలేనంత అని పిండితార్థం. సహస్రనామాలు అంటే 999 తరువాత వెయ్యి అని లెక్కలు చూసుకోవడం అలవాటైపోయి…సహస్రం అంటే వెయ్యికే పరిమితమైపోయాము. అష్టోత్తర శతం అంటే సరిగ్గా 108 లెక్క సరిపోయినట్లు…సంస్కృతం, తెలుగు భాషల్లో వందకు, వెయ్యికి లెక్క సరిపోవాల్సిన పని లేదు. అందుకే నువ్ వంద చెప్పు…వెయ్యి చెప్పు…నేనొప్పుకోను అని […]

ఏం పిల్లడో ఎల్దమొస్తవా ? … వెళితే బతుకు బస్టాండే… వంగపండుతో ఓ జ్ఞాపకం…

May 20, 2023 by M S R

vangapandu

Murali Buddha….   ఏం పిల్లడో వెల్దమొస్తవా ? … వెళితే బతుకు బస్టాండే…….. వంగపండుతో .. ఓ జ్ఞాపకం ఎన్టీఆర్ భవన్ లో 2004 .. టీడీపీ అధికారం కోల్పోయిన కొత్తలో .. ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే వెళ్ళాను . వేదికపై ఉన్న అతను బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా ఉన్నారు , ఎవరో గుర్తుకు రావడం లేదు . ఒక ప్రముఖ నాయకుడి ప్రెస్ కాన్ఫరెన్స్ అని చెప్పి అతను రాకముందు రెండు మూడు బృందాలతో […]

పళ్లు బాగున్నా… పీకించేసుకుని… బంగారుపళ్లు పెట్టించుకున్న ఓ జర్నలిస్టు కథ…

May 19, 2023 by M S R

బుద్ధా మురళి

Murali Buddha……….   పళ్లూడగొట్టుకొని బంగారు పళ్ళు పెట్టించుకొన్న జర్నలిస్ట్, అద్దె కట్టలేక అటవీ ప్రాంతంలో అంతిమ రోజులు…. అతని జీవితం ఓ పాఠం… జ్ఞాపకాలు… ‘‘చూశారా బంగారు పళ్ళు పెట్టించుకున్నాను . నా పళ్ళు బాగానే ఉన్నాయి కానీ చిన్నప్పటి నుంచి పేదరికంలోనే గడిపాను . ఇప్పుడు డబ్బులు వచ్చాయి . బాగున్నా సరే, ఆ పళ్ళు తీసేసి ఈ బంగారు పళ్ళు పెట్టించుకున్నాను’’ ……….. ఇదో జర్నలిస్ట్ వాస్తవ కథ . పేదరికం జీవితంలో చాలా […]

భలే భలే… కల్తీ మద్యం సప్లయర్ కూడా బాధితుడే… పరిహారమూ ఇచ్చారు…

May 19, 2023 by M S R

stalin

Chada Sastry……    తమిళనాడు లో శ్రీరంగం జిల్లా మేళవాసల్ పట్టర్తోప్పు ప్రాంతంలో ఆచార్య శ్రీమన్ భట్టార్ (గురుకులం) వేద పాఠశాల నడుస్తోంది. వేసవి సెలవుల్లో 50 మందికి పైగా చిన్నారులు ఇక్కడే ఉండి వేద పాఠాలు చదువుతున్నారు. ఈరోడ్ జిల్లా నసియానూర్‌లోని వలరసంపట్టికి చెందిన 11వ తరగతి విద్యార్థి గోపాలకృష్ణన్ (17), మన్నార్గుడికి చెందిన 7వ తరగతి విద్యార్థి విష్ణుప్రసాద్ (14), మన్నార్గుడికి చెందిన మరో 10వ తరగతి విద్యార్థి హరిప్రసాద్ (14), కిడాంబి వెంకటగిరిధర్ సాయి […]

ఆకాశ హర్మ్యాల నడుమ… తన ఇంటి ఉనికి కాపాడుకున్న శ్రీరంగనాథుడు…

May 19, 2023 by M S R

temple

ఎటు చూసినా ఆకాశ హర్మ్యాలు… హైదరాబాద్ విస్తరిస్తుంటే, చెట్లు, గుట్టలు, చెరువులు, కుంటలు, రాళ్లు, రప్పలు ఏవీ ఆగడం లేదు… అన్నీ మింగేస్తూ నగరం నలువైపులా విస్తరిస్తోంది… ఈమధ్య పలువురు చెబుతున్నట్టు హైదరాబాదులోని కొన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే అమెరికా నగరాల్లో తిరుగుతున్నట్టే కనిపిస్తోంది… నిజమే… ఈ భారీ భవంతుల నడుమ ఒకటోరెండో పాత, అపురూప కట్టడాలు కనిపిస్తే, అవీ ఆధ్యాత్మక మందిరాలు అయితే..? వాటి ఉనికి సంభ్రమంగానే ఉంటుంది… ఇదీ అదే… ఫేస్ బుక్ మిత్రురాలు Kavitha […]

బెజవాడ అంటేనే అట్లుంటది మరి… ఆరు రుతువులూ వేసవే ఇక్కడ…

May 18, 2023 by M S R

bejawada

Chat at Heat: విజయవాడలో అన్ని రుతువులు వేసవిలోనే సమసించి ఉంటాయని శతాబ్దాలుగా రుజువయిన సత్యం. 1. బండలు పగిలే మెండు ఎండల తీవ్ర వేసవి; 2. ఒళ్లు కాలి వేడెక్కే వేసవి; 3. వేడిగాడ్పుల వేసవి; 4. ఒక మోస్తరు వేసవి; 5. మామూలు వేసవి; 6. వేసవి కాని వేసవి- అని విజయవాడలో ఆరు రుతువులు ఉంటాయి. ఇతర ప్రాంతాల్లో 45 డిగ్రీల ఎండ కంటే విజయవాడలో 45 డిగ్రీల ఎండ ఎక్కువగా ఉన్నట్లు […]

తన బలమే నాలుక… దాన్ని కోసుకుంటానని ఓ ఛాలెంజ్ విసిరాడు… తర్వాత..?

May 18, 2023 by M S R

gone prakash

Murali Buddha………    నోట్లో నాలుక లేని గొనె ప్రకాష్, జర్నలిస్ట్ లు నేర్చుకోదగిన పాఠాలు… ఓ జ్ఞాపకం ఇదేం శీర్షిక ? గొనె ప్రకాష్ కు నోట్లో నాలుక లేకపోవడం ఏమిటి ? ఆయన ప్రత్యేకతే నోట్లో నాలుక … ఒకసారి మాట్లాడడం మొదలు పెట్టారు అంటే ఆపడం యాంకర్ తరం కూడా కాదు . టివి 9 రజనీ కాంత్ కూడా ఆపలేడు . చరిత్ర చెబుతాడు . నాలుకేసుకొని బతికేస్తున్న గొనె ప్రకాష్ను నోట్లో […]

బాబులో నాకు శ్రీ వెంకటేశ్వర స్వామి కనిపించారు… ఓ జ్ఞాపకం…

May 17, 2023 by M S R

trust bhavan

Murali Buddha………..  బాబులో నాకు శ్రీ వెంకటేశ్వర స్వామి కనిపించారు, ఓ జ్ఞాపకం… చంద్రబాబు ఇమేజ్ ను మీడియా ఏ స్థాయికి తీసుకువెళ్ళింది అంటే అధికారులు సైతం ఆయనలో భగవంతుడిని చూసే స్థాయికి తీసుకువెళ్ళింది . జనం ఓడించి ఇంట్లో కూర్చోబెట్టేంత వరకు అదే ఇమేజ్ భ్రమల్లో ఉండిపోయారు . బాబు గారిని చూస్తూ , ఆయన ఎదుట కూర్చొని మాట్లాడుతుంటే శ్రీ వెంకటేశ్వర స్వామి తో నేరుగా మాట్లాడుతున్నట్టు అనిపించింది .. ఉద్యోగం వదిలి పోటీ […]

ఒక సెకండ్ విలువ- ఒక పరుగు పతకం… ఒక వోటు విలువ- ఒక విజయ పతాకం…

May 17, 2023 by M S R

one vote

Siva Racharla …….   ఒక్క ఓటు – సీఎం పదవి జీవితకాలం లేటు ! మీకు కాలం విలువ తెలుసా? ఒక్క సెకండ్ విలువ తెలియాలంటే 0.1 సెకండ్ తేడాతో ఒలంపిక్ మెడల్ కోల్పోయిన మిల్కా సింగ్ ను అడగండి … పర్సనాలిటి డెవలప్ మెంట్ పాఠాల్లో విరివిగా చెప్పే ఉదాహరణ ఇది. జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలిస్తే చాలు అనుకునే వాళ్ళు చాలా మందే తెలిసుంటారు కానీ కేవలం ఒక్క ఓటు తేడాతో ఎన్నికల్లో […]

ఆ ముఖ్యమంత్రిని తన ఇంట్లోకి రానివ్వలేదు … ఓ జ్ఞాపకం…

May 16, 2023 by M S R

ntr

Murali Buddha……….  ముఖ్యమంత్రిని ఇంట్లోకి రానివ్వలేదు … ఓ జ్ఞాపకం ముఖ్యమంత్రి తన చేతిలో బొకే పట్టుకొని అరగంట పాటు గుమ్మం ముందు నిలబడ్డా తనను లోపలికి రానివ్వలేదు …. ఆగాగు, సినిమా కథ చెబుతున్నావా ? కాదు, సినిమా వాళ్ళ కథ .. నిజంగా జరిగిన కథ చెబుతున్నాను . సినిమా కథ అయినా ? సినిమా వాళ్ళ కథ అయినా కొంత సహజంగా ఉండాలి . మేం మరీ అంత అమాయకులుగా కనిపిస్తున్నామా ? సీఎం […]

సీఎం కుర్చీకై బలమైన కొట్లాట… సిద్దరామయ్య మార్క్ రాజకీయం స్టార్ట్…

May 15, 2023 by M S R

karnataka

పార్ధసారధి పోట్లూరి ……. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరు ? కాంగ్రెస్ గెలిచింది అని సంబరాలు చేసుకుంటున్న వారికి ఇది అంకితం ! కర్ణాటక కాంగ్రెస్ లో రెండు బలమయిన గ్రూపులు ఉన్నాయని మనకి తెలిసిందే ! D.shivakumar [DSHIK] మరియు సిద్ధ రామయ్య! కానీ ఎన్నికలలో తమ విభేదాలని పక్కన పెట్టి కలిసికట్టుగా పోరాడారు DSHIK మరియు సిద్ధ రామయ్య ! వీళ్ళిద్దరి లక్ష్యం ఒకటే.ఎలాగయినా అధికారాన్ని చేజిక్కించుకొని తరువాత మనిద్దరి బలాబలాలు చూసుకోవచ్చు అని […]

టీడీపీ టికెట్టు కొందరికి లాటరీ జాక్‌పాట్… అలా వచ్చి ఇలా ఒళ్లో పడిపోయేది…

May 15, 2023 by M S R

trust bhavan

Murali Buddha……….   ఏంటీ టికెట్ కోసమా ? అసెంబ్లీకి అడిగితే పార్లమెంట్ కు ఇచ్చారు … ఓ జ్ఞాపకం … 1999 ఎన్నికల సమయం .. చంద్రబాబు నివాసంలో మీడియా నిరీక్షణ .. ఉదయం నుంచి రాత్రి వరకు… పగలు రాత్రి అనే తేడా లేకుండా గంటల తరబడి నిరీక్షణ.. హాలులో సోఫాలోనే జారగిలపడి … కళ్ళు మూతలు పడ్డాయి .. కళ్ళు తెరిచి చూస్తే పక్కన చింపిరి జుత్తు తో అదే సోఫాలో ఓ మహిళ […]

ఫాఫం సాక్షి… పిల్లలకు ఓ నీతి కథ చెప్పింది… తనే తప్పుల్లో కాలేసింది…

May 15, 2023 by M S R

sakshi

నిజానికి అక్షరదోషాలు పత్రికల్లో వస్తూనే ఉంటయ్… చిన్న పత్రికల్లోనైతే భీకరంగా కనిపిస్తుంటయ్… తప్పులు సరిచూసుకుని, సరిదిద్దుకునే సాధనసంపత్తి, సంకల్పం లేవు కదాని మనమూ చూసీచూడనట్టు భరిస్తుంటాం… కానీ కొన్ని వేల కోట్ల మీడియా ఎంపైర్స్… ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి పెద్ద పత్రికల్లో తప్పులు వస్తే…? ఏటా వందల కోట్ల ప్రజాధనాన్ని యాడ్స్ రూపంలో… నేరుగా ప్రభుత్వ ధనాన్ని సైతం పొందే ఈ పత్రికలు భాషకు ద్రోహం చేయవచ్చా..? ఇవీ ప్రశ్నలు… పత్రికలు సమాజానికి చేసే ద్రోహాల […]

చొక్కాలు, గొంతులు చించుకోవల్సిన పనిలేదు… ఫస్ట్, బుడ్డగోచీ సరిచూసుకోవాలి…

May 14, 2023 by M S R

exit

కర్ణాటకలో 2018 లో బీజేపీ ఓట్ షేర్ 36 % 2023 లో ఓట్ షేర్ 36 %, ఏ మార్పు లేదు… కానీ చాలా సీట్లు కోల్పోయింది…. 2018 లో జేడీఎస్ వోట్ షేర్ 18 %, 2023 లో జేడీఎస్ ఓట్ షేర్ 13 % , 5 % కోల్పోయారు… 2018 లో కాంగ్రెస్ ఓట్ షేర్ 38 %, 2023 లో కాంగ్రెస్ ఓట్ షేర్ 43 %, 5 % […]

అప్పు… స్వరాల మామకు సహాయకుడు కాదు… కలిసి నడిచన ఆత్మ…

May 14, 2023 by M S R

music

Bharadwaja Rangavajhala……….   పాట క‌ట్టాలంటే అంత తేలికేం కాదు … సిట్యుయేష‌న్ అర్ధం చేసుకోవాల .. డైర‌క్ట‌రుగారికి ఏం కావాలో ఎలా కావాలో తెల్సుకోవాల … అప్పుడు క‌విగారితో కూర్చోవాల … ఇక్క‌డే మ‌హ‌దేవ‌న్ ప్ర‌త్యేక‌త … ముందు క‌విగారిని రాసేయ‌మ‌నండి … అప్పుడే ట్యూను క‌డ‌దాం … అలా చేసిన‌ప్పుడే స‌ర‌స్ప‌తికి స‌రైన గౌర‌వం ఇచ్చిన‌ట్టు అనేవారాయ‌న‌. ఇక ట్యూను క‌ట్టేసిన త‌ర్వాత అది పాడుతున్న సింగ‌రుకు సౌక‌ర్య‌వంతంగా ఉందా లేదా అనేది కూడా చూసుకునేవాడాయ‌న‌. […]

  • « Previous Page
  • 1
  • …
  • 97
  • 98
  • 99
  • 100
  • 101
  • …
  • 126
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • మురారి అహం… అందుకే స్మితా పాటిల్ ఎహె నేను రాను పొమ్మంది…
  • ఓ కొలవెరి, ఓ రౌడీ బేబీ… అప్పట్లో ‘తోడీ సిపీలీహై’… మందు కొట్టించేశాడు…
  • బాలు, కొసరాజు, సింగీతం, సాలూరి… అందరి కెరీర్లలోనూ ఇదే చెత్తపాట…
  • సంపద, సర్కిల్, పేరు, చదువు… ఆ ఒక్క దుర్బల క్షణంలో పనిచేయవు..!!
  • రియా హరి..! తనే నిర్మాత, తనే హీరోయిన్… ఓ కృత్రిమ ప్రేమకథ…
  • వంశీ, శ్రీలక్ష్మి, ఆంజనేయులు… వాళ్ల అనుభవాలు చెప్పే పాఠమేంటనగా…
  • రవితేజ సినిమా అయితేనేం… సూపర్ ఫ్లాప్, చివరకు టీవీల్లో కూడా…
  • రియల్ కల్‌ప్రిట్ పాకిస్థాన్ కాదు… దాని వెనుక అమెరికా ట్రంపు…
  • ఆ మంత్రి చిల్లర వ్యాఖ్యలపై పార్టీ మౌనం ఏం సంకేతాలు ఇస్తున్నట్టు..!?
  • Decaplets..! ఒకే కాన్పులో పదిమంది… నెవ్వర్.., ఇప్పటికీ జరగలేదు…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions