తండ్రీకొడుకులిద్దరూ భలే యాక్టర్స్… మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి… ఇద్దరూ ఏక్‌సేఏక్ నటించగలరు… సీఎంగా ఉన్నప్పుడు ఏవేవో కారణాలు చెబుతూ అప్పుడప్పుడూ కన్నీళ్లు పెట్టుకునేవాడు కుమారస్వామి… అనవసరంగా బీజేపీని విడిచిపెట్టి తప్పు చేశాను, లేకపోతే నేనే మళ్లీ సీఎం అయ్యేవాడిని అంటూ ఆమధ్య కూడా బోరుమన్నాడు కూడా..! ఇప్పుడు తాజాగా ఓ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు దేవెగౌడ… 87 సంవత్సరాల ఈ వయస్సులో కూడా తన జేడీఎస్ పార్టీ వ్యవహారాల్ని తనే స్వయంగా చూసుకుంటాడు… […]
సాక్షిని గుర్తించిన ఆంధ్రజ్యోతి..! గుడ్… ఈ వైరం ఇలాగే వర్ధిల్లుగాక..!!
#RKisRight… అడ్డెడ్డె… షర్మిల వార్త కవరేజీతో బాగా ముందుకెళ్లిపోయిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ… తను అంతకుముందు పెట్టుకున్న కొన్ని నిషేధాలు కూడా సడలించేసి, లేదా మరిచిపోయి ఏదేదో రాసేస్తున్నాడు… అబ్బే, సాక్షికి వ్యతిరేకంగా తమరి ఆగర్భ శతృత్వాన్ని వదిలేస్తే ఎలా సార్..? మీ ఫ్యాన్స్ ఏమైపోతారు..? మీ ట్రోల్ ఫ్యాన్స్ ఎటుపోవాలి..? హహహ… నిజం… ఆర్కే ఎప్పుడూ తన పత్రికలో సాక్షి అనే పత్రిక పేరు రాయడు, రాయించడు, రాస్తే అనుమతించడు, సహించడు… అందుకే రాయాల్సిన సందర్భం వస్తే, […]
బంధువు లేడు, దోస్త్ లేడు… సోషల్ మీడియాతో అకారణ శతృత్వాలు…
సెలెబ్రిటీ అభిమానుల సోషల్ వార్! ——————– “I may disapprove of what you say, but I will defend to the death your right to say it” “నాకు నీ అభిప్రాయం నచ్చినా, నచ్చకున్నా- ఆ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పుకునే నీ హక్కును కాపాడ్డానికి మాత్రం చివరిదాకా ప్రయత్నిస్తాను” ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రచారంలో ఉన్న భావప్రకటన ఆదర్శం ఇది. ఆదర్శాలెప్పుడూ అందనంత ఎత్తులో ఆకాశంలో ఉంటాయి. ఆచరణ సహజంగా పాతాళం అంచుల్లో ఉంటుంది. సినిమా […]
55 ఏళ్ల క్రితం గల్లంతు.., నేటికీ వణికిస్తున్న ఆ అణుపరికరం కథేంటో తెలుసా..?
ఉత్తరాఖండ్‌లో ఒక్కసారిగా మెరుపు వరదలు విరుచుకుపడి హఠాత్తుగా ఓ విలయాన్ని సృష్టించిన విషాదం తెలుసు కదా… దాదాపు 150 మందికి పైనే గల్లంతు… 32 మృతదేహాలు దొరికాయి… ఎన్డీఆర్ఎఫ్తోపాటు ఐటీబీపీ బలగాలు కూడా సహాయక చర్యలు, గాలింపు పనుల్లోకి దిగాయి… భారీ హిమఫలకం ఒకటి కరిగి (అవలాంచి) నదీప్రవాహాల్లో పడి, ఆ వరదల వల్ల ఈ ఉత్పాతం జరిగిందనేది ప్రాథమిక అంచనా… కాదు, కొండచరియలు విరిగిపడి, డ్యామ్ ఒకటి పగిలి ఈ విపత్తుకు దారితీసిందనేది తాజాగా అంచనా […]
నారి స్వారి చేస్తోంది- అబ్బాయిలూ! తప్పుకోండి!
తరం మారుతున్నది. స్వరం మారుతున్నది. ఆచారాలకు అర్థం మారుతున్నది. ఉత్తరాదిలో పెళ్లి ఊరేగింపు చాలా ప్రధానం. పెళ్లి కొడుకు గుర్రమెక్కి రావాలి. ఆ గుర్రాన్ని అందంగా అలంకరించాలి. మేళ తాళాలు, బృంద నాట్యాలతో బరాత్ సాగాలి. ఇది సంప్రదాయం. బహుశా తెలుగువారికి కూడా పెళ్లి పదహారు రోజుల పండుగగా జరిగినప్పుడు ఇలాంటిదే ఏదో ఉండి ఉండాలి. ఒకప్పుడు మనక్కూడా ఎదురుకోవులు, అలకలు, బుజ్జగింపులు ఏవేవో ఉండేవి. ఇప్పుడు తాళి కట్టగానే అబ్బాయి అమెరికా ఉద్యోగానికి, అమ్మాయి ఆస్ట్రేలియా ఉద్యోగానికి […]
“పది కోట్ల యూనిట్ల సంచిత ఉత్పత్తి మైలు రాయి…” ఒరే, చంపేయాలిరా నిన్ను…
హీరో ప్రకటన! విలన్ అనువాదం!! ———————— ఒకప్పుడు జపాన్ హోండా తో జత కట్టిన హీరో ఆటోమొబైల్ కంపెనీ రెండు దశాబ్దాల తరువాత విడాకులు తీసుకుని వేరయ్యింది. ఇప్పుడు హోండా, హీరో దుకాణాలు ఎవరికి వారివి ప్రత్యేకం. పార్కింగ్ కు అంగుళం చోటు లేకపోయినా కార్లు కొనేవాళ్లు ఎంతగా పెరుగుతున్నా భారతదేశంలో ద్వి చక్ర వాహనాలు బైక్ లు, స్కూటర్లే ఎక్కువ. హీరో పది కోట్ల బైక్ లు అమ్మిన సందర్భంగా దేశమంతా ఇంగ్లీష్, హిందీతో పాటు అన్ని […]
మిలియన్ల కొద్దీ వ్యూస్..! అనసూయకూ, సుమకూ *గరుడ దృష్టి*దోషం..!!
నిన్న ఎక్కడో చదివినట్టు గుర్తు… అప్పుడప్పుడూ అకస్మాత్తుగా వార్తల్లోకి వచ్చిపడే ఓ కేరక్టర్ ఉంది కదా… గరుడ పురాణ ప్రవచనకర్త అలియాస్ గరుడాచలం అలియాస్ శివాజీ… ఎప్పుడూ మనకు వింతే… తనేం మాట్లాడతాడో, ఆ మాటలు వార్తాంశాలు ఎలా అవుతున్నాయో… అప్పట్లో రవిప్రకాష్ చేతుల్లో టీవీ9 ఉన్నప్పుడు గంటల కొద్దీ ఆ ప్లాట్‌ఫామ్ వాడుకుని, జనం బుర్రల్ని ఫ్రై చేయకుండానే తినేసేవాడు… ఎన్టీవీ, టీవీ5, ఏబీఎన్ చానెళ్లలో అంత చాన్స్ దొరకనట్టుంది ఫాఫం… చాలారోజులైంది కదా హీరో […]
నాటి విశాఖ ఉక్కు వార్తలు… ఈ ఫోటోలు చాలు, మళ్లీ కథ అక్కర్లేదు…
బుల్ షిట్..! ఆ పశువుల మలమూత్రాలే మహాప్రసాదం ఇప్పుడు…!!
భూమికి ఆలమంద వెన్నుదన్ను ———————- “భూగోళం పుట్టుక కోసం రాలిన సుర గోళాలెన్నో? ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో?” అన్న దాశరథి ప్రశ్నకు సమాధానం అంత సులభంగా దొరకదు. భూమి ఏర్పడి ఎన్ని కోట్ల సంవత్సరాలయ్యిందో? భూమి మీద మనిషి ఇప్పుడున్న మనిషి రూపంలోకి రావడానికి ఎన్ని లక్షల లేదా కోట్ల ఏళ్లు పట్టిందో? భూమి తప్ప మిగతా గ్రహాలు ప్రాణులు బతికి బట్టకట్టడానికి అనువైనవి కావు. భూమి మీద మనం బతకాలంటే భూమి […]
అది తాంత్రిక గుప్తయాగం సరే… ప్రభుత్వ లోగోలు ఏమిటి..? ఈ ప్రచారమేంటి..?!
కేసీయార్ బర్త్ డే యాగం మీద కొన్ని ప్రశ్నలు తలెత్తాయి కదా… అదేనండీ, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో ఓ బహిరంగ సభ స్థాయిలో ఓ ప్రత్యేక యాగం నిర్వహింబోతున్నారు అని చెబుతున్నారు కదా… ఆ ఆది శ్రవణ యాగం అనగానేమి..? అసలు ఇంతవరకూ ఆ యాగం పేరే ఎవరూ వినలేదు కదా..? అనే ప్రశ్నకు ఆయనే నిన్న ఓ క్లారిటీ ఇచ్చాడు విలేకరులకు… పనిలోపనిగా ఓ చిన్న అడ్వర్టయిజ్మెంట్ మెటీరియల్ […]
పండు పండు పండు, ఎర్రపండు… కమలం దాని పేరు…
మెండుగా దేశభక్తి పండు! ———————— ఏ సంస్కృతి అయినా దానికదిగా రాత్రికి రాత్రి పుట్టి స్థిరపడినది కాదు. వందల, వేల ఏళ్ల ప్రయాణంలో ఒక సంస్కృతి ప్రాణం పోసుకుని, పెరిగి, సాగుతూ ఉంటుంది. ప్రపంచంలో ఏ ఒక్క సంస్కృతి అయినా మరో సంస్కృతితో ఎంతో కొంత ప్రభావితం కాకుండా ఉండలేదు. వేషం, భాష, తిండి, వాడే వస్తువులు…ఇలా అన్నిట్లో పరదేశం పరకాయ ప్రవేశం చేస్తూనే ఉంటుంది. చివరకు అవి విదేశాలనుండి దిగుమతి అయినవి అన్న విషయం కూడా […]
మిస్టరీ లింకులు..! కిషన్‌రెడ్డికి పోలవరంపై అంత ఇంట్రస్టు ఏమిటబ్బా..?!
ఇదే తేడా… ఒక బండి సంజయ్‌కూ, ఒక సోము వీర్రాజుకూ మధ్య తేడా ఇదే… బైబిల్ పార్టీ కావాలా, భగవద్గీత పార్టీ కావాలా అని ఓ బాంబు వేసి, ఇక దాన్ని మార్చడు తను, కవర్ చేసుకునే ప్రయత్నం కూడా చేయడు, అవును అదే అన్నాను, బరాబర్ అంటాను, ఇప్పుడూ అదే అంటాను, అయితే ఏంటట అంటాడు… కానీ సోము వీర్రాజు…? బీసీ సీఎం అన్నాడు… వైసీపీకి, టీడీపీకి ఆ దమ్ముందా అనడిగాడు… సవాల్ విసిరాడు… అసలు […]
విశాఖ ఉక్కు- ఆంధ్రుల మొక్కు!
———————— వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. అయితే వజ్రాన్ని కొని పెట్టుకునే వారే నూటికో కోటికో ఒక్కరు. వారెవరూ వజ్రాన్ని చేతులారా కోసి పరీక్షించుకోలేరు. వజ్రాలు తయారు చేసేవారికే వజ్రాల కోత గురించి తెలిసి ఉంటుంది. ఇనుము అలా కాదు. ఇనుప శాస్త్రం సామాన్యులకు కూడా తెలిసి ఉంటుంది. సగటు జీవి ఇంటి నిండా ఇనుమే. తొక్కే సైకిల్ ఇనుము. వండే బాణలి ఇనుము. దున్నే నాగలి ఇనుము. తలుపు గడియ ఇనుము. కిటికీ ఇనుము. మంచం ఇనుము. […]
వైశ్య మనోభావాలకూ గౌరవం… సరైన దిశలో జగన్ సర్కారు…
On……. Gopi Dara facebook wall………….. “చింతామణి” నాటకం….. ఇప్పుడీ నాటకాన్ని నిషేధించాలని ఆర్యవైశ్య సంఘం ఏపీ ప్రభుత్వంపై వత్తిడి తెస్తోంది. ఏపీ ప్రభుత్వం ఈ నాటక ప్రదర్శన నిలిపివేసే ఆలోచనలో ఉంది. ఈ విషయంలో ఆర్యవైశ్య సంఘం అభిప్రాయం సమర్ధనీయమే… చర్చించవచ్చు… రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేక మూడు రాజధానులు వంటి తీవ్రమైన రాజకీయ అంశం కాదుకాబట్టి, దీనిపై ఎలాంటి చర్చ చేసినా “పచ్చ బ్యాచ్” అనో “పేటియం బ్యాచ్” అనో ముద్ర వేసే అవకాశం […]
ఇజ్జత్ తీసుకున్న ఇళయరాజా..! ఓడిపోయి, ఇక సొంత దుకాణానికి షిఫ్ట్..!!
మొన్న ఓ వార్త… చిన్నగా ఎక్కడో కనిపించింది… నిజానికి పెద్ద వార్తేమీ కాదు… సంగీత దర్శకుడు ఇళయరాజా తన సొంత స్టూడియోలో తన సంగీత దర్శకత్వం పనులు ప్రారంభించాడు అని వార్త సారాంశం… చెన్నైలోని టీనగర్లో ఎంఎం థియేటర్ కొని, దాన్ని రికార్డింగ్ థియేటర్‌గా మలుచుకున్నాడు… దానికి ‘ఇళయరాజా’ అని పేరు పెట్టాడు… అక్కడ ఒక తమిళ సినిమా పాటను బుధవారం రికార్డు చేశాడు… అవును, ఇందులో పెద్ద విశేషమేముంది అంటారా..? ఉంది… ఇళయరాజా చేజేతులా పోగొట్టుకున్న […]
చాలా సీరియస్ ఇష్యూ… KCR చెవుల్లోనే చెబుతాడట… ప్రకటనలిస్తున్నాడు..!!
కేసీయార్… తను ఎలాంటి పాలకుడైనా కావచ్చు… ఏళ్ల తరబడీ సెక్రెటేరియట్‌కే రాకపోవచ్చు… అసలు సెక్రెటేరియట్ మీద కోపమొచ్చి, దాన్ని కూలగొట్టవచ్చు… వేల ఫైళ్లు పెండింగులో ఉండవచ్చు… సీరియస్ ఇష్యూస్ తెర మీదకు వచ్చినా తను జాడాపత్తా లేకుండా పోవచ్చు… నెలల తరబడీ అసలు ఆయన ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో ఆయన్ని సీఎంను చేసిన ప్రజలకే తెలియకపోవచ్చు… ఇంకా, ఇంకా, ఏమైనా మనకు ఆక్షేపణలు, అభ్యంతరాలు ఉండవచ్చు గాక………….. అయినా సరే, ఈ ఇష్యూలో మాత్రం కేసీయార్‌నే సపోర్ట్ […]
వేపకాయంత ఉందా… రండి, కార్టూనిస్టు కండి..! (కార్టూన్ కబుర్లు-2)
Early warning to young cartoonists……… కార్టూన్ కబుర్లు – మోహన్ “ఈ బుల్లి పుస్తకం చదవండి. ఒక్క వారంలో మంచి కార్టూనిస్టు కాగలరు. మరో వారం తిరిగేసరికి కార్టూన్ గోల్డెన్ స్టార్ గా వెలుగుతారు. అందరి కళ్లూ మీమీదే. ఆటోగ్రాఫ్ హంటర్స్ అందరూ మీవెంటే. ఎడిటర్లూ, పబ్లిషర్లూ బ్లాంకు చెక్కులు పట్టుకుని మిమ్మల్ని వేటాడతారు. కనకవర్షం, కీర్తివాన, నవ్వుల హరివిలల్లు” ఇలా ముందుచెప్తే కింద రాసిందంతా చచ్చినట్టు చదువుతారు కదా అని ఆశ. అయినా అబద్ధాలెందుకు? […]
ఒసే., ఓవర్ మేకప్‌తో ఇంత మోసం చేస్తావా..? తియ్, డబ్బు తియ్..!
నిన్నలేని వికారమేదో నిదుర లేచెనే! అపురూపమయిన రూపం అన్న మాట నిజానికి పాక్షికమే కానీ- పరమ ప్రమాణం కాదు. అసలు విషయంలోకి వెళ్లే ముందు తెలుగులో వాడుకలో ఉన్న కొన్ని మాటలను ఒకసారి తలచుకుందాం. అసలు రంగు బయట పడింది. నిజరూపం తెలిసింది. స్వస్వరూప జ్ఞానం. ఎలుక తోలు తెచ్చి ఎంతగా ఉతికినా నలుపు నలుపేగానీ- తెలుపు కాదు. పగలు చూస్తే రాత్రి కలలోకి వచ్చి భయపెడుతుంది. మసిపూసి మారేడు కాయ చేసి. కంటికి మించిన కాటుక. […]
మెర్సీ కిల్లింగ్..! మనసును పిండేసే ఓ హృదయ విదారకమైన కథ..!
ఒక వార్త… మెర్సీకిల్లింగ్, అంటే కారుణ్య మరణాన్ని అనుమతిస్తూ పోర్చుగల్ దేశం ఓ నిర్ణయం తీసుకుంది… అంటే చనిపోయేందుకు అనుమతి… నెదర్లాండ్స్, బెల్జియం, కొలంబియా, లక్సెంబర్గ్, వెస్టరన్ ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లో ఆల్రెడీ మెర్సీకిల్లింగ్‌కు అనుమతి ఉంది… సో, పోర్చుగల్ ఏడో దేశం… దీనికి ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకులున్నారు, సమర్థకులున్నారు… తప్పనిసరి పరిస్థితిలో ఒక మనిషి గౌరవంగా మరణించడానికి సమాజం అంగీకరించాలనేది ఈ మెర్సీ కిల్లింగ్ కాన్సెప్టు… మరి మన ఇండియాలో..? ఇక తప్పదు, సాగనంపడమే మేలు అనుకున్నప్పుడు, […]
నేతాజీ..! గెలుపో ఓటమో జానేదేవ్… నాయకుడంటేనే ఈ సేనాని..!
కాలాతీత స్ఫూర్తి సుభాష్ చంద్రబోస్…. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే మనకు అంతులేని అభిమానం. ప్రేమ. ఆరాధన. తాదాత్మ్యం. పులకింత. ఆయన గురించి తెలిసింది ఎంతో- తెలియనిది కూడా అంతే ఉంటుంది. తెలిసినదానితో తెలియనిది ఊహించినా, తెలియనిదాన్ని తెలిసినదానితో ముడిపెట్టుకున్నా ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ కు వచ్చిన లాభమూ లేదు- నష్టమూ లేదు. మార్గాలు వేరు కావచ్చు. ఎంచుకున్న విధానాలు వేరు కావచ్చు. కానీ- నూట ఇరవై ఐదేళ్లయినా మనమింకా సుభాష్ చంద్రబోస్ కు విలువ కట్టడంలో తడబడుతూనే […]
- « Previous Page
- 1
- …
- 101
- 102
- 103
- 104
- 105
- …
- 108
- Next Page »