మన టీవీ, మన సినిమా ఇండస్ట్రీలే కాదు… దేశమంతా దాదాపు సేమ్… ఒక్కసారి సినిమా హీరో అయితే చాలు, ఇక ఎక్కడాలేని ఇగో తలకెక్కుతుంది… అది చాలా చిన్న సినిమా కావచ్చుగాక… హీరో అనే పదం తనను తాను ఓ దైవాంశసంభూతుడిని చేస్తుంది… చకచకా కళ్లు నడినెత్తికి ఎక్కుతాయి… మేఘాల్లోకి చేరుకుంటారు… ఇక దిగిరారు… అతిశయాలు, ఆభిజాత్యాలు, అహంకారాలు, నానా ఎదవ్వేషాలు గట్రా చాలా అవలక్షణాలు వచ్చి చేరతాయి… అలాగే బతుకుతూ, అట్నుంచి అటే మేఘాల్లో కలిసిపోయేవాళ్లు […]
మాలావత్ పూర్ణ, వారణాసి మానస… దేత్తడి హారిక ఏరకంగా బెటర్ ఎంపిక..?!
బ్రాండ్ అంబాసిడర్ అంటే ఎవరు..? తెలంగాణ నెటిజనంలో భలే చర్చ సాగుతోంది… పాకిస్థానీ క్రికెటర్‌ను పెళ్లిచేసుకున్న వీరజాతీయవాది సానియా మీర్జాను తెలంగాణకే బ్రాండ్ అంబాసిడర్‌గా చేసి కోట్లకుకోట్లు హారతికర్పూరం చేశారు… ఆమె ఏం చేస్తుందో, ఆమెతో ఏం ప్రయోజనమో ఆమెను ఎంపిక చేసి, కోట్లాది తెలంగాణ ప్రజాధనాన్ని ధారబోసిన పెద్దలు చెప్పాలి… చెప్పడానికి మొహం చెల్లదు… అప్పట్లో ఏదో చేనేతకు అక్కినేని నాగ సమంతను ఎంపిక చేశారు… ఎందుకో, ఎవరిని శాటిస్ఫై చేయడానికో మళ్లీ తెలంగాణ పెద్దలే […]
హీరో వెంకటేష్ పెద్ద బిడ్డ…! ప్రేక్షకులకు ఏదో చెప్పాలనుందట…!
దగ్గుబాటి కుటుంబంలో హీరో వెంకటేష్ ఓ చిత్రమైన… కాదు, కాదు, ఓ విశిష్టమైన కేరక్టర్… అరవయ్యేళ్లు దాటాడు… కానీ తనకు నప్పిన, నచ్చిన పాత్రల్నే ఎంచుకుంటూ… ఇక ఆ సొల్లు ఫార్ములా కథల్లోకి వెళ్లడం లేదు… గోల్డెన్ స్పూన్‌తో పుట్టినవాడు, అందుబాటులో అన్నీ… విలాసాలు, వైభోగాలు… కానీ తన మాటల్లో ఏదో స్పిరిట్యువాలిటీ, ఫిలాసఫీ వినిపిస్తుంటాయి… చుట్టూ ఓ గిరిగీసుకుంటాడు… ఫ్యామిలీ కూడా పెద్దగా ఫోకస్‌లోకి రాదు… ముగ్గురు బిడ్డలు, ఒక కొడుకు… వారసుడి కోసం తాపత్రయమా..? […]
జెమినిలో జూనియర్..! ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ హోస్టింగు తప్పా..? ఒప్పా..?!
జూనియర్ ఎన్టీయార్ తప్పు చేస్తున్నాడా..? లేక తన నిర్ణయం కరెక్టేనా..? టీవీ, సినిమా బిజినెస్ సర్కిళ్లలో ఇది ఆసక్తి రేపుతున్న ప్రశ్న… మీలో ఎవరు కోటీశ్వరులు అనే ప్రోగ్రామ్ చేస్తున్నాడు తను… దీనికోసం గత డిసెంబరులోనే సన్ నెట్‌వర్క్‌తో జూనియర్ ఎన్టీయార్‌కు ఒప్పందం కుదిరిందని ‘ముచ్చట’ ఎక్స్‌క్లూజివ్ కథనాన్ని రాసింది… అదిప్పుడు కార్యరూపంలోకి వచ్చింది… సదరు ప్రోగ్రామ్ ప్రోమోల్లో హోస్ట్ మొహం చూపకుండా, ఏదో సస్పెన్స్ మెయింటెయిన్ చేస్తున్నారు గానీ… అది జూనియర్ ఎన్టీయారేనని అందరికీ తెలుసు… […]
సువిశాల హృదయుడు మోడీ చక్రవర్తి..! ప్రత్యర్థులనూ ప్రేమించు దయా సముద్రుడు..!!
పవన్ కల్యాణ్‌కు తీవ్ర ఘోర అవమానం అని ఏదేదో రాస్తున్నారు గానీ…. మోడీ ప్రభువుల వారి కరుణా వీక్షణాలు సోకి బాగా ఆనందపడిపోతున్న వారి గురించి ఎవరూ మాట్లాడరేమిటి అసలు..? మోడీ చక్రవర్తి గారి చల్లని చూపులకు నోచుకున్న వారి మనోభావాలకు అర్థం, విలువ ఏమీ లేవా అసలు..? ఉదాహరణకు అద్వాణీనే చూడండి… ఫాఫం, పార్టీ భవనానికి పునాదుల్ని తవ్వడం దగ్గర్నుంచి పెయింటింగ్ పని దాకా చేశాడు… తీరా ఇప్పుడు ఏం జరిగింది..? ఏమీ గాకుండా అయిపోయాడు… […]
చాగంటి రాధాకృష్ణ స్వామి భలే చెప్పాడు… ఈ రాతలూ కలియుగధర్మమే…
‘‘ద్వాపర యుగాంతంలో ఒక రోజున పంచపాండవులలో చివరివాడైన సహదేవుడు గుర్రాల సంతలో ఒక అందమైన గుర్రాన్ని చూశాడు. దాని ధర ఎంత అని యజమానిని అడిగాడు. ‘గుర్రాన్ని ఎవరికీ అమ్మను. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెబితే వారికి ఉచితంగా ఇస్తాను’ అని యజమాని చెప్పాడు. దీంతో సహదేవుడు ఏ ప్రశ్న అయినా సమాధానం చెప్తానని ధీమాగా అన్నాడు. దీంతో యజమాని… పెద్ద బావి ఉంది. అందులోని నీటితో ఏడు చిన్న బావులను నింపవచ్చు. కానీ, ఆ […]
ఆక్సిజన్ అయిపోతోంది… అర్జెంటుగా వేరే గ్రహం వెతుక్కోవాల్సిందే…
ఇక వంద కోట్ల సంవత్సరాలే ఆక్సిజన్ ఉండేది! త్వరగా ఊపిరి పీల్చుకోండి!! ——————– త్రేతాయుగంలో హనుమంతుడు పుట్టగానే అద్భుతాలు జరిగాయి. ఉయ్యాల కొద్దిగా ఒరిగి రోజుల పిల్లాడయిన హనుమ కింద పడితే తల్లి అంజనాదేవి తల్లడిల్లిపోయింది. పసిపిల్లాడికి ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో అని ఆతృతగా ఒళ్లంతా తడిమి తడిమి చూసింది. పిల్లాడికి దెబ్బలు తగలలేదు కానీ- పిల్లాడి దెబ్బకు కొండ పిండి పిండి అయ్యింది. మళ్లీ ఉయ్యాల్లో పెట్టగానే పిల్లాడు ఏడుపు అందుకున్నాడు. ఒక్క నిముషం ఆగు […]
స్టార్ హోటల్ అంటే ఇదీ..! స్టార్లలోకి తీసుకెళ్లి ఆతిథ్యం ఇస్తారు..!!
అనంతమయిన హోటల్ ఆకాశం! అంతరిక్షం టోటల్ మీకోసం!! ——————- ఆకాశం, గగనం, శూన్యం- అని సంస్కృత ప్రామాణిక నిఘంటువు అమరకోశం ఆకాశాన్ని ఆకాశానికెత్తుతూ ఎన్నెన్నో పదాలతో హారతి పట్టింది. నిజమే. రామ- రావణ యుద్ధాన్ని దేనితో పోల్చాలో తెలియక- అంతటి ఆదికవి వాల్మీకి- ఆకాశానికి ఆకాశమే పోలిక. సముద్రానికి సముద్రమే పోలిక. రామ- రావణ యుద్ధానికి రామ-రావణ యుద్ధమే పోలిక అన్నాడు. అందరికీ, అన్నిటికీ అవకాశం కల్పించేదే ఆకాశం. గ్రహాలు కూడా ఆకాశంలో స్థిర కక్ష్యల్లో కక్షలు […]
తెరపై కనిపిస్తే చాలు… చెల్లి, లవ్వు, రేప్, కడుపు… కెరీరంతా ఇదే కథ…!
చాలా ఏళ్ల క్రితం… థియేటర్లో ఓ తెలుగు సినిమా… కథ సీరియస్‌గా ఉంది… ఓవైపు తల్లి, మరోవైపు అన్నయ్య… తల్లి బిడ్డను కొడుతూ ఉంటుంది… అన్న ఆపుతాడు… ఏమైంది అంటాడు… చెల్లి మీద విపరీతమైన ప్రేమ… చెల్లి నోరు విప్పుతుంది… ‘‘నేను గోపిని ప్రేమించాను అన్నయ్యా… తొందరపడ్డాం… తల్లిని కాబోతున్నాను… గోపి తండ్రి ఒప్పుకోవడం లేదు…’’ అని ఏడుస్తూ ఉంటుంది… గోపి ఫాదర్ అత్యంత సహజంగా హీరోకు పడని విలన్ అయి ఉంటాడు కదా తెలుగు సినిమా […]
నువ్వేం నాయకుడివయ్యా తండ్రీ… ఇంకా చదువుతానంటావేం..?!
చదువుకుంటే లీడర్లు ఎలా అవుతారు? ——————- మహాత్మా గాంధీ న్యాయవిద్య చదివి, అంతర్జాతీయస్థాయిలో న్యాయవాదిగా నిరూపించుకుని భారత స్వాతంత్ర్య పోరాటంలో ఊరూరు తిరిగాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా లండన్‌లో లా డిగ్రీ చదువుకుని భారత్ వచ్చాడు. పి వి నరసింహారావు చదువు సంధ్యలు, బహుభాషల్లో పాండిత్యం అందరికీ తెలిసినవే. అటల్ బిహారీ వాజపేయి హిందీ, సంస్కృతం, ఇంగ్లీషు అంశాలతో గ్వాలియర్ లో డిగ్రీ చదివాడు. చదువుకుని రాజకీయాల్లోకి వచ్చేవారు తగ్గిపోయారు. రాజకీయాల్లోకి వచ్చాక బుద్ధిగా డిగ్రీలు, […]
రాహుల్ జవాబు వింటే… బాలయ్య, బ్రాహ్మి జాయింటుగా గుర్తొచ్చారు సుమీ…
కాలేజీ పిల్లల ఎదుట ఓ ప్రధాని అభ్యర్థి ఫుషప్స్ చేస్తున్నాడు… ఒంటి చేత్తో పుషప్స్ చేస్తూ సవాల్ విసురుతున్నాడు… చెరువుల్లో ఈతలు కొడుతున్నాడు… వంటల్లో ఉప్పు కలుపుతున్నాడు… తాటి ముంజలు తింటున్నాడు… మస్తు ప్రయాసపడుతున్నాడు… మోడీ ముదురు వేషాలతో పోలిస్తే ఇవి తక్కువేమీ కాదు… కానీ ఇండియా వంటి అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో ప్రధాని అభ్యర్థిత్వాలు తమను తాము గోసపెట్టుకున్న తీరు చూస్తే మనకే గోస అనిపిస్తుంది… ఆ వేషాలు సరే, కానీ కీలకమైన ఇష్యూస్ వచ్చినప్పుడు […]
ప్రపంచ కుబేరుల పద్దులో తెలుగువారికి అన్యాయం!
పృథివి కలవాడి పృష్ఠంబు పుండయిన జగతి వార్తకెక్కు- అని ఒక ప్రమాణం. అంటే బాగా డబ్బున్నవాడి పిర్ర మీద చిన్న పుండు లేచినా అది ప్రపంచానికి అతి పెద్ద వార్త అవుతుందట. అలాంటిది బాగా డబ్బున్నవారి ప్రపంచ హోదా, ర్యాంకింగ్, స్థాయి, సంపద విలువ, ఎవరికంటే ఎవరు ఎక్కువ? ఎవరు తక్కువ? అన్న వార్త సకల వార్తలకు తాతలాంటి వార్త అయి తీరుతుంది. వేదాంతులకు కళ్లముందు స్పష్టంగా కనిపించే ఈ ప్రపంచమంతా ఒట్టి మిథ్య. మాయ. పుట్టినదేదయినా నశించేదే. […]
నాలుగు రామోజీ పత్రికల మూసివేత… మిగిలినవి ఈనాడు, అన్నదాత…
రామోజీరావు అనితర సాధ్యుడు ఏమీ కాదు… ఆయన పెట్టుబడుల అడుగులన్నీ సక్సెస్ ఏమీ కాదు… చేతులు కాల్చుకుని, మూసేసుకున్నవి బోలెడు… చివరకు తనకు కీర్తికిరీటాలు తొడిగిన మీడియా రంగంలోనూ బోలెడు వైఫల్యాలు… తన ఇంగ్లిష్ పత్రిక న్యూస్‌టైం ఒక అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్… చాలారోజులు నష్టాల్లో నడిపీ నడిపీ ఇరవయ్యేళ్ల క్రితం మూసేశాడు… పలు భాషల్లో తీసుకొచ్చిన ఈటీవీ న్యూస్ చానెళ్లన్నీ ఫ్లాప్… వాటిని పాత బాకీల కింద ముఖేష్ అంబానీకి ముడిపెట్టి చేతులు దులుపుకున్నాడు… మిగిలిన […]
తూచ్ మోడీ సాబ్… టీకా ఫోటోల్లో తమిళ టచ్ మిస్సయ్యింది భయ్యా…!!
మోడీ కరోనా టీకా వేసుకోవడం వెనుక అంత పరమార్థం, ఎన్నికల వ్యూహాలు ఉన్నాయా…? వావ్… మనలాంటి అల్లాటప్పా సామాన్యులకు అంతుపట్టదు గానీ… ఉండే ఉంటుంది… ఒకాయన చెప్పాడు కదా…. ప్యూర్ యాంటీ మోడీ బ్యాచ్… తెల్లారిలేస్తే హిందూ డప్పు కొట్టే మోడీ అట, తన ప్రాణాలకు సంబంధించిన ఇష్యూకు వచ్చేసరికి క్రిస్టియన్ నర్సులను నమ్ముకున్నాడట… నమో నమ…. వీళ్లు మోడీని మించిపోతున్నారు కదా… ఆయన అస్సోం ఎన్నికల నేపథ్యంలో ఆ కల్చర్‌ను ప్రతిబింబించే ఓ స్కార్ఫ్ వేసుకుని, […]
మీనా మేకప్పుపై ట్రోలింగ్..! ఆ దృశ్యం ఒప్పుకోదని చెప్పినా వినలేదుట..!!
ఒక సినిమా తారకు మేకప్ ఎందుకు..? అందంగా కనిపించడానికి… మొహంపై గుంతలు, మరకలు కప్పడిపోవడానికి… డార్క్ షేడ్ కవర్ చేసుకోవడానికి..! తెరపై కనిపించినంతసేపు ప్రేక్షకుడికి ప్లజెంటుగా అనిపించడానికి…! మేకప్ లేకుండా బయటికే రారు, డీగ్లామర్ లుక్కులో కనిపించడానికే ఇష్టపడరు… నాటకాల్లో కూడా రంగు పూసుకోవడం మస్ట్, అందంగా కనిపించడానికే కాదు… మొహంలో ఉద్వేగాలు ప్రస్ఫుటంగా ఎక్స్పోజ్ కావడానికి..! దూరంగా ఉన్న ప్రేక్షకుడికి కూడా స్పష్టంగా కనిపించడానికి..! అసలు సినిమా తారలు, సెలబ్రిటీలే కాదు… మహిళలు బయటికి వెళ్తున్నప్పుడు […]
పోనీ… ప్రతి చందాకూ ఐటీ వారి ధ్రువపత్రం జతచేయాలా కామ్రేడ్..?!
దాత విరాళంపై కేరళ ఆలయం అభ్యంతరం ధర్మబద్దమేనా? సంస్కృతంలో మొదటిసారి ఛందోబద్ధమయిన శ్లోకం వాల్మీకి నోట్లో నుండే వెలువడింది. ఆదికావ్యం రామాయణం. ఆది కవి వాల్మీకి. బోయకులానికి పర్యాయపదంగా వాల్మీకి వాడుకలోకి వచ్చింది కానీ- నిజానికి వాల్మీకి ప్రచేతస మహర్షి పుత్రుడు. పేరు ప్రాచేతసుడు. దారితప్పి అడవుల్లో అల్లరి చిల్లరగా తిరుగుతుంటే- ఒక రుషి జ్ఞానోదయం కలిగిస్తాడు. ఈ దారి దోపిడీలు ఎందుకోసం? అన్న రుషి ప్రశ్నకు ప్రాచేతసుడు నవ్వి – కుటుంబాన్ని పోషించడం కోసం అని […]
ప్రేమ ఖతం..! ప్రియుడి హత్యకు ప్రియురాలి సుపారీ… ప్లస్ ఒక పూట..?
ఒక్కసారి కోరికలు గాడితప్పితే చాలు… అవి సుఖాన్నివ్వడమే కాదు… తెలియని తలనొప్పుల్లో, తప్పుల్లో ఇరికించి, చివరకు ప్రాణాలు తీసినా ఆశ్చర్యం లేదు… అడుసులో కాలేయడం వరకే, అది ఎక్కడి దాకా దిగ‘జారుస్తుందో’ ఎవరూ చెప్పలేరు… ఇదీ అలాంటి కథే… ఒక యువతి, ఒక యువకుడు… వాడికి ఇంతకుముందే పెళ్లయింది… ఆమెకు పెళ్లి కాలేదు… ఇరవయ్యేళ్ల వయస్సు… ఇద్దరి నడుమ అక్రమ సంబంధం సాగుతోంది… సమాజంలో ఇలాంటివి బొచ్చెడు కనిపిస్తయ్, అది కాదు సమస్య… ఆమెకు పెళ్లి ఖాయమైంది… […]
మహానటి..! పాత్రలోకి దూరిందంటే చాలు… సహనటుడికి ప్రాణగండమే…
ద్రౌపది పాత్రలో నటి రౌద్రావతారం! చావుదప్పి బతికి బయటపడ్డ విలన్! ——————- బలిజేపల్లి లక్ష్మీకాంత కవి సత్యహరిశ్చంద్ర నాటక రచయితగా జగత్ ప్రసిద్ధుడు. ఆ నాటకం ప్రదర్శించని ఊరు తెలుగు నేల మీద బహుశా ఉండదు. “భక్తయోగ పదన్యాసి వారణాసి…” “తిరమై సంపదలెల్ల..” పద్యాలు అందులోనివే. నాటకాన్ని సినిమా మింగనంతవరకు, మూడు యుగాలు గడచినా పూర్తి కాని సీరియళ్లతో టీ వీ లు వేయి తలలుగా విస్తరించనంతవరకు నాటకం పద్యాలు వినేవారు ఉండేవారు. డి వి సుబ్బారావు, […]
బిరుదు కావాలా నాయనా..? మన మార్కెట్లో చౌక సరుకే ఇది…!!
కీర్తి ప్రతిష్ఠల కోసమే లోకం బతుకుతూ ఉంటుంది. తిరుమల కొండమీది వెంకన్న కీర్తి ప్రభతో- వికారాబాద్ పక్కన అనంతగిరి కొండల్లో ప్రశాంతంగా ఉన్న అనంతపద్మనాభస్వామి ప్రభను పోల్చడానికి వీల్లేదు. ఎవరి కీర్తి వారిదే. తిరుమల వెంకన్న అన్నమయ్య అంతటి మహామహుడిని పి ఆర్ ఓ గా పెట్టుకుని పోషించగలిగాడు. అనంతగిరి స్వామికి ఆర్థికంగా అంత వెసులుబాటు లేదేమో? లేక అన్నమయ్య లాంటి కారణజన్ముడు దొరకలేదేమో? మనకెలా తెలుస్తుంది? అది పెరుమాళ్లకే ఎరుక! మనిషికయినా, దేవుడికయినా, చివరకు రాక్షసుడికయినా కీర్తి […]
సోప్ వేసిన సోప్ ప్రకటన..! తెల్లటి మాయకు తెలివైన ప్రయాస..!!
మా సోప్ శరీరం రంగు చూడదు! మా ప్రకటన భాష చూడదు!! ——————– డోవ్ అని ఒక ఒళ్లు రుద్దుకునే సోప్. ఆ సోప్ పాఠకులకు ఒక ప్రకటన సోప్ వేసింది. ఒక ఇంగ్లీషు పత్రికలో ఫస్ట్ పేజీలో సగం, రెండో పేజీ మొత్తం ఉన్న ఈ ప్రకటనలో కనిపిస్తున్న మనిషి ఊరు, పేరు కూడా వేశారు. “No digital distortion” అని అదే ప్రకటనలో ప్రత్యేకంగా చెప్పుకున్నారు. అంటే గ్రాఫిక్స్, మార్ఫింగ్, రంగులు మార్చడం లాంటివి […]
- « Previous Page
- 1
- …
- 101
- 102
- 103
- 104
- 105
- …
- 110
- Next Page »