Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గురువులనే పిల్లలు కోదండం వేసే రోజులొచ్చాయ్… బహుపరాక్‌‌…

December 6, 2024 by M S R

teacher

. విద్యార్థులు కొట్టారు… మనోవేదనతో టీచర్ కన్నుమూశాడు (The Sad incidet of a Teacher) అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపల్లి ఉర్దూ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏజాష్‌ అహ్మద్‌ టీచర్‌గా పనిచేస్తున్నారు. బుధవారం విద్యార్థులకు ఆయన పాఠాలు చెప్తూ ఉన్నారు. పక్కనే తొమ్మిదో తరగతి నుంచి విపరీతమై అల్లరి వినిపిస్తోంది. ఆయన ఆ తరగతికి వెళ్లి వాళ్లని మందలించాడు. వారిలో ఇద్దరు కవల పిల్లలున్నారు. వాళ్లిద్దరూ బాగా అల్లరి చేస్తున్నారని గుర్తించి వారిలో ఒకరిపై దెబ్బ […]

మన ఉన్నత విద్యాప్రమాణాల్లో నాణ్యత నానాటికీ తీసికట్టు…

December 6, 2024 by M S R

education

. చదువులు చట్టు బండలేనా ..? ఎనభయ్యవ దశకంలో రెండు సినిమాలు వచ్చాయి … ఆకలి రాజ్యం  సినిమాలో నిరుద్యోగుల జీవితాలను ఒక్క పాటలోనే కళ్ళకు కడతాడు దర్శకుడు. ఈ చదువులు మాకొద్దు.. అనే మరో సినిమాలో… ఉద్యోగాలు ఇవ్వలేని.. ఉపాధి చూపలేని.. ఎందుకూ కొరగాని చదువులు అని యవత నిరాశ.. నిస్పృహలతో.. ప్రాణత్యాగానికి సిద్ధపడతారు.. సరిగ్గా నలభై ఏళ్ల తర్వాత కూడా దేశంలో ఈ పరిస్థితి మారలేదు. మారే సూచనలు కూడా కనిపించడం లేదు.. 90వ […]

బిగ్‌బాస్ చిప్ టోటల్లీ దొబ్స్… వాడికైనా ఈ ఆట ఏమిటో సమజై చస్తే కదా…

December 5, 2024 by M S R

bb8

. హహహ… నేను ముందు నుంచే చెబుతున్నా… ఈసారి బిగ్‌బాస్ హౌజ్ అంటేనే ఓ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అని… నో నో , నువ్వు తప్పు… కంటెస్టెంట్లు మెంటల్ గాళ్లు కాదు… అసలు బిగ్‌బాస్ టీమే పెద్ద మెంటల్ గ్రూప్ అని… పదే పదే నిరూపితం అవుతూనే ఉంది… ఈరోజు టాస్క్ పర్‌ఫెక్ట్ ఉదాహరణ… మణికంఠ, పృథ్వి తదితరులు వెళ్లిపోవడం కాదు… అసలు కేసు బిగ్‌బాస్ కదా… పక్కాగా బిగ్‌బాస్ ఎవరు డీల్ చేస్తున్నారో వాళ్ల […]

ఇతర సీఎంల భార్యలతో పోలిస్తే… ఈ అమృత స్టోరీ చాలా డిఫరెంట్…

December 5, 2024 by M S R

amrtutha

. దేవేంద్ర ఫడ్నవీస్… మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నాడు… పుట్టింది నాగపూర్… ఆర్ఎస్ఎస్ మూలాలు… ఈసారి బీజేపీకి మంచి సీట్లు రావడంతో… చిన్నాచితకా అడ్డంకులు తొలగించిన హైకమాండ్ తన సీఎం పదవికి దారి క్లియర్ చేసింది… తన వివరాలే కాదు, ప్రస్తుతం ఆయన భార్య వివరాల సెర్చింగు సాగుతోంది అధికంగా… ఆమె పేరు అమృత… తనదీ నాగపూరే… ఫడ్నవీస్ రాజకీయాలు, ముఖ్యమంత్రిత్వంతో ఏ సంబంధమూ లేకుండా ఆమెది ఓ సపరేట్ కెరీర్… ఎప్పుడూ వార్తల […]

తుమ్మ సంజయ్ మంచి వంటవాడే కాదు… మాటగాడు… ఆటగాడు…

December 5, 2024 by M S R

bb8

. తుమ్మ సంజయ్… మంచి టాప్ క్లాస్ చెఫ్ మాత్రమే కాదు… తెలుగువాడు… సరదాగా, జోవియల్‌గా ఉంటాడు… తన వంటకాలతో మాత్రమే కాదు, తన మాటలతో కూడా జోష్ నింపగలడు… మామూలుగా ఇతర టీవీ రియాలిటీ షోలలాగే బిగ్‌బాస్ రియాలిటీ షోలో కూడా ఎక్కువగా టీవీ, సినిమా బేస్డ్ టాస్కులు, ఫన్నీ గేమ్స్ ఎక్కువ… వచ్చే గెస్టులు కూడా టీవీ, సినిమా సెలబ్రిటీలే ఎక్కువ… ఈ నేపథ్యంలో సంజయ్ ఒక డిఫరెంట్ గెస్టుగా హౌజులోకి రావడం బాగుంది… […]

పుష్ప చూడకపోతే చస్తావని పాయింట్ బ్లాంక్‌లో బెదిరిస్తున్నారా..?!

December 4, 2024 by M S R

pushpa2

. ( — ప్రసేన్ బెల్లంకొండ ) ది ఓల్డెస్ట్ కోట్… ‘ ఈ ప్రజలు బ్రెడ్ లేదు బ్రెడ్ లేదు అని గొడవ చేస్తారెందుకు? బ్రెడ్ లేకపోతే కేక్ లు తినొచ్చు కదా ‘ …..అందట ఎలిజబెత్ రాణి!!… అన్వయం కుదురుతుందో లేదో గానీ నాకైతే పుష్ప – 2 టికెట్ రేట్ల గురించిన రభస చూస్తుంటే ఏలిజబెత్ రాణీమతల్లే గుర్తుకొస్తోంది!! అవునూ పుష్ప 2 సినిమా యేమన్నా జీవ జలమా చూడకపోతే గొంతెండి చావడానికి ?…. […]

ఎర్రచందనం స్మగ్లింగుకన్నా దారుణం… సోవాట్, ఎవడు చూడమన్నాడు..?

December 4, 2024 by M S R

pushpa2

. మనిషి మెంటల్ గాడే గానీ… చాలాసార్లు తను చెప్పింది అక్షర సత్యాలు అనిపిస్తాయి… కాకపోతే చెప్పడంలో తనది వేమన టైపు కాదు… వర్మ టైపు… క్రూడ్… . ఎస్, పుష్ప2 సినిమా టికెట్ రేట్లకు సంబంధించి ఒక వ్యవస్థగా చంద్రబాబు, రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్… దరిద్రపు నిర్ణయాలు… అంతే మరి… ఇద్దరూ పుష్ప2 తరహా కేరక్టర్లే కదా… అలాగని జగన్ తక్కువ అనీ కాదు… కేసీయార్ మరీ తక్కువ కాదు… దొందూ దొందే తరహాలో […]

భూకంప తీవ్రతకన్నా… వార్తలు, ప్రచార ప్రకంపనల తీవ్రత ఎక్కువ..!!

December 4, 2024 by M S R

earth quake

. అవును… 5 దాటి రిక్టర్ స్కేల్‌‌పై కంపనల తీవ్రత ఉండటం వార్తే… పాత వరంగల్ జిల్లా మేడారం ఈ భూకంపం ఎపిసెంటర్ అని భావిస్తున్నారు… అంటే భూకంప కేంద్రం… దానికి దాదాపు 100 నుంచి 200 కిలోమీటర్ల దాకా కంపనల ప్రభావం ఉంటుంది,.. అయ్యో, అయ్యో… అదే మేడారంలో ఈమధ్య వందల హెక్టార్లలో లక్ష చెట్లు అకారణంగా నేలకూలాయి… ఆ మిస్టరీ ఏమిటో ఛేదించలేకపోయారు… ఈలోపు ఎన్నడూ లేనిది ఈ భూకంపం… ఏదో జరుగుతోంది… భూకంపాలకు […]

రాజకీయ విమర్శకు వ్యంగ్యం జోడించి కొడితే… అదే రోశయ్య దెబ్బ..!!

December 4, 2024 by M S R

rosaiah

. కొణిజేటి రోశయ్య… తను క్రౌడ్ పుల్లర్ కాదు… వ్యక్తిగత చరిష్మాతో రాజకీయాల్లోకి నెగ్గుకొచ్చినవాడు కాదు… కొన్ని పద్ధతులు, విలువల్ని తనే నిర్దేశించుకుని… ప్రస్తుత రాజకీయ అవలక్షణాల్ని దగ్గరకు రానివ్వకుండా… తెలుగు రాష్ట్రాల పాలనపై తనదైన ముద్ర వేసిన వాడు… ఒక ముఖ్యమంత్రిగా జస్ట్, ఓ టెంపరరీ, టైమ్ బీయింగ్ అడ్జస్ట్‌మెంట్ కావచ్చుగాక… కానీ ఓ ఆర్థికమంత్రిగా ఓ సుదీర్ఘ అనుభవం… ప్రావీణ్యం… ఇప్పుడంతా పంచుడు రాజకీయం కదా… అదే బటన్ డిస్ట్రిబ్యూషన్ కదా… కానీ రోశయ్య […]

చెప్పినట్టు వింటాం, కాపాడండి… ఇజ్రాయిల్‌కు సిరియా మొర…?

December 4, 2024 by M S R

ww3

. WW3 అప్డేట్ 6…… షాకింగ్ న్యూస్! సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహు సహాయం కోరాడు! వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం! సోమవారం 02, డిసెంబర్ సాయంత్రం అంటే నిన్న సాయంత్రం అల్ అసద్ నెతన్యాహు సహాయం ఆర్ధించినట్లుగా తెలుస్తున్నది! సౌదీ అరేబియా న్యూస్ పేపర్ ఎలాఫ్ ( ELAPH NEWS ) ఈ విషయాన్ని తెలియచేసినట్లు ఇజ్రాయెల్ వార్త సంస్థ పేర్కొన్నది! అయితే నేరుగా అల్ అసద్ నెతన్యాహుతో మాట్లాడలేదు! సిరియాతో సత్సంబంధాలు […]

ఒకరి రాత బాగున్నా… సమూహానికి మేలు, రక్షణ… అదీ లేకపోతే..?

December 4, 2024 by M S R

thunder

. చాలాసార్లు మీరు ఈ కథ చదివి ఉండవచ్చు… ఏమో, చదివి ఉండకపోవచ్చు కూడా… సమూహంలో ఒకరు అదృష్ణవంతుడు, పుణ్యశీలి ఉంటే ఆ సమూహానికి భద్రత… అదే ఒక్కడు దురదృష్ణవంతుడు ఉన్నా సరే సమూహం మొత్తానికీ అరిష్టం… మరోసారి ఇది చదవండి… పర్లేదు, మనమెంత నిమిత్తమాత్రులమో చెప్పే కథ… మనల్ని నేలపై ఉంచే కథ… చీకటి కావస్తున్నది… ఆ బస్సు రద్దీగా ఉంది… ప్రయాణికులతో నిండుగా ఉంది… గమ్యస్థానంవైపు మెల్లిగా వెళ్తున్నది… అడవిలోకి ప్రవేశించింది… ఘాట్ రోడ్డు… […]

ప్రధాని సహా ఇతర మంత్రులూ వీక్షించారు… ఏమిటి ఈ సబర్మతి రిపోర్ట్..!!

December 3, 2024 by M S R

the Sabarmati report

. మన తెలుగు మీడియాలో పెద్ద ప్రాధాన్యత లభించలేదు.. కానీ ఇదొక విశేషమైన వార్తే… బహుశా పుష్ప-2  బాపతు ఉరవడిలో కొట్టుకుపోతున్నాం కదా, మనకు ఇప్పుడు ఇంకేమీ కనిపించవు… వార్త ఏమిటంటే…? ప్రధాని మోడీ తన కేబినెట్ సహచరులు అమిత్ షా, రాజనాథ్ సింగ్, నితిన్ గడ్కరీ సహా పలువురు ఎంపీలతో కలిసి పార్లమెంటు లైబ్రరీ బిల్డింగులోని బాలయోగి ఆడిటోరియంలో ఒక సినిమా వీక్షించాడు… తనే చెప్పాడు, ప్రధాని అయ్యాక చూసిన తొలి సినిమా అని..! అదీ […]

అత్యంత ప్రముఖ జర్నలిస్టు… సాక్షిలో ఓ అద్భుత వ్యాసరత్నం…

December 3, 2024 by M S R

karan thapar

. నిజానికి నాకు నచ్చిన టీవీ ఇంటర్వ్యూయర్ తను… ఈ సోకాల్డ్ పిల్ల బిత్తిరి ఇంటర్వ్యూయర్లు లేని నాటి రోజుల్లో పెద్ద పెద్ద కేరక్టర్లనే తన ఇంటర్వ్యూలతో హడలగొట్టిన జర్నలిస్టు తను… పేరు కరణ్ థాపర్… ఒక కంచె ఐలయ్య, ఒక రామచంద్రగుహ, ఒక యోగేంద్ర యాదవ్ ఎట్సెట్రా… ఇలాంటి వ్యాసకర్తల వ్యాసాలు బయాస్డ్‌గా ఉంటాయి… సరే, వాళ్ల వ్యాసాలు వాళ్ల ఇష్టం… అవి పబ్లిష్ చేసుకునే మీడియా సంస్థల ఇష్టం… కానీ..? ఒక కరణ్ థాపర్, […]

భాగ్యనగరమే ఒక షాపింగ్ మాల్… అద్దాల అంగడి మాయ…

December 3, 2024 by M S R

shopping

. భాగ్యనగరమే ఒక షాపింగ్ మాల్… అద్దాల అంగడి మాయ ఒక ఆదివారం మధ్యాహ్నం ఊరికే అలా ఎటైనా వెళదాం అన్నాను నేను మా ఆవిడతో. యాదగిరిగుట్టకు వెళదాం అంది. సెలవురోజు యాదగిరిగుట్టకు వెళ్లేంత భక్తి ఉన్నా… ధైర్యసాహసాలు మాత్రం లేనివాడిని అని నా అశక్తతను స్పష్టంగా చెప్పాను. నిజమేనని… దైవదర్శనానికి పైరవీలు చేయలేని నా అశక్తతకు మా ఆవిడ నిట్టూర్చింది. దుర్గంచెరువు దగ్గర పేరుమోసిన షాపింగ్ మాల్ కు వెళదాం ఎలాగూ ఇంటికి కొనాల్సిన ఏవో సరుకులు […]

అవసరాల మేరకే సంపాదన… ఆ తరువాత అంతా ఉచిత సేవ…

December 3, 2024 by M S R

doctor

. మిత్రుడు Gopireddy Jagadeeswara Reddy….. వాల్ మీద కనిపించిన పోస్టు ఒకటి ఆసక్తికరంగా ఉంది… భగవంతుని గురించి తెలుసుకునే వారందరూ చదవవలసిన ఒక అత్యద్భుతమైన యదార్థ సంఘటన. కొన్నేళ్ళ క్రితం మన దేశంలో ఉత్తర భారతంలో ఒక ఆయుర్వేద వైద్యుడు వుండేవాడు. పేద డాక్టరు . భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనిషిని ఎలా జీవించమని చెప్పాడో కచ్చితంగా అలానే జీవిస్తూ వుండేవాడు. ఒక రోజుకు తన భార్య , కూతురు , తనకు ఎంత డబ్బు అవసరం అవుతుందో అంతే […]

తలబిరుసు కాదు… తలదించుకునేది కాదు.,. స్మిత కొన్ని వాస్తవాలు…

December 2, 2024 by M S R

silk

. నిజంగా సిల్క్ స్మిత గురించి నిజాలు తెలుసా అందరికీ..? ఇంటిమేట్ సీన్లు, కేబరే డాన్సులు, వ్యాంప్ తరహా పాత్రలతో ఓ ఉర్రూతలూగించిన కేరక్టర్ నిజజీవితం ఏమిటో తెలుసా అందరికీ..? ఈ ప్రశ్నకు సమాధానం లేదు… విద్యాబాలన్ నటించిన డర్టీ పిక్చర్ చూసి అదే నిజజీవిత చరిత్ర అనుకుంటున్నారు అందరూ… కానీ కాదు… అది జస్ట్, ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి నానా చెత్తా రంగరించిన చరిత్ర… అందులో విద్యబాలన్ ఓ పాత్ర… నిజానికి ఆమె ఎవరు..? తెలుగు మహిళ… […]

సోనియా వేరు, ఇందిర వేరు… సేమ్… సోనియా వేరు, వాజపేయి వేరు…

December 2, 2024 by M S R

najma heptulla

. అందరూ రాశారు… 84 సంవత్సరాల నజ్మా హెప్తుల్లా సోనియా గాంధీ మీద చేసిన విమర్శ అది… In persuit of democracy, beyond party lines అని ఆత్మకథలాంటి పుస్తకం రాసింది, అందులో చేసిన విమర్శ… ఏమిటంటే..? తను ఓసారి Inter Parliamentary Union అధ్యక్షురాలిగా ఎన్నికైంది… ఇది షేర్ చేసుకోవడానికి బెర్లిన్ నుంచి ఫోన్ చేస్తే మేడమ్ బిజీ అని చెప్పిన ఎవరో ఆమె సిబ్బంది వెయిట్ చేయండి అన్నారుట… ఈమె గంటసేపు వెయిట్ […]

సోషల్ మీడియాలో విమర్శకు… ఈమధ్యకాలంలో ది బెస్ట్ రిప్లయ్…

December 2, 2024 by M S R

mahindra

. ఆనంద్ మహింద్రా… మహింద్రా గ్రూపు చైర్మన్… తరచూ వార్తల్లో ఉండే వ్యక్తి… తన కార్ల వ్యాపారమేదో తాను చూసుకోవడమే కాదు, సమాజగతి మీద కూడా స్పందిస్తుంటాడు… సోషల్ మీడియాలో యాక్టివ్… తనకు ఆసక్తిగా అనిపించినవి షేర్ చేసుకుంటాడు… తను సాయం చేయగల ఇష్యూస్‌లో ఇన్వాల్వ్ అవుతాడు… విశిష్టంగా కనిపించే ఓ భిన్నమైన వ్యాపారి… ఇప్పుడు సోషల్ మీడియాలో తన కార్లకు సంబంధించి కనిపించిన ఓ పోస్టుకు తనే రియాక్టయ్యాడు… తను ఇచ్చిన రిప్లయ్ ఈమధ్యకాలంలో అత్యుత్తమం […]

అంటే అన్నామంటారు గానీ… ఈ యాడ్ పరమార్థం ఏమిటి సార్..?!

December 1, 2024 by M S R

nuzen

. ఒక ప్రపంచంలోకెల్లా అత్యధిక ధనవంతుడైన, ప్రభావమంతమైన హిందూ దేవుడి గుడికి పాలకమండలి అధ్యక్షుడయ్యాడు ఆయన… వోకే… కారణాలు ఇక్కడ అప్రస్తుతం… పక్కా రాజకీయ పదవి… మన గుళ్లు రాజకీయ క్రీడల్లో చిక్కిన ఫలితం… పోనీలే పాపం… ఎవడెవడో నాస్తిక చక్రవర్తులు కూడా భ్రష్టుపట్టించే దుర్మార్గాలు చేశారు, ఈయన నయం కదా అంటారా..? సరే… అంగీకరిద్దాం… తనను చూసి కాదు… మన గుళ్ల పరిస్థితి చూసి..! సరే, అయ్యాడు… అక్కడ సగటు భక్తుడికి, వోకే, వోకే, ఆ […]

పుట్టుక, చావుల మైలతో గుడి పూజారి అర్చన వృత్తికి వెళ్లొచ్చా..?

December 1, 2024 by M S R

Ayodhya

. నిజానికి వర్తమాన వార్తాసరళి నడుమ ఇది పెద్ద వార్తగా అనిపించదు… కానీ భక్తి విశ్వాసులకు చదవగానే ఒకింత ఆసక్తి… తెలంగాణలోని ఓ ప్రధాన ఆలయ అర్చకుడు అనుమతి లేకుండా ఇటీవల దుబయ్ వెళ్లొస్తే గుడి ఉన్నతాధికారగణం తనపై యాక్షన్‌కు సిద్ధమైందనే ఓ సమాచారం విన్న వెంటనే ఈ వార్త కనిపించి, కొంత ఇంట్రస్ట్ అనిపించింది… వార్త ఏమిటంటే..? అయోధ్యలో అర్చనలు చేసే పూజారులు ఎవరైనా సరే తమ ఇళ్లల్లో పుట్టుకలు, మరణాలు సంభవిస్తే మందిరంలోకి రావద్దు […]

  • « Previous Page
  • 1
  • …
  • 42
  • 43
  • 44
  • 45
  • 46
  • …
  • 125
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • భగవాన్ శ్రీరాం సర్..! విశ్వాసులకు దేవుడే… అంతగా ప్రభావితం చేస్తారు..!!
  • పూప్ సూట్‌కేస్..! పుతిన్ పర్యటనల్లో కనిపించే ఈ భద్రత కథేమిటి..?!
  • మంచి సోర్స్, గైడ్, అప్‌‌డేషన్, క్రాస్‌చెక్… ఆ బ్యూరో చీఫ్‌ల రోజులే వేరు…
  • లేడీ విలన్…! అతిరథుల్ని దాటేసిన ఆమె నటనకు అంతటా చప్పట్లు…!
  • అప్పట్లోనే ఇది ఓ మహా బాహుబలి..! అందుకే తను సూపర్‌స్టార్..!!
  • సరోగేట్ ప్రమోషన్..! ఇది సరైన పద్ధతి కాదు మిస్టర్ జగపతిబాబూ..!!
  • ఇవి మంజుల రోజులు కావు… ఘట్టమనేని సితార, భారతిల ఆధునిక కాలం…
  • వైఎస్ ఫ్యామిలీకి అక్కడంత సీనే లేదట… అదీ బాబు దయేనట..!!
  • మహల్లో కోయిల… ఇది వంశీ రాసిన కథ కాదు… వేరే… ‘కోటలో రాణి’…
  • ఉపరాష్ట్రపతి ఎంపికపైనా ఆర్ఎస్ఎస్ ముద్రపడింది… ఎవరాయన..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions