అయోధ్యలో రాముడి గుడి కట్టాం… ఆర్టికల్ 370 ఎత్తేశాం… ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్ రద్దు చేశాం… పౌరసత్వ సవరణ చట్టం తెచ్చాం… సర్జికల్ స్ట్రయిక్స్ చేశాం… నిజానికి పోలింగ్ హీట్ పెరిగేకొద్దీ బీజేపీ నాయకుల నుంచి ఈ మాటలు పెద్దగా వినిపించలేదు, వినిపించడం లేదు… కొత్త కొత్త ఎజెండా వైపు ప్రచారం మళ్లిపోయింది… ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగం రద్దు వంటి అంశాలవైపు బీజేపీని కార్నర్ చేయడం మొదలుపెట్టిందో బీజేపీకి తన విజయాల ప్రచారంకన్నా […]
సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే తీసిపడేస్తారు గానీ… సర్వవిధముల మేలట..!!
సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే చాలామంది నార్తరన్ ఫుడ్ లవర్స్‌కి వెటకారం… అబ్బే, ఏముందండీ… సౌత్ వెజ్ అంటే అవే ఇడ్లీలు, అవే దోశలు, అవే ఊతప్పం, అవే పెసరట్లు, కాదంటే ఉప్మా… అంతేకదా అని తేలికగా తీసిపారేస్తారు… ప్రత్యేకించి ఇడ్లీ మీద బోలెడు జోక్స్ కూడా వేస్తుంటారు… పొద్దున్నే డీప్ ప్రై చేయించిన పావ్ బజ్జీలు, కడక్ సుగర్ జిలేబీలు తినే మొహాలు… అఫ్కోర్స్, ఈమధ్య సౌత్ నగరాల్లో కూడా ఉదయమే మైసూరు బోండా, పూరీలు, […]
చాయ్ వోకే… కానీ కొన్ని గైడ్ లైన్స్ దాటొద్దట… దాటితే బుక్కయినట్టేనట..!!
ఫుల్లుగా బిర్యానీ పట్టించాక మాంచి మసాలా టీ గానీ ఇరానీ చాయ్ గానీ తాగుతారు చాలామంది… కొందరైతే ఒకవైపు బిర్యానీ లాగిస్తూనే మరోవైపు చాయ్ లేదా కాఫీ తాగుతుంటారు… (ఈమధ్య కూల్ డ్రింక్స్ కూడా తాగుతున్నారు…) ఐతే అది డేంజర్ అంటోంది ఐసీఎంఆర్… అనగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్… కొన్ని భారతీయ ఆరోగ్య విషయాల్లో క్లారిటీ ఇచ్చింది… లంచ్ లేదా డిన్నర్ తరువాత టీ తాగితే ఛాతీ, గొంతు నుంచి నూనెను అది తొలగిస్తుందనీ, […]
అమెరికా అధ్యక్షుడి నివాసం… అంతే, అంతకుమించి విశేషమేమీ లేదు…
కావచ్చు, మన ఆలోచనల ధోరణిని బట్టే… చూసే కోణం, అర్థం చేసుకునే తీరు మారతాయేమో… ఈ ప్రపంచపు నెంబర్ వన్ దేశాన్ని పాలించే అధ్యక్షుడి నివాస భవనం వైట్ హౌజ్… అంతేనా..? ఇంకేదైనా విశేషం ఉందా..? ఏమీ లేదు… అబ్బో, ఇది అమెరికా అధ్యక్షుడు ఉండే ఇల్లు అట అనే ఓ ఓవర్ రేటెడ్ ఫీల్‌తో వెళ్లడమే గానీ, నిజంగా అంత పెద్ద సీనేమీ లేదు… అది చూడగానే మొదట గుర్తొచ్చింది… అప్పట్లో మోడీ, కిషన్‌రెడ్డి తదితరులు […]
No to NOTA… వోటేద్దాం… ఐతే వాటేసుకోవడానికి… లేదా వేటు వేయటానికి…
థింక్ వన్స్… ఒకసారి భిన్నంగా ఆలోచించి చూద్దాం… ఎన్నికలు రాగానే నోటాకు వేద్దాం, చైతన్యం చూపిద్దాం అనే నీతిబోధలు మీడియాలో స్టార్ట్ అవుతాయి… అక్కడికే వోటరు ఎందుకు ఆగిపోవాలి… బిట్ బియాండ్ దట్… అంతకుమించి ఎందుకు ఆలోచించొద్దు..? నోటా దగ్గరే మనం ఆగిపోతే అది ఓ తప్పుడు అవగాహన కాదా..? ఈ కోణంలో ఎందుకు ఆలోచించకూడదు..? నిజంగా నోటాకు వోటు వేయడం అనేది ఓ చైతన్య సూచికా..? ఎవరో ఏదో దేశంలో ప్రవేశపెట్టిన ఈ నోటాకు వోటు […]
రంగు పూసుకో… కానీ ఎర్రగా, దట్టంగా పూసుకున్నావో బుక్కయిపోతావ్…
వాడొక పిచ్చోడు… పేరుకు కమ్యూనిస్టు దేశం… కానీ అక్కడంతా నియంతృత్వమే… అదీ ఉన్మాదపు పోకడ… పిచ్చి ప్రభుత్వం… తలతిక్క రూల్స్… అనుమానమొస్తే వేటు వేయడమే… ఎవడూ దేశంలోకి రావొద్దు, ఎవడూ దేశం వదిలిపోవద్దు… అక్కడ ప్రజల పరిస్థితులేమిటో కూడా ఎవరికీ స్పష్టంగా తెలియవు… ఎవరైనా కష్టమ్మీద ప్రాణాలు అరచేత పట్టుకుని బయటికి వచ్చి ఒకటీ అరా నోరువిప్పితే కాస్త తెలిసేది… అదీ ఎంత నిజమో కన్ఫరమ్ చేసేవాళ్లు కూడా ఉండరు… ప్రజల మీద విపరీతమైన ఆంక్షలు, తన […]
ఎన్నికల ఖర్చుకు దీటుగా బెట్టింగ్ టర్నోవర్లు… ధర్మరాజులు ఎందరో…
విజయవాడలో పదిమంది జర్నలిస్టుల మధ్య కూర్చున్నప్పుడు ఎన్నికల ఫలితాల బెట్టింగుల మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఒకటికి- రెండు, మూడు; కోసు పందెం లాంటి పందెం పరిభాష నేనెప్పుడూ వినకపోవడంవల్ల… నిరక్షరకుక్షులకు అర్థమయ్యేలా సావధానంగా, స్పష్టంగా విడమరచి చెప్పాలని నేనడిగితే ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పడం ప్రారంభించాడు. నైమిశారణ్యంలో రావి చెట్టు కింద రాతి అరుగుమీద కూర్చుని సూతమహాముని చెబుతుండగా చుట్టూ నీడలో చేరి శౌనికాదిమునులు శ్రద్ధగా వింటున్నట్లు అందరూ వింటున్నారు. ‘‘అసలు మా ఊరంటే ఏమనుకుంటున్నారు? […]
డెమోక్రసీ అనేదొక డేంజరస్ నిషా… ఓటు పవిత్రమైంది సుమా, జాగ్రత్త..!
Taadi Prakash……. ఎవరు డబ్బిచ్చినా తీసుకో…. ఎవరు మందు పోయించినా తాగు… TO VOTE IS OUR SACRED DUTY… —————————————————- గంగా, గోదావరి లాంటి జీవనదులూ…. కన్నతల్లీ, కాశీపుణ్యక్షేత్రమూ మనకి ఎంతో పవిత్రమైనవి. గుళ్ళో హారతి, మెళ్ళో మంగళసూత్రం పవిత్రం! ఓటు మరింత పవిత్రమైనది! ఇలా పవిత్రతను మనం విచ్చలవిడిగా వాడుతుంటాం. డబ్బు పవిత్రమైనది అని మాత్రం అనం. డబ్బు విలువైంది. అవసరాలు తీర్చేది. అడ్డమైన సుఖాలూ తెచ్చి యిచ్చేది. పవిత్రమైన ఓటుని కొనగలిగే శక్తి […]
అక్షరాలా ఇది జగన్ వర్సెస్ రామోజీరావు ఎన్నికల యుద్ధం..!!
ఓ మిత్రుడు చెప్పినట్టు… ఈసారి ఎన్నికలు అక్షరాలా జగన్మోహన్రెడ్డికీ ఈనాడు రామోజీరావుకు నడుమ యుద్ధం… నిజమే… స్థూలంగా చెప్పుకోవాలంటే… ఇది వైసీపీ వర్సెస్ యెల్లో కూటమి పోరాటం కాదు… ఇది రెడ్డి వర్సెస్ కమ్మ-కాపు కూటమి పోరాటం కానే కాదు… ఇది జగన్ వర్సెస్ జగన్ చెల్లెలు షర్మిల పోరాటం అసలే కాదు… జస్ట్, జగన్ వర్సెస్ రామోజీ… కొద్దిరోజులుగా ఈనాడు బరితెగించి, బట్టలు విడిచిపెట్టి, పోతురాజులా బజారులో నిలబడి యెల్లో కొరడాతో ఛెళ్లుఛెళ్లుమని కొట్టుకుంటూ జగన్ […]
రామాయణంపై మేధోహక్కులట… సాయిపల్లవి రామకథకు అడ్డంకులట…
ఒక వార్త… రణబీర్ కపూర్ రాముడిగా సాయిపల్లవి సీతగా నటించే రామాయణం సినిమా చిక్కుల్లో పడింది అని..! దాదాపు ఐదారువందల కోట్ల ఖర్చుతో భారీ ఎత్తున ప్రతిష్ఠాత్మకంగా తీయబోయే ఈ సినిమాకు నితిష్ తివారీ దర్శకుడు… రావణుడిగా నటించడంతోపాటు కన్నడ హీరో యశ్ ఈ సినిమాలో డబ్బు కూడా పెట్టుబడి పెడుతున్నాడట… ఈ ముగ్గురు ప్రధాన పాత్రధారుల రెమ్యునరేషనే వంద కోట్ల దాకా ఉండనుందనే కథనాలు వచ్చాయి గానీ అందులో నిజానిజాలు ఎవరూ కన్ఫరమ్ చేయరు కాబట్టి […]
శ్రీదేవికి దీటైన అందం, అదే రక్తం… కానీ అనామకంగా ఉండిపోయింది…
నిజానికి ఈ వార్తలన్నీ పాతవే… కొన్ని జాతీయ మీడియా న్యూస్ సైట్లు మళ్లీ ఎందుకు ఈమధ్య తెర మీదకు తీసుకొస్తున్నాయో తెలియదు… శ్రీదేవి చెల్లెలి గురించి..! నేను డీఎన్ఏ సైటులో చదివినట్టు గుర్తు… బోనీకపూర్ తాటతీస్తాడేమో తెలియదు గానీ… ఒకవేళ తను అత్యంత అధికంగా పిచ్చిగా ప్రేమించిన శ్రీదేవి బయోపిక్ గనుక రాంగోపాలవర్మ తీస్తే… అందులో శ్రీదేవికి దీటైన పాత్ర, ప్రాధాన్యం బహుశా ఆమె చెల్లెలి పాత్రకు కూడా ఇవ్వాల్సి ఉంటుందేమో… నిజానికి చాలామందికి శ్రీదేవి చెల్లెలి […]
ఆనాటి చెలిమి ఒక కల… ఈనాటి విషం ఒక భ్రమ… భలే బంధాలు..!!
సాక్షిలో కేసీయార్ ఇంటర్వ్యూ పూర్తిగా చదవలేదు… రోజూ చెప్పే అబద్ధాలు, ఆత్మస్తుతి, పరనింద మాత్రమే కదా అనుకుని… పైగా చాన్నాళ్ల తరువాత టీవీ9 లో డిబేట్ పెట్టించుకుని, పక్కా స్క్రిప్టు ప్రకారం తను చెప్పదలుచుకున్నది అడిగించుకుని మరీ నాలుగు గంటలపాటు చెప్పాడు కదా, ఇంకా కొత్త విషయాలు ఏముంటాయిలే, చెప్పేవాడికి అడిగేవాడు లోకువ అనుకుని..! కానీ ఓ చిన్న వీడియో బిట్ వాట్సప్ గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతోంది… చూస్తే కేసీయార్ ఆంధ్రజ్యోతి మీద నిప్పులు కక్కాడు అంటూ..! […]
‘రెండు ఘంటసాల వెయ్యి, సుశీలను కూడా పెట్టు, చివరలో సిధ్ శ్రీరాం…’
Ashok Vemulapalli…. సుశీల-ఘంటసాల (బజ్జీ-ఉగ్గానీ)… రాయలసీమ ఆతిథ్యం గురించి సినిమాల్లో చూడటం తప్ప ప్రత్యక్షంగా ఇవాళే చూసాను.. శతృవైనా ఇంటికి వస్తే కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తారని విన్నాను.. అక్కడ వాళ్లు చూపించే ప్రేమకే కడుపు నిండిపోతుంది.. కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారి ఇంటికి ఇవాళ వెళ్లినపుడు.. ముందు కడుపు నిండా తినండి తర్వాత మాట్లాడుకుందాం అన్నారు ఆయన.. నాకు అంతకుముందు అసలు పరిచయం లేదు.. మాతో పాటు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి […]
ఓహో… అవి ఆడ ఫిరంగులై ఉంటాయి… అందుకే సివంగులై గర్జించాయి…
అప్పట్లో ఏదో సినిమాలో సుద్దాల అశోక్ తేజ అనబడే ఓ ఘన రాతగాడు ఓ పాట రాశాడు… అదిలా సాగుతుంది… “కాళ్లకి ఎండీ గజ్జెల్, లేకున్నా నడిస్తే ఘల్ ఘల్… కొప్పుల మల్లెల దండల్, లేకున్నా చెక్కిలి గిల్ గిల… రంగే లేని నా అంగీ, జడ తాకితే అయితది నల్లంగీ… మాటల ఘాటు లవంగి, మర్లపడితే అది సివంగి… తీగెలు లేని సారంగి, వాయించబోతే అది ఫిరంగి..’’ బోలెడు ఆశ్చర్యమేసింది… సుద్దాల కలం నుంచి పిచ్చి […]
అక్షరాలా కోటి భూత్ బంగ్లాలు… జస్ట్, అలా వదిలేస్తున్నారు వాటిని…
అకియా… అంటే పాడుబడిన ఇల్లు… భూత్ బంగ్లా… జపాన్‌లో..! ప్రస్తుతం ఇలాంటి అకియాలు ఆ దేశంలో అక్షరాలా కోటి… అంటే కోటి ఇళ్లున్నయ్, కానీ ఉండటానికి జనం లేరు… అవి అలా పఢావు పడిఉన్నయ్, పాడుబడి పోతున్నయ్… మరేం చేస్తుంది ఆ దేశం… పిల్లల్ని కనేవాళ్లు లేరు, కొత్త కుటుంబాలు లేవు, జనాభా వేగంగా పడిపోతోంది… మిగతా ప్రపంచం మొత్తానిది ఒక బాధ అయితే జపాన్‌ది మరో బాధ… అఫ్ కోర్స్, చైనా కూడా ఇలాంటి దిశలోనే […]
ఇవి కొత్త తరహా పెళ్లిళ్లు… కలిసే ఉంటారు- కాపురాలు చేయరు… మరి..?!
అప్పట్లో… అంటే వెంకటేష్ వంటి కమర్షియల్ హీరో సైతం కంట్రాక్టు మ్యారేజీ సబ్జెక్టు మీద, అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకోవడం మీద కూడా సినిమాలు చేసిన బంగారు రోజుల్లో అన్నమాట… ఇప్పుడంటే బూతునాయుడు వంటి వెబ్ సీరీస్ చేసుకుంటున్నాడు… పూలదుకాణం స్థానంలో కట్టెల మండీ పెట్టుకున్నట్టు… తను అప్పట్లో ఓ సినిమాలో సౌందర్యను కంట్రాక్టు మ్యారేజీ చేసుకుంటాడు… (పవిత్రబంధం..? ఆరేడు ఇతర భాషల్లోకి కూడా అనువదించిబడి హిట్లు కూడా కొట్టింది…) వెంకటేష్ తండ్రి పాత్రను ఎస్పీ బాలు […]
డబ్బు ఎలా ఖర్చుపెట్టాలో తెలియక… పైత్యంతో ఇలా తగలేస్తుంటారు…
దీన్నే బలుపు అంటారు… మరీ ఇంత హార్ష్ కామెంటా అని తిట్టుకున్నా సరే… జనం సొమ్ముతో లక్షల కోట్లకు ఎదిగి, ప్రపంచ ధనికుల్లో ఒకడిగా నిలిచినా సరే, ముఖేష్ అంబానీ జనానికి ఏమీ తిరిగి ఇవ్వడు అనే విమర్శ చాన్నాళ్లుగా ఉన్నదే కదా… చివరకు తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధుల వ్యయం కూడా సరిగ్గా చేయడు అంటారు… ఒక విప్రో అజీమ్ ప్రేమ్‌జీ, ఒక టాటా రతన్, ఒక హెచ్‌సీఎల్ శివ నాడార్… ఇలా ఎందరో […]
అయినవారు కూడా అడుగుపెట్టని వాకిళ్లలో నివాసమే నేటి నాగరికత
ఇంటి ముందుకొచ్చే మనుషులు – మహమ్మద్ ఖదీర్‌బాబు రాలిన బాదంకాయల కోసం పిల్లలు వచ్చేవారు. ఎర్రగా పూసి, గోడ బయటకు తలవాల్చిన మందారాల కోసం యూనిఫాముల్లో ఉన్న ఆడపిల్లలు వచ్చేవారు. దేవుని పటాలకు కాదనేదెవరని నందివర్థనాల కోసం పక్కింటామె వచ్చేది. చనువున్న కాలేజీ స్టూడెంట్ కాదనడానికి వీల్లేని పద్ధతిలో రోజాపువ్వును తెంపుకెళ్లేది. రెండు చేతులున్న ప్రతి మహాలక్ష్మి గుప్పెడు గోరింటాకు కోసం హక్కుగా గేటు బాదేది. నాలుగు పుదీనా రెబ్బల కోసం ఎవరైనా రావచ్చు. చారెడు కరివేపాకుకు […]
కపట ప్రభుత్వ నేతల మాల్దీవుల్ని ఇంకా ఇంకా ఉద్దరించాలా మనం..?
‘ప్లీజ్, మా దేశానికి రండి, పర్యాటకం లేనిదే మా దేశం లేదు, మీరు రాకపోతే దివాలా తీస్తాం, మన దేశాల నడుమ బంధం చరిత్రాత్మకం, శాంతి-స్నేహాన్ని కోరుకుంటున్నాం’…. ఇలా మాల్దీవుల పర్యాటక మంత్రి ఇబ్రహీం తాజాగా మీడియా ద్వారా మొత్తుకుంటున్నాడు… ఈ దొంగ మాటల్ని ఇండియా నుంచి వెళ్లాలనుకునే టూరిస్టులు పట్టించుకోవాల్సిన పనిలేదు, అసలు అక్కడికి వెళ్లాల్సిన పనే లేదు… కడుపులో కత్తులు పెట్టుకున్న ప్రభుత్వ ముఖ్యులు అక్కడ… ఒకవైపు చైనాకు తొత్తుగా మారి, అపారమైన సముద్రజలాల్లో […]
ముడత మంచిదే..! ఇస్త్రీ చేయకపోతే ఏంటట..? అలాగే ధరిద్దాం…!
ఒక గంటపాటు లైట్లన్నీ ఆపేద్దాం… ధరిత్రికి అది మనం చూపించే కృతజ్ఞత… ఒక గంట విద్యుత్తు నిలిపేస్తే ఎంత శక్తి ఆదా అవుతుందో, తద్వారా ఎంత కాలుష్యాన్ని వాతావరణంలోకి పోకుండా ఆపగలమో, ఎంత భూతాపాన్ని నిలువరించగలమో లెక్కలతో సహా అప్పుడప్పుడూ ప్రచారాన్ని, పిలుపులను వింటుంటాం, చదువుతుంటాం, కొన్నిసార్లు పాటిస్తుంటాం కూడా… మంచిదే, అలాంటివి ఆహ్వానించాలి… ఏ చిన్న సత్సంకల్పమైనా సరే వ్యతిరేకించొద్దు, ప్రత్యేకించి సోషల్ మీడియాలో హెహె అని వెటకారపు ట్రోలింగూ అక్కర్లేదు… ఎప్పుడో ఓ గంట […]
- « Previous Page
- 1
- …
- 45
- 46
- 47
- 48
- 49
- …
- 125
- Next Page »