ఎన్నికల కోడ్ అనేది తెలంగాణ ఎన్నికల్లో ఓ ఫార్స్లా తయారైంది… ఐటీ శాఖ డీజీ సంజయ్ బహదూర్ ప్రెస్‌మీట్ పెట్టి చెప్పాడు… 59.93 కోట్ల నగదును పోలీసులు పట్టుకుంటే అందులో లెక్కల్లేని నగదు కేవలం 1.7 కోట్లు అట… ఇప్పటికే యజమానులకు 10.99 కోట్లు అప్పగించారట… మరోవైపు ఇంత నగదు పట్టుకున్నాం, ఇన్ని బంగారు నగలు పట్టేశాం అని గొప్పలు చెప్పుకుంటోంది అధికార యంత్రాంగం… మరి 156 కిలోల బంగారం, 454 కిలోల వెండి మాటేమిటి అంటారా..? […]
ఇదీ టైగర్ నాగేశ్వరరావు అసలు కథ… మూడు రోజులపాటు శవయాత్ర…
ఈ కథనం Amarnath Vasireddy… షేర్ చేసుకున్న ఓ పోస్టు… మొన్న మనం ఎన్కౌంటర్ పింగళి దశరథరామ్ జీవితం గురించిన కథనం చదువుకున్నాం కదా… దాని రచయిత ఎన్జే విద్యాసాగరే ఈ టైగర్ నాగేశ్వరరావు కథనూ సవివరంగా చెప్పింది… టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఏం చూపించారో వదిలేయండి… సినిమా కదా చాలా క్రియేటివ్ లిబర్టీ తీసుకుని ఏవేవో మార్పులు చేస్తారు… అసలు టైగర్ కథ ఏమిటి..? (టైగర్ నాగేశ్వరరావు గురించి తెలుసుకోవాలని 2010లో స్టువార్టుపురం చీరాల చుట్టుప్రక్కల వూళ్ళు […]
పెళ్లయితే చాలు ఇక కిచెన్ పరుగులే… ఆటల్లేవ్, పతకాల్లేవ్, షీల్డుల్లేవ్…
… మీ ఊళ్లో స్పోర్ట్స్ అసోసియేషన్లు ఉంటే ఒకసారి వెళ్లి చూడండి. మగపిల్లలకు సమాన సంఖ్యలోనో, కాస్త తక్కువగానో ఆడపిల్లలూ ఆడుతుంటారు. బోలెడన్ని మెడల్స్, కప్పులు వచ్చి ఉంటాయి. అందులో కొందరు జాతీయ స్థాయిలోనూ ఆడి ఉంటారు. వాళ్లంతా పెళ్లయ్యాక ఎందుకు ఆడరనేది ఎప్పుడైనా ఆలోచించారా? 130 కోట్ల దేశంలో పి.టి.ఉష, అశ్విని, మల్లీశ్వరి, సానియా, మేరీకోమ్, పి.వి.సింధు, మిథాలీ, బబిత, జరీన్.. గట్టిగా చెప్పుకుంటే వంద లోపు పేర్లు. S.ఇలవళగి అనే క్యారమ్ క్రీడాకారిణి రెండు […]
ప్రజాసేవ – ప్రజాభీష్టం – ప్రజాదేశం – ప్రజామోదం – అన్నీ భ్రమపదార్థాలు…
Bharadwaja Rangavajhala……. అంతా ప్రజలే చేస్తారు… మీరు పార్టీ మారుతున్న విషయం మీద పుకార్లు వినిపిస్తున్నాయి మీరేమంటారు? పుకార్లని మీరే అన్నారు కదా … మీకు పార్టీ మారే ఉద్దేశ్యం లేదంటారా? లేదని చెప్పలేదు కదా … మారాల్సిన టైమొస్తే మారొచ్చు … అంటే మారుతారా? ప్రజల కోరిక మేరకు నేను రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజల అభీష్టం మేరకు రాజకీయాల్లో కొనసాగుతున్నాను. ప్రజలు కోరితే పార్టీ మారుతాను. ప్రజలు నేను ఏ పార్టీలో ఉంటే తమకు బాగా […]
రాళ్లేసేవాళ్లు ఎప్పుడూ ఉంటారు… రాళ్లేయించుకునే రచనలొస్తున్నాయా ఇప్పుడు..?
… 33 ఏళ్ల పాటు కేరళలోని Congregation of Mother Carmel (CMC)లో నన్‌గా ఉన్న సిస్టర్ జెస్మే ఆ వ్యవస్థను ‘Mafia, with a few Good Goons’ అని వర్ణించి కేరళ క్యాథలిక్ చర్చిల్లో జరిగే లైంగిక వేధింపులు, మోసాల గురించి ‘Amen – Autobiography of a Nun’ అనే పుస్తకం రాశారు. కేరళ క్రైస్తవ సమాజం ఈ పరిణామంతో నివ్వెరపోయి ఆమె మీద బోలెడు ఆరోపణలు చేసినా వెనక్కి తగ్గలేదు. చంపుతామని […]
గుడ్ టచ్, బ్యాడ్ టచ్… ‘సవతి నాన్న’ నేర్పిన పాఠం జీవితంలోనే మర్చిపోలేను…
అమ్మ… చిన్న వయస్సులోనే మా నాన్నతో లేచి వచ్చేసింది… తరువాత… ఆయనకు మా అమ్మ ఒక్కతే భార్య కాదనీ, అప్పటికే తనకు పెళ్లాలు, పిల్లలు ఉన్నారని తెలిసింది ఆమెకు… ఆ పెళ్లితో ఆమె సుఖంగా లేదు… నాన్న మోసం చేశాడనే బాధ ఆమెను పీడించేది… పెళ్లయిన ఐదేళ్ల వరకూ ఆమెను పిల్లల్ని కూడా కననివ్వలేదు… చూసీ చూసీ, వెయిట్ చేసీ చేసీ చివరకు నేను నాలుగో తరగతి చదువుతుండగా అమ్మ నాన్నను వదిలేసింది… చాలాకాలంగా తనకు ప్రపోజ్ […]
అదె వేంకటాచల మఖిలోన్నతము, అదివో బ్రహ్మాదులకపురూపము…
Torchbearers : సంగీత, సాహిత్యాల్లో సమానమైన విద్వత్తు కలిగిన అతికొద్దిమందిలో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ (1893- 1979) ముందు వరుసలో ఉంటారు. తెలుగు, సంస్కృతం, కన్నడ, ప్రాకృత భాషల్లో ఆయనకు ఎంత ప్రావీణ్యం ఉందో సంగీతంలోకూడా అంతే ప్రావీణ్యం ఉంది. అన్నమయ్య కీర్తనలను రాగిరేకులనుండి ఎత్తి రాసి…తప్పొప్పులను పరిష్కరించి లోకానికి అందించిన నలుగురు మహా పండితుల్లో ఆయన ఒకరు. సాహితీ విమర్శకు, తెలుగు వ్యాసరచనకు ఆయన దారిదీపం. “అన్నమాచార్యుని కవిత” అన్న శీర్షికతో ఆయన 1955లో రాసిన వ్యాసం ఎమెస్కో సంస్థ 2017 […]
రావణదహనం కాదు… కొన్ని తమిళ ప్రాంతాల్లో రామదహనం… ఈ కథేమిటనగా…
రావణ దహనానికి వ్యతిరేకంగా శ్రీరామదహనం – ద్రవిడ అస్తిత్వవాద ప్రకటన… విజయదశమి సందర్భంగా చాలా చోట్ల రావణ దహనం చేస్తారు. ఎందుకు? రామాయణం ప్రకారం విజయదశమి నాడే రాముడు రావణుడ్ని వధించాడని నమ్ముతారు కాబట్టి. ఆ నమ్మకం ఏళ్లకేళ్లుగా సాగుతూ రావణదహనం నిరాటంకంగా సాగుతోంది. మనదేశంలో ఒకప్పుడు రామదహనం కూడా చేపట్టారని తెలుసా? రామ్‌లీలకు వ్యతిరేకంగా ‘రావణలీల’ జరిగిన కాలం ఒకటి ఉండింది. ఎక్కడో కాదు, మన పక్క రాష్ట్రం తమిళనాడులోనే. ప్రముఖ ఉద్యమకారుడు, ఆత్మగౌరవ ఉద్యమ […]
తెలుగు పాత్రికేయంలో తొలి, తుది అగ్నికలం… ప్రతి అక్షరమూ ఓ అగ్నికణం…
తెలుగు దేశంలో లుచ్ఛా ఎం.ఎల్.ఏ.లు! ది డర్టీ పొలిటికల్ క్రూక్ భవనం వెంకట్రాం! అజ్ఞాని జైల్‌సింగ్ రాష్ట్రపతా? హ్హి! హ్హి! హ్హి! ఎన్టీవోడు రాత్రిళ్ళు చీరెందుకు కడుతున్నాడు? అమ్మోరి సొమ్ము కమ్మోరికే! ఈ తరహా హెడ్డింగులతో 1980 నుండి 1985 వరకు ఒక పత్రిక ఆంధ్రప్రదేశ్‌లో వుండేది. ఆ పత్రిక పేరు ‘‘ఎన్కౌంటర్.’’ ఎడిటర్ పేరు ‘పింగళి దశరథరామ్’. యెనభయ్యవ దశకంలో అప్పటి యువతరంలో రాజకీయ సామాజిక చైతన్యం రగిలించిన ముగ్గురు యువకులు గద్దర్, కత్తి పద్మారావు, […]
అనూహ్యం… బిగ్‌బాస్ వీకెండ్ షో అదిరింది… ఓవరాల్‌గా శోభాశెట్టి గుడ్…
ఏమాటకామాట… బిగ్‌బాస్ వీకెండ్ షోలలో నాగార్జునకు భలే డ్రెస్సులు వేస్తారు… ఈమధ్య ఆయన వేసుకునే చొక్కాల ఖరీదు 60 వేలు, లక్షా 80 వేలు అంటూ ఆధారాలతో సహా కొందరు పోస్టులు పెడుతున్నారు… ఈరోజు వేసుకున్న షర్ట్ బహుశా ఏదో పాలిస్టర్ పూల చీరెను కట్ చేసి కుట్టినట్టుంది… ధర ఎంతో తెలియదు… చిన్నప్పుడు రేషన్ బట్ట దొరికేది… చౌకగా వస్త్రాలు ఇచ్చేవాళ్లు… ఎక్కువగా ప్లెయిన్ చేనేత బట్టలే ఉండేవి… కొన్ని డిజైన్లలో వచ్చేవి… శీటి బట్టలు […]
మదిలో చింతలు మైలలు మణుగులు… వదలవు నీవవి వద్దనక…
Aswana Vahana Seva: పరమాణువు మొదలు బ్రహ్మాండాలన్నీ నిండి ఉన్న పరమాత్మ రూపాన్ని దర్శించి…పరవశించి పాడుతున్నాడు అన్నమయ్య. అంతటి రూపం అత్యంత సులభంగా అంజనాద్రి మీద వెంకన్న రూపంలో దొరుకుతోందని ఆనందపడుతున్నాడు. పల్లవి:- అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాదిసిరి అంజనాద్రిమీది రూపము చరణం-1 వేదాంతవేత్తలెల్ల వెదకేటి రూపము ఆదినంత్యము లేని యారూపము పాదు యోగీంద్రులు భావించు రూపము యీదెస నిదివో కోనేటిదరి రూపము చరణం-2 పాలజలనిధిలోన బవళించేరూపము కాల సూర్యచంద్రాగ్నిగల రూపము మేలిమి వైకుంఠాన మెరసిన రూపము కీలైనదిదె శేషగిరిమీది […]
బెంగళూరు నాగరత్నమ్మ… విశ్వనాథ్ శంకరాభరణం కథామర్మం ఇదే…
‘శంకరాభరణం’ కథామర్మం – మహమ్మద్ ఖదీర్‌బాబు………. ‘పాశ్చాత్య సంగీతపు పెనుతుఫానుకు రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయడానికి తన చేతులు అడ్డుపెట్టిన ఆ దాత ఎవరో’… ఎవరు? బెంగళూరు నాగరత్నమ్మ. *** శంకరాభరణం కథ ఎలా పుట్టి ఉంటుంది? ఈ కథ రాయడానికి కె.విశ్వనాథ్ గారు ఎక్కడి నుంచి ఇన్‌స్పయిర్ అయి ఉంటారు, కథను మెల్లమెల్లగా ఎలా కల్పించుకుని ఉంటారు, ఎలా తుదిరూపు ఇచ్చి ఉంటారు అనేది ఒక కథకుడిగా నాకు ఎప్పుడూ ఆసక్తి. […]
అతిశయంబైన శేషాద్రి శిఖరము గంటి… ప్రతి లేని గోపుర ప్రభలు గంటి…
History of Hills: కొండ అన్న మాటంటే అన్నమయ్యకు పరవశం. ఎన్ని వేల చోట్ల కొండను వర్ణించినా తనివి తీరినట్లు లేదు. పల్లవి ఎత్తుగడలో కొండతో ప్రాంభించినవి, చరణాల్లో కొండను బంధిచినవి కోకొల్లలు. కట్టెదుర వైకుంఠము కాణాచయిన కీర్తన బాగా ప్రచారంలో ఉన్నది. కళ్ల ముందు కనిపించే వైకుంఠమిది. మహిమలు తెట్టెలుగా పైకి తేలుతున్న కొండ ఇది అని మొదలుపెట్టాడు. పల్లవి:- కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ తెట్టలాయ మహిమలే తిరుమలకొండ చరణం-1 వేదములే శిలలై వెలసినది కొండ యేదెస […]
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ… తెట్టలాయ మహిమలే తిరుమల కొండ…
How Many Tirupathis: మనమేదయినా కొత్త తీర్థానికో, క్షేత్రానికో వెళితే అక్కడ ఎక్కడ ఉండాలో, ఎన్నాళ్ళుండాలో లెక్కలు వేసుకుని ఏర్పాట్లు చేసుకుంటాం. ఆ ఊరికి ఎప్పుడు బయలుదేరి ఎలా వెళ్లాలో ముందే నిర్ణయించు కుంటాం. అక్కడికెళ్లాక ప్రధానమయిన ప్రదేశాలేవీ వదిలేయకుండా చూడడానికి ప్రయత్నిస్తాం. తిరుమల- తిరుపతి క్షేత్రాలను వందల, వేల సార్లు చూసినవారు; అక్కడే పుట్టి పెరిగినవారు కూడా చెప్పలేనంత కచ్చితత్వంతో తన పదకవితలో బంధించాడు అన్నమయ్య. పల్లవి:- అదెచూడు తిరువేంకటాద్రి నాలుగు యుగము లందు వెలుగొందీ ప్రభమీరగాను చరణం-1 […]
గొర్రెల మందపై తోడేళ్లు పడ్డట్టు… ఎన్నికల తనిఖీలు- ఒక విపత్తు…
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సీఈవో వికాస్‌రాజ్‌కు ఓ లేఖ రాసి, అందులో పోలీసుల ఎన్నికల తనిఖీలను గొర్రెల మందపై తోడేళ్లు పడ్డట్టుగా ఉందని వ్యాఖ్యానించింది… అసలు వికాస్‌రాజ్‌కు ఫీల్డులో ఏం జరుగుతుందో నిజం తెలిస్తే కదా, తెలుసుకోవాలని అనుకుంటే కదా, ప్రజలు అవస్థలు పడొద్దని భావిస్తే కదా ఆయన రియాక్టయ్యేది… పోలీసులు చెప్పే స్వాధీనం అంకెల్ని, పోలీసుల తనిఖీలను కూడా తన ఘనతగా చెప్పుకుంటాడు కదా… నిన్న ‘ముచ్చట’ ఈ తనిఖీలు జనాన్ని ఎలా ఇబ్బందులు […]
సత్తుపిండి & ఆడబిడ్డల పాటలు… నిజమైన బతుకమ్మ నీకెంత తెలుసు..?
సత్తుపిండి ఒక తియ్యటి మధురపదార్థం ! ఈ వారం పదిరోజులు సత్తుపిండ్ల పరిమళంతో ఉత్తరతెలంగాణ పల్లెలన్ని సుగంధభరితమౌతాయి. ప్రతి ఇల్లూ.. కమ్మటి సత్తుపిండి తయారీకేంద్రమే ! బతుకమ్మ ఆటపాటలకున్నట్టే– నైవేద్యాలకూ తనదైన ప్రత్యేకత ఉంది. రకరకాల సత్తులూ, ఓరలూ/అన్నాలూ అమ్మలగన్న అమ్మకు చాలా ప్రీతికరమైనవి. సత్తు అంటే సత్తువనిచ్చేది..! సంతానశక్తిని పరిపుష్టం చేసేదే సత్తు. సత్తుపిండి.. సాక్షాత్తుగ శక్తి స్వరూపం. అందుకేగదా పెండ్లయిన ఆడిబిడ్డకు చీరెతోబాటుగా సారె కూడా పెట్టిపంపేది. ఇక్కడ కూడా గౌరమ్మకు శివునితోపెండ్లిజేసి అత్తవారింటికి […]
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… మా బాబును రిలీజ్ చేయించు ఉయ్యాలో…
ఏమన్నా విశేషాలు ఉన్నాయా ? అని కాల్ చేస్తే… మా పిల్లలు బతుకమ్మ ఆట చూద్దాం అంటే కంట్రీ క్లబ్ కు తీసుకువచ్చాను అని అటు నుంచి సమాధానం వచ్చింది . ఇప్పుడు కాదు, దాదాపు రెండు దశాబ్దాల క్రితం టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు … చిత్తూరు జిల్లా నగరికి చెందిన ఏఎం రాధాకృష్ణ ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ కార్యాలయ కార్యదర్శిగా ఉండేవారు . ఇంటికి వెళ్లేటప్పుడు టీడీపీకి సంబంధించి ఏమన్నా వార్తలు ఉన్నాయేమో అని […]
హాస్పిటల్ కూల్చి 500 మందిని బలిగొన్న ఆ దారుణం ఎవరి పని..?!
గాజా లోని అల్ అహ్లి హాస్పిటల్ మీద IDF దాడి చేసిందా? వివరాలలోకి వెళితే కాదు అనే సమాధానం వస్తుంది! ఇస్లామిక్ టెర్రర్ ఔట్ ఫిట్స్ ఎప్పుడూ చేసే పనినే ఇప్పుడూ చేస్తున్నాయి! ****************** 1.గాజాలో హమాస్ స్థావరాలు సాధారణ ప్రజలు నివసించే ఇళ్ల కింద బేస్మెంట్స్… అవి నిర్మించి అందులో ఉండి రక్షణ తీసుకుంటారు. 2.దాడి చేయాలనుకున్నప్పుడు బేస్మెంట్ నుండి బయటికి వచ్చి దాడి చేసి వెంటనే బేస్మెంట్ లోకి వెళ్లిపోతారు. 3.స్కూళ్ళు, హాస్పిటల్స్ కింద […]
మన్మథ పూలరథం కనిపిస్తే దానిమీద ఎక్కాడు… అలా కూర్చున్నాడో లేదో…
Srivahi Vahana Sevas: తిరుమల ఉత్సవాల్లో రకరకాల వాహనాల మీద స్వామివారు ఊరేగడాన్ని మనం చూడగలుగుతాం. ఆయా వాహనాల ప్రత్యేకతలు తెలిస్తే మరింత భక్తితో నమస్కారం పెట్టుకుంటాం. అన్నమయ్య మనలా ఎందుకు చూస్తాడు? ఒక ఉత్సవంలో వెంకన్న అందమయిన అవస్థను, అంతకంటే అందమయిన తడబాటును దర్శించి…కీర్తనలో బంధించాడు అన్నమయ్య. పల్లవి:- అదె వాడె యిదె వీడె అందు నిందు నేగీని వెదకి వెదకి తిరువీధులందు దేవుడు చరణం-1 అల సూర్యవీధి నేగీ నాదిత్యుని తేరిమీద కలికికమలానందకరుడుగాన తలపోసి అదియును దవ్వు […]
ప్రాణం తీసిన ప్రేమ – ఒరు ఫ్లాష్ బ్లాక్ …. ఉదాత్తమైన అక్రమ ప్రేమ… 3
ప్రాణం తీసిన ప్రేమ – ఒరు ఫ్లాష్ బ్లాక్ ………………………………………….. ఉదాత్తమైన అక్రమ ప్రేమ… స్టోరీ – 3 1980 లో SUMMER OF 42 అనే అమెరికన్ ఫిల్మ్ చూశాను. విశాఖపట్నంలో, జగదాంబ థియేటర్లో. పదిహేనేళ్ళ విద్యార్థి ఒకడు స్కూల్ టీచర్ని ఇష్టపడతాడు. ఆమెకి పెళ్ళయింది. భర్త ఎక్కడో యుద్ధరంగంలో ఉంటాడు. కుర్రాడికి కాంక్ష … నవయవ్వనం… క్యూరియాసిటీ… ఆమె కావాలని బలంగా అనిపిస్తుంది. కొన్ని వూరించే చిన్న చిన్న సంఘటనలు… కవిత్వంలాంటి విజువల్స్, వెన్నాడే […]
- « Previous Page
- 1
- …
- 49
- 50
- 51
- 52
- 53
- …
- 108
- Next Page »