Kandukuri Ramesh Babu ……. విను తెలంగాణ – సిరిసిల్ల సంక్షోభానికి నైతిక బాధ్యత కేఅట్ఆర్ దే! దాదాపు ఏడేళ్ళుగా బతుకమ్మ చీరల పేరిట సిరిసిల్ల పరిశ్రమపై నిన్నటి ప్రభుత్వం ఏటా మూడు వందల కోట్లకు పైగా ఖర్చు చేసిందని మీకు తెలుసు. ఇప్పటిదాకా మొత్తం రెండువేల కోట్ల రూపాయలకు పైగా వెచ్చించింది. ఐనా నిన్నటికి నిన్న కేటిఆర్ ఈ పరిశ్రమ సంక్షోభంలో ఉందంటూ గత ప్రభుత్వం చేపట్టిన పథకాలు కొనసాగిస్తూ కొత్త పథకాలు లేదా చర్యలు […]
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్… కాదు, కాదు… అలార్మింగ్ ఇంటలిజెన్స్…
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్… అనగా కృత్రిమమైన మేధస్సు… అవును, దాన్ని అలా పిలవకుండా అలార్మింగ్ ఇంటలిజెన్స్ అని పిలవాలి… నాలుగేళ్ల తన కొడుకును కిరాతకంగా చంపేసి, నిర్వికారంగా సూట్‌కేసులో పెట్టుకుని 10 గంటలపాటు పక్కనే కూర్చుని ప్రయాణం చేసిన టెకీ సుచనా సేఠ్లో కృత్రిమ మేధస్సు లేదు, క్రూర మేధస్సు మాత్రమే ఉంది… ఒకటి మాత్రం నిజం… మీరు ఎన్ని ఉన్నత చదువులైనా చదవండి, ఎంత మంచి పొజిషన్లోనైనా ఉండండి… కానీ బేసిక్‌గా మనిషి ఎదగడం లేదు… తల్లి […]
జీడిపండ్ల తులాభారం… ఈ తరానికి తెలియని తీపి ముచ్చట…
Sampathkumar Reddy Matta…… జీడిపండ్లూ.. జీడిపండ్లూ..! ఓ చిన్నాయీ, ఎట్లిస్తన్నవ్..? ఇరువైరూపాలకు చెటాకు బిడ్డా ! సౌ గ్రామయితే.. ముప్పయిరూపాలకిత్తా. ఏందీ.. ? ఏమి ధర యిది, కొత్తగ కొంటున్నమా..? అడవిల దొరికేటియేనాయె, గంత చెప్పవడితివీ.. చెటాక్కు ఇరువయంటె ఎక్కువనిపిస్తందారా.. ? ఏదిజూడవొయినా అగ్గిల చెయివెట్టినట్టేనాయె, పదిరూపాలు వెడితె బుక్కెడు చాయబొట్టు అత్తందా ? టమాటలే పదిరూపాలకు కిల. గివ్వి గింత పిరమా ? జీడిపండ్లు మత్తుగ అమ్మత్తన్నయి గని, ఇచ్చేధరజెప్పు. ఏడికెల్లి మత్తుగత్తన్నయవ్వా ? గట్టుకువొయి […]
దర్శకుడు Sailesh Kolanu…సైకో ! హీరో పాత్ర Saindhav Koneru… సైకో ! మరి మూవీ..?!
తన వయస్సుకు తగినట్టు ఏవో విభిన్నమైన పాత్రలు సెలెక్ట్ చేసుకుంటూ వెంకటేష్ అందరి అభిమానాన్ని అలాగే నిలబెట్టుకుంటూ వస్తున్నాడు… దృశ్యం కావచ్చు, నారప్ప కావచ్చు, మరేదైనా కావొచ్చు… రొటీన్ ఫార్ములా పెంట పాత్రలు గాకుండా వైవిధ్యాన్ని ఆశ్రయించాడు… గుడ్… కానీ అదేదో దిక్కుమాలిన వెబ్ సీరీస్‌లో బూతు దరిద్రాన్ని కౌగిలించుకుని తన ఇమేజీ మొత్తం పోగొట్టుకున్నాడు… సరే, ఒక ఎఫ్-2 కూడా కామెడీ డిఫరెంట్ అనుకుందాం… అదే రీతిలో ఎఫ్-3 వచ్చి మరింత అసంతృప్తి మిగిల్చింది తన […]
ఆ కోడిని అమలకే ఎందుకు అప్పగించాలి..? ఈ కేసులో ఆమె ఎవరు..?!
ఒక ప్రాణికి మరో ప్రాణి ఆహారం… అది ప్రకృతి నిర్దేశించిన జీవావరణ బ్యాలెన్స్ మెకానిజం… రోజూ ప్రపంచవ్యాప్తంగా కోట్ల జీవులు తెగిపడతయ్, ముక్కలవుతయ్, ఉడుకుతయ్, కాలుతయ్, వేగుతయ్, కొన్ని సజీవంగా పెద్ద జీవుల కడుపుల్లోకి చేరిపోతయ్, జీర్ణమవుతయ్… ఇది నేచర్, ఇదంతా నేచురల్… అంతేతప్ప ఇదేదో క్యూయెల్టీ టు యానిమల్స్ వంటి చట్టాల బాపతు క్రూరత్వం లేదు, నేరమూ లేదు… కరీంనగర్ కేసు తీసుకుందాం… ఎవరో బస్సులో కోడిని మరిచిపోయారు… సహజం… ఎవరో నెల్లూరాయన కరీంనగర్ జిల్లాలో […]
అయోధ్య ఉద్యమసేనాని విజ్ఞత… గుడి రంధ్రాన్వేషకుల్లో లేకపాయె…
విదేశీయులు సాగించిన ఆధిపత్య, సామ్రాజ్య, సాంస్కృతిక దండయాత్రలో కూలిపోయి… ఇన్నేళ్లూ పరధర్మాన్ని తను పునాదుల మీద నిస్సహాయంగా, నిశ్శబ్దంగా మోసింది అయోధ్యలోని ఆ కట్టడం..! విముక్తి పొందింది… ఓ భవ్యమందిరాన్ని ఆశిస్తోంది… భారత జాతి యావత్తూ అదే సంకల్పించింది… ఇంటింటికీ చేరుతున్న అయోధ్య అక్షితల పరమార్థం కూడా ఆ సంకల్పధారణే… పూజ అయ్యాక కదా అక్షితలు… అసలు ప్రాణప్రతిష్ఠ జరగనిదే అక్షితల పంపిణీ దేనికి..? ఇదంతా రాజకీయం, ఎన్నికల్లో ఫాయిదా కోసం నాటకం అని అప్పుడే విమర్శలు… […]
ఇక వాళ్లు వద్దు అన్నా… మహేశ్ బాబుకు ఓ వీరాభిమాని బహిరంగ లేఖ…
Srinivas Sarla…. అతడు, పోకిరి సినిమాలు వచ్చి ఇరవై ఏళ్ళు అవుతున్నా, నువ్ చైర్ లో కూర్చునే స్టైల్ నువ్ మాట్లాడే స్టైల్ ని అనుకరించే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారని నీకు తెలుసా, తెలువదా అన్నా I am sorry, నువ్ సినిమాల్లో ఎన్నో ప్రయోగాలు చేసావ్, నాని సినిమా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఆ కాలానికి ఏ హీరో చేయని సాహసం టక్కరి దొంగ, One నేనొక్కడినే, స్పైడర్, ఖలేజా లాంటి ఎన్నో ప్రయోగాలు […]
వాళ్లు హిమాలయాల్నే జయించారు… ప్చ్, తమ బొటాబొటీ జీవితాల్ని తప్ప…
Priyadarshini Krishna….. Life of unsung heroes Sherpa…. షెర్పా…. మౌటనీరింగ్, హిమాలయన్ ట్రెక్కింగ్, ఎవరెస్ట్ ఇతర మంచుపర్వతాల సమ్మిట్స్ పైన ఆసక్తి వుండే వారికి పరిచయం వుండే పేరు. షెర్పా- నేపాల్, టిబెట్ ప్రాంతాలకు చెందిన మూలవాసులు (ఎథ్నిక్ గ్రూప్) వీరి జీవనం అత్యంత దుర్భరమైన కఠినమైన వాతావరణలోం సముద్రమట్టం నుండి 10,000 అడుగుల ఎత్తులో సాగేది. దాదాపు అందరి షెర్పాల జీవితం దుర్భరమైనదే… ఆరు నలలు దట్టమైన మంచు, తీవ్రమైన చలిలో కూరుపోయివుంటే మిగతా […]
ఓ చిన్న తప్పు కొన్ని జీవితాల్ని కూల్చేయగలదు, కొంపలు కాల్చేయగలదు…
యండమూరి వీరేంద్రనాథ్ కాపీ సాహిత్యం, నవలా వ్యాపారం మీద బోలెడు విమర్శలున్నయ్… ఎక్కడి నుంచి కాపీ కొట్టాడు, తెలుగు పాఠకులకు నచ్చేలా ఎలా మార్పులు చేసుకున్నాడనేది వదిలేస్తే… తన మొత్తం నవలల్లో కొన్ని మంచి కథలూ ఉన్నయ్… కొన్ని ప్రయోగాలూ ఉన్నయ్… నో డౌట్, తెలుగు పాఠకులను తన రచనాస్రవంతిలో ఉర్రూతలూగించినవాడు… అగ్రగణ్యుడు… అందరూ తన రచనల్లో అంతర్ముఖం సూపర్ అంటారు గానీ… పర్ణశాల ఇంకా బెటర్ అనుకోవచ్చు… కథకు కమర్షియల్ వాసనలేవీ అద్దకుండా లైఫ్ రియాలిటీస్‌ను […]
ఆపరేషన్ కాక్టస్… ఇదే మాల్దీవుల ప్రభుత్వాన్ని మనం ఎలా కాపాడామంటే…?
మాల్దీవులు… చుట్టూ సముద్రం… మహా అంటే 5 లక్షల జనాభా… భూతాపం పెరుగుతూ త్వరలో ఆ దేశమే కనుమరుగు కాబోతోంది… నివారణ లేదు… భారతదేశం ఎప్పుడూ దాన్ని నేపాల్, భూటాన్ వంటి అత్యంత సన్నిహిత మిత్రదేశంగా… ఒక్క ముక్కలో చెప్పాలంటే మనకు లక్షద్వీప్, అండమాన్ దీవులు ఎలాగో మాల్దీవులను కూడా అలాగే చూసింది… ప్రస్తుతం అది చైనా అండ చూసుకుని మనపట్ల ధిక్కరాన్ని, ద్వేషాన్ని ప్రదర్శిస్తోంది… సరే, ప్రస్తుత వివాదంలోకి ఇక్కడ వెళ్లడం లేదు… అక్కడ ఓ […]
ఎవడే సుబ్రహ్మణ్యం..? బురద బకెట్టుతో ఎప్పుడూ రెడీగా ఉంటాడు…
Priyadarshini Krishna… అష్టాదశ పురాణాలు క్షుణ్ణంగా చదువుకోలేదు కానీ, చాలామంది నా కాంటెంపరరీస్ కంటే కొంచెం ఎక్కువే చదువుకున్నాను. డాన్స్ (కూచిపుడి) లోతుగా చదువుకోవడం (సాధన ప్రదర్శన మాత్రమే కాదు) వల్ల లక్షణ గ్రంథాలను కూడా చదువుకునే అదృష్టం కలిగింది. ఈ ఉపోథ్ఘాతం ఎందుకంటే …ఈ వ్యాసం కొంచెం సీరియస్ విషయం కనుక… రామజన్మభూమిని చుట్టుకొని కొన్నివందల సంవత్సరాలుగా ఎన్నో వివాదాలు, ఘోరాలను భారతీయులమైన మనం మన పూర్వ తరాలవారు చూస్తూ అనుభవిస్తూ సహిస్తూ వున్నారు…. చిట్టచివరికి […]
పెద్ద సినిమాల తన్నులాటలో మరో కోణం… వెబ్ రాతల్లో అంత మర్మముందా..?
ప్రతి మీడియాకు ఓ పార్టీ రంగు ఉంది… వాటి పొలిటికల్ లైన్స్ మీద ఆ రంగులే ప్రతిఫలిస్తుంటాయి… ఇదీ డిస్‌క్లెయిమర్… ఈనాడు మీద సాక్షి, సాక్షి మీద ఆంధ్రజ్యోతి ఏళ్ల తరబడీ యుద్ధం సాగుతూనే ఉంది… సాగుతుంది… అది ఆగర్భశతృత్వం… అనగా ఆ మీడియా హౌజు ఓనర్లు సాగించే సామాజికవర్గ యుద్దం అని కాదు… సరే, దాన్ని తెలుగుదేశం వర్సెస్ వైసీపీ వార్ అనుకుందాం… పత్రికలు బజారునపడి తన్నుకుంటున్నా సరే వాటి టీవీ చానెళ్లు పరస్పరం తిట్టుకునే […]
రేఖ బయోబుక్..! పుట్టుక నుంచీ ఆమె లైఫ్ జర్నీపై సంపూర్ణ చిత్రణ…
నిజమే… చాన్నాళ్ల తరువాత ఒక పుస్తకాన్ని వేగంగా చదివేయడం ఇదే… ఎందుకు..? అది రేఖ జీవితానికి సంబంధించింది కావడం… ఆమె భారతీయ సౌందర్య ప్రతీక… యాభై, అరవైలలోని లక్షలమందికి ఈరోజుకూ ఆమె అంటే ఆరాధన… అప్పట్లో కోట్ల మందికి ఆమె కలలనాయిక… అంతేనా..? కాదు, ఆమె జీవితం ఓ సినిమా కథను మించి ఎన్నోరెట్లు అబ్బురం కాబట్టి… ఆమె గతాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి అలా పుస్తకాన్ని వేగంగా చదివేలా చేసింది… నిజానికి ఏడెనిమిదేళ్లుగా రేఖ బయట కనిపించింది […]
బ్రా-డ్ ‘బ్యాండ్’… Bad Band… నిద్ర లేచేసరికి ఒక జీవితకాలం వ్యర్థమై పోతుంది…!
Priyadarshini Krishna…. How the total generation is getting killed by unproductive activities: ఒక పదేళ్ళ క్రితం వరకు ఇంత విరివిగా లేని ఇంటర్నెట్ సౌలభ్యం, ఇంత చవగ్గా దొరికే చైనా వాడి స్మార్ట్ ఫోన్స్ ఒక జనరేషన్ మొత్తాన్ని ఎందుకు కొరగాకుండా మార్చేసింది. పదేళ్ళక్రితమే….. అప్పుడప్పుడే సామాన్యుని చేతిలోకి వచ్చివాలిన ఫోన్లు.. దానికి పదేళ్ళ క్రితం …అంటే దాదాపు 2005 లో అంబానీ పుణ్యమా అని ‘కర్లో దునియా ముట్టీ మే’ అని […]
అజహర్ హత్య వెనుక ఇంత కథ ఉందా..? 3 నెలల్లో ఈ నంబర్ 24…
మసూద్ అజహర్ చచ్చాడు! 2024 ఆంగ్ల సంవత్సరం మొదటి రోజున శుభవార్త వింటున్నాము! గుర్తు తెలియని వ్యక్తి చేసిన మరో హత్య! జనవరి 1వ తారీఖు ఉదయం 5 గంటలకి పాకిస్థాన్ లోని బహావల్పూర్ లో మసీదు నుండి తిరిగి వస్తుండగా బాంబ్ దాడిలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు మసూద్ అజహర్! నిన్నటి నుండి బహావల్ పూర్ బాంబ్ బ్లాస్ట్ దృశ్యాలు X (ట్విట్టర్) లో మొదట వైరల్ అయ్యి తరువాత ఇతర సోషల్ మీడియాలో […]
యాంకర్ సుమ ఇజ్జత్ కోల్పోయినచోట… సింగర్ సునీత పద్ధతిగా తలెత్తుకుంది…!
ఒకరు తెలుగులో అత్యంత ఫేమస్ యాంకర్, హోస్ట్ సుమ… హీరోయిన్లకు దీటుగా సంపాదించే పాపులర్ సెలబ్రిటీ… మరొకరు ఫేమస్ సీనియర్ తెలుగు సినిమా సింగర్ సునీత… ఆమే ఓ హీరోయిన్లా కనిపించే పాపులర్ సెలబ్రిటీ… రీసెంట్ న్యూస్‌లో ఇద్దరికీ ఓ పోలిక ఉంది, ఇద్దరి నడుమా బీభత్సమైన తేడా ఉంది… పోలిక ఏమిటంటే..? ఇద్దరూ తమ కొడుకుల్ని హీరోలుగా లాంచ్ చేశారు… సుమ కొడుకు రోషన్… సునీత కొడుకు ఆకాశ్… ఇద్దరూ నిజానికి హీరో మెటీరియల్ కాదు… […]
ఇది వాట్సప్ మేట్రిమోనీ శకం… పత్రికల్లో ప్రకటనలు మరీ నామ్కేవాస్తే దశకు…
ఒకప్పుడు పెళ్లి సంబంధాలు అంటే… కేవలం అదే పనిగా తిరిగే పెళ్లిళ్ల పేరయ్యలు ఉండేవాళ్లు… వధూవరుల పూర్తి వివరాలను వీళ్లే ఓసారి చెక్ చేసి, జాతకాలు కలుస్తాయో లేదో గుణించి… కులాలు, ఆర్థిక స్థోమతలూ పరిగణించి… కుదిరే సంబంధం అనుకుంటేనే ఒకరి వివరాల్ని మరొకరికి ఇచ్చేవాళ్లు… దగ్గరుండి మరీ పెళ్లి చూపులు కార్యక్రమాన్ని పర్యవేక్షించేవాళ్లు… నిజానికి బంధువులు, స్నేహితుల సర్కిళ్ల ద్వారా వచ్చే పెళ్లి సంబంధాలే అధికం… వధూవరుల ఇష్టాయిష్టాలకు, కోరికలకు మరీ అంత ప్రాధాన్యం ఉండేది […]
ధన్యజీవి..! కిలోమీటర్ల కొద్దీ జనం కన్నీటి నివాళి… అపూర్వ వీడ్కోలు…
నువ్వు హీరోవా..? అసలు యాక్టర్ అవుతావా..? నీ కలర్ ఏమిటి..? ఆ కలలేమిటి..? ఫో… అని చీదరించుకోబడిన కెప్టెన్ విజయకాంత్ బోలెడు సినిమాల్లో హీరో అయ్యాడు… ఏదో నాలుగు సినిమాలు చేసి, తరువాత ఇంట్లో కూర్చోవాల్సిందే అనే విమర్శలకు రాజకీయాల్లోకి ఎంట్రీ ద్వారా బదులిచ్చాడు… మొదట్లో అక్కడా ఫెయిల్యూర్, తరువాత అన్నాడీఎంకేతో కూడి గౌరవనీయ సంఖ్యలో ఎమ్మెల్యేల్ని గెలిపించుకున్నాడు… ప్రతిపక్ష నేత అయ్యాడు… ఒక హీరోగా… ఒక రాజకీయ నేతగా… తను ఎగిరి విరిగిన కెరటమే కావచ్చుగాక… […]
Biggboss… చివరకు ఆ షో ఫినాలే రేటింగ్స్‌పైనా అబద్ధపు ప్రచారం…
మొదటి నుంచీ బిగ్‌బాస్ ఇదే ధోరణి… పిచ్చి స్ట్రాటజీలు, తిక్క ప్రచారాలు, దిక్కుమాలిన షో నిర్వహణ… ఈసారి మరీ ఘోరం… సోఫాజీ అనబడే శివాజీని మోసిన తీరు చిరాకెత్తించగా… పల్లవి ప్రశాంత్‌ను జనం మీదకు విన్నర్‌గా రుద్దడం ఏకంగా సొసైటీకే సమస్యగా మారింది… గత సీజన్ ఎలాగూ మట్టిగొట్టుకుపోయింది… దరిద్రమైన రేటింగ్స్‌తో జనం ఛీ అన్నారు… లైట్ తీసుకున్నారు… కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు… గత సీజన్ దరిద్రానికి ఎన్నో కారణాలు… ఈసారి ఏదో పేరు మార్చి, […]
సింగరేణి ఘోర ఓటమి… ఈ ‘బతుకమ్మ’ ఆత్మమథనానికి ప్రాతిపదిక కావాలి…
Kandukuri Ramesh Babu ….. విను తెలంగాణ – ఇచ్క పోతున్న ‘బతుకమ్మ’ : సింగరేణి జిందాబాద్…. మలిదశ తెలంగాణా ఉద్యమంలో త్వరితంగా ఎదిగి వచ్చిన నేతల్లో కల్వకుంట్ల కవితకు విశిష్ట స్థానం ఉన్నది. నిన్న మొన్నటిదాకా బతుకమ్మ అంటే ఆమె మారుపేరుగా నిలిచారు. కానీ, వారి రాజకీయ ప్రస్థానంలో నిన్నటి సింగరేణి ఎన్నికల ఫలితం మామూలు కుదుపు కాదు. ఆమె గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న సంస్థ చిత్తు చిత్తుగా ఓడిపోవడమే కాదు, ఒక డివిజన్ లో […]
- « Previous Page
- 1
- …
- 59
- 60
- 61
- 62
- 63
- …
- 125
- Next Page »