రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని రేవంత్ ప్రభుత్వం చెబుతోంది… తాము హామీలు ఇచ్చిన అనేకానేక పథకాల్లో అమలుకు నోచుకుంటున్న తొలి పథకం అన్నమాట… ఈ పథకం అమలు నియమనిబంధనల మీద ఇంకా క్లారిటీ లేదు… కానీ కర్నాటకలో ఈ పథకం అమలు అవుతున్నందున సేమ్, అదే విధానం ఇక్కడా పాటిస్తారని అనుకోవచ్చు… పథకం అమలు విధివిధానాలు పకడ్బందీగా రూపొందేవరకు మహిళలు తమ ఆధార్ కార్డును చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు […]
సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం… కొన్ని అబ్జర్వేషన్స్…
Paresh Turlapati….. అబ్సర్వేషన్స్… తెలంగాణా ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు కదా, టీవీల్లో చూసిన తర్వాత దాంట్లో నేను గమనించిన కొన్ని దృశ్యాలు ! * రేవంత్ రెడ్డి సోనియా కుటుంబంలో మంచి మార్కులే సంపాదించుకున్నారు ! * తాజ్ కృష్ణ హోటల్ నుంచి సోనియా..రాహుల్.. ప్రియాంకలు ఎల్బీ స్టేడియానికి బయలుదేరేటప్పుడు హడావుడిలో జరిగిన ఒక చిన్న దృశ్యం నన్ను ఆకర్షించింది ! కారులో రాహుల్ ముందు కూర్చుంటే సోనియా.. ప్రియాంక […]
చలికాలంల సర్వపిండిదే సౌభాగ్యం… ఉల్లి కొత్తిమీర గుమగుమలతో ఊరిస్తది.
సర్వపిండి సనాతనం ~~~~~~~~~~~~~~~ చలికాలంల సర్వపిండిదే సౌభాగ్యం. ఉల్లి కొత్తిమీర గుమగములతో ఊరిస్తది. ఎక్కువ గట్టిపడిపోదు. చలిగదా, తాపం తక్కువ. చెడగొట్టు ముసుర్లకు చెవ్వోముక్కో అన్నట్టుగుంటంది గద, కారకారంగ రామతులసి ఆకులు వేసిపెట్టిన సర్వపిండి ఇది. నీడకుబతికే వాళ్లం, ఒక్కటితింటే ఒకపూట గాసం సమాప్తం. ~•~•~•~•~ అనుభవసారం ప్రకారం సర్వపిండిలో ప్రాంతీయత మెండు. పుట్టిన ఊర్లర్ల జిలుకరెల్లిపాయేసి,ఇంత పెసరుపప్పు చల్లేటోళ్లు. నేను పెరిగిన ఊర్ల పల్లీలు నువ్వులు దండిగనే పోసేకునే వాళ్లు. ఏ ఊరిపంట ఆవూరితిండికి మూలం […]
టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్… నిజానికి రేవంత్‌రెడ్డి ఎవరి మనిషి..?!
‘ఎప్పటికైనా సీఎంను అవుతా… అన్నా, నువ్వు చెప్పు, సీఎంను అవుతానా ? కాదా ?’ రేవంత్ రెడ్డి వేసిన ఈ ప్రశ్నకు ‘కమ్మ పార్టీలో రెడ్డి సీఎం ఎలా సాధ్యం అవుతుంది’ అని నా సమాధానం . అసెంబ్లీ ఆవరణలో టీడీఎల్పి , (టీడీపీ) సియల్పి (కాంగ్రెస్) ఆఫీస్ ల మధ్య దారిలో జరిగిన చర్చలో రేవంత్ రెడ్డి నేనూ మాట్లాడుకున్న విషయం ఇది … అప్పుడు అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కూడా కాదు […]
నిజమే… అతడు ఓడిపోతున్నాడు… ఈ లోకం నుంచే వెళ్లిపోతున్నాడు…
సాక్షిలో వచ్చిన ఓ వార్త పొద్దున్నుంచీ మదిలో గిర్రున తిరుగుతూనే ఉంది… మంచి వార్త… కాకపోతే మెయిన్ ఎడిషన్‌కు తీసుకోక, ఆ వార్త ప్రయారిటీ అర్థం గాక సిటీలో వేశారు… వార్త సారాంశం ఏమిటంటే..? హైదరాబాద్ నగరంలో గత ఏడాది 544 మంది ఆత్మహత్యలు జరిగితే అందులో 433 మగ ఆత్మహత్యలే… అనగా మేల్ సూసైడ్స్… సాధారణంగా సమాజంలో ఓ అభిప్రాయం ఉంది… ఆడవాళ్లే సున్నిత మనస్కులనీ, త్వరగా కుంగిపోయి అఘాయిత్యాలకు పాల్పడతారనీ, మగవాళ్లు మానసికంగా దృఢంగా […]
పాడండి… పాడించండి… పిల్లలకు అదే సాధన, అదే బోధన, అదే వినోదం…
Language by Songs: పల్లవి : వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే… వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతీ విద్యాందేహీ… భగవతి సర్వార్థసాధికే… సత్యార్థచంద్రికే మాంపాహి మహనీయ మంత్రాత్మికే మాంపాహి మాతంగి మాయాత్మికే చరణం 1 : ఆపాత మధురము… సంగీతము అంచిత సంగాతము… సంచిత సంకేతము శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము… అమృత సంపాతము… సుకృత సంపాకము సరిగమస్వరధుని సారవరూధినీ… సామనాదవినోదినీ సకల కళాకళ్యాణి సుహాసినీ… శ్రీ రాగాలయ వాసిని మాం పాహి మకరంద మందాకిని […]
ఆలూ లేదు, చూలూ లేదు… అప్పుడే కాంగ్రెస్ కేబినెట్ తేల్చేసిన సోషల్ మీడియా…
ఒకవేళ బీఆర్ఎస్కు 55 వరకూ సీట్లు వస్తే… మజ్లిస్ ఉండనే ఉంది… కాదంటే బీజేపీ ఉంది… మరీ కాదంటే కాంగ్రెస్‌లోని కేసీయార్ కోవర్టులు కొందరు గెలుస్తారు, వాళ్లూ ఉన్నారు… ఇవన్నీ గాకుండా బీఆర్ఎస్కే సరిపడా మెజారిటీ వస్తే ఇక ఏ రందీ లేదు… స్ట్రెయిట్‌గా కొత్త కేబినెట్ కొలువు తీరడమే… సో, రకరకాల సమీకరణాలు రేపటి ఫలితాలపై ఆధారపడి ఉన్నాయి… నో, నో, కాంగ్రెస్‌కు సరిపడా మెజారిటీ వస్తుంది… కాంగ్రెస్‌ను చీల్చినా సరే కేసీయార్‌కు సరిపడా మెజారిటీ […]
రెడ్డి లవ్స్ కమ్మ… నో, కమ్మ వెడ్స్ బ్రాహ్మణ… షర్మిల కొడుకు పెళ్లిపై ఫుల్లు చర్చ…
తెలంగాణలో మరీ ఎక్కువేమీ కనిపించవు కానీ… ఏపీ రాజకీయాల్లో మొత్తం కులం బురదే…! చాన్నాళ్లు కమ్మ వర్సెస్ కాపు… అప్పట్లో రంగా హత్యానంతరం జరిగిన విధ్వంసం, దహనకాండలు తెలిసిందే కదా… వైఎస్, చంద్రబాబు హయాంలో కూడా రాజకీయాల్లో కులం ప్రధానపాత్ర పోషించినా సరే మరీ ఘోరంగా దిగజారలేదు… జగన్ సీఎం అయ్యాక రెడ్డి వర్సెస్ కమ్మ ఉధృతమైంది… జగన్ ప్రత్యేకంగా కమ్మ సామాజికవర్గాన్ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది… ఊళ్లల్లో రెడ్ల ఆధిపత్యం కూడా బాగా పెరిగింది… ఈ […]
“డాక్టరు వద్దకు తీసుకు వెళ్ళరా?” అనడిగాను… వాళ్ళు విచిత్రంగా చూశారు నా వైపు…
Kandukuri Ramesh Babu….. విను తెలంగాణ – ఒక సహజ మరణం ముందు… మూడు తరాలే కాదు, అక్కడ జీవితం సంపూర్ణం. దాదాపు నాలుగు తరాలనూ ఒక్క చోట చేర్చిన సంధ్యా సమయం అది… ఒక్క స్పర్శ తప్ప మరేమీ లేని స్థితి అది… అది సాయంత్రం వేళ… గాంధారి మండలం నేరెల్ తండా… కాయితీ లంబాడాల ఒకానొక ఆవాసం… అక్కడి వీధి వీధినీ పరిశీలిస్తూ నడుస్తుంటే ప్రతి చోటా ఆగి ఫోటో తీయాలనిపించే అందమైన జీవన […]
మరో పకడ్వా పెళ్లి… మాంగళ్యం తంతేనానేనా… తలపై గన్ను- మెడలో తాళి…
ఈ పెళ్లిళ్లు ఏ కేటగిరీలోకి వస్తాయి..? ఇది పెద్ద ప్రశ్న… మనం వార్తలోకి వెళ్లేముందు అసలు భారతీయ సంప్రదాయంలో ఎన్నిరకాల పెళ్లిళ్లు ఉన్నాయో చూద్దాం… అష్ట విధ వివాహాలు… ఇందులో ఇప్పుడు కొన్ని వర్తించవు… యాజ్ఞవల్క్య స్మృతి ప్రకారం… బ్రాహ్మ :- విద్యాచారాలు గల వరునికి కన్యనిచ్చి చేసే వివాహం దైవ :- యజ్ఞయాగాదులు జరిపించిన పురోహితునికి ఇవ్వవలసిన రుసుమునకు బదులుగా కన్యాదానం చేయడం ఆర్ష :- కన్యాశుల్కంగా వరుడి నుంచి ఒక జత ఆవు-ఎద్దులను తీసుకుని పెళ్ళి […]
రంగు రుచి పరిమళం చిక్కదనం… ఈ చాయ్‌పత్తా యాడ్‌లో అన్నీ… గుడ్ వర్క్…
చాలా యాడ్స్ టీవీ సీరియళ్లలా విసిగిస్తయ్… క్రియేటివిటీ లేకుండా చెత్తా ఆలోచనల్ని, మార్కెటింగ్ ఎత్తుగడల్ని నింపుతారు… కానీ మంచి క్రియేటివ్ కమర్షియల్స్ (యాడ్స్) చేయడం ఓ కళ… అవి హృదయాలను కనెక్టవుతాయ్… విపరీతమైన కంటెంట్, అంకెలు, అర్థం కాని ఏవో పద గాంభీర్యాలు, స్టార్ నటీనటులు ఎట్సెట్రాలను జనం జస్ట్ చూస్తారు, అంతే… కొన్ని మాత్రమే అలా హత్తుకుంటయ్… సరళమైన పదాలతో డైలాగులు అవసరం (అనువాదాలు తేలిక)… ఎక్కువగా హిందీ, ఇంగ్లిషుల్లో ఉండే యాడ్స్‌ను బహుళ జాతి […]
గంజాయ్’ తెలంగాణ..! చాప కింద నీరులా పాకుతున్న ప్రమాదం…!!
Kandukuri Ramesh Babu ………. విను తెలంగాణ – ‘గంజాయి తెలంగాణ’: ఒక హెచ్చరిక….. మనం చూస్తున్న అనేక వార్తలు గంజాయి పట్టుబడటం గురించే. కానీ ఆ గంజాయి చాపకింద నీరులా పల్లెటూర్లకు ఇదివరకే చేరిందని, ఇప్పటికే మత్తుకు బానిసలైన యువత కొన్ని చోట్ల ఆత్యహత్యలు కూడా చేసుకున్నారని తెలిసి ఆందోళనతో ఈ వ్యాసం రాయవలసి వస్తోంది. పదేళ్ళ పరిపాలనలో ప్రజల జీవితాల్లో వచ్చిన మౌలిక మార్పులను క్షేత్ర స్థాయిలో పరిశీలించే ప్రయత్నంలో తీవ్ర భయాందోళనకు గురిచేసే […]
టీడీపీ బీరు సీసా కాదు అన్నాడు… ఖాళీ బీరు సీసా విలువ కూడా లేకుండా చేశాడు…
తిక్కవరపు ఇంటికి భోజనానికి వెళ్లిన కొత్త పెళ్లి కొడుకు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి… టీడీపీ అపవిత్రం అయిందన్న బాబు వర్గం .. అలా పుట్టింది ముసలం… జర్నలిస్ట్ జ్ఞాపకాలు – ———————- 1993-94 ప్రాంతం . ఎన్టీఆర్ రెండవ వివాహం చేసుకున్న కొత్తలో . అప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉంది . ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి కొత్తగా వివాహం చేసుకున్న ఎన్టీఆర్ దంపతులను తన ఇంటికి భోజనానికి పిలిచారు . ఇప్పుడైతే ఐతే ఏంది ? అనిపిస్తుంది […]
డబ్బు ఇవ్వండి… మీరు ఏ యాడ్ ఇచ్చినా… కళ్లకద్దుకుని ప్రచురిస్తాం…
పైసలిస్తే మీడియా ఏదైనా చేస్తుందా..? అవును, ఏదైనా చేస్తుంది… యాజమాన్య లాభాలే అంతిమం… నిష్పక్షపాతం, నిజాయితీ, నిబ్బరం వంటి మాటలు ఊకదంపుడు బాపతు… అవి అక్షరాల్లో రాసుకుని పాఠకుల కళ్లకు గంతలు కట్టడానికి మాత్రమే… ఎప్పుడైతే పార్టీల వారీగా కరపత్రాలు వచ్చేశాయో ఈ పరిస్థితి ఇంకా దిగజారింది… ప్రతి పేపర్, ప్రతి టీవీ ఆయా పార్టీల ఓన్ మౌత్ పీస్ మాత్రమే… పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ కావాలా..? ఎక్కడి దాకో ఎందుకు..? నమస్తే తెలంగాణ, టీన్యూస్, వెలుగు, వీ6, […]
నెగెటివ్ ధోరణితో బీఆర్ఎస్… పాజిటివ్ పోకడలో కాంగ్రెస్… పేలవంగా బీజేపీ…
యాడ్స్‌తో ఊదరగొట్టే తెలుగుదేశం బరిలోనే లేదు… మజ్లిస్ అసలు యాడ్స్ పట్టించుకోదు… పత్రికలు, మీడియా, సోషల్ మీడియా, సభలు, రోడ్ షోలు ఇతర యాడ్స్ కోణంలో చూస్తే బీజేపీ ఆ రెండు ప్రధాన పార్టీలకన్నా తక్కువే… నిజానికి ప్రచారం కాంగ్రెస్, బీఆర్ఎస్ నడుమ హోరాహోరీ సాగింది… జనసేన యాడ్స్ నిల్… సీపీఎం సోసో… విశేషం ఏమిటంటే..? అనేక పార్టీలు బరిలో ఉన్న గత ఎన్నికలకన్నా ఈసారి యాడ్స్ దుమారం ఎక్కువ… సరే, ప్రచారం ముగిసింది… మోతెక్కించిన మైకులు […]
విను తెలంగాణ… కేసీయార్ సర్కారుపై జనంలో ఈ ఆగ్రహానికి కారణాలేమిటి..?
Kandukuri Ramesh Babu …….. విను తెలంగాణ – ప్రభుత్వంపై ఎందుకీ ఆగ్రహం? కేవలం ఒకే ఒక దశాబ్ద కాలం. కానీ తెలంగాణా అనేక దశాబ్దాల వెనక్కి వెళ్ళింది. ఆ వెనుకబాటు నుంచి ప్రజ మౌనం దాల్చింది. అందుకు కారణం రెండడుగులు వెనక్కి వేసి మరో పెద్ద అడుగు ముందుకు వేయడానికే అని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించినట్లు లేదు. తెలంగాణా రాష్ట్రంలో అధికార బిఆర్ ఎస్ పార్టీపట్ల పట్ల ప్రజాభిప్రాయాన్ని జన సామాన్యంలో తెలుసుకోవడానికి గాను దాదాపు […]
సీనియర్ నరేష్ ఇకపై సర్ నరేష్ అట… భలే పడతావయ్యా అవార్డుల దుకాణాల్ని…
గత సంవత్సరం మే నెలలో… అంటే ఏణ్నర్థం… మన సీనియర్ నటుడు నరేష్ (సీనియర్ నరేష్) గురించి మనమే ఓ కథనం చెప్పుకున్నాం… ముందుగా దాని సారాంశం చదివి, ఆ తరువాత మరో ముచ్చట చెప్పుకుందాం… అబ్బే, ఆయన సహగామి (అనధికారికంగా నాలుగో భార్య కావచ్చు…) పవిత్రా లోకేష్, మూడో పెళ్లాంతో గొడవల గురించి కాదు… ఇది వేరే… ఓ ట్వీట్ కనిపించింది… మన సినిమాల్లో నటిస్తుంటాడు కదా… నరేష్… సీనియర్ నరేష్ అంటుంటారు కదా… విజయనిర్మల […]
ఒక ప్రశాంత్ కిషోర్ చెడగొట్టుకున్నాడు… ఒక పాండ్యన్ నిలబెట్టుకున్నాడు…
మొన్నామధ్య మనం ఓ కథనాన్ని ముచ్చటించుకున్నాం… ఒడిశా ప్రభుత్వంలో కీలకమైన ఓ ఐఏఎస్ అధికారి, పేరు పాండ్యన్ వీఆర్ఎస్ తీసుకున్నాడు అని… దానికి నేపథ్యాన్ని కూడా చెప్పుకున్నాం… ఒకసారి ఈ పాత కథనాన్ని చదవండి, తరువాత తాజా సమాచారంలోకి వెళ్దాం… వి.కార్తికేయన్ పాండ్యన్… ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ పేరు చర్చకు వస్తోంది… ఎందుకంటే..? ఆయన ఇప్పుడు ఒడిశాకు యాక్టింగ్ సీఎం… అబ్బే, నవీన్ పట్నాయక్ ఎవరికీ అంత అవకాశం ఇవ్వడు అంటారా..? కాదు, ఇస్తున్నాడు, ఇచ్చాడు… ఇంతకీ […]
చాలాసార్లు చదివిందే కావచ్చుగాక… మరోసారి నెమరేసుకొండి… అవసరం…
Padmakar Daggumati…….. “మీ అంత్యక్రియల తర్వాత ఏం జరుగుతుందో తెలుసా?” కొన్ని గంటల్లో ఏడుపుల శబ్దం పూర్తిగా ఆగిపోతుంది మీ కుటుంబ సభ్యులు బంధువుల కోసం భోజనాలు తయారు చేయించి వడ్డీంచడంలో బిజీగా ఉంటారు మీ మనవళ్లు మనవరాండ్రు అటు ఇటు పరిగెడుతూ ఆడుకుంటూ ఉంటారు వయసులో ఉన్న యువతీ యువకులు ఒకరినిఒకరు చూసుకుంటూ రొమాంటిక్ చిరునవ్వుతో ఫోన్ నంబర్లను మార్చుకునే పనిలో ఉంటారు వయసు మళ్ళిన కొందరు లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ టీ తాగుతూ సమయం గడపుతారు […]
ఆ దేవుడి మీదొట్టు… నేను ఆ హరీష్‌రావుకు అస్సలు అమ్ముడుబోలేదు…
I Swear: “సర్వాగమానామాచారః ప్రథమం పరికల్పతే; ఆచారప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః” అన్ని ఆగమాలకంటే ముందు ఆచారం ఏర్పడింది. ఆచారం నుండి ధర్మం పుట్టింది. ధర్మానికి ప్రభువు అచ్యుతుడు. ఆచరించడం వల్ల స్థిరపడింది ధర్మం. జీవితాన్ని ఉద్ధరించేది ధర్మం. ధర్మం ఏ విధంగా ఉండాలో నిర్దేశించిన వాడు విష్ణువు కాబట్టి ధర్మానికి ప్రభువు విష్ణువే. -విష్ణు సహస్రనామం. ఎన్ని యుగాలైనా కొన్ని ప్రమాణాలు మారవు. అలాంటి ప్రమాణాలే ఆ జాతి సంస్కృతిగా గుర్తింపు పొందుతాయి. అలా మనం చేసే […]
- « Previous Page
- 1
- …
- 62
- 63
- 64
- 65
- 66
- …
- 125
- Next Page »