ఆశ, లక్ష్యం ఉన్నచోట ఆశాభంగం, అసంతృప్తి, ఒత్తిడి, నిరాశ, పరుగు ఉంటాయి…
1.26 కోట్లు ఒక లడ్డూ… ఓ విల్లా ధరలా బాగా ఖరీదైన భక్తి…
in hyderabad one ganesha laddoo prasadam auctioned for 1.26 crores
తలుపు తట్టిన చప్పుడు… డెయిలీ పేపర్ కింద పడిన చప్పుడు… నేనింకా బతికే ఉన్నాను…
వార్తాపత్రిక డెలివరీ బాయ్ చెప్పిన కధ హృదయాన్ని హత్తుకుని నా మనస్సుని కదిలించింది *”సౌండ్ ఆఫ్ నాకింగ్”* *పేపర్ బాయ్* : నేను వార్తాపత్రికను డెలివరీ చేస్తున్న ఇళ్లలో ఒక ఇంటి మెయిల్‌బాక్స్ తాళం వేసి ఉంది, అందువలన నేను వారి తలుపు తట్టాను. మిస్టర్ ప్రసాద్ రావు, అస్థిరమైన అడుగులతో నడుస్తున్న వృద్ధుడు, నెమ్మదిగా తలుపు తెరిచాడు. నేను అడిగాను, “సార్, మీ మెయిల్ బాక్స్ ఎంట్రన్స్ ఎందుకు బ్లాక్ చేయబడింది?” ఉద్దేశపూర్వకంగానే బ్లాక్ చేశాను […]
వయస్సును వెనక్కి మళ్లించి… మళ్లీ యవ్వనంలోకి తిరుగు ప్రయాణం…
మీకు యయాతి కథ తెలుసు కదా… ఏదో శాపానికి గురై వృద్ధాప్యం మీదపడితే… తన కొడుకుల్ని తమ యవ్వనాల్ని ఇవ్వమని ప్రాధేయపడతాడు… ఎవడూ ఇవ్వడు… చిన్న కొడుకు సరేనని ఇస్తాడు… యయాతి నవ యవ్వనుడు అవుతాడు… మిగతా కథ జోలికి పోవడం లేదు గానీ ఈ యవ్వనంలోకి రావడం వరకే పరిమితం అవుదాం ఇక్కడ… పొద్దున్నే ఓ మిత్రుడి పోస్టు చూడగానే ఈ కథే గుర్తొచ్చింది ఎందుకో గానీ… రేఖ పారిస్ వెళ్లి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని […]
భలే భలే… 955 అసలు ధరట… 1000 సబ్సిడీ అట… అద్దిరిపోయే స్కీమ్…
పొద్దున్నే ఓచోట… ఎక్కడ దొరికిందో గానీ ఒకాయన ఆంధ్రప్రభ పట్టుకున్నాడు… పక్కవాడిని అడుగుతున్నాడు… ‘‘కేసీయార్ ఒక్కో సిలిండర్ మీద 1000 రూపాయల సబ్సిడీ ఇస్తాడట… ఈ పేపరోడు రాసిండు… ఇప్పుడు సిలిండర్ రేటే 955… అంటే సిలిండర్ బుక్ చేస్తే 45 రూపాయలు ఉల్టా మనకే ఇస్తారా..? భలే ఉంది కదా స్కీమ్..?’’ ఆ పక్కన కూర్చున్నాయన తెల్లమొహం వేశాడు… ఏం సమాధానం ఇవ్వాలో తెలియడం లేదు… వెయ్యి రూపాయల సబ్సిడీ అని వార్త రాసిన విలేఖరి, […]
Right to Sit… సేల్స్ గరల్స్ కూర్చోకూడదా..? గంటల కొద్దీ నిలబడే ఉండాలా..?
(ప్రభాకర్ జైనీ)……. ఇయ్యాల నాకు చాన సంతోషంగ ఉన్నది. ఇంటర్మీడియట్ పరీక్షల ఫస్ట్ క్లాసుల పాసయిన. ఇంటర్నెట్ సెంటరుల ఇచ్చిన కాగితాన్ని తీసుకోని బయటకొచ్చి ఇంటి ముఖం పట్టిన. కనీ, దూరం పంటి కూలిపోయేటట్టున్న మా ఇల్లు చూసెటాలకు, నాకు నా భవిష్యత్తు ఎట్లుంటదో అర్థమయింది. పై చదువులు చదివించే స్థోమత మా ఇంట్లోల్లకు లేదని నాకర్థమైంది. మనసు చంపుకున్న. పై చదువులు చదువాలనే ఆశను మొగ్గల్నే తుంచేసుకున్న. మా ఊరు, పట్నం గదే, హైద్రాబాదుకు నలభై రెండు […]
నాయకుడు పదే పదే గట్టిగా చెప్పాడంటే… దానికి వ్యతిరేక దిశలో వెళ్తున్నట్టు లెక్క…
జర్నలిస్ట్ లు అవకాశం ఉన్నంత వరకు చదవాలి . 87 నుంచి 94 వరకు జిల్లాల్లో పని చేసేప్పుడు చాలా మంది జర్నలిస్ట్ లు జిల్లా పేజీలు మాత్రమే చదివేవారు . ఆ తరువాత మనం రాసిన వార్త మనం చదివితే పేపర్ చదివినట్టే అనే దశకు చేరుకున్నాం . ఇప్పుడు ఆ దశ కూడా దాటి పోయి టివిలో న్యూస్ చూడడమే తప్ప చదవడం అనే అలవాటు తగ్గిపోయింది .నాయకుల మాటల్లో మర్మం అర్థం చేసుకోవడానికి […]
ఆరోజు విమానంలో… మా పాపను ఆయన ఎత్తుకుని లాలిస్తూ…
Prabhakar Jaini ఒక రోజు ఉదయం చీకటి తెరలు ఇంకా పూర్తిగా విచ్చుకోలేదు కూడా! అప్పుడు కలిసిన వ్యక్తి! మేం కొత్త దంపతులం. అంటే అప్పటికే మా పాపకు రెండు నెలల వయసు. విమానంలో తిరుపతికి వెళ్ళాలని ప్లాను చేసుకుని, అంతకు ముందు సంవత్సరం పాటు డబ్బులు కూడబెట్టుకున్నాము. అప్పుడు నాది చాలా చిన్న ఉద్యోగం. వరంగల్ మునిసిపాలిటీలో క్లర్క్ ఉద్యోగం. కానీ, కోరికలు ఉండకూడదని ఏం లేదు కదా? వరంగల్ నుండి ముందు రోజు బయలుదేరి […]
మైనార్టీ వోట్లతో వయనాడ్‌లో గెలిచిన రాహుల్… హైదరాబాద్‌లో నిలబడతాడా..?
Nancharaiah Merugumala…. రాహుల్ గాంధీని వాయనాడ్ కమ్యూనిస్టులు ఉత్తరాదికి పొమ్మంటుంటే… కాంగ్రెస్ ‘ప్రిన్స్’ హైదరాబాద్ లో పోటీకి దిగాలని మజ్లిస్ నేత అసదుద్దీన్ సవాల్! ………………………………………………………………………………………………………. భారత్ జోడో యాత్ర తర్వాత, ఇటీవల పార్లమెంటులో, వెలుపలా పదునైన ప్రసంగాలతో తన ‘నేషనల్ స్టేచర్’ పెంచుకున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కాంగ్రెసన్నా, నెహ్రూ–గాంధీ కుటుంబమన్నా ఎమర్జెన్సీ పెట్టిన 1975 జూన్ 25 నుంచీ ఘోరంగా వ్యతిరేకించే నాలాంటి ‘అవిశ్రాంత’ పాత్రికేయులు సైతం రాహుల్ భయ్యా ముఖంలో పొంగిపొర్లుతున్న […]
ఆ ఫ్లాట్లలోనే మగ్గిపోకుండా… స్విగ్గీలు అయిపోకుండా… కాస్త కిందకు దిగండి…
మన విశ్వనగరంలోనే… ఏరియా పేరు ఎందుకు లెండి… ఇద్దరు మిత్రులు ఓ అపార్ట్మెంట్ పార్కింగులో నిలబడి మాట్లాడుకుంటున్నారు… ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ వచ్చాడు అక్కడికి… సార్, మీకేమైనా ఈ డిటెయిల్స్ తెలుసా అనడిగారు… ఆ బిల్లుపై కనిపించే వివరాలు చూస్తే… ఓ పేరుంది… ఫస్ట్ ఫ్లోర్ అని ఉంది… అపార్ట్మెంట్ పేరు లేదు… ఫోన్ నంబర్ ఉంది గానీ… ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు… అసలు స్విగ్గీ ఆర్డర్ మరిచిపోయారో, కావాలనే లిఫ్ట్ చేయడం లేదో […]
గ్రూప్ వన్ నియామకాల వైఫల్యం… కేసీయార్ పాలనకు చేదు మరక…
నా పేరు కపిలవాయి రవీందర్. నాకు ఇద్దరు కుమారులు. పెద్దబాబు B.Tech. చిన్నబాబు MBA.. .. పెద్దబాబును Group-1 అధికారిగా చూడాలని నా కోరిక.. అయితే ఈ నోటిఫికేషన్ కోసం 9 ఏళ్లు ఎదురు చూశాము. తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి ఏపీలో చివరి సారిగా 2011లో గ్రూప్-1 నోటిఫికేషన్ వచ్చింది. 2014 ల తెలంగాణ రాష్ట్రం సాకారం అయిన తర్వాత ఇగ మా రాష్ట్రం మాకు వచ్చింది, మాకు ఇంకేం కావాలి అనుకున్నా. అప్పటి నుండే […]
సినిమాగా ‘పర్వ’… ఆదిపురుష్‌లాగే తీస్తే అడ్డంగా తిరస్కరించడం ఖాయం…
నిన్నో మొన్నో మిత్రుడు Yeddula Anil Kumar పోస్ట్ ఒకటి కనిపించింది… ‘‘ప్రముఖ కన్నడ నవలా రచయిత ఎస్.ఎల్.భైరప్ప గారు మహాభారతం మీద వ్రాసిన నవల “పర్వ”… దాదాపు 90సార్లు ఈ పుస్తకం మరుముద్రణ కాబడింది… లక్షల కాపీలు అమ్ముడయ్యాయి… 7 దేశీయ భాషల్లో, మూడు విదేశీ భాషల్లో ఈ పుస్తకము అనువాదం అయ్యింది… ఇంత గొప్ప పుస్తకాన్ని కశ్మీర్ ఫైల్స్ చిత్రము తీసిన ప్రముఖ దర్శకులు వివేక్ అగ్నిహోత్రి గారు సినిమాగా తీస్తున్నారు… అందుకోసం రచయితతో ఒప్పందం కూడా […]
సొసైటీ మీద పడి కోట్లు దండుకుని బతికే వాళ్లతో… సొసైటీకి జీరో ఫాయిదా…
ఈరోజు చదివిన మంచి పోస్టు… ఒక్కో సినిమాకి 50 కోట్లు లేదా 100 కోట్లు వసూలు చేసే ఈ సినిమా నటులు లేదా నటీమణులు ప్రజలకు ఏం చేస్తారో నాకు అర్థం కాలేదు. అగ్రశ్రేణి సైంటిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, అధికారులు తదితరులకు ఏడాదికి 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు మాత్రమే సంపాదన ఉంటే, అదే దేశంలో ఒక సినిమా నటుడు ఏడాదికి 10 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నాడు! అతను […]
హమ్మో… భడవా అంటే అంత దారుణమైన తిట్టా… ఇన్నాళ్లూ తెలియనేలేదు…
Nancharaiah Merugumala……. మొన్న రాత్రి లోక్ సభలో బీఎస్పీ కువర్ దానిశ్ అలీని బీజేపీ గుజ్జర్ సభ్యుడు రమేశ్ బిధూఢీ తిట్టడం వల్లే…. ‘భడవా’ అనే తెలుగు బ్రామ్మల తిట్టుకు అర్ధం ఏమిటో ‘పరిశోధించే’ ఆలోచన వచ్చింది! ………………………………………………………………………………………………… తెలుగు సినిమాల్లో ముఖ్యంగా బాపు, కె.విశ్వనాథ్ వంటి బ్రాహ్మణ దర్శకుల సినిమాల్లో, తర్వాత కొందరు కాపు, కమ్మ, రెడ్డి డైరెక్టర్ల చిత్రాల్లో– వయసులో చిన్నవారిని పెద్దలు కొన్ని సందర్భాల్లో ‘ఓరి భడవా!’ అని ఆశ్చర్యం, కొద్దిపాటి దిగ్భ్రాంతితో […]
చివరి పుటల్లో చీకట్లు… ఎంతటి చంద్రబాబు చివరకు ఎలాగైపోయాడు..?!
నేను రాసేది వివాదాస్పదం అవుతుండవచ్చు, కొందరి మనసులను గాయపరుస్తుండవచ్చు… కానీ రాజకీయమనేది యదార్థం. ఆ యధార్థాన్ని బలహీనమైన పునాదులపై నిలబెట్టరాదు. దానికి దృఢమైన పటుత్వం ఉన్నప్పుడే రాజకీయం రసకందాయం అవుతుంది. అవును రాజకీయం చాలా విచిత్రమైనది. నీ కళ్ళతో చూసేది నిజం కాదు, నీ చెవులతో వినేది వాస్తవం కాదు, రాజకీయాల్లో ఏది శాశ్వతం కానే కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో చూసి, మరెన్నో అద్భుతాలు చేసి తనదైన ముద్రవేసిన ’45 ఏళ్ళ రాజకీయం’ అత్యంత హీనమైనస్థితిని అనుభవిస్తుంది. నాకింకా గుర్తున్నాయి, […]
‘‘వయస్సు మళ్లితే చాలు… మేం ఇక పౌరులుగానే కనిపించడం లేదా..?’’
జయా బచ్చన్… అమితాబ్ బచ్చన్ భార్య… వయస్సు 75 ఏళ్లు… ఆమె పార్లమెంటులో వృద్ధులు, అనగా సీనియర్ సిటిజెన్స్ సమస్యలను ప్రస్తావించి, కొన్ని మంచి పాయింట్లను లేవనెత్తిందనీ, ప్రభుత్వాన్ని ఏకిపారేసిందనీ ఓ పోస్టు వాట్సపులో చక్కర్లు కొడుతోంది… బహుశా ఆమె ప్రసంగ సారాంశం కాకపోవచ్చు… ఏమో కావచ్చు కూడా… కానీ ఏ మీడియాలోనూ కవరైనట్టు కనిపించలేదు… పోనీ, ఆమె చాలా సీనియర్ సిటిజెన్ కదా, సెలబ్రిటీ కదా, హైప్రొఫైల్ లేడీ కదా… మాట్లాడిందనే అనుకుందాం కాసేపు… అవి […]
ఆ సమైక్య ఎడిటర్ ఇంట్లో పెళ్లా..? పిచ్చ లైట్ తీసుకున్న సీఎం కేసీయార్…
ఈ మధ్య యూట్యూబ్ లో కొన్ని వీడియోలు చూస్తుంటే బీడీ కట్ట కోసం , ప్లేట్ ఇడ్లీ కోసం ఎవరో ఒక్కరిపై ఆధారపడే వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది కెసిఆర్ కాదు మేమే … మేం లేకపోతే కెసిఆర్ ఎక్కడ అంటూ బోలెడు మాట్లాడుతున్నారు . ఆ వీడియోలు చూస్తుంటే అలాంటి దృశ్యాన్ని మరికొందరు జర్నలిస్ట్ మిత్రులతో కలిసి నేరుగా చూసిన సంఘటన గుర్తుకు వచ్చింది . ************* 2014 లో తెలంగాణ ఏర్పడిన కొత్తలో […]
మోడీ మార్క్ మిస్టరీ సీక్రెసీ… బీజేపీ సహా అన్ని పార్టీలకూ గింజులాట…
ఇవి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు… ఎజెండా ఏమిటో ఒక్క చిన్న అంశమూ బయటికి పొక్కడం లేదు… టాప్ సీక్రెసీ మెయింటెయిన్ చేస్తోంది మోడీ ప్రభుత్వం… సొంత పార్టీ వాళ్లకే ఏ సమాచారం లేదు… లీక్ కావద్దనే భావనతో కొందరు ముఖ్యులకు తప్ప ఇంకెవరికీ తెలియనివ్వడం లేదు… మొత్తం పీఎంఓ ఆర్గనైజ్ చేస్తోంది… దీంతో విపక్షాలు గింజుకుంటున్నాయి… నోట్ల రద్దు సమయంలో ఏం జరిగిందో తెలుసు కదా… నరమానవుడికీ తెలియనివ్వలేదు… మోడీ ప్రెస్‌మీట్ చూశాకే ప్రజలందరితోపాటు ఆ పార్టీ […]
తెలంగాణ చెవిలో కన్నడ మంత్రోపదేశం… కాంగ్రెస్ హామీలపై ఓ విశ్లేషణ…
అటు సోనియా గాంధీ కాంగ్రెస్ గ్యారంటీ కార్డులను జారీ చేయడం పూర్తి కూడా కాలేదు… అప్పుడే యాంటీ కాంగ్రెస్ సెక్షన్లు సోషల్ మీడియాలో వెక్కిరింపులు, ఆక్షేపణలు స్టార్ట్ చేశాయి… బీఆర్ఎస్ సహజంగానే ఈ కౌంటర్లలో ముందుంది… తెలంగాణ బీజేపీ సోషల్ మీడియాకు ఎప్పటిలాగే చేతకాలేదు… ‘కేవలం ఓట్ల కోసమే ఈ హామీలు.., ఏం, మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఇవన్నీ ఇస్తున్నారా..? ఐనా మిమ్మల్ని నమ్మేదెవరు..?’ వంటి వ్యాఖ్యలు జోరుగా సాగాయి, గుతున్నాయి, తాయి… మేధావులుగా చెప్పబడే కొందరి […]
ఎలక్షన్ ఇయర్లోకి వచ్చేశాం… మన పురాణం సీత గారేమంటారంటే…
Bharadwaja Rangavajhala……… ఇల్లాలి ముచ్చట్లు ….( పునః ) – పురాణం సీత గారు 2. O అనుకుండూండగానే ఎలక్సన్ ఇయర్లోకి వచ్చేశాం … ఎవరు గెలుస్తారు … ఎలా గెలుస్తారు … బ్లడీ డిస్కషన్స్ … కిచెన్‌లోనూ అవే … డైనింగ్ టేబుల్ దగ్గరా అవే … ఫేస్‌బుక్‌లోనూ … టీవీల్లోనూ … ఆల్ సోషల్ అండ్ సైన్స్ మీడియా అంతటా … వాటీజ్ సైన్స్ మీడియా అంటారా … టీవీలూ పేపర్లూ ఎక్సెట్రా ఎక్సెట్రా […]
- « Previous Page
- 1
- …
- 63
- 64
- 65
- 66
- 67
- …
- 119
- Next Page »