పార్ధసారధి పోట్లూరి రష్యా ప్రయోగించిన Luna-25 మూన్ లాండర్ విఫలం అయ్యింది! చంద్రుడి దక్షిణ ధృవం మీద లాండ్ అవాల్సిన Luna-25 శనివారం రోజున చంద్రుడి దక్షిణ ధృవం మీద సురక్షితంగా దిగాల్సి ఉండగా కుప్ప కూలి పోయింది! చాలా మంది అనుకుంటున్నట్లు భారత్ కంటే ముందుగా రష్యా చంద్రుడి మీదకి తన ల్యాండర్ ని పంపి క్రెడిట్ కొట్టేయాలని చూసింది అని అనడం తప్పు! నిజానికి 2023 ఆగస్టులో చేసిన ప్రయోగం ఏదయితే ఉందో అది […]
ఉద్యమకారులైతే టికెట్లు నిరాకరించకూడదా..? ఇదెక్కడి సూత్రం..?
ఆంధ్రజ్యోతిలో ఓ వార్త… ఉద్యమకారులకు కేసీయార్ ఈసారి మొండిచేయి చూపించబోతున్నాడు… కనీసం పది మందికి టికెట్లు నిరాకరించబోతున్నాడు అని…! అదేదో పెద్ద తప్పయినట్టు, కేసీయార్ తెలంగాణకు ఏదో ద్రోహం చేస్తున్నంత ఫీల్ ఉంది ఆ వార్తలో… సరే, ఇప్పుడు ఆంధ్రజ్యోతి రూట్ వేరు కదా, కేసీయార్తో ఎక్కడో బెడిసి, ఇద్దరూ తూకిత్తా తూకిత్తా అనుకుంటున్నారు కదా… కానీ కొన్ని సందేహాలు… ఉద్యమకారులనగా ఎవరు..? తెలంగాణ ఏర్పడాలని ఉద్యమించడం వేరు… ఆ స్పూర్తిని, ఆ పోరాటాన్ని అభినందిద్దాం… కానీ […]
హమ్మయ్య… ఐఐటీ విద్యార్థుల ఆత్మహత్యల్ని ఇక నివారించేసినట్టే…
Spring Fans: దేశంలో ఐఐటీ అంటే చాలా గొప్పే. చాలా సులభంగా దొరికేది ఏదీ సృష్టిలో విలువైనది కాలేదు. కాదు కూడా. ఒకవేళ అత్యంత విలువయినది నిజంగా తేలికగా దొరికినా దాన్ని సహజంగా మనం గుర్తించం. అలా ఐఐటీల ప్రవేశ పరీక్ష శత్రు దుర్భేద్యమయిన, అనితరసాధ్యమయిన విద్యాయుద్ధ పరీక్ష. అలా ఎందుకయ్యిందో? అలా కావడం దేశానికి మంచిదా? కాదా? అంతటి ఐ ఐ టీ ల్లో బాగా చదివి, ఆ చదువుకు ఆవగింజంత అయినా సంబంధంలేని వేరే వృత్తుల్లోకి […]
గేటు బయట నిలబెట్టి అవమానించాడు… తనే తిరిగి అంజలి ఘటించాడు…
‘‘ఇటీవల కన్నుమూసిన గద్దర్ విషయంలో కూడా కేసీఆర్ నిరంకుశంగానే వ్యవహరించారు. ప్రగతిభవన్ గేటు వద్ద పడిగాపులు పడినప్పటికీ ఆయనను లోపలకు అనుమతించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా పాలకుల వద్ద కూడా గద్దర్కు ఇలాంటి అవమానం జరిగి ఉండదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇదే గద్దర్ మద్దతుకోసం కేసీఆర్ పాకులాడారు. ఆమరణ నిరాహార దీక్ష పేరిట నిమ్స్ ఆస్పత్రిలో చేరిన కేసీఆర్, తాను దీక్షను కొనసాగించలేని పరిస్థితిలో ఉన్నానని, గద్దర్ వంటి వాళ్లు దీక్ష విరమించాలని విజ్ఞప్తి […]
ఎన్ని గదుల్లో తబలా వాయిస్తే… ఒక్కో గదికి ఒక్కో గంట చొప్పున లెక్కకట్టి…
శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి… ఈ నానుడిని నిజం చేసి తన సంగీతంతో శిశు, పశు, పాములను తన్మయత్వంలో ముంచెత్తిన పద్మవిభూషణుడు పండిట్ జస్రాజ్. అలాంటి మహానుభావుడి బాల్యానికి కేరాఫ్ మన భాగ్యనగరం. ఆ భాగ్యాన్ని భాగ్యనగరంతో పంచుకున్న ఆ బడి డ్రాపవుటే.. బడా సంగీతకారుడై.. సాగిన ఆ జర్నీలో హైదరాబాద్ తో ఆయనకున్న ఆ అనుబంధమేంటో ఓసారి ఆయన మాటల్లోనే చెప్పుకుందాం. మా తండ్రి మోతీరామ్ ప్రముఖ సంగీతకారుడు. నా నాల్గో ఏటనే మా […]
అది నేనే… ఇటు నేనే… అన్నీ నేనే… సెల్ఫ్ డ్రమ్ ఆఫ్ ది గ్రేట్ విజనరీ…
Self Drum: అదొక అతి శీతల అతి పెద్ద కన్వెన్షన్ హాల్. ఇసుకవేస్తే రాలేంత జనంతో హల్ పలుచగా, చప్పగా, నీరసంగా ఉంది. కానీ బీ బీ సీ మెదలు లోకల్ సిటీ కేబుల్ దాకా జర్నలిస్టులు, కెమెరా సిబ్బంది, లైవ్ , డిజిటల్ మీడియా వారు వందల మంది పెట్టుడు పెయిడ్ సిబ్బంది ముందు వరుసలో చిక్కగా చక్కగా ఉన్నారు. స్టేజ్ వెనుక ఎల్ ఈ డి బ్యాక్ డ్రాపులు 80 బై 80 లో ఆకాశం అంచుల […]
వహ్వా వహ్వా… గజల్స్ వింటూ, ఆస్వాదిస్తూ ఇంతకుమించి ఇంకేం అనగలం..?
Sai Vamshi………. చిన్నప్పుడు ఏమీ తోచక టీవీ ఛానెల్స్ తిప్పుతూ ఉంటే ఉర్దూ ఛానెల్ కనిపించేది. ఎవరో గాయకుడు స్టేజీ మీద కూర్చుని పాడుతూ ఉండేవారు. భావావేశంతో ఆయన పాడుతూ ఉంటే, కింద జనం వహ్వా అంటూ ఆనందించేవారు. సినిమా పాటల్లా కాకుండా అత్యంత సున్నితంగా ఉన్న ఆ పాటేంటో అర్థమయ్యేది కాదు. భాష కూడా తెలియదు. ఉర్దూ అంటే ముస్లింల భాష అన్న అపోహ కారణాన కాసేపటికి ఆ ఛానెల్ మార్చేసేవాణ్ని. నాకు మల్లే అనేక […]
మా ఎమ్మెల్యేకే మళ్లీ టికెట్టిస్తే… మర్యాద దక్కదని హెచ్చరించనైనది…
మహారాజరాజశ్రీ గౌరవనీయులయిన పార్టీ అధ్యక్షులవారి పాద పద్మములకు నమస్కరించి ఫలానా నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్రాయునది… మీరు అనేక సర్వేల తరువాత గెలుపు గుర్రం అని తేల్చి గత ఎన్నికల్లో నిలబెట్టిన అభ్యర్థిని మేము అంతే పట్టుదలతో కష్టపడి గెలిపించాము. గెలవగానే ఆయన/ఆమె ఏకు మేకు కావడంతో మాకు కష్టాలు చెప్పి వస్తున్నాయి. అంతకు ముందు అయన దారిన పోయే దానయ్య. ఇప్పుడు ఆయన/ఆమె ఏ దారినీ వదలకుండా కబ్జాలు చేస్తుండడంతో మాకు ఏదారీ లేక కుక్కతోక […]
తెలుగు వెండితెర తండ్రి… ఆనంద చక్రపాణి… A Tearful Success Story
తెలుగు వెండితెర తండ్రి ఆనంద చక్రపాణి A Tearful Success Story …………………………………… అది 1989. చింతపల్లి – నాగార్జునసాగర్ రోడ్డులో పాడుబడిన ఒక పాత దొరల గడీ. అప్పటికే జాతీయ అవార్డు పొందిన హీరోయిన్ అర్చన ఒక గోడకి దగ్గరగా నిలుచుని వుంది. ఆమె రెండు చేతులూ పట్టుకుని, పైకెత్తి గోడకి అదుముతూ, అర్చన మీద దౌర్జన్యం చేయాలి చక్రపాణి. అది దాసి సినిమా షూటింగ్ లోకేషన్. చక్రపాణికి తొలి సినిమా. అర్చన రెండు చేతులూ […]
ప్రతి మనిషీ ఇప్పుడొక డిజిటల్ యానిమల్… సోషల్ మీడియా యానిమల్…
‘Social’ Murder: కొన్ని వార్తలు చదవకపోతేనే బాగుండు అనిపిస్తుంది. అలాంటి వార్త ఇది. డిజిటల్ వ్యామోహంలో మనుషులు ఎలా మృగాల కంటే నీచంగా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవాలి కాబట్టి చదవకతప్పదు. డిజిటల్ వ్యసనంలో పడ్డవారు వావి వరుసలు మరచి ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకుని జాగ్రత్తపడాలి కాబట్టి తెలుసుకోక తప్పదు. ఉత్తర ప్రదేశ్ లో ఒక జంట. ఇద్దరు పిల్లలు. అతడు ట్రావెల్ ఏజెంట్. ఆమె గృహిణి. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక ఆమెకు ఇంట్లో పని ఒత్తిడి తగ్గి…తీరిక దొరికింది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతివారూ […]
జెండా వందనవేళ ఆ టీచరమ్మ ఆ కలెక్టరమ్మను చూసి పొంగిపోయింది…
ఆమె పొంగిపోయింది… తన విద్యార్థిని ఓ జిల్లా కలెక్టర్గా చార్జి తీసుకోవడం ఆమెకు గర్వంగా తోచింది… ఆ ఆనందాన్ని ఎలా పంచుకోవాలి..? ఎస్, ఆ విద్యార్థినితోనే ఆ సంతోషాన్ని షేర్ చేసుకోవాలి… అదీ సదరు కలెక్టర్ జెండా వందనం చేస్తున్నప్పుడు… పోలీస్ బలగాలు ఆమెకు గౌరవ వందనం చేస్తుంటే కళ్లారా చూడాలి… అనుకున్నదే తడవుగా ఆమె మధురై నుంచి కొట్టాయం వరకు రాత్రికిరాత్రి 250 కిలోమీటర్లు ప్రయాణించి, తన విద్యార్థిని ఇరవై ఏళ్ల తరువాత కలుసుకుంది… ఆనందంగా […]
హైదరాబాద్ మాత్రమే కాదు… మరో తెలుగు ప్రాంతమూ విలీనానికి మొండికేసింది…
Siva Racharla చరిత్ర బూజు దులిపితే మనకు తెలియని సంగతులు,అది కూడా మనచుట్టూ జరిగిన అనేక సంఘటనల వివరాలు బయటకొస్తాయి. స్వాతంత్రం వచ్చిన తరువాత కూడా అనేక సంస్థానాలు భారత్ లో కలవలేదని మనకు తెలుసు. సంస్థానాల విలీనం కోసం నెహ్రు ఒక కార్యక్రమాన్ని తీసుకొని వందల సంస్థానాలను చర్చల ద్వారా నిజాం లాంటి వారిని సైన్యం బలంతో విలీనం చేసిన చరిత్ర తెలిసిందే. కానీ ఆంధ్రప్రదేశ్ లోని ఒక సంస్థానం భారత్ లో కలవటానికి మొండికేసిన […]
ఆఫ్టరాల్ చిరుత… టీటీడీ చేతికర్ర చూస్తే ఆమడదూరం పరుగోపరుగు…
పెద్ద పులి, చిరుత పులి, జాగ్వార్ ఇలా ఏ రకం పులి అయినా, సింహాలు అయినా అంతరించిపోతున్న వన్య ప్రాణి జాబితాలో ఉన్నాయి. 1.వాటిని కొట్టడం, చంపడం, వాటి జీవనాన్ని అడ్డుకోవడం నేరం అవుతుంది. 2.మానవుల మీద దాడి చేసినపుడు వాటిని పట్టి బంధించి దూరంగా అడవిలో వదిలిపెట్టాలి అంతే కాని వాటిని చంపకూడదు. 3.ఒక వేళ చంపాల్సిన అవసరం ఏర్పడినప్పుడు దానికోసం విధి, విధానాలు ఉన్నాయి వాటిని తప్పక పాటించాలి. 4. ఏ మాత్రం తేడా […]
పింగళి వెంకయ్య పేరు సరే… సురయ్యా పేరు విన్నారా ఎప్పుడైనా…
రెండు రోజులుగా నెట్లో– స్వాతంత్య్ర దినోత్సవం రానున్న సందర్భాన– ఏదో చదువుతుంటే సురయ్యా త్యాబ్జీ ప్రస్తావన కనిపించింది. ఆమె హైదరాబాదీ కావడంతో ఆసక్తి కలిగింది. గత సంవత్సరం నేను ‘మేడమ్ కామా’గా పిలువబడే భికాజి కామా గురించి చదివాను. ఆమె అప్పటికి కలకత్తా ఫ్లాగ్గా పిలువబడిన తొలిస్థాయి జాతీయ పతాకాన్ని జర్మనీలో మొదటిసారి ఎగురవేసింది. అది రికార్డ్ అయి ఉంది. పింగళి వెంకయ్య గారు ప్రతిపాదించగా రూపుదిద్దుకుంటూ వచ్చిన మూడు రంగుల జాతీయ జెండా మీద ‘చరఖా’ […]
నిజంగా పీడన నుంచి విముక్తమయ్యాయా..? పంద్రాగస్టు వేళ ఓ ఆత్మావలోకనం…
India – Independence: మహాత్మా మళ్లీ జన్మిస్తావా? (ఇరవై ఆరేళ్ల కిందట 1997లో స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల వేళ ఒక పత్రికలో ప్రచురితమయిన సంపాదకీయ వ్యాసమిది. వజ్రోత్సవాలు దాటి వచ్చిన 2023లో ఒకసారి నెమరువేత) నాగరికత నడక నేర్చుకుంటున్న రోజుల్లో… ప్రపంచం అబ్బురపడేలా భారతీయ చరకుడు వైద్యానికి భాష్యం చెబితే మనకెందుకు? చాణక్యుడు అర్థశాస్త్రానికి అర్థం చెబితే మనకెందుకు? అంతకుముందు నుంచే ఉన్న వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, సకల శాస్త్రాల గురించి మనకెందుకు? స్వాతంత్య్రం వచ్చింది. వచ్చి యాభై ఏళ్లయింది. అది చాలు […]
అన్నీ బాగుండటం కూడా ఓ సమస్యే… అసలు సమస్యల్లేని జీవితమే ఓ సమస్య…
Amarnath Vasireddy…. కాలిపై కాలు వేసుకొని జీవితాంతం హ్యాపీగా బతికేయొచ్చు – .. అనే డోపమైన్ హై కథ ! తండ్రి – కష్టపడి ఎదిగి పారిశ్రామిక వేత్త అయ్యాడు. కూతురంటే అమితమయిన ప్రేమ . పెళ్ళీడొచ్చిన ఆమె కోసం మంచి సంబంధం వెదికాడు . శ్రమ ఫలించింది. వెయ్యి కోట్ల సంపద కలిగిన ఉన్నత శ్రేణి పారిశ్రామిక వేత్తల సంబంధం . ఒక్కడే కొడుకు . అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది .” అదృష్టం అంటే […]
హీరో రోడ్డు పక్కన 50 ఏళ్ల కింద తాను అంట్లు తోమిన ఇరానీ హోటల్లోకి వెళ్లి…
ఒకే రోజు హీరో మనవరాలి పెళ్లి ముహూర్తం, హీరో ద్విశతాబ్ది (ఈ మధ్య ఏదయినా సంస్కృతంలోనే చెబుతున్నారు) అంటే 200 సినిమా షూటింగ్ ప్రారంభ ముహూర్తం ఒకే ఘడియలో గడియపడ్డంతో అభిమానుల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొని ఉంది. టీవీ డిబేట్లలో ఇదే చర్చ. సామాజిక మాధ్యమాల నిండా ఇవే వార్తలు. కామెంట్లు. అభిప్రాయాలు. గ్రహాల గతులనే కొంచెం మార్చాలంటూ ఏకాదశమ గ్రహ జాతక సైకో ఫ్యాన్స్ నిపుణులు నవీన జోతిషాలు కూడా చెబుతున్నారు. ఇలాంటి అరుదయిన […]
‘అఖండ దీపారాధనకు ఎన్ని వత్తులు వాడాలో చెప్పండి స్వామీజీ…’
Sai Vamshi….. … హారతి ఎలా ఇవ్వాలో తెలుసా? … అఖండ దీపారాధనకు ఎన్ని వత్తులు వాడాలి? … తీర్థం తలకు రాసుకుంటే దోషమా? … దేవుడికి వేసే దండలో ఎన్ని పువ్వులు ఉండాలి? … ఏ నూనెతో దీపం వెలిగించాలి? … దేవుడి నిర్మాల్యం ఎక్కడ వేయాలి? ... కొబ్బరికాయ మూడు ముక్కలైతే దోషమా? … కుంకుమ ఏ వేలితో పెట్టుకోవాలి? … గంధం ఎన్ని వేళ్లతో రాయాలి? … ఓర్నీ! తెల్లారి లేస్తే యూట్యూబ్ […]
చట్టాలు ఏ భాషలో ఉంటేనేం..? అవి పోలీస్ లాఠీ భాషలోనే పలుకుతాయి..!!
Own Language: ఇండియన్ పీనల్ కోడ్- ఐ.పి.సి. ఇకపై భారతీయ న్యాయ సంహిత. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్- సి.ఆర్.పి.సి. ఇకపై భారతీయ నాగరిక్ సురక్షా సంహిత. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇకపై భారతీయ సాక్ష్య. పోలీసు భాష ప్రపంచంలో లిపి ఉన్నవి, లిపి లేనివి ఎన్ని భాషలయినా ఉండవచ్చుగాక. “ఆల్ యువర్ లాంగ్వేజెస్ విల్ ఎండ్ వేర్ మై లాఠీ బిగిన్స్” అని ఒక అలిఖిత పోలీసు దుడ్డు కర్ర భాష ఉంది కాబట్టి సకల భాషలు అక్కడ […]
రచయితకు చేరని పాఠకుడి ఉత్తరం… ఓ కథ… ఓ స్వీయానుభవం…
నేను చాలా కాలంగా కథలు రాస్తున్నాను. కానీ, కథా స్వరూపం గురించి, కథ యొక్క ప్రయోజనాన్ని కార్పొరేట్ ప్రపంచం ఏ విధంగా వాడుకుంటుందన్న విషయం ఈ మధ్యే, ఒక ‘టాక్’ లో పాల్గొనడం వలన మరింత నిర్దిష్టంగా తెలిసింది. నిరంతరం కొత్త విషయాలను తెలుసుకోవాలనే నా జిఙ్ఞాస కారణంగానే డబ్బులు కట్టి, ఈ ‘టాక్’లో పాల్గొన్నాను. కథలు రెండు రకాలనీ, ఒకటి స్వీయ అనుభవాల సారాంశమనీ, రెండవది మనం సమాజాన్ని పరిశీలించడం ద్వారా కలిగిన ఆలోచనలను ఒక […]
- « Previous Page
- 1
- …
- 67
- 68
- 69
- 70
- 71
- …
- 119
- Next Page »