Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కల్వకుంట్ల కాదు ఇప్పుడు… బహుజన కవిత… ప్లాన్‌డ్‌గా అడుగులు…

October 4, 2025 by M S R

kavitha

. సినిమా పేరు అబ్బాయి గారు అనుకుంటా… అప్పట్లో సూపర్ హిట్ సినిమా… అందులో అత్తకు ఎప్పటికప్పుడు చెమటలు పట్టిస్తూ ఆడించే కోడలి పాత్ర మీనాది… బ్రహ్మానందం అంటాడు ఓ చోట… ఏమో అనుకున్నాం గానీ కంచు… కంచండీ నంబర్ వన్ కంచు బాబోయ్ అంటాడు… అత్తకు మరింత మంటెక్కేలా… బండారు దత్తాత్రేయ ఏటా నిర్వహించే దసరా అలయ్ బలయ్‌లో కల్వకుంట్ల కవిత ఈసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్… ఏ కేసీయార్ విమలక్క వంటి అభ్యుదయవాదుల్ని, తెలంగాణ […]

ముందు నీ గోచీబట్ట సర్దుకోవోయ్ నొటోరియస్ బీహారీ డెకాయిట్..!!

October 4, 2025 by M S R

prasanth kishore

. ప్రశాంత్ కిషోర్… వర్తమాన రాజకీయాల్లో ఏమాత్రం విశ్వసనీయత లేని ఈ వింత పొలిటికల్ బ్రోకర్ కేరక్టర్ గురించి చెప్పుకోవాలి… ఎందుకంటే..? తను వచ్చే ఎన్నికలకు తెలంగాణ వస్తాడట, రేవంత్ రెడ్డిని పనిగట్టుకుని ఓడిస్తాడట… రాహుల్ గాంధీ గానీ, మోడీ గానీ కాపాడలేడట… నరే, అంత సీన్ ఏమీ లేదు తనకు… కానీ ఎందుకు రేవంత్ రెడ్డిపై ఎందుకు కోపం..? తను బీహారీ డీఎన్ఏ‌లో కూలీపని చేసుకునే గుణం ఉందని ఎప్పుడో అన్నాడట… అది అవమానించినట్టు అట, […]

“ఓం శివోహం…” ఇళైయరాజా పాటకు ఓ కోపిష్టి అఘోరీ ఆకర్షితుడయ్యాడు…!

October 3, 2025 by M S R

ilairaja

. Rochish Mon ….. ఇళైయరాజా పాట —– ‘ఆఘోరీ-పాట’ “ఓం శివో హం…” 2009లో వచ్చిన నాన్ కడవుళ్ తమిళ్ష్ సినిమాలోని పాట “ఓం శివో హం…” ఇళైయరాజా పాటకు పెద్ద శాతం పామరులు, విజ్ఞులు, విదేశీయులు, సంగీత సాంకేతిక నిపుణులు, శాస్త్రీయ సంగీత వేత్తలు ఆకర్షితులవడం, ఇళైయరాజాను శ్లాఘించడం తెలిసిందే. అంతే కాదు ఇళైయరాజా పాటకు ఏనుగులు ఆకర్షితులవడం వంటి ఆశ్చర్యకరమైన సంఘటనలూ జరిగాయి. ఈ “ఓం శివో హం…” పాటకు ఈ ప్రపంచ […]

BF అంటే..? ఆగండి, ఏవో నీలి ఊహల్లోకి వెళ్లకండి… ఇది చదవండి…

October 3, 2025 by M S R

bf

. BF …. ఫుల్ ఫామ్ ఏమిటి..? అర్థం ఏమిటి..? అరెరె, ఆగండాగండి, ఎక్కడికో ఆ నీలి ఊహల్లోకి వెళ్లకండి కాసేపు… మరో కథ చెబుతాను… అసలు అర్థం ఏమిటో అది చెబుతుంది… what is BF meaning… . ఇది ఓ అందమైన ‘BF‘ కథ … ఓ పిల్లాడు టీన్స్… సేమ్ వయస్సులో ఓ అమ్మాయి… స్కూల్‌లో ఆ పిల్లాడు ఆమెతో ‘నేను నీకు BF‘ అన్నాడు… ఆ పిల్ల దానికి ‘BF‘ అంటే ఏంటి? […]

నోబెల్ ఇవ్వకపోతే చచ్చారే… అసలే నేను మహా శాంతికాముకుడిని…

October 3, 2025 by M S R

trump

. ఏం తమాషాగా ఉందా? నాకుగాక ఎవరికిస్తారు నోబెల్? నోబెల్ ప్రపంచ శాంతి బహుమతి ఎంపిక కమిటీకి ట్రంప్ రాయునది ఏమనగా…:- ఒళ్ళు దగ్గరపెట్టుకుని చదవాల్సిన అత్యవసర విషయాలు:- రెండో ప్రపంచం యుద్ధం ముందునాటి (1930-45) జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ గురించి ఇంకా ఎన్ని తరాలు మాట్లాడుకుంటారు? అదంతా గతం గతః. చరిత్రపుటల్లో ఎప్పుడో పాతబడిపోయింది. భూగోళం మరచిపోయే కొన్ని తరాలు అయ్యింది. మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఏడుసార్లు ఆపిన ఇప్పటి నా అప్రమేయ, […]

ఎంత మంచివాడవురా…? ఎన్ని నోళ్ల పొగడుదురా..? చెంపపైకి ఓ కన్నీటి చుక్క..!!

October 2, 2025 by M S R

good story

. అతను ఆ బాధాకర సిచువేషన్ హ్యాండిల్ చేసిన విధానం చాలా అద్భుతం… డాక్టర్ ఏపూరి హర్ష వర్ధన్,.. ఖమ్మం, వృత్తి రీత్యా ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్ లో జనరల్ మెడిసిన్ లో వైద్య సేవలు అందిస్తున్నాడు.పెళ్లి సమయం వచ్చింది , వైరా దగ్గరలోని మేనత్త ఊరిలో సింధు అనే అమ్మాయిని పరస్పరం వీడియోలో చూసుకున్నారు ఇష్టపడ్డారు… కరోనాకాలం మొదలవుతుంది. ముందుగా నిర్ణయించిన సమయానికి అనగా ఫిబ్రవరి 12 2020 నాడు హర్ష సింధుల వివాహం అత్యంత ఘనంగా […]

75 weds 35 … పెళ్లిరోజు రాత్రే కుప్పకూలాడు… ఏం జరిగి ఉంటుందబ్బా…

October 2, 2025 by M S R

75 weds 35

. జయ్‌నూర్ జిల్లా కుచ్ఛముఛ్ గ్రామం…  ఆ ఉదయం నిశ్శబ్దంతో మేల్కొంది… ళ్లి పాటలు, శుభాకాంక్షల సందడి కేవలం కొన్ని గంటల కిందటే ఊరంతా కమ్మేసి ఉండగా… మరుసటి రోజు ఉదయం మాత్రం ఒక్కసారిగా విలపాలతో, అనుమానాలతో నిండిపోయింది… సంగ్రురామ్ – 75 ఏళ్లు…ఒక సంవత్సరం క్రితం తన జీవిత భాగస్వామిని కోల్పోయాడు… వయస్సు 75 ఏళ్లు.., పిల్లలు లేని ఒంటరితనంలో బతికాడు… ఇంకేముంది..? కృష్ణారామా అనుకుంటూ బతుకు ఈడ్చడమే కదా… కాదు, వృద్ధాప్యపు నిశ్శబ్దం, ఖాళీ […]

ఇంటింటికీ ఓ జవాన్… ఆసియాలోనే అతి పెద్ద గ్రామం… ఆర్మీ గ్రామం…

October 1, 2025 by M S R

army village

. ( రమణ కొంటికర్ల ) ….. గంగానదీ తీరాన ఆ గ్రామమంతా దేశభక్తులే. ఇంటింటికీ ఓ సైనికుడు తప్పనిసరి. ఆసియా ఖండంలోనే ఆర్మీ సేవల్లో అతి ఎక్కువ మంది కల్గిన గ్రామంగా కూడా గహ్మార్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అంతేనా.. ఆసియా ఖండంలోనే అతి పెద్ద గ్రామం కూడా గహ్మారే కావడం విశేషం. మరి ఆ ఊరు కథ తెలుసుకుందాం రండి. కొన్ని దశాబ్దాలుగా వేగవంతమైన పట్టణీకరణ, పారిశ్రామికీకరణ కనిపిస్తోంది. అయినప్పటికీ భారత్ అంటే గ్రామీణమే. వ్యవసాయమే […]

ఆనాటి ఆ ఓటమి కసి నుంచే… వరల్డ్ క్రికెట్ మీద దండయాత్ర…

October 1, 2025 by M S R

bcci

. చాలా రోజుల తర్వాత క్రికెట్ మ్యాచ్ కి ముందు రోజు రాత్రి అహ్మదాబాద్ కి ఫ్లైట్ లో వెళ్లి… నైట్ ఫ్రెండ్ ఇంట్లో పడుకొని.., మధ్యాహ్నం మ్యాచ్ కి వెళ్లి… వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా ఓడిపోవడం గ్రౌండ్ లో చూసాక.. ఎందుకో క్రికెట్ అంటే ఇష్టం తగ్గటం మొదలయింది… వైరాగ్యం వచ్చినట్టయింది… గత రెండు సంవత్సరాలుగా ఓటమే అన్నది ఎరుగని టీం ఇండియా మళ్ళీ ఒక్కసారి టైం మెషిన్ లోకి వెళ్లి, ఆనాటి ఆ […]

56 అక్షరాలు దేనికి..? ఈ 37 అక్షరాలతో సరళీకరించలేమా..?!

October 1, 2025 by M S R

telugu

. ఆధునిక తెలుగు అక్షరమాలలో వాడుక తగ్గిపోయి, తొలగించిన లేదా చాలా అరుదుగా ఉపయోగించే కొన్ని అక్షరాలు ఉన్నాయి… మనం ఱ (బండి ‘ర’) దాదాపుగా తీసేశాం… ఇంకా వాడుకలో లేనివి లేదా చాలా అరుదుగా ఉపయోగించే ఇతర అక్షరాలు ఇక్కడ చూడవచ్చు… అచ్చులు (Vowels): ౠ (దీర్ఘ ఋ): ఇది సంస్కృత పదాలలో ఉండేది. ఌ (ల్రు): సంస్కృత పదాలలో ఉండేది. ౡ (దీర్ఘ ల్రు): ఇది కూడా సంస్కృత పదాలలో ఉండేది. ఈ నాలుగు అచ్చులు […]

పాలపిట్ట గొంతుచించుకుని రాయల పేర్లు పలుకుతోంది… ఏరీ వారెక్కడ?

October 1, 2025 by M S R

hampi

. విజయనగర రాజుల కాలంలో హంపీలో ఉత్సవం జరగని రోజు లేదు. అదొక నిత్య కల్యాణ సీమ. మహారాజ ద్వారం మెదలు సామాన్య గుమ్మం దాకా పసిడి తోరణాలు కట్టుకున్న సీమ. ఇళ్ల స్తంభాలకు ముత్యాలు, రత్నాలు ఒదిగిన సీమ. సకల కళలు పసిడి పల్లకీల్లో ఊరేగిన సీమ. నిత్యం సంగీత, సాహిత్య, నాట్య కళల ప్రదర్శనలతో తుళ్లిపడిన సీమ. మనుషులతో పోటీలు పడి రాళ్లు రాగాలు పాడిన సీమ. ప్రాణమున్న మనుషుల నాట్యాన్ని సవాలు చేసిన […]

ఇడ్లీ అంటే… ఓ బీథోవెన్ సింఫనీ, హుస్సేన్ పెయింటింగ్, సచిన్ సెంచరీ…

October 1, 2025 by M S R

idli day

. మనం చాలాసార్లు ఇడ్లీ విశిష్టత గురించి ముచ్చటించుకున్నాం కదా… అనుకోకుండా ఓ రీల్ తారసపడింది… పూణెలో ఓ స్ట్రీట్ వెండార్… ఇడ్లీలను నూనెలో (అదీ ఇంజన్ ఆయిల్‌లా కనిపిస్తోంది) గోలించి, వాటిని ముక్కలు చేసి, వాటిపై సాంబార్ వంటి ద్రావకాన్ని ఏదో పోసి, పైగా దానిపైనే చట్నీ వేసి ఇస్తున్నాడు… మస్తు పాపులర్ అట… ఫుల్లు గిరాకీ అట… సరే, జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి… మా యాసీన్ అయితే సాంబార్, చట్నీ ఏదీ లేకుండా […]

ఆ బనకచర్ల ఏట్లో కలిసింది… కొత్తగా ఇంకో కాళేశ్వరం కథ మొదలైంది…

September 30, 2025 by M S R

cbn

. గురువు, శిష్యడు అంటూ సోకాల్డ్ జగన్ జాన్ జిగ్రీ దోస్త్ పార్టీ బీఆర్ఎస్ ఎన్ని వెటకారాలు ఆడినా సరే… ఎహె పోవోయ్ అని ధిక్కరించి…. రేవంత్ రెడ్డి ప్రతిపాదిత బనకచర్ల అలియాస్ మరో కమీషన్ల ఏటీఎం కాళేశ్వరం ప్రాజెక్టు మెడకు చిక్కుముళ్లు బిగించాడు… దాంతో చంద్రబాబుకు ఊపిరాడలేదు… అయ్యో, కేసీయార్ తరహాలో మరో కాళేశ్వరంలా ఓ అయిదారు తరాలకు ఇక నో ఫికర్ అనుకుంటే… శిష్యుడు శిష్యుడు అంటూనే గురువు— పెట్టిన మెలికలు, ఫిక్స్ చేసిన […]

దళిత వాడల్లోకి దేవుడిని రానివ్వవా కాంగ్రెస్ షర్మిలా..?

September 30, 2025 by M S R

ttd

. గుళ్లలోకి దేవుడి దగ్గరకు అసలు రానివ్వని దుర్మార్గపు వివక్ష రోజుల నుంచి… దేవుడే ఆ వాడల్లోకి వస్తున్న, గుళ్లు కూడా కట్టుకుంటున్న రోజులు ఇవి… దళిత గోవిందం కావచ్చు, ఇప్పుడు టీటీడీ 5 వేల గుళ్ల నిర్మాణ నిర్ణయం కావచ్చు… తిరుమల హుండీలో వేసే ప్రతి రూపాయి వెనుక ఆ దాత అంతరార్థం… వెంకన్న ఖ్యాతి విస్తరణ, హిందూ ధర్మ రక్షణ, ప్రచారం… టీటీడీ అదే పని చేస్తుంటే వైఎస్ షర్మిలకు ఎందుకు అభ్యంతరం..? ఎందుకంటే..? […]

మూర్ఖ వ్యక్తి పూజల వ్యతిరేక సిలబస్ ఇప్పుడు ఓ తక్షణ కర్తవ్యం

September 30, 2025 by M S R

karur

. మాకు మా అమ్మా నాన్న అపురూపంగా ఏదో పేరు పెట్టారు. మా సినీ అభిమానం వెల్లువలో మా నామకరణం రోజు పెట్టిన పేర్లు ఎప్పుడో కొట్టుకుపోయాయి. రెక్కలు ముక్కలు చేసుకుని పెంచి పోషించిన, ఇంకా పోషిస్తున్న మా అమ్మా నాన్నలకంటే, చదువు చెప్పిన టీచర్లకంటే, బతుకు పాఠాలు చెప్పి కూడు పెట్టినవారికంటే, ఉద్యోగమిచ్చినవారికంటే మాకు మా అభిమాన హీరోలే ఎక్కువ. # ఏనాడూ రక్తదానం చేయని మేము మా అభిమాన హీరో సినిమా విడుదలరోజు బ్లేడ్లతో […]

కొందరు తారసపడతారు… అలా గుర్తుండిపోతారు చాన్నాళ్లు…

September 30, 2025 by M S R

driver

. నేను నిన్న రాత్రి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగాను… క్యాబ్ బుక్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు… ఒక వ్యక్తి వచ్చి నాకు ట్యాక్సీ కావాలా అని అడిగాడు… అవును అనగానే, అతను డ్రైవర్‌కి కాల్ చేసి. వెహికల్‌ని అరైవల్స్ ఏరియాకి తీసుకురమ్మని చెప్పాడు… అది 40 నిమిషాల ప్రయాణం, నేను తెల్లవారుజామున సుమారు 3:15 గంటలకు ఇంటికి చేరుకున్నాను. డ్రైవర్ వెళ్లిపోగానే, చెక్ చేసుకుంటే నా ఫోన్ కనిపించడం లేదని గ్రహించాను… డ్రైవర్‌ను సంప్రదించడానికి నా దగ్గర […]

ప్రపంచం తప్పు అని వెనక్కి లాగితే… ఒప్పు అని చెప్పు, నిరూపించు…

September 29, 2025 by M S R

class

. శుభోదయం…. బాల్యంలో రోహన్ పాఠశాలలో నేర్చుకున్న ఆత్మవిశ్వాసం, పాఠాన్ని అతను ఎప్పటికీ మర్చిపోలేదు… ఒకసారి తరగతి గదిలో ముందుగా పద్యం చదవడానికి అతన్ని పిలిచారు… అతను మొదలుపెట్టాడో లేదో, వెంటనే ఉపాధ్యాయుడు గట్టిగా “తప్పు!” అని అడ్డుకున్నాడు… అతను మళ్ళీ మొదలుపెట్టాడు.., కానీ ఉపాధ్యాయుడు మళ్ళీ “తప్పు!” అని ఉరిమాడు… అవమానంతో రోహన్ కూర్చుండిపోయాడు… తరువాత మరో బాలుడు పద్యం చదవడానికి లేచాడు, అతను మొదలుపెట్టగానే ఉపాధ్యాయుడు “తప్పు!” అని అరిచాడు… అయితే, ఆ విద్యార్థి […]

Women labour… గంటల కొద్దీ పెయిన్… అదే నియంత్రణ లేని పెయిన్…

September 29, 2025 by M S R

labour

. Ashok Kumar Vemulapalli….  రైస్ మిల్లులో బియ్యం డబ్బా భుజాన పెట్టుకుని మోస్తున్న ఒక మహిళ .. మోసి మోసి అలసిపోయి .. బయటకు వెళ్తోంది .. అప్పుడే గుమాస్తా ఎక్కడికి వెళ్తున్నావు అని కటువుగా అడిగాడు చిటికిన వేలు చూపించింది ఆమె సగం సిగ్గుతో చచ్చిపోతూ .. అప్పుడే ఉచ్చ ఊరిపోయాయా? ఇందాకేగా వెళ్లి లీటర్ పోసి వచ్చావ్ .. వెళ్లి పని చేయ్.. అని అరవడం మొదలు పెట్టాడు ఆమె కళ్ళల్లో నీళ్లు […]

ఒక ఊరి పట్వారీ… మరో ఊరిలో మస్కూరి… ఇదీ అదే మరి…

September 29, 2025 by M S R

protocol

. “నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు బట్టు; బయట కుక్క చేత భంగపడును; స్థానబలిమి గాని తన బల్మిగాదయా విశ్వదాభిరామ వినురవేమ !” నీళ్ళలో ఉన్న మొసలి ఎలాంటి తడబాటు లేకుండా అతిపెద్ద ఏనుగును కూడా నీటిలోకి లాగి పట్టుకోగలుగుతుంది. కానీ అదే మొసలి తన స్థానమైన నీటి నుండి బయటకు వచ్చినప్పుడు మాత్రం కుక్క చేతిలో కూడా ఓడిపోతుంది. మొసలిది నీళ్ళల్లో స్థానబలిమి తప్ప తన బలం కాదు. “కమలములు నీటబాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన […]

పదండి పోదాం… తొక్కుకుంటూ వాడి కాలికి తోలుచెప్పులమవుదాం…

September 29, 2025 by M S R

stampede

. ఎవడు ఎంత పరిహారాలు ఇచ్చినా పోయిన ప్రాణాలు వెనక్కి రావు… వెల్లువెత్తిన ప్లాస్టిక్ సంతాపాలు ఎవడి కన్నీళ్లూ తుడవవు, ఆ కుటుంబాలను నిలబెట్టవు… నాలుగు రోజులు ఒకడికొకడు బ్లేమ్ గేమ్… ఏవేవో కుట్రలట.., బురదలు, విచారణలు, మీడియా పుంఖానుపుంఖాల కథనాలు… అంతే… ఈ రాజకీయాల క్షుద్రపూజల్లో ఎన్ని బలితర్పణాలు..? బాధ్యుడికేం బాగానే ఉంటాడు… బాధితుడి బాధ వాడికెందుకు..? ఈ కన్నీళ్లే అక్షింతలుగా ఎదుగుతూనే ఉంటాడు… వాడి పేరు అర్జునుడు కావచ్చు, వాడి పేరు విజయుడు కావచ్చు, […]

  • « Previous Page
  • 1
  • …
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • …
  • 135
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • చిరంజీవ..! ఆహా… ఎంత నాసిరకం సినిమా సమర్పించావు అభీ..!!
  • గోపీనాథ్ మరణ మిస్టరీ ఏమిటి..? కేటీయార్ మౌనం వెనుక మర్మమేంటి..!!
  • దీనక్క… ఏం రాశాడు గురూ సినిమా మాండలికంలో… బాగా ప్రాసపడుతూ…
  • నేతల సొంత కంచాల కథలేమిటి..? చానెల్‌లో పర్సనల్ కేసు లొల్లేమిటి..?
  • అంబానీలు, ఆదానీలకన్నా… శివ నాడార్ శిఖర సమానుడు… ఎలాగంటే..?!
  • బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది… టెండర్ల రద్దు అసలు కథ వేరు…
  • …. అలాంటి నాగార్జున సడెన్‌గా యాక్షన్ హీరో అనేసరికి మేమంతా షాక్’’
  • సాయి అభ్యంకర్..! మూడేళ్లలోనే ఎగిసిన స్వరకెరటం… భారీ డిమాండ్..!!
  • చక్దా ఎక్స్‌ప్రెస్..! ఈ ప్రపంచకప్ విజయ నిర్మాణంలో ఒక పునాది శిల..!!
  • సుమలత, ఊర్వశి… నాలుగు భాషల్లోనూ వాళ్లే… దర్శకుడూ ఒకడే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions