Untimely affect on Mamgo lovers : బండలు పగిలే ఎండలు మెండుగా వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో చల్లటి అండ కోసం కుండల అన్వేషణ ఇంకా పూర్తవనే లేదు. వడగాడ్పుల వేడి తగ్గించుకోవడానికి ఆస్థాన నిపుణుడితో ఏ సి ల దుమ్ము ఇంకా దులిపించనే లేదు. షరా మామూలుగా ప్రతి వేసవిలో రెండు, మూడు నెలల పాటు తినబోయే రకరకాల మామిళ్ల రుచులను తలచుకుంటూ బంగినపల్లి బుట్టలకు ఇంకా ఆర్డర్ ఇవ్వనే లేదు. పసందయిన హిమాం […]
ఎన్టీయార్ భవన్లో క్యాంటీన్కూ ఓ చరిత్ర ఉంది… తెలుగుదేశం పార్టీకి ఉన్నంత…!!
Murali Buddha ……….. ఎన్టీఆర్ భవన్ క్యాంటిన్ కూ ఉంది చరిత్ర… జ్ఞాపకాలు 2004 లో తెలుగుదేశం ఓడిపోయాక ఓరోజు ఎన్టీఆర్ భవన్ లో నన్నపనేని రాజకుమారి ‘‘చూడు మేం ఓడిపోయినా ఎన్టీఆర్ భవన్ ఎప్పుడూ కళకళలాడుతోంది’’ అంటే… ఓ క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేను ‘‘క్యాంటిన్ బంద్ చేసి చూడండి, ఎన్టీఆర్ భవన్ ఎంత కళకళలాడుతుందో చూడండి అన్నాను … ఆమె ఫకాలున నవ్వి అంతేనా ? అన్నారు . పేరుకు క్యాంటిన్ కానీ […]
గర్జించని రష్యా… గాండ్రించని రష్యా… ఆ దేశ విక్టరీ మిలిటరీ పరేడ్ నిస్తేజం…
పార్ధసారధి పోట్లూరి …….. May 9,2023, మాస్కో, రష్యా! విక్టరీ పెరేడ్ పేరుతో ప్రతి సంవత్సరం ఈ రోజున రష్యా భారీ స్థాయిలో మిలటరీ పెరేడ్ నిర్వహిస్తూ వస్తున్నది ! నాజీ జర్మనీ మీద విజయం సాధించిన రోజు May 9 ని ఘనంగా జరుపుకుంటుంది రష్యా ! కానీ నిన్న జరిగిన విక్టరీ పెరేడ్ ని కనుక చూస్తే ఉత్తర కొరియా చాలా బెటర్ అని అనిపించేవిధంగా జరిగింది ! ప్రతి సంవత్సరం ఈ రోజున […]
రష్యా రూబుల్ వర్సెస్ ఇండియన్ రుపీ… భారతీయ బ్యాంకుల్లో వేల కోట్ల నిల్వ…
పార్ధసారధి పోట్లూరి ……….. భారతీయ రూపాయలని ఏం చేసుకోవాలి ? రష్యా విదేశాంగ మంత్రి లవరోవ్ ప్రశ్న ! రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవరోవ్ [Sergey Lavrov ] SCO సమావేశాల కోసం వచ్చినప్పుడు నిశ్శబ్దాన్ని ఛేదించాడు! గత సంవత్సరం ఫిబ్రవరి 23 న రష్యా ఉక్రెయిన్ మీద దాడి మొదలుపెట్టగానే యూరోపుతో పాటు అమెరికా కూడా రష్యా మీద ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే ! దాంతో రష్యాకి చెందిన వివిధ అంతర్జాతీయ బాంకులలో […]
బరిలో గిరిగీసి గెలిచారు… బయట సిస్టంతో పోరాడలేక అసహాయంగా వలవల…
Wrestling with System: అదేమిటి? తాము అబలలం కాదని…సబలలమని బరిలో గిరిగీచి…నిలిచి…గెలిచినవారు కదా? ఎందుకలా వలవల కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నారు? అదేమిటి? దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున మన క్రీడా గర్వకారణాలు రోడ్డునపడి విలపిస్తున్నాయి? అదేమిటి? భారత మల్లయోధుల సమాఖ్య అధిపతి బ్రిజ్ భూషణ్ లైంగికంగా వేధించాడని…న్యాయం చేయమని ప్రాధేయపడుతున్న యోధురాళ్ల వార్తలను మీడియా నెలల తరబడి ఇస్తూ ఉంటే…అంతమందిని చెరచగల లైంగిక పటుత్వం నాకుందా? అని అతడు అంత లేకిగా, వెకిలిగా, నీచంగా మాట్లాడుతున్నాడేమిటి? అదేమిటి? […]
పాకిస్థాన్ దివాలా… ఐఎంఎఫ్ అప్పు రాదు… పీవోకే స్వాధీనానికి ఇదే తరుణం…
పార్ధసారధి పోట్లూరి ………… దక్షిణాసియా లో అమెరికా తన పట్టుని నిలుపుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నది ! ఒకవైపు చైనాతో ఘర్షణపూర్వక వాతావరణం కొనసాగుతున్న తరుణంలో అమెరికాకి ఒక్క భారత్ మాత్రమే పెద్ద అవసరమైన దేశంగా కనిపిస్తున్నా భారత్ మాత్రం ఒకవైపు రష్యాతో మరోవైపు అమెరికాతో వర్తక, వాణిజ్య సంబంధాలని తూకం వేసినట్లుగా ఎటు వైపూ మొగ్గు చూపకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తున్నది. మరీ ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి నుండి దిగిపోగానే అప్పటి వరకు […]
ఓహో… రాధాకృష్ణకూ చంద్రబాబుకూ ఫెవికాల్ బంధానికి ఇవేనా కారణాలు…
Murali Buddha…….. ‘రాధా బాబుల ‘బంధం……. ఫిర్యాదు చేసిన ఆర్ కే … నవ్వుకున్న నేతలు…. ఓ జ్ఞాపకం **** రాధాకృష్ణ చంద్రబాబుల బంధం ఎలాంటిది.? అమలిన ప్రేమనా ? విడదీయరాని బంధమా ? జన్మ జన్మల బంధమా ? అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పవచ్చు … ఆ ఒక్కొక్కరిలో ఒకడిగా నాకూ ఓ అభిప్రాయం ఉంది .? పాతికేళ్ల నుంచి వృత్తిపరంగా చూసిన అనుభవంతో నాకూ ఓ అభిప్రాయం ఉంది .. పరస్పర అవసరం […]
ఘొప్ప ప్రజాస్వామిక దేశంలో… రాజు గారికి పట్టాభిషేక మహోత్సవం…
Dynasty Forever: ఒకానొక గ్రేట్ ప్రజాస్వామిక దేశం. అక్కడి ప్రజలు వారి వ్యక్తిbగత స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కోసం పరితపిస్తుంటారు. సమూహంగా అందరి హక్కుల కోసం ఎలుగెత్తుతూ ఉంటారు. వారి భాష వారికి గ్రేట్. వారి వేషం వారికి గ్రేట్. వారి మర్యాదలు వారికి గ్రేట్. వారి ఆలోచనలు వారికి పులకింత. వారి రాతలు వారికి తుళ్లింత. వారి కవిత్వమే కవిత్వం. వారి నడకే నడక. ప్రపంచానికి వారివ్వనిదేదీ లేదని వారనుకుంటూ ఉంటారు. అలాంటి మా గొప్ప ప్రజాస్వామిక […]
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్… మనుషుల ఒరిజినల్ బుర్రలకు చెదలు…
Boomerang: వెనుకటికి ఒక బద్దకస్థుడు ఏ పనయినా చిటికెలో చేసి పెట్టే దయ్యం కోసం ఘోరమయిన వామాచార అభిచార హోమం చేశాడు. అతడి హోమానికి మెచ్చి దయ్యం ప్రత్యక్షమయ్యింది. “నాకు నా పళ్లు తోముకోవడం కూడా బద్దకమే. ఎప్పుడూ నా వెంట ఉండి…నేను నోటితో చెప్పడం ఆలస్యం…నువ్వు ఆ పనులన్నీ చేసి పెడుతూ ఉండాలి” అన్నాడు. “దానికేమి భాగ్యం! అలాగే. అయితే- ఒక షరతు. నాకు పనులు చెబుతూనే ఉండాలి. పనులు చెప్పనప్పుడు… నేను నిన్ను మింగేస్తాను…లేదా అదృశ్యం అయిపోతాను” […]
ఈనాడును అప్పట్లో వరంగల్లో కొట్టిపడేశాం… పాత్రికేయుడిగా అదొక కిక్కు…
Prasen Bellamkonda……. ఈనాడు విలేకరి రాలేదా, వచ్చాక ప్రెస్ మీట్ మొదలెడదాం… అనే అనుభవం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి ఈనాడేతర విలేకరినీ వేధిస్తూనే ఉంటుంది. ఈ చిరాకు గురించిన Murali Buddha పోస్ట్ ఈనాడు లేదా రామోజీ క్షీణ స్థితిని కళ్ళకు కడుతూ.. బాగుంది. ఈ మంట నాకూ ఉండేది. అదేంటి అలా ఎలా ప్రెస్ మీట్ ఆపుతారు అని నేను ఘర్షణ పడ్డ సందర్భాలూ ఉన్నాయి. అయినా మనం ఆఫ్ట్రాల్ ఆంధ్రభూమి ప్రతినిధి కావడంతో కేరెజాట్ […]
చైనా, బర్మా, పాకిస్థాన్… మణిపూర్ మంటలకు తలాపాపం తిలా పిడికెడు…
పార్ధసారధి పోట్లూరి ……… ఉత్తర ఈశాన్య రాష్ట్రం అయిన మణిపూర్ మండుతున్నది ! ఏదో మాట వరసకి మండుతున్నది అనే పదం వాడడం లేదు ! నిజంగానె మండుతున్నది ! May 3 న మొదలయిన ఘర్షణలు ఈ రోజుకి తీవ్ర రూపం దాల్చి చివరకి కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇవ్వాల్సిన స్థితిలోకి వెళ్ళిపోయింది మణిపూర్ రాష్ట్రం. మణిపూర్ లో ఉంటున్న కుకీ,నాగా, మెతీ తెగల ప్రజల మధ్య తీవ్ర ఘర్షణలు జరగడం వల్ల చివరికి కర్ఫ్యూ […]
నాకు ఎన్టీయార్ ఇంటర్వ్యూ దక్కింది… నా మిత్రుడికి బిర్యానీతో కడుపు నిండింది…
Murali Buddha……… అటు బిర్యానీ -ఇటు ఎన్టీఆర్ ఇంటర్వ్యూ ఓ జర్నలిస్ట్ కు మూడు కోట్ల రూపాయల పాఠం ఓ జ్ఞాపకం …. రాక్సీ లో నార్మా షేరర్ బ్రాడ్వే లో కాంచన మాల ఉడిపి శ్రీకృష్ణ విలాస్ లో – అటు చూస్తే బాదం హల్వా ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ … రెండింటిలో దేన్ని ఎంపిక చేసుకోవాలో శ్రీ శ్రీ కే కాదు ఎవరికైనా కష్టమే .. జర్నలిస్ట్ కే కాదు ప్రతి మనిషి […]
ఖమ్మంలో ఎన్టీయార్ భారీ విగ్రహం… ఎవరి ఆధిపత్య ప్రదర్శన కోసం మహాశయా..?
Gurram Seetaramulu………. ఒకప్పుడు ఈ దేశంలోకి వామపక్ష రాజకీయాలు బయలుదేరినప్పుడు ఈ దేశంలో పీడక కులాలే తమ ఇళ్ళల్లో ఆశ్రయం ఇచ్చాయి. నాయకత్వం కూడా పీడక కులాల చేతిలోనే ఉండేది. ఇది కేవలం ఒక్క ప్రాంతంలో జరిగిన కథ కాదు. ప్రతి ప్రత్యామ్నాయ మార్పు వెనక ఆధునికతను అర్ధం చేసుకున్న సమూహాలే ముందుకు వస్తాయి ఆ ఉద్యమాలకు వాన్ గార్డ్ లాగా ఉంటాయి. ఇలా పీడక కుల వాసన లేని చోట కూడా ప్రజాఉద్యమాలు పెల్లుబికాయి. అది బస్తర్ […]
ఈనాడు రిపోర్టర్ ఇంకా రాలేదా..? కాసేపు ఆగి ప్రెస్మీట్ స్టార్ట్ చేద్దాం…
Murali Buddha…….. ఈనాడు రిపోర్టర్ వచ్చాడా ? ఓ జ్ఞాపకం……. రెండు దశాబ్దాల క్రితం వరకు తన వృత్తి జీవితంలో ప్రతి జర్నలిస్ట్ ప్రతి రోజూ విన్న మాట ఇది … **** ఓ రోజు ఇంటికి రాగానే నా కోసం ఓ వ్యక్తి పరుగెత్తుకొచ్చి చేతిలో ఓ ఐడెంటిటీ కార్డు పెట్టాడు … కార్డు చాలా బాగుంది. నాణ్యతతో మెరిసి పోతుంది … అతను చదువుకోలేదు. అప్పుడప్పుడు డ్రైవర్ గా పని చేస్తాడు. ఏంటీ అని […]
పుతిన్ మీదకు డ్రోన్ల దాడి… జెలెన్స్క్ మీదకు మిసైళ్లు… పెద్ద తలలే టార్గెట్…
పార్ధసారధి పోట్లూరి …….. భౌతికంగా జెలెన్స్కీ ని అంతం చేయడమే రష్యా మొదటి లక్ష్యం ! రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ మీద డ్రోన్ దాడి జరిగింది నిన్న ! ఈ దాడి నేరుగా రష్యా అధ్యక్షుడిని హత్య చేసే ప్రయత్నంగా భావిస్తున్నామని రష్యన్ మిలటరీ ఉన్నతాధికారి ప్రకటించాడు! ప్రతిగా రష్యన్ స్పెషల్ ఫోర్స్ కమాండోలు ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదోమిర్ జెలెన్స్కీ ని చంపడమే లక్ష్యంగా ఉక్రెయిన్ లోకి [రష్యా ఆక్రమిత ప్రాంతం ] లోకి […]
వేటగాడు ఇప్పుడు జంతుప్రేమికుడు… అరుదైన జాతులకు సంరక్షకుడు…
వేటగాణ్ని ప్రేమికుడిగా మార్చిన వేక్ అప్ కాల్ కథ! బోయవాని వేటుకి గాయపడిన కోయిల పాట వింటుంటే.. వేటగాడిదెంత కరుడుగట్టిన మనస్తత్వం అనిపిస్తుంది కదా! కానీ, ఓ పక్షి వేటనంతరం.. ఓ కరడుగట్టిన వేటగాడి హృదయం చలించి.. మనిషిగా మారి… ఆ మహనీయుడే ఎన్నో జీవుల పాలిట దేవుడయ్యాడు. కోహిమాకు చెందిన రువుటో బెల్హో వేకప్ కాల్ స్టోరీలోకి ఓసారి విహంగ వీక్షణమై తెలుసుకుని వద్దాం పదండి. భక్షకుడు-రక్షకుడయ్యాడు 64 ఏళ్ల రువుటో బెల్హో. నాగాలాండ్ లోని […]
tv9 రజినీకాంత్కు జనం నాడి తెలుసా..? వెంకట్రావు చానెల్పై ఓ జ్ఞాపకం…
Murali Buddha….. జనం నాడి తెలిసిన జర్నలిస్ట్ – టివి 9…. యజమానుల నాడియే జనం నాడి… ఓ జ్ఞాపకం సోడాబుడ్డి కళ్లద్దాలు , పెరిగిన గడ్డం , లాల్చీ, పైజామా … ఇదీ పాత తెలుగు సినిమాల్లో జర్నలిస్ట్ అనగానే కనిపించే రూపం .. జనం మనసుపై ఈ ముద్ర బలంగా పడిపోయింది. ఓసారి విశ్వనాథ్ ఆనంద్ ను ఒకరు ఏం చేస్తావ్ అని అడిగితే చెస్ ప్లేయర్ ను అని చెప్పాడట … చెస్ ఆడుతావు […]
బాబాలకూ కనిపించని బాధలేవో ఉంటయ్… కోటరీల బందిఖానాల్లో బతుకులు…
Murali Buddha…….. వ్యతిరేకంగా రాయండి ప్లీజ్ ….బాలసాయిబాబా…….. ఓ జ్ఞాపకం …. మ్యూజియంలో ఓ పుర్రెను చూసి విద్యార్థులు ఆసక్తిగా అడిగితే గైడ్ అది హిట్లర్ పుర్రె అని చెబుతాడు … మరో చిన్న పుర్రె కనిపిస్తే అది హిట్లర్ చిన్నప్పటి పుర్రె అంటాడు … ఇది చిన్నప్పుడు చదివిన జోక్ … ఈ జోక్ ప్రాణం పోసుకొని కళ్ళ ముందు కనిపిస్తే ? 1987లో ఆంధ్రభూమి రిపోర్టర్ గా సంగారెడ్డిలో … అప్పుడే అయూబ్ ఖాన్ […]
ప్రజాస్వామిక సర్పయాగం అనబడు కన్నడ పాముల కథ…
Snake – Sentiment: తమిళంలో “గరుడా! సౌఖ్యమా?” అని ఒక సామెత. పద్నాలుగు లోకాల్లో ఆగకుండా తిరిగిన విష్ణు మూర్తి వైకుంఠంలో దిగి…తన వాహనం గరుత్మంతుడికి వీక్లి ఆఫ్ సెలవు ఇచ్చాడు. మనోవేగం కంటే వేగంగా తిరగడంతో ఒళ్లు వేడెక్కింది…అలా చల్లగా హిమాలయాల కూల్ కూల్ కులూ మనాలి కాశ్మీర పర్వత సానువుల రిసార్టులో సేద తీరుదామని బయలుదేరాడు గరుత్మంతుడు. పైన దూది కొండల్లాంటి చల్లటి మేఘాలు, కింద వెండి కొండల్లాంటి మంచు పర్వతాలు. ప్రకృతి పరవశ గీతం పాడుతోంది. గరుత్మంతుడు ఒళ్లు […]
బంగారం కూడా తినేస్తున్నాం… మన ‘ఘన ఖనిజ ఆహార వైభోగం’ అట్లుంటది మరి…
Eatable Gold: “లక్షాధికారి అయినా లవణమన్నమె కానీ… మెరుగు బంగారంబు మ్రింగబోడు” అని ధర్మపురి నరసింహ స్వామి గుడి మెట్ల మీద కవి శేషప్ప కొన్ని శతాబ్దాల క్రితం అమాయకంగా అనుకున్నాడు. లక్షాధికారులు మెరుగు బంగారం మింగబోయే రోజులొస్తాయని కవి శేషప్ప ఊహించి ఉండడు. ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం పూతరేకులకు పెట్టింది పేరు. అక్కడి పూతరేకుల తయారీ రాకెట్ సైన్స్ కంటే గొప్పదని అనాదిగా కథలు కథలుగా లోకం చెప్పుకుంటోంది. చక్కర, బెల్లం, ఖర్జూరం, డ్రయి […]
- « Previous Page
- 1
- …
- 80
- 81
- 82
- 83
- 84
- …
- 119
- Next Page »