Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

యాంకర్ అనసూయమ్మ గారూ… మొత్తానికి మీరు మారిపోయారు మేడమ్…

July 15, 2024 by M S R

anasuya

యాంకర్ అనసూయ… ఇప్పుడలా అనకూడదేమోనట కదా, సరే, రంగమ్మత్త అనసూయమ్మ గారూ… మీరు మారిపోయారు మేడమ్ అని నెటిజనం హాశ్చర్యపోతున్నారు… నిజం… ఆమె అనసూయేనా అని నాలుగుసార్లు సదరు ట్వీట్ ఖాతాను ఫ్రెష్ కొట్టీ కొట్టీ చెక్ చేస్తున్నారు… విషయం ఏమిటంటే..? అనసూయ అంటేనే ఓ ఫైర్ కదా… అంటే పుష్ప బాపతు ఫైర్ కాదు… సోషల్ మీడియాలో తన మీద చిన్న వాక్యం నెగెటివ్‌గా కనిపించినా, అనిపించినా వెంటనే సదరు ట్రోలర్‌ను తిట్టేస్తుంది… చాకిరేవు పెడుతుంది […]

సరిపోదా శనివారం..! అవును, ఇదీ ఓ సినిమా కథలాగే ఉంది…!!

July 15, 2024 by M S R

snake

ప్రతి శనివారం… అవును, మల్లాది నవల ‘శనివారం నాది’లో నెగెటివ్ షేడ్స్ ఉన్న ఓ వ్యక్తి ప్రతి శనివారం ఏదో ఓ దుర్ఘటనకు పాల్పడుతుంటాడు… సరిపోదా శనివారం అని ఓ సినిమా వస్తోంది, హీరో నాని… ఆ మల్లాది నవల కథనే ఈ సినిమా కథ కావచ్చుననే సందేహాలు కూడా వినవస్తున్నాయి… ఈ శనివారం సెర్చింగులో మరో ఇంట్రస్టింగ్ కథ కనిపించింది… కథ అని ఎందుకంటున్నానో కథ మొత్తం చదివాక మీకు తెలుస్తుంది… ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్… వికాస్ […]

మా కార్లకు బ్లూ బుగ్గలు, కుయ్ కుయ్ సైరన్ల పర్మిషన్లు ఇవ్వగలరు…

July 15, 2024 by M S R

ias

గౌరవనీయ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి మరియు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రివర్యుల దివ్యసముఖమునకు- మరియు ఏ శాఖలకు మా సమస్యలు వరిస్తాయో ఆయా శాఖల మంత్రులకు- ముఖ్యమంత్రులకు- ప్రధానికి- ఊరూ పేరూ లేని సగటు భారతీయ నాలుగు చక్రాల వాహనాల యజమానులు వ్రాసుకొను బహిరంగ లేఖార్థములు. మహారాష్ట్ర పూనాలో ఒకానొక శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారిణి తన సొంత అత్యంత విలాసవంతమైన ఆడి కారుకు మహారాష్ట్ర ప్రభుత్వ లోగోను, అధికారిక బ్లూ బుగ్గను పెట్టుకున్న […]

భాషిణి..! పరభాష అడ్డంకుల్ని అధిగమింపజేసే ఓ కొత్త యాప్…!

July 14, 2024 by M S R

translation

టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో హోటల్లో దిగగానే పెట్టెలు తెచ్చి ఒకబ్బాయి రూములో పెట్టాడు. ఊరికి కొంచెం దూరంగా సముద్రంలో చేరడానికి ముందున్న నదికి అభిముఖంగా పర్వతపాదం మీద ఉన్న ప్రశాంతమైన, అందమైన హోటల్ అది. టర్కీ నగదు లిరా కొద్దిగా అయినా లేదు. కరెన్సీ ఎక్స్ చేంజ్ కు ఎక్కడికెళ్లాలి? ఇక్కడి నుండి ఊళ్లోకి వెళ్లడానికి రవాణా ఎలా? అని ఆ అబ్బాయిని హిందీలో అడిగితే అర్థం కానట్లు అయోమయంగా మొహం పెట్టాడు. ఇంగ్లీషులో అడిగితే అలాగే […]

సెన్సేషనల్ యూట్యూబర్ ధృవ్ రాఠీపై కేసు… కానీ ఈ కేసులో ట్విస్టు వేరే…

July 13, 2024 by M S R

rathee

ధృవ్ రాఠీ… పర్యావరణం, పర్యాటకం తదితరాంశాలపై తన వీడియోల మాటెలా ఉన్నా… వర్తమాన రాజకీయాలపై పెట్టే వీడియోలు మాత్రం సెన్సేషన్… 2 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు, ఆల్రెడీ 3 కోట్ల వీక్షణలు… మామూలు సక్సెస్ స్టోరీ కాదు తనది… ట్రెమండస్ హిట్… మొన్నామధ్య అమెరికాలో కొందరి ఇళ్లకు వెళ్లినప్పుడు వాళ్ల ఇళ్లల్లో కూడా ఈయన వీడియోల పట్ల విపరీతమైన ఆరాధన చూసి ఆశ్చర్యమేసింది… వోకే, ఒపీనియన్ బేస్డ్ వీడియోలే… తప్పులేదు, పక్కగా తన వాదనకు తగిన చార్టులు, […]

ఆర్గానిక్ స్వీట్ల దందా..! వేలాది మంది నమ్మారు… తీరా కట్ చేస్తే…?

July 13, 2024 by M S R

emerald

వజ్రం లాంటి పేరు… వంచన తీరు? సామాజిక సేవ పేరుతో వ్యవస్థల్ని లోబరచుకోవడo ఆధునిక వ్యాపార సూత్రo.. “యమ”రాల్డ్.. ఈ సంస్థ యజమాని.. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో అంటే సుమారుగా 2001-02 సంవత్సరం కాలంలో నాకు పరిచయం. నాల్గు అక్షరం ముక్కలు తప్ప పొట్ట పోసుకోవడానికి మరేమీ తెలీని నాకు అప్పట్లో కాపీ రైటింగ్ అవకాశం ఇచ్చారు. కనీసం 2, 3 గంటలు నా చేత క్యాప్షన్స్ రాయించుకుని రూ.100, రూ.200 చేతిలో పెట్టి పంపేవాడు. […]

24 ఏళ్ల సర్వీసు… 25 బదిలీలు… నాలుగు సార్లు ఏసీబీ దాడులు…

July 13, 2024 by M S R

employee

ప్రభుత్వ ఉద్యోగం ముఖ్యంగా గ్రూప్ 2A వంటి ఉద్యోగాల్లో చేరే అధికారుల ఉద్యోగ జీవితం చాలా క్లిష్టమైనది. ఎందుకంటే, ఆ అధికారి పైన ప్రభుత్వ హయరార్కీలో అనేక మంది అధికారులు ఉంటారు. ఉదాహరణకు, మా డిపార్టుమెంటులో ఏసీటీవో ఉద్యోగమే తీసుకుంటే, ఒక సర్కిల్లో ఏసీటీవో పైన డీసీటీవో, సీటీవో ఉంటారు. డివిజన్ స్థాయిలో డిప్యూటీ కమీషనర్ ఉంటారు. డీసీ ఆఫీసులో అనేక మంది అధికారులు పని చేస్తుంటారు. కొత్తగా చేరిన ఏసీటీవో అదృష్టం కొద్దీ తన పై […]

ఏటా లక్షకు 12 మంది… పెరిగిన ఆత్మహత్యలు మరో సామాజిక విపత్తు…

July 13, 2024 by M S R

suicide

జీవితం అంటే గెలుపు; జీవితమంటే సుఖం; జీవితమంటే శిఖరారోహణం… అని మన నరనరాన ఎక్కించుకున్నాం. జీవితమంటే ఎడతెగని ప్రయాణం. గెలుపోటములు, ఎగుడు దిగుళ్లు, కష్టనష్టాలు సహజం అని అర్థం చేసుకోవడం ఎప్పుడో మానేశాము. దూరం బాధిస్తున్నా…పక్షి విశ్వాసం రెక్కలు విప్పుతూనే ఉంటుంది. అలలను సవాలు చేసి…చేప పిల్ల ఈదుతూనే ఉంటుంది. గ్రీష్మంలో ఎండిన కొమ్మే చైత్రంలో చిగురించి…ప్రకృతికి పట్టు చీరల సారె పెడుతుంది. మావి చిగురుకోసం కోయిల నిరీక్షిస్తూ ఉంటుంది. కోయిల పిలుపు కోసం మావి కొమ్మ […]

టమాట… వంటల్లో ఇది ఎందుకు తప్పనిసరి అవసరమంటే..?

July 13, 2024 by M S R

tomato

మన శరీరపు సూపర్ హీరో – టమాటా… మొన్నా మధ్య ఆగస్ట్ 21,2023 న సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్సన్ (CDC) సంస్థ ఈ భూమి మీద టమాటాని మించిన ఫ్రూట్ లేదు అని చెప్పింది. CDC అంటే అమెరికా జాతీయ పబ్లిక్ హెల్థ్ సంస్థ. ఆరోగ్యానికి సంబంధించి సైన్స్ పరంగా డేటాని ఎనలైజ్ చేయటంలో దీనికి మించినది ఎక్కడా లేదు. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే – మన శరీరంలో ఉన్న ఫ్రీ […]

అవునూ… పోయి పోయి మరీ ఆషాఢంలో ఈ అంబానీ వారింట పెళ్లేమిటో…!!

July 13, 2024 by M S R

ambani

ఒక మిత్రుడు అడిగాడు ముఖేష్ అంబానీ గారు ఏంటి తన చిన్న కొడుకు పెండ్లి ఆషాఢ మాసంలో చేశాడు అని. అందరికీ తెలిసిన విషయమే, ఇంకా గతంలో గరికపాటి నరసింహారావు గారు కూడా క్లియర్ గా చెప్పారు. ఆషాడంలో (జూలై నెలలో) పెండ్లి చేస్తే, గర్భధారణ జరిగితే, 9 నెలలు తర్వాత వచ్చే ఏడాది ఏప్రిల్/మే నెల ఎండలు ఎక్కువ ఉండే సమయంలో పిల్లలు పుడితే, పూర్వపు రోజుల్లో కన్వీనియంట్ గా ఉండేది కాదు, అందుకే పూర్వీకులు […]

మాకు మిగిలినవి జ్ఞాపకాలు, కన్నీళ్లు… గోడ మీద వేలాడే వాడి ఫోటో…

July 13, 2024 by M S R

smriti

కెప్టెన్ అంశుమన్ సింగ్… గత జులైలో సియాచిన్ అగ్నిప్రమాదంలో పలువురిని రక్షించి తన అమరుడైన మెడికల్ ఆఫీసర్… ప్రభుత్వం కీర్తిచక్ర ఇచ్చింది… దాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన భార్య స్మృతి సింగ్ అందుకుంది కన్నీళ్లతో… చిన్న ఏజ్‌లోనే భర్తను కోల్పోయిన ఆమె ఫోటో చూసి చిల్లర వ్యాఖ్యలకు దిగారు కొందరు నెటిజన్లు… సరే, అదొక దరిద్రం మన సమాజంలో… సరే, ఆయన తల్లిదండ్రుల బాధ జాతీయ మీడియాలో కనిపించింది… (మన తెలుగు మీడియా […]

వర్చువల్ దర్శనాలు- డిజిటల్ పూజలు… ఆన్‌లైన్‌లోనే ఆశీస్సులు…

July 13, 2024 by M S R

E darsan

వర్చువల్ దర్శనాలు- డిజిటల్ పూజలు……. స్థూలకాయుడైన వినాయకుడిని గణాధిపతి కావాలంటే ముల్లోకాల్లో ఉన్న నదుల్లో స్నానం చేసి రావాలన్నారట. తాను అశక్తుడనని ఆదిదేవుని ప్రార్థిస్తే… తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేస్తే చాలని వరమిచ్చారట. ఫలితంగా కుమారస్వామికి ప్రతి నదిలోనూ తనకన్నా ముందే స్నానం చేసి వెళ్తున్న వినాయకుడు కనిపించాడు. దాంతో తానే ఓటమి ఒప్పుకొని అన్నగారికే విఘ్నాధిపత్యం ఇవ్వమంటాడు. ప్రతి యేటా వినాయకచవితికి చదివే కథే. అంతర్లీనంగా తల్లిదండ్రుల పట్ల పిల్లలకు ఉండాల్సిన భక్తి, అన్నదమ్ముల మధ్య పోటీ, […]

ఎప్పుడో మరణించినా వదిలేట్టు లేరు… వ్యంగ్యమేది..? బాబు భజన తప్ప..!!

July 12, 2024 by M S R

eenadu

ఫాఫం… మాకిరెడ్ది అనబడే ఔత్సాహిక కార్టూనిస్టును అనాల్సిన పనేమీ లేదు… పత్రిక ఎడిటోరియల్ లైన్ ఏమిటో, పొలిటికల్ దాస్యం ఏమిటో దానికే కట్టుబడి కార్టూన్లు గీయాలి కదా… లేకపోతే ఈనాడు నుంచి తరిమేస్తారు కదా… అంతటి శ్రీధరుడినే పంపించేశారు, ఈ కొత్త కార్టూనిస్టులు ఎంత..? విషయం ఏమిటంటే..? పత్రిక కథనాలకు దీటుగా కార్టూన్లు కూడా నాసిరకంగా తయారయ్యాయని చెప్పడమే… అప్పుడంటే రామోజీరావు స్వయంగా పత్రిక వ్యవహారాలను చూసుకుంటున్నప్పుడు తను స్వయంగా శ్రీధరో, పాపా కార్టూనిస్టో రోజుకు పది […]

రాహుల్ ద్రవిడ్ గొప్ప సంస్కారం… సీఎం నితిశ్ వింత నమస్కారం…

July 12, 2024 by M S R

news

ద్రవిడ్ సంస్కారం…  నిన్న పత్రికల్లో రెండు మంచి వార్తలు. లోపలెక్కడో అప్రధాన వార్తలుగా వచ్చినా… విషయప్రాధాన్యం ఉన్న వార్తలు. రాహుల్ ద్రవిడ్ పెద్ద మనసు రాహుల్ ద్రవిడ్ క్రీడాకారుడిగా ఎన్ని మ్యాచులాడాడు? ఎన్ని ఓడాడు? ఎన్ని మ్యాచులను ఒంటి చేత్తో గెలిపించాడు? ఎన్ని గెలుపుల్లో అతడి వాటా ఎంత? లాంటి చర్చల స్థాయిని ఏనాడో దాటేశాడు కాబట్టి ఇప్పుడు ఆ క్రీడా చర్చలు అనవసరం. పోతపోసిన సంస్కారంగా, మన పక్కింటి మధ్యతరగతి మనిషిగా ద్రవిడ్ ను చూసి నేర్చుకోవాల్సింది […]

ఆయన సినిమాల టాక్స్ ఆఫీసరు… ఆయన రిక్షా వెంబడి మా పరుగులు…

July 11, 2024 by M S R

entertainment

చిన్నప్పటి నుండి సినిమాలంటే మహా పిచ్చిగా ఉండేది. సినిమా అంటే, మా నాన్న తన్నే వాడు. ఇప్పటిలాగా అప్పట్లో అడ్వాన్స్ బుకింగులు ఉండేవి కావు. ఏ సినిమాకైనా బుకింగ్ కౌంటరు ముందు యుద్ధం చేయాల్సిందే, చొక్కాలు చింపుకోవాల్సిందే, చొక్కా చింపుకున్నందుకు ఇంట్లో తన్నులు తినాల్సిందే. సాధారణంగా నెలకు ఒక ఇరవై రోజులైనా అమ్మతోనో, నాన్నతోనో తన్నులు తప్పేవి కాదు. మా చెల్లెలు క్లాస్ మేట్ సుజాత అని ఒకామె ఉండేది. వాళ్ళన్నయ్య బాబురావు అని వరంగల్ సేల్స్ […]

నీతిబోధ సరే… మరి ఈ అక్రమం మాటేమిటి జీరో టాలరెన్స్ భారతీయుడా..?!

July 11, 2024 by M S R

indian2

ఒక విమర్శ కనిపించింది ఆన్‌లైన్‌లో… తెలుగువాళ్లు భారతీయుడు-2 సినిమా చూడాలంటే 350 చెల్లించాలి ఒక్కొక్కరికి… సరే, పాప్ కార్న్, సమోసా, సాఫ్ట్ డ్రింక్స్, పార్కింగు మన్నూమశానం సరేసరి… తమిళనాడులో (తమిళ సినిమా) చూడాలంటే 190 చెల్లిస్తే సరి… అఫ్‌కోర్స్, ఇతర దోపిడీలు అక్కడా ఉంటాయి… నిజమే కదా… అసలు టికెట్ల రేట్లు పెంపునకు ఎందుకు ప్రభుత్వాలు అవకాశం ఇవ్వాలి..? ఇదీ అసలు ప్రశ్న… పేరుకు భారతీయుడు సినిమా అవినీతి పట్ల జీరో టాలరెన్స్ అట… మరి ఈ […]

హబ్బ… హేం చెప్పితిరి బాబయ్యా… పార్టీ జవజీవాలకు నెత్తుటి భరోసా..!!

July 10, 2024 by M S R

cbn

ఆంధ్రప్రభలో కనిపించింది వార్త… మరి ఇతర పచ్చ ప్రధాన పత్రికల్లో కనిపించినట్టు లేదు గానీ… పదే పదే కుటుంబ పార్టీగా ముద్రలు పడినా సరే, నష్టమేమీ లేదు, అలాగే కనిపిద్దాం పర్లేదనే చంద్రబాబు ధోరణి మరోసారి స్పష్టంగా కనిపించింది… అది ఏపీలో అయినా సరే, తెలంగాణలో అయినా సరే, రేప్పొద్దున జాతీయ స్థాయికి పెరిగినా సరే… అవును, ఇప్పటికీ తమది జాతీయ పార్టీ అనే చెప్పుకుంటుంది కదా తెలుగుదేశం పార్టీ… సరే, ప్రభ వార్తను బట్టి… తను […]

తరాలు మారుతున్నా సరే… రష్యాలో ఇండియన్ పాటలే ఈరోజుకూ పాపులర్…

July 9, 2024 by M S R

jimmy

ఒక వార్త… ఇండియాటుడే ప్రత్యేక కథనం అది… మోడీ రష్యా పర్యటనకు వెళ్లాడు కదా… పుతిన్ ప్రభుత్వం, రష్యన్ సమాజం ఘనంగా స్వాగతించాయి… కాలపరీక్షకు నిలిచిన స్నేహం మనది అని ఇద్దరు అధినేతలూ ఆలింగనం చేసుకున్నారు సరే… ఈ సందర్బంగా ఆ మీడియా ఓ ఆసక్తికరమైన కథనాన్ని ప్రజెంట్ చేసింది… అదేమిటీ అంటే..? ఒకప్పుడు రష్యన్ల మనస్సుల్ని గెలుచుకున్న ఇండియన్ సినిమా మ్యూజిక్ ఇప్పటికీ అలాగే అలరిస్తోందా..? ఇదీ టాపిక్… ముందుగా ఆ కథనంలో నాకు కనెక్టయిన […]

హవ్వ… ఇదా ఎన్టీయార్ వంటి ప్రసిద్ధ హీరో పాత్ర ఔచిత్యం..?

July 9, 2024 by M S R

deeksha

దీక్ష… ఈ సినిమా లవర్సుకు ఈ సినిమా గుర్తు ఉండిపోవటానికి ముఖ్య కారణం ఒకే ఒక్క పాట . సి నారాయణరెడ్డి వ్రాసిన పాట . మెరిసే మేఘమాలికా ఉరుములు చాలు చాలికా అనే చాలా చాలా శ్రావ్యంగా ఉండే పాట . సూరజ్ అనే హిందీ సినిమాలోని బహారో ఫూల్ బరసావో మేరా మెహబూబ్ ఆయా హై ట్యూన్ తో పెండ్యాల ఈ పాటను తయారు చేసారు . బాల సుబ్రమణ్యం కూడా పాటకు తగ్గట్లు […]

డాక్టర్ సాయిపల్లవి..! తను ప్రాక్టీస్ చేయవచ్చా… చదవాల్సిన స్టోరీ..!!

July 8, 2024 by M S R

saipallavi

ఈ చెత్త ఇండస్ట్రీలో కూడా కొన్ని విలువలు పాటించే సాయిపల్లవి అంటే అందరికీ అభిమానమే… పైగా ఇప్పుడు సీత కేరక్టర్ చేస్తుండటం ఆమెకు ఓ వరం… సరే, దాన్నలా వదిలేస్తే… ఈరోజు బాగా ఫోటోలు, వార్తలు కనిపిస్తున్నాయి… ఏమిటీ అంటే… ఆమె డాక్టర్ పట్టా అందుకుంది, ఇంకేం ఆమెను డాక్టర్ సాయిపల్లవి అని పిలవాలి… ఆమె ప్రాక్టీస్ చేయడానికి అంతా రెడీ అని…! తప్పు..!! ఎందుకో తెలియాలీ అంటే కాస్త మెడికల్ ఫీల్డ్ గురించి తెలియాలి… అదేనండీ […]

  • « Previous Page
  • 1
  • …
  • 85
  • 86
  • 87
  • 88
  • 89
  • …
  • 141
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • మళ్లీ ఓ చిరంజీవి రెట్రో లుక్కు… జోడీగా ఇదే నయనతార… ఏమిటది..?!
  • హైడ్రోజన్ రైల్..! ఈ పైలట్ రన్స్ గనుక సక్సెసైతే… రవాణా విప్లవమే..!!
  • ‘‘తెలంగాణ వ్యతిరేకులతో కలిసొస్తాం.., కాస్త కరుణించి వోట్లేయండి ప్లీజ్..!!
  • జూ..లకటక..! మతాంతర పెళ్లిళ్ల సినిమా కథలు అందరూ తీయలేరు..!!
  • అమెరికా మైక్రోవేవ్, సోనిక్ వెపన్స్ వాడిందా..? అసలు అవేమిటో తెలుసా..?!
  • హై-ప్రొఫైల్ వ్యక్తులో బోల్తాపడుతున్నారు – జేడీ లక్ష్మినారాయణ ఎంత..?!
  • పండుగ వాసనల్లేని… రెండు ముదురు బెండకాయల సంక్రాంతి షో..!!
  • అనిల్ రావిపూడి ‘మన శివశంకర ప్రసాద్ గారిని’ పాస్ చేసేశాడు..!!
  • జగన్ వ్యాఖ్యల్ని సొంత మీడియాయే ఎందుకు దాచిపెట్టినట్టు..!?
  • టీవీ న్యూస్..! వార్తల విశ్వసనీయతను చంపేస్తున్న వేగం…! ఓ ఉదాహరణ..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions