ఇప్పుడు ఈనాడు రిపోర్టర్ ఎవరైనా సరే… ఎంతటి పెద్దమనిషి ఇంటర్వ్యూకు వెళ్లినా సరే… జో బైడన్ అయినా సరే, ప్రధాని మోడీ అయినా సరే, రష్యా ప్రధాని పుతిన్, చైనా బాస్ జిన్పింగ్ అయినా సరే… ఫస్ట్ అడగాల్సిన ప్రశ్న… ‘‘మార్గదర్శిపై జగన్ దాడులపై మీరేమంటారు..? ఖండిస్తారా..?’’ వీళ్లనే యాజమాన్యం మనసెరిగి నడుచుకునే ఉద్యోగులు అంటారు… ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే..? మార్గదర్శి మీద జగన్ సర్కారు దాడుల తరువాత ఎవరు ఖండిస్తే వాళ్ల వార్తలు ఈనాడులో […]
పూరీ మాత్రమే కాదు… అహ్మదాబాద్, మహేశ్ రథయాత్రలూ దీటైనవే…
20 జూన్, 2023 పూరీ రథయాత్ర సందర్భంగా… (డా. వైజయంతి పురాణపండ) వేసవి వెనుకబడి తొలకరి జల్లులు కురుస్తున్న సమయంలో జగన్నాథ రథయాత్ర వైభవంగా ప్రారంభమవుతుంది. బలభద్రుడు, సుభద్ర, శ్రీకృష్ణుడు వేడుకగా విహారయాత్రకు బయలుదేరతారు. దివ్యరథాల మీద పూరీ దేవాలయం నుంచి, స్వగ్రామంలో తోటలో కొలువుతీరిన భవంతికి చేరుకుంటారని భారతీయుల విశ్వాసం. ఆ కారణంగానే ఈ యాత్రను శోభాయమానంగా, పవిత్రంగా నిర్వర్తిస్తారు. జగన్నాథుడిని విష్ణుమూర్తి అవతారంగా ఆరాధిస్తారు. ఒరిస్సాలోని పూరీ గ్రామంలో జగన్నాథుడు కొలువుతీరి ఉన్నాడు. జగన్నాథుడు, […]
పాలిటిక్స్ అంటే అంతే… ఫ్యాక్షన్లు, కులాలు, మతాల సమీకరణాలు…
Siva Racharla ………. నీ శత్రువే శాశ్వతం కానప్పుడు యుద్ధం, విజయం శాశ్వతం ఎందుకు అవుతుంది?. అంతిమ యుద్ధం అంటూ ఏమీ ఉండదు! రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు అని కాలం మళ్ళీ మళ్ళీ నిరూపిస్తుంది. ఫ్యాక్షన్ అన్న మాట రాయాలన్నా నాకు మనసు రాదు కానీ పశ్చిమ కర్నూల్ ప్రాంతంలో మూడు దశాబ్దాల ఫాక్షన్ లో ఎంతోమంది చనిపోయారు. కేవలం ఒక మండల నాయకుడు “కప్పట్రాళ్ల” వెంకటప్పయ్యనాయుడు నడిపిన ఫ్యాక్షన్ లో ఎంతమంది చనిపోయారో […]
పాపం పాపారావు… ఇల్లు కొన్నాడు… ఇది సర్రియల్ ఎస్టేట్…
House-Wish: పాపం పాపారావు. భార్య పోరు భరించలేక…కొన్ని ఆదివారాలను ఇల్లు కొనడానికి అన్వేషణకోసం కేటాయించాడు. పాపారావు పేరే పాతగా ఉంటుంది కానీ ఆయన ఉద్యోగం చాలా ట్రెండీగా ఉంటుంది. సాఫ్ట్ వేర్ కొలువు. భార్య కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగే. ఇద్దరికీ కలిపి రెండు లక్షల నెల జీతం చేతికి వస్తుంది. పెళ్లయి నాలుగేళ్లయింది. ఏడాది పాపతో పాపారావు ఇల్లు కళకళలాడుతూ ఉంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు సహజంగా అలవడే శని, ఆదివారం అర్ధరాత్రి అలవాట్లు భార్యా భర్తలకు లేకపోవడంతో ఆ ఇంట్లో […]
మెగాబాబు లేదా మెగాపాప… ఓహో, మంచిరోజు చూసే ప్రసవం ఫిక్స్ చేశారన్నమాట…
టీవీ9 వాడికైతే మరీనూ… పిల్లొచ్చినా పిత్తొచ్చినా అపురూపమే… సమాచార సంచలనమే… హీరో రాంచరణ్, ఉపాసన దంపతులకు రేపు మార్నింగ్ 6.30 గంటలకు సంతానమట… ఇదొక మెగా ఈవెంట్ అన్నట్టుగా టీవీ9 వాడు ఎగబోసుకుంటూ వార్తల మీద వార్తలు ఇస్తున్నాడు… జనం రెండో ప్లేసులో కూర్చోబెట్టినా ఇంకా బుద్ధి ప్రసవించలేదు…సూపర్ ఎక్స్క్లూజివ్ అట… రెడీగా ఉండాలట… హాస్పిటల్ నుంచే ఉదయం నుంచే ప్రత్యక్ష ప్రసారమట… పాపం శమించుగాక… హాస్పిటల్ లోనికి వెళ్లకండిరా నాయనా… దీనిపై Abdul Rajahussain సార్ రాసిన ఓ […]
తెలంగాణలో బీజేపీ ఆశలు గల్లంతు
గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ సాధించిన ఎమ్మెల్యే సీట్లు ఎన్ని? ఒక్కటంటే… ఒక్కటి! రాజా సింగ్ మాత్రమే తన స్వంత బలంతో ఓల్డ్ సీటీలో గెలిచాడు. మిగతా అన్ని చోట్లా కాషాయం కొట్టుకుపోయింది. అయితే, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు ఎంపీ సీట్లు రావటంతో కమలం క్యాంపులో కాస్త కళ వచ్చింది. రాజా సింగ్ కు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ తోడవ్వటంతో టీ అసెంబ్లీలో బీజేపీ బలం ‘ఆర్ఆర్ఆర్’ అయింది! అయినా […]
అప్పట్లో శేషన్… తరువాత అంతటి సిన్సియర్ ఎలక్షన్ రిఫార్మిస్ట్ ఎవరో తెలుసా..?
Murali Buddha ఎంఐఎం అసదుద్దీన్ ను హడలెత్తించిన కొండయ్య … జర్నలిస్ట్ జ్ఞాపకాలు ————– ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు తెలంగాణలోనైనా ఫలితాలు ఎలా ఉండవచ్చు అని రకరకాలుగా చెబుతారు కానీ పాత నగరంలోని నియోజకవర్గాల ఫలితాల విషయంలో అందరిలో ఏకాభిప్రాయం ఉంటుంది . పాతనగరం సీట్లను యంఐయం పార్టీకి వదిలేసి లెక్కలు చెబుతారు . అలాంటిది యంఐయం నేత అసదుద్దీన్ ఒవైసి సైతం హడలిపోయేట్టు చేశారు ఒకరు . ఎవరు అమానుల్లా ఖానా ? అంటే.. . […]
ఓం రౌత్ సరిగ్గా కునుకు తీసి ఉంటే… ఆదిపురుష్ ఇంకాస్త బాగుండేదేమో…
Sleep Well: నిద్ర పట్టని ప్రపంచం నిద్రకోసం నిద్రాహారాలు మాని నిరీక్షిస్తోంది. కొన్ని సెకెన్లు కాగానే కనురెప్పలు అసంకల్పితంగా పడడానికి వీలుగా కనురెప్పల వెనుక తడి ఉంటుంది. కంటి తడి లేకపోతే శాస్త్రీయంగా కనుగుడ్డుకు రక్షణ ఉండదు. గుండెతడి లేకపోతే మనిషికి విలువ ఉండదు. కను రెప్ప వేసే కాలమే నిమిషం. దేవతలకు మనలాగా కనురెప్పలు పడవు కాబట్టి వారు అనిమేషులు. కనురెప్ప పడినంత సహజంగా, వేగంగా నిద్ర పట్టాలి. కానీ- ఇది చెప్పినంత సులభం కాదు. కొందరు నిద్రకోసం […]
రెండేళ్ళు గడిచాక నువు నాలుగో తరగతి పాసయ్యావు పొమ్మన్నాడు పెద్దాయన…
Taadi Prakash…… అది నివ్వెరపోయేంత నిజాయితీ Mohan On Our Father Tadi Appalaswamy —————————————————————– తెలంగాణసాహిత్య పత్రిక ‘పాల పిట్ట’ 2014 నవంబర్ సంచిక ఆర్టిస్ట్ మోహన్ special issue గా వచ్చింది. అందులో మా నాన్న తాడి అప్పలస్వామి గురించి మోహన్ ఒక వ్యాసం రాశాడు. ఈ మధ్య కార్ల్ మార్క్స్ పుట్టిన రోజున నా వ్యాసం లో మా నాన్న గురించి రాసింది చదివి, ఆయన వివరాలు మరిన్ని తెలిస్తే బావుంటుందని కొందరు […]
రాజశేఖర్ రెడ్డి కల భట్టీ నెరవేరుస్తున్నాడా?
గంగా నది మన దగ్గరకు రాదు. వేల మైళ్లు ప్రయాణించి అయినా మనమే గంగ దగ్గరికి వెళ్లాలి. ప్రజాస్వామ్యంలో జనమే… గంగా ప్రవాహం లాంటి వారు! వాళ్ల మధ్యకి వెళ్లి కలిసి నడిచిన వారే జన నేతలు అవుతారు! ‘జనం మధ్యలో జన నేత’ అంటే మనకు ఎవరు గుర్తుకు వస్తారు? పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా తెలుగు వారందరికీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కళ్ల ముందు కదలాడతారు! తలపై పాగా, తెల్లటి పంచె, స్వచ్ఛతలో ఒక దానితో […]
ఎన్ని జ్ఞాపకాలని నెమరేసుకోను నాన్నా… అవి అనంతం కదా…
నాన్నా! ఈ పిలుపులో తీయదనం అనుభవించేవారికే తెలుస్తుంది. ఒకరోజు ఒక లక్ష మాటలు మాట్లాడితే అందులో 90 వేల సార్లు వచ్చే పదం… నాన్నా!. నిజం నాన్నా! అసలు నీకు ఇది నిజం అని చెప్పవలసిన అవసరం లేదు నాన్నా! అబద్ధం అనే పదం తెలియకుండా పెంచావు మమ్మల్ని. నువ్వు మా నుంచి భౌతికంగా దూరమై, 33 సంవత్సరాలు అవుతోంది. శరీరం అశాశ్వతం. మనసే శాశ్వతం. మానసికంగా నువ్వు మా మదిలో ఒక శిలాశాసనం. ఎప్పుడు ఏ […]
తెలంగాణ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా ?
తెలంగాణలో కాంగ్రెస్ వైపుకి రెడ్డి సామాజిక వర్గం, బ్రాహ్మణులు మొదలు దళితులు, గిరిజనుల దాకా, మైనార్టీలతో సహా… అన్ని వర్గాల్లోనూ కాంగ్రెస్ కు ఓటర్ల బలంగా ఉన్నారు! ఇది మనకు స్వతంత్రం వచ్చిన నాటి నుంచీ నిరూపితం అవుతోన్నదే! అయితే, తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు అతి పెద్ద బలం రెడ్డి సామాజిక వర్గం. వాళ్లు మొదటి నుంచీ హస్తంతోనే కొనసాగుతున్నారు. ఇతర వర్గాల ధోరణి ఎలా ఉన్నా… ఎన్నికలు వచ్చిన ప్రతీ సారి రెడ్డి సామాజిక […]
‘‘నా దేహంపై పూలదండలు వేయకండి, వీలైనంత త్వరగా సింపుల్గా కాల్చేయండి’’
Siva Racharla………. మరణ ఆదేశం…. “నేను పోయినప్పుడు” అని తన మరణం తరువాత అంత్యక్రియలు ఎలా జరగాలి అని కవిత రాసుకున్న కవయిత్రి Indira Bhyri గారు గత ఫిబ్రవరిలో చనిపోయినప్పుడు ఆ కవిత మీద మంచి చర్చ జరిగింది. మరణం తరువాత సంప్రదాయం మీద మంచి చర్చ జరిగింది. https://www.facebook.com/siva.racharla/posts/5927558923947437 ఈ ఉదయం నెల్లూరు మణి బుక్ స్టాల్ మణి గారు చనిపోయారు. ఆయన 30 సంవత్సరాల కిందటే “మరణ శాసనం” పేరుతో తన మరణం […]
ముగ్గురు మంత్రుల నియోజకవర్గాలపై కేఎల్ఆర్ గురి
అర్జునుడికి చెట్టు, కొమ్మ, పక్షి కాదు… దాని కన్నులోని కనుగ్రుడ్డు మాత్రమే కనిపించిందట! కాంగ్రెస్ పార్టీ కీలక నేత కేఎల్ఆర్ ఇప్పుడు అదే సూత్రం పాటిస్తున్నారు! కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిగా మేడ్చల్, రంగారెడ్డి ప్రాంత వాసులకి అత్యంత సుపరిచితులైన మన డైనమిక్ లీడర్… హై కమాండ్ ఆదేశాలతో ఎలక్షన్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఏకకాలంలో కేసీఆర్ క్యాబినేట్ లోని ముగ్గురు మంత్రుల నియోజకవర్గాలపై గురి పెట్టారు. ఏదో ఒక కాన్ స్టిట్యూయెన్సీ నుంచీ ఆయన బరిలోకి దిగుతారని కాంగ్రెస్ […]
మీడియా మాయల ముందు కల్కి మాయలు లీలలు కూడా దిగదుడుపే…
మీడియా మాయాజాలం – కల్కి మాయలు…… రెండింటి థియరీ ఒకటే…… జర్నలిస్ట్ జ్ఞాపకాలు – ————————– మోకాలికి , బోడిగుండుకు సంబంధం కలిపినట్టు మీడియాకు , కల్కికి సంబంధం ఏమిటీ అనిపించవచ్చు. సంబంధం ఉంది . ప్రజల నమ్మకాలతో ఆడుకొనే ఓ స్వామీజీయే ఈ విషయంపై నాకు జ్ఞానోదయం కలిగించారు . 2009 ఎన్నికల సమయంలో పేజీలకు పేజీలు ఈనాడులో అబద్దాలు వండివార్చేవారు . ఇంత అబద్దాలు ఎలా అని ఈనాడులో పనిచేసే ఓ మిత్రుడిని అడిగితే […]
అక్కడికి నాటి తక్షశిల, నలందలే ఇప్పుడు చైతన్య, నారాయణలు అన్నట్టు…
Success Stake: సనాతన ధర్మానికి మూల స్తంభమయినది అద్వైత సిద్ధాంతం. దేవుడు- జీవుడు ఒకటే అన్న అహం బ్రహ్మాస్మి సూత్రాన్ని అర్థం చేసుకోవడమే అద్వైత సాధకుల అంతిమ లక్ష్యం. ఇది ఎంత సులభమయినదో అంత సంక్లిష్టమయినది కూడా. కళ్ల ముందు కనిపించే ప్రపంచం అద్దంలో ప్రతిబింబమే తప్ప నిజం కాదట! ఇంతకంటే లోతుగా వెళితే ఇది వేదాంత పాఠమవుతుంది. ప్రస్తుతం మన చర్చ అది కాదు. “పారాయణ నిశ్చైతన్యం” గురించి. రెండు తెలుగు రాష్ట్రాల్లో…ఆ మాటకొస్తే బహుశా దేశ వ్యాప్తంగా “పారాయణ నిశ్చైతన్యం” గురించి తెలియని […]
ముక్కు మొగమున్న చీకటి ముద్దవోలె విహరణము సేయసాగె గబ్బిలమొకండు
హే బ్యాట్ మ్యాన్! Brotherly Bat: “ముక్కు మొగమున్న చీకటి ముద్దవోలె విహరణము సేయసాగె గబ్బిలమొకండు దాని పక్షాని లంబున వాని చిన్ని యాముదపు దీపమల్లన నారిపోయె” “ఆ అభాగ్యుని రక్తంబు నాహరించి యినుపగజ్జెల తల్లి జీవనము సేయు! గసరి బుసకొట్టు నాతని గాలిసోక నాల్గు పడగల హైందవ నాగరాజు” “కర్మ సిద్ధాంతమున నోరు కట్టివేసి స్వార్థలోలురు నా భుక్తిననుభవింత్రు కర్మమన నేమొ? దానికీ కక్షయేమొ? ఈశ్వరుని చేత ఋజువు చేయింపవమ్మ!” “ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు […]
డాన్స్ బార్ ఓనర్ నుంచి… ఓ బలమైన నేత దాకా… ఇంట్రస్టింగ్ కెరీర్…
Siva Racharla………. డాన్స్ బార్ ఓనర్ నుంచి బలమైన నేత వరకు… లాయలిటీ మార్చటం పెద్దగా ఆక్షేపించవలసిన అంశం కాని రోజులు ఇవి. గుండె ఆపరేషన్ కోసం అమెరికాకు బయలుదేరిన ఎన్టీఆర్ గారికి గుమ్మడికాయతో దృష్టి తీసిన సన్నపనేని రాజకుమారి వారం తిరగక ముందే నాదెండ్ల భాస్కరరావు గ్రూప్ లో చేరినప్పుడున్న ప్రజా వ్యతిరేకత 2014 తరువాత కాంగ్రెస్, టీడీపీల నుంచి తెరాసలోకి , వైసీపీ నుంచి టీడీపీలోకి ఎమ్మెల్యేలు ఫిరాయించినప్పుడు లేదు. 2019 తరువాత ముగ్గురు […]
వయసు మాట వినదు… తుళ్లితుళ్లి పడదు, తూలితూలి పడుతుంది…
Age Factor: ప్రపంచంలో గేటు ముందు కాపలాగా ప్రభుత్వ అవుట్ సోర్సింగ్ ఉద్యోగానికయినా పదవీ విరమణ వయసు ఉంటుంది కానీ…రాజకీయనాయకుల పదవీ విరమణకు వయసుతో నిమిత్తం ఉండదు. దాంతో వార్ధక్యం వల్ల ఏమి మాట్లాడుతున్నారో వినపడని వృద్ధులు, కాలెత్తి నడవలేక వీల్ చెయిర్లో మాత్రమే తిరిగగలిగే కురు వృద్ధులు, అటు ఇటు మనుషుల సాయంతో మాత్రమే నాలుగడుగులు వేయగలిగే అతి వృద్ధులు, ఆసుపత్రి ఐ సి యు లో సెలయిన్ ఎక్కించుకుంటూ, కృత్రిమంగా ప్రాణవాయువు పీల్చుకుంటూ కాటికి కాళ్లు చాచిన మహా […]
నీలోఫర్ గైనిక్ విభాగానికి అభినందనలు… పోయే ప్రాణాన్ని నిలబెట్టారు…
నిజానికి మంచి వార్త… సమాజంలో ఒకింత పాజిటివ్ వైబ్స్ నింపే వార్త… ఈనాడులో కనిపించింది… కాకపోతే ఇవ్వాల్సినంత ప్రయారిటీ ఇచ్చినట్టు అనిపించలేదు… నిజానికి ఇలాంటి వార్తలే హైలైట్ కావాలి… గతంలోలాగా పాఠకులు సోది సొల్లు రాజకీయ వార్తలను ఏమీ చదవడం లేదు… నేతల డప్పు వార్తలకు ఇప్పుడు విలువే లేదు… ఇదుగో ఇలాంటి పాజిటివ్ వార్తల్నే ఇష్టంగా చదువుతున్నారు… ఉదయమే పత్రిక తెరవగానే ఇలాంటి వార్తలు కనిపిస్తే పాఠకుల మానసికారోగ్యానికి కూడా మంచిది… అఫ్కోర్స్, మన టీవీలకు […]
- « Previous Page
- 1
- …
- 90
- 91
- 92
- 93
- 94
- …
- 133
- Next Page »