ఒక దృశ్యం… ఒక మంచం వేసి ఉంది… దానిపై ఓ బట్ట… దాని నాలుగు కోళ్ల దగ్గర నాలుగు రాళ్లు తెచ్చిపెట్టారు… వాటి మీద నీళ్లు జల్లి, పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టారు… ఇద్దరు బాలింతలు తమ చంటి బిడ్డలను అక్కడికి తీసుకువచ్చారు… అలంకరించిన చాటల్లో పడుకోబెట్టారు… పైన తెల్లటి వస్త్రాన్ని కప్పారు… తరువాత ఆ ఇంటి పెద్దను, అనగా అత్తగారిని పిలిచారు… ఆమె చాటను ఒకవైపు లాగుతూ ఈ బిడ్డ నీకా నాకా అనడుగుతుంది… […]
ఓనం అంటేనే సాద్యా… ఒక్కసారి అరిటాకు ఖాళీ అయిపోతేనే పండుగ మజా…!!
ఈరోజు మలయాళ పండుగ ఓనం… ఆంధ్రులకు సంక్రాంతి, తెలంగాణలో దసరా పండుగల్లాగే కేరళ వాళ్లకు ఓనం ప్రధానమైన పండుగ… ఎవరి స్థోమతను బట్టి వాళ్లు పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు… ఒకప్పటితో పోలిస్తే ఈ పండుగ కూడా తన ప్రాభవాన్ని వేగంగా కోల్పోతోంది… ఆ కారణాల చర్చలోకి వెళ్లడం లేదు గానీ… ఓనం సాధ్యా అనేది ఆసక్తికరమైన పండుగ విశేషం… సాధ్యా అంటే ఓనం పండుగ భోజనం… నేల మీద కూర్చుని, కుటుంబసభ్యులంతా, అరటి ఆకుల్లో 24 నుంచి […]
ఆ ఒంటరి నాన్న జీవితంలో మళ్లీ సిటీ మొహం చూడలేదు..!!
భార్య చనిపోయింది… ఈలోకం నుంచి సాగనంపారు… పదమూడోరోజు కార్యక్రమాలు కూడా ముగిశాయి… రిటైర్డ్ పోస్ట్‌మ్యాన్ మనోహర్ ఇక తన ఊరిని, ఇంటిని విడిచిపెట్టి ముంబైలోని తన కొడుకు సునీల్ ఇంటికి వచ్చేశాడు… నిజానికి ఆ ఇంటికి రావడానికి ఏళ్లు పట్టింది తనకు… కొడుకు ఇంటికి వెళ్దామని ఎప్పుడు చెప్పినా సరే, భార్య అంగీకరించేది కాదు… వాళ్ల జీవితాల్లోకి మనం ఎందుకు జొరబడటం..? ఏం, ఇప్పుడు ఈ ఊళ్లో బాగానే ఉందిగా అంటూ వారించేది… ఇప్పుడు ఆమె లేదు… […]
అసలు ఏమిటి కన్సల్టెన్సీ అంటే… అదిరిపోయే ఉదాహరణ ఇదుగో…
ఎన్నికల వ్యూహాలకు కన్సల్టెన్సీలు… పథకాల రచనకు కన్సల్టెన్సీలు… ప్రతి శాఖలో కన్సల్టెన్సీలు… ఎక్కడ చూసినా కన్సల్టెన్సీలు… . ఓ బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజీకి ఓ ఫేమస్ కన్సల్టెంట్ వచ్చాడు ఏదో గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి… ఓ విద్యార్థి తననే అడిగాడు… ‘‘కన్సల్టెన్సీ అంటే ఏమిటి సార్..?’’ . ఏ మూడ్‌లో ఉన్నాడో గానీ కన్సల్టెంట్ కాస్త అర్థమయ్యేట్టుగానే చెప్పడానికి రెడీ అయ్యాడు… ఓ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు… . ‘పర్ సపోజ్, నా దగ్గరకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు… […]
హంగరీ తండ్రి, రష్యా తల్లి, తను స్విట్జర్లాండ్… మెట్టింది, గిట్టింది ఈ నేలపై…
సైనికులకు ఇచ్చే పురస్కారాల గురించి చదువుతుంటే… ఓ ఎపిసోడ్ ఇంట్రస్టింగుగా అనిపించింది… మన పిల్లలకు బోధించే కరిక్యులమ్‌లో ఇలాంటివి ఎందుకు ఉండవు అనిపించింది..? మరీ కార్తికేయ-2, బ్రహ్మాస్త్ర సినిమాల తరహాలో కాదు గానీ దీని వెనుక కూడా ఓ పురాణగాథ ఉంది… పక్కా భారతీయ స్త్రీగా మారిన ఓ విదేశీ యువతి ఉంది… ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇలా మన సైనిక విభాగాలేమైనా సరే, అందుకోదగిన అత్యున్నత సైనిక పురస్కారం ఏమిటో తెలుసు కదా… పరమవీరచక్ర… […]
గురువుతో అఫైర్… క్షమించిన భర్త… బ్రిటన్ కొత్త ప్రధాని లిజ్ ట్రస్ కథ…
Nancharaiah Merugumala…… రాజకీయ గురువుతో ‘అఫైర్’ నుంచి బయటిపడి భర్తతో దాంపత్య జీవితాన్ని కాపాడుకున్న కాబోయే బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ నిజంగా గ్రేట్…. బ్రిటిష్ ప్రధాన మంత్రిగా ఎన్నికైన మేరీ ఎలిజబెత్ ట్రస్ (47) దాంపత్య జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఇప్పుడు మీకూ చెప్పాలనిపించి రాస్తున్నాను. బోరిస్ జాన్సన్ రాజీనామాతో పాలకపక్షమైన కన్సర్వేటివ్ పార్లమెంటరీ పార్టీ నాయకత్వం కోసం భారత పంజాబీ ఖత్రీ రిషి సునక్ నుంచి ఎదురైన పోటీలో విజేతగా నిలిచిన లిజ్ […]
KCR ను ఇరుకునపెట్టే BJP ‘విమోచన’ ప్లాన్… TRS కౌంటర్ స్ట్రాటజీ రెడీ…
నిన్న నమస్తే తెలంగాణలో ఫస్ట్ లీడ్ స్టోరీ ఒకటి వచ్చింది… ఏమిటీ అంటే..? తెలంగాణ భారత యూనియన్‌లో కలిసి 74 ఏళ్లు పూర్తయినందున, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని వజ్రోత్సవం నిర్వహించాలని పలువురు మేధావులు ముఖ్యమంత్రిని అడిగారట… సీఎం సానుకూలంగా స్పందించాడట… కేబినెట్లో చర్చిస్తామని చెప్పాడట… 75 ఏళ్లు కాలేదు, 74 ఏళ్లే… ఐతేనేం… రాజకీయ అవసరం… మేధావులు కేసీయార్‌కు చెప్పడం, ఆయన సావధానంగా వినడం, సానుకూలంగా స్పందించడం అసలు జరిగే పనేనా..? కావాలనే ఆ స్టోరీ వండబడింది… […]
రెండు రాష్ట్ర ప్రభుత్వాలు… క్రూరహింసకు గురవుతున్న ఓ గుడి ఏనుగు కథ…
నిన్నో, మొన్నో యాంకర్ రష్మి వినాయకుడికి దండ వేస్తున్న ఓ గజరాజు వీడియో పోస్ట్ చేస్తే… వెనకాముందూ చూడకుండా, ఆమె గురించి తెలియకుండా హిందూ ద్రోహి అని ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు కొందరు… సరే, ఆ వివాదం ఎలా ఉన్నా, ఆ వార్తల్ని చెక్ చేస్తుంటే మరో ఇంట్రస్టింగ్ వార్త కనిపించింది… అదీ ఏనుగుదే… ఓ ఏనుగు బాధ… ఎందుకు ఒక్కసారిగా కనెక్టయ్యానంటే… ఆ ఏనుగు కోసం ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి రంగంలోకి దిగడం… రాష్ట్ర […]
నాకు వేరే పులిట్జర్ అవార్డు అవసరమా..? ప్రభుత్వ పురస్కారం కావాలా..?
Taadi Prakash…………. ఎడిటర్ నండూరికి నివాళి, గతకాలపు మంచితనాన్ని మరొక్కసారి తలుచుకుంటూ …. నండూరి వారితో వదంత వీజీ కాదు!…. An Uphill Task at AndhraJyothi daily ______________________________________ జర్నలిజంలో పదేళ్లు పూర్తి చేశాను. 1974-75లో వచ్చిన ‘ఈనాడు’ తెలుగు జర్నలిజంలో భూకంపం పుట్టిస్తే, 1984-85లో వచ్చిన ‘ఉదయం’ సునామీ సృష్టించింది. ఈ రెండు దినపత్రికలూ రూల్స్ ఆఫ్ ది గేమ్ ని పూర్తిగా మార్చేశాయి. నిజానికి నేను ఈనాడుకీ ఉదయానికీ పుట్టిన అక్రమ సంతానాన్ని. […]
చైనాతో నేపాల్‌కూ తలబొప్పి… ఆ రెండు హైడల్ ప్రాజెక్టులూ ఇండియా చేతికి…
పార్ధసారధి పోట్లూరి ……… చైనాది ఎంత విషకౌగిలో హంబన్‌తోట పోర్టుతో శ్రీలంకకు అర్థమైంది… నాసిరకం ఆయుధాలతో బంగ్లాదేశ్‌కు అర్థమవుతోంది… ఇప్పుడు నేపాల్‌కు కూడా అర్థమైపోయింది… చైనా అర్థంతరంగా వదిలేసిన రెండు విద్యుత్ ప్రాజెక్టుల పనుల్ని భారత్ కి ఇచ్చింది నేపాల్ ! నేపాల్ దేశం కోసం రెండు విద్యుత్ ప్రాజెక్ట్స్ ని నిర్మించమని భారత్ తో ఒప్పందం చేసుకున్న నేపాల్ ప్రభుత్వం… హిమాలయ రాజ్యం అయిన నేపాల్ పశ్చిమ భాగంలో సేటి హైడ్రో పవర్ ప్రాజెక్టు [West […]
హేట్సాఫ్ బీహారీస్… బతుకు విలువ తెలుసు, బతకడమూ తెలుసు…
ఒక సమాజంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయీ అంటే… ఇతర ప్రాంతాలతో పోలిస్తే చాలా ఎక్కువగా నమోదవుతున్నాయీ అంటే… దాన్ని ఏరకంగా విశ్లేషించుకోవాలి..? అక్కడి మానవసమూహం సంక్షుభితంగా ఉన్నట్టా..? అభివృద్ధిరాహిత్యంలో ఉన్నట్టా..? భద్రత, బతుకు సమస్యలు పెరిగిపోయినట్టా..? మరి వాటికి ప్రధాన కారణాలు ఏమిటి…? ఇవి కొన్ని చిక్కు ప్రశ్నలు… నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ఎప్పటిలాగే 2021 సంవత్సరానికి ఆత్మహత్యల సంఖ్యను క్రోడీకరించింది… చిన్న జిల్లాలతో సమానంగా ఉండే సిక్కిం, అండమాన్, పుదుచ్చేరిలను వదిలేస్తే… కేరళ, తెలంగాణ అగ్రస్థానంలో […]
చైనా ఆయుధాలు అంటే అంతే మరి… ఎంతకూ పేలవు, కాలవు, ఎగరవు…
పార్ధసారధి పోట్లూరి ………. చైనా ఆయుధాలు కొని మోసపోయిన బంగ్లాదేశ్ ! చైనా బాధితుల లిస్టులోకి తాజాగా బంగ్లాదేశ్ కూడా చేరిపోయింది! చాలా కాలంనుండి భారత్ చుట్టూ ఉన్న దేశాలకి ఆయుధాలు అమ్మడం ద్వారా భారత్ ని ఇబ్బంది పెట్టాలనే దురాలోచనతో ఉంది చైనా ! ఆ ఆలోచనని భారత్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆచరణలో పెట్టింది గుట్టుచప్పుడు కాకుండా ! అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద ఎలాంటి అభ్యంతరాలు పెట్టలేదు […]
ద్రవిడనాడు పేరిట దేశం నుంచి చీలిపోతారట… స్టాలిన్ ఏమంటాడో మరి..?!
ఒకవైపు కశ్మీర్లో పండిట్లను కాల్చేస్తూనే ఉన్నారు… మరోవైపు ఖలిస్థానీవాదం ప్రాణం పోసుకుని, ఢిల్లీని ముట్టడించి, ఈమధ్య పంజాబ్‌లో అనుకూల ప్రభుత్వాన్నే ఏర్పాటు చేసుకుంది… ఇంకోవైపు కొత్తగా ప్రత్యేక తమిళనాడు (ఈలం) కోరికలు బలాన్ని పెంచుకుంటున్నాయి… ఈ దేశం నుంచి విడిపోతారట… ప్రత్యేకంగా తమిళదేశం కావాలట… ఎవరో కాదు, అధికారంలో ఉన్న స్టాలిన్ అనుయాయులు, మిత్రులే గొంతెత్తుతున్నారు… మొన్నటి జూలైలోనే రాజా అనబడే మాజీ కేంద్ర మంత్రి ‘‘ఇప్పటివరకూ మా ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నా బాటలో నడుస్తున్నాడు… మాకు […]
వాడొక మాజీ ఐఏఎస్… పెళ్లాం ఓ పిశాచి… మిగతా కథ చదవండి…
అందరూ కాకపోవచ్చుగాక…. కానీ ఈ దేశంలో నయా జమీందార్లు, దొరలు, దొరసాన్లు సివిల్ సర్వెంట్లు… భారతీయ సమాజానికి అది పెద్ద శాపం వాళ్లే… బట్టీలు పట్టి, సబ్జెక్టు పుస్తకాలను ముక్కున పట్టి, ఆ దిక్కుమాలిన సివిల్స్ పరీక్షల్ని రాసి, తలతిక్క ఇంటర్వ్యూల్లో నెగ్గితే… మనం ఆహా అంటున్నాం, ఓహో అంటున్నాం… చిన్న మంచి పని చేస్తే చప్పట్లు కొడుతున్నాం… కానీ వాళ్లలో ఎందరు ఈ సొసైటీకి కరోనా వైరసులు అవుతున్నారనే నిఘా లేదు, చర్యల్లేవు… ఒక్కసారి ఐఏఎస్, […]
హాట్‌స్టార్ లైవ్ సంఖ్య చూశారా..? అది రాబోయే డిజిటల్ పట్టుకు సంకేతం..!!
ఒక మాయను చిన మాయ, చిన మాయను పెద మాయ, పెద మాయను పెను మాయ… అని ఎక్కడో చదివాం కదా… సాంకేతికత పెరిగేకొద్దీ కొత్తది వచ్చి పాతదాన్ని మింగేయడం సహజం… నిన్న ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ చూస్తుంటే హాట్‌స్టార్ వ్యూయర్స్ సంఖ్య కూడా లైవ్ వేశారు… యూట్యూబ్ లైవ్ వ్యూయర్స్ నంబర్ వేసినట్టుగానే..! హార్ధిక్ పాండ్యా చివరి ఓవర్లలో గెలిపించిన సందర్భంలో 1.3 కోట్ల మంది లైవ్ చూశారు హాట్‌స్టార్ వేదికగా… ఆశ్చర్యం వేసింది, కాదు, రాబోయే […]
రాంగ్ డెసిషన్…! ABN రాధాకృష్ణ బిగ్డిబేట్తో కవితకు రిలీఫ్ ఏంటి..?
ఏబీఎన్ చానెల్లో డిబేట్‌కు వెళ్లడం ద్వారా కేసీయార్ బిడ్డ కవితకు వచ్చిన ఫాయిదా ఏమిటి..? కనీసం డ్యామేజీ కంట్రోల్ ఏమైనా జరిగిందా..? తన వెర్షన్ బలంగా వినిపించగలిగిందా..? అసలు ఆ డిబేట్‌కు వెళ్లాలనే సలహా ఇచ్చింది ఎవరు..? నిజానికి ఈ డిబేట్ కవితకు ఒకరకంగా నష్టం చేకూర్చింది… ఎలాగో చెప్పుకోవాలంటే కాస్త దీనికి పూర్వరంగం నెమరేసుకోవాలి… కవిత పేరును పదే పదే బీజేపీ వాళ్లు ఢిల్లీ మద్యం స్కాంలోకి తీసుకొస్తున్నారు… ఆమె కోర్టుకు వెళ్లి ఎవరూ తన […]
పేకాట బదులు ఇంకో డర్టీ పదం… ఈనాడులో ఓ కొలువును ఉరితీసేశారు…
ఈనాడు వరంగల్ యూనిట్లో ఓ సబ్ ఎడిటర్‌ను తీసేశారు… పేరు, ఆయన వయస్సు, ఆయన జీతం ఎట్సెట్రా ఇక్కడ అనవసరం… తను ఉషోదయ ఎంప్లాయీ కూడా కాదు, శ్రమదోపిడీ కోసం ఈనాడు ఏర్పాటు చేసిన డిజిటల్ బ్యాచ్ సబ్ఎడిటర్ ఆయన… విషయం ఏమిటీ అంటే..? ఓ అక్షర దోషానికి తను బాధ్యుడట… నిజమే, చాలా దారుణమైన తప్పు దొర్లింది… అయితే తనొక్కడే దానికి కారకుడా..? ఓ సబ్ఎడిటర్ను పీకేస్తే ఈ సమస్య పరిష్కారం అయిపోతుందా..? ఆ సోయి […]
శవపేటిక చుట్టూ చేరి… నవ్వుతూ ఆ ఫ్యామిలీ గ్రూప్ ఫోటో తీసుకుంది…
పుట్టినవాడు గిట్టకతప్పదు… ప్రతి జీవికీ మరణం తప్పదు… అందరూ అంగీకరించేదే కదా… కాకపోతే లోకాన్ని విడిచిపెట్టి పోవడానికి జీవి గుంజాటన ఉంటుంది… తనతో అనుబంధం ఉన్నవాళ్లకు బాధ ఉంటుంది… అలాగని సాగనంపడానికి శోకాలు పెట్టాలా..? కడుపులో లేకపోయినా కన్నీళ్లు ప్రవహించాలా..? మరణం ఖరారయ్యాక.., ఆ ఆత్మను, ఆ దేహాన్ని నవ్వుతూ సాగనంపితే తప్పేమిటి..? ఈ ప్రశ్న ఇప్పుడు కేరళలో ఓ చర్చకు దారితీస్తోంది… ఇంట్రస్టింగు… ఎస్, చాలా దేశాల్లో… మన దేశంలోనూ కొన్ని తెగల్లో ఎవరినైనా ఈలోకం […]
బెంగుళూరు తిండిబీథిలో విదేశాంగ మంత్రి జైశంకర్ ఇంట్రస్టింగ్ ఫుడ్వాక్..!!
రాజకీయ నాయకులు అంటేనే ఇప్పుడు అందరికీ ఓ వెగటు సరుకు కదా… వాళ్ల నడవడిక కూడా అలాగే ఉంటోంది… ప్రజలు చీదరించుకుంటే ఆశ్చర్యం ఏముంది..? కానీ కొందరు ఉంటారు… అసలు ఇలాంటోళ్లు కదా రాజకీయాల్లో ఉండాల్సింది అనిపిస్తారు… చాలా తక్కువ మంది… అందులో ఒకరు మన విదేశాంగ మంత్రి జైశంకర్… నిజానికి తను పొలిటిషియన్ కాదు… ఫారిన్ సర్వీస్‌లో చాలా కీలక పోస్టుల్ని నిర్వహించాడు… చివరకు మోడీ విదేశాంగ శాఖకు తననే పికప్ చేసుకున్నాడు… సరైన ఎంపిక… […]
ఓహో… ఆ పత్రిక రాసిన ‘పెయిడ్ స్టోరీస్’తోనే ఢిల్లీలో ముసలమా..!!
అదేదో శుద్ధపూస పత్రిక అయినట్టు… ఆప్, బీజేపీ తన్నుకుంటున్నాయి..! ఆప్ నేతలు చెబుతున్నారేమిటంటే..? ‘‘ఢిల్లీ ప్రభుత్వం విద్యావిధానంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పుల్ని న్యూయార్క్ టైమ్స్ ఫస్ట్ పేజీలో ప్రత్యేక కథనంగా కుమ్మేసింది… అది చూసి మోడీకి, షాకు బుగులు పట్టుకుంది, ఇక రాబోయే ఎన్నికలు కేజ్రీ వర్సెస్ మోడీ అనేది ఫిక్స్… పైగా అదే పత్రిక కరోనా సమయంలో మోడీ వైఫల్యాల్ని కూడా ఏకిపారేసింది… అదుగో, దాంతో కక్షపెట్టుకుని సిసోడియాను టార్గెట్ చేసి, సీబీఐ కేసు పెట్టించాడు […]
- « Previous Page
- 1
- …
- 92
- 93
- 94
- 95
- 96
- …
- 120
- Next Page »