Beer – Bath: స్నానాలు ఎన్ని రకములు? వాటి స్వరూప స్వభావాలు, వాటికోసమయ్యే ఖర్చు? వాటి వల్ల ప్రయోజనములెట్టివి? అన్న చర్చ కాదిది. నూనె పూసి, నలుగు పెట్టి చేసే అభ్యంగన స్నానాలు సంప్రదాయంలో ఉంటే ఉండవచ్చుగాక. కలవారి ఇళ్లల్లో ఇంద్రలోకం సిగ్గుపడాల్సిన బాత్ టబ్బులో పరిమళభరిత నురగలు తెలిమబ్బుల్లా తేలితే తేలవచ్చుగాక. ఒళ్లంతా బురద పట్టించుకుని మడ్ బాత్ ల మృత్తికా స్నానాలు ఉంటే ఉండవచ్చుగాక. ఆరోగ్యానికి ఊపిరిలూదే ఆవిరి స్నానాల మెత్తదనం ఉంటే ఉండవచ్చుగాక. గంధము పూయరుగా పన్నీరు గంధము […]
స్టీమ్ వాష్… ఫోమ్ వాష్‌కన్నా ఖరీదెక్కువ… కానీ కడిగాక తళతళ ఖాయం…
విదేశాల్లో ఏనాటి నుంచో ఉన్నదే… మన దేశంలో కూడా చాన్నాళ్లుగా ఉన్నదే… హైదరాబాదులో కూడా స్టార్టయి మూణ్నాలుగేళ్లు అయ్యిందట… మీ కారుకు నీటి ఆవిరితో వాషింగ్ అనే ప్రకటన ఒకటి అనుకోకుండా ఫేస్‌బుక్‌లో కనిపించింది, ఆసక్తికరం అనిపించింది… మీ కారును మళ్లీ కొత్త కారు చేసేస్తాం అంటోంది వాళ్ల యాడ్… అందులో ఆకర్షించింది ఏమిటంటే..? మొత్తం కారు వాషింగుకు నాలుగు లీటర్ల లోపే నీటిని వాడటం, అదీ నీటిని ఆవిరిరూపంలో ప్రెషర్‌తో వాడటం, ఇంటి దగ్గరకే వచ్చి […]
పీహెచ్‌డీ చేస్తుందట..! ఎంట్రన్స్ పాసైంది..! ఈ రంగుల లోకంలోనూ అదే విద్యాసక్తి..!
ముందుగా ఒక వార్త… ‘‘ఇటీవలి కాలంలో సినీ రంగంలో బాగా పాపులరైన మహిళ పవిత్ర లోకేశ్… సీనియర్ నటుడు నరేశ్ తో ఆమె సహజీవనం బాగా వార్తల్లో నలుగుతోంది ఇంకా…!! ఇప్పుడు మరోసారి ఆమె వార్తల్లోకి ఎక్కింది… కన్నడ యూనివర్శిటీ నిర్వహించిన పీహెచ్డీ కామన్ ఎంట్రన్స్ పరీక్షలో ఆమె ఉత్తీర్ణురాలైంది… కన్నడ యూనివర్శిటీ వివిధ విభాగాల కింద పీహెచ్డీ చేయడానికి అవకాశం కల్పిస్తోంది… వివిధ విభాగాల్లో పీహెచ్డీ చేసేందుకు 981 మంది ఎంట్రన్స్ పరీక్ష రాయగా… వీరిలో […]
వయస్సు 72 ఏళ్లు… ఈరోజుకూ అదే క్రేజ్… సూర్య, విజయ్ రేంజులో ‘ఫీజు’…
నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్ప మద్యపానం… దాంతోనే చెడిపోయాను, లేకపోతే మరింతగా ప్రజాసేవ చేసే అవకాశం లభించేది…. అని ఈమధ్య రజినీకాంత్ ఎక్కడో చెప్పాడు… నిజానికి తన ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీసింది మద్యపానం కాదనీ, ధూమపానం అనీ చెన్నై పండితులు అంటుంటారు… ఆరోగ్యమే సరిగ్గా ఉంటే, రాజకీయాల్లో క్లిక్కయిపోయి, తమిళనాడును బాగా ఉద్దరించేవాణ్నని తన వ్యాఖ్యల అంతరార్థం… 72 ఏళ్ల వయస్సు… బయట ఆఫ్ ది స్క్రీన్ రజినీని చూస్తే హీరో కాదు […]
నీ కడుపు సల్లగుండ… నెయ్యి రుచిలా ఘుమఘుమలాడే నిజం చెప్పినవ్…
ఆమధ్య ఏదో హెల్త్ ప్రాబ్లం మీద ఓ ఆయుర్వేద వైద్యురాలి దగ్గరకు వెళ్తే… అక్కడ ఆమె రాసిన పుస్తకాలు కనిపించాయి… వాటిని తిరగేస్తుంటే నెయ్యిను అసలు వాడకూడదని ఓచోట రాసి ఉంది… నిజమే కదా, అల్లోపతిలోె నెయ్యిని దాదాపు నిషేధించినట్టే డాక్టర్లు ఆ వాడకం వద్దంటూ సలహాలు ఇస్తుంటారు… ఆమె ఆయుర్వేద వైద్యురాలే అయినా అల్లోపతిని కూడా ప్రయోగిస్తుంటుంది… ఆ ప్రభావమే ఆమె మీద కూడా ఉన్నట్టుంది… నెయ్యిని పరిమితంగా వాడితే తప్పులేదు, నష్టం లేదు అని […]
దండలు కూడా లేని పెళ్లి… పది నిమిషాల్లో పూర్తి… అరగంటలో ఇంటికి…
Taadi Prakash…….. పెళ్ళి… దాని గుట్టు పూర్వోత్తరాలు… 1984 : An eventful year ———————————————————— 1984… ఈ సంవత్సరం గుర్తొస్తే, ఎస్. వరలక్ష్మి పాట “నీ సరి విలాసులూ జగానలేనెలేరుగా” మరోసారి వింటున్నట్టు ఉంటుంది. ఆ పాట నాలో తీయగ మోగనీ, అనురాగ మధుధారలై సాగనీ… తోటలో నారాజు… అంటూ సినారె గీతాన్ని ఘంటసాల నా కోసమే పాడుతున్నట్టూ అనిపిస్తుంది. ఏ జర్నలిస్టుకైనా జీవితాంతమూ మరిచిపోలేని సంవత్సరం 1984. ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్ తో […]
కోకాపేట నవ్వుతోంది… వంద అంతస్థుల గగన భవనాల్ని తలుచుకొని…
On Sky: అది 2030 సంవత్సరపు వర్ష రుతువు. మేఘాలు నీటిని కడుపులో దాచుకుని నలుపెక్కి, బరువెక్కి కిందికి దిగి కురవడానికి సిద్ధంగా ఉన్నాయి. నయాపాలిష్ బండల కొండల ఈ వేలం పాటలతో ఆవేళ ఆన్ లైన్ గాలి వెర్రెక్కి ఊగుతోంది. పాటకు తాళం లేని సాకీకి పాస్ వర్డ్ తాళం తీశారు. ఎకరా వేలం పల్లవి వేగం అందుకుంది. ఆది తాళం వంద కోట్లు. ఆలాపన రెండొందల కోట్లు. మొదటి చరణానికి మూడొందల కోట్లు. మొదటి […]
గెలిచింది తనొక్కడే, అదీ ఒక్కసారే… కొన్నాళ్లకు ఆ పార్టీ దుకాణమే షట్‌డౌన్…
తెలంగాణకు అదేం దురదృష్టమో కానీ … జీవితంలో ఒక్కసారి గెలిచి, మళ్లీ అడ్రెస్ లేకుండా పోయినవారి మాటలకే తెలుగు మీడియా ప్రాధాన్యత ఇస్తుంది … ఆరు నెలల్లో ఆంధ్రాలో కలిపేయాలంటూ ఉద్యమం తెలంగాణలో వస్తుంది చూడండి అని జ్యోతిష్యం చెప్పారు కొందరు … బోరు బావులకు విద్యుత్ లేక కరువుతో పోతారు అన్నారు … ఆ మేధావుల్లోని ఒకరు జయప్రకాశ్ నారాయణ… మెట్రో గురించి మరో జోస్యం చెప్పారు . మెట్రో గురించి ఇది మొదటి జోస్యం […]
ఛిద్ర భాష… ఈనాడే కాదు, ప్రింట్ మీడియా మొత్తం అదే బాట…!!
టీవీ మీడియా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది… ప్రత్యేకించి టీవీ న్యూస్ మీడియాలో భాష పరిస్థితి అధ్వానం… అన్నింటికీ మించి రిపోర్టర్లు ఫీల్డ్ నుంచి వివరించే గ్రౌండ్ రిపోర్ట్ భాష, మరీ ప్రత్యేకించి ‘పరిస్థితి, జరిగింది’ వంటి పదాలు కర్ణకఠోరం… ఈ నేపథ్యంలో ప్రింట్ మీడియా, అనగా పత్రికలు కాస్త నయం అనిపిస్తుంది… కాకపోతే ఈమధ్య పత్రికల్లో భాష, హెడింగులు, ప్రయారిటీలు, ప్రజెంటేషన్లు, రచనశైలి కూడా మరీనాసిరకంగా ఉంటున్నాయి… ట్రెయిన్డ్ గాకుండా అన్ ట్రెయిన్డ్ […]
గాసిప్స్ పుట్టించడం అంటేనే… అది మీడియా ప్రాథమిక హక్కు మరి…!
వర్షం పడితేనే రైతులు పంట పండిస్తారు… మీడియా ఎంతటి వార్తల కరువులోనైనా పుకార్ల పంట పండిస్తుంది … గవర్నర్ కోటా కింద శాసనమండలి సభ్యులుగా ఎంపిక అయ్యే వారి గురించి ఎబిఎన్ ఛానల్ లో ఓ స్టోరీ ప్రసారం చేశారు . మోత్కుపల్లి నర్సింహులు మొదలుకొని తమకు తెలిసిన పలువురు నాయకులకు ఈ కోటాలో మండలి సభ్యత్వం కల్పించేశారు . తీరా చూస్తే కుర్రు సత్యనారాయణ , దాసోజు శ్రవణ్ లను కెసిఆర్ ఎంపిక చేశారు . ఒక్క […]
చివరి తెలుగు లేడీ సూపర్ స్టార్… అరకొర వేషాలతో మొదలై…
vanisri is last lady super star of tollywood
ట్రెండీ తిండి… కడుపుకు చేటు, పర్స్ కు మహా చేటు…
bitter experience with corn meal
తటస్థులు… టీడీపీలో వికటించిన ఒక వింత ప్రయోగం..!!
buddha murali memories
క్రై ఫర్ మణిపూర్… రాజదీప్ సర్దేశాయ్ కన్నీళ్లు పెట్టిన ఓ టీవీ ఇంటర్వ్యూ…
Pathetic: టీ వీ లో తెలుగు న్యూస్ ఛానెల్స్ అన్నీ వరదల్లో పీకల్లోతు మునిగి ఉన్నాయి. ఇంగ్లీషు న్యూస్ ఛానెల్స్ మారుస్తుంటే- ఇండియా టుడేలో రాజ్ దీప్ సర్దేశాయ్ చేసిన ఒక ఇంటర్వ్యూ ‘క్రయ్ ఫర్ మణిపూర్’ మరికాసేపట్లో ప్రసారమవుతుందని ప్రోమో వచ్చింది. ఛానెల్ మార్చకుండా కూర్చుని చూశాను. దాదాపు 25 నిముషాల ఆ ఇంటర్యూలో నిజంగానే రాజ్ దీప్ సర్దేశాయ్ కళ్లల్లో నీళ్లు పెట్టుకున్నాడు. ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించాడు. ఇంటర్వ్యూ చూస్తూ…ఉబికి వచ్చే కన్నీళ్లను ఆపుకుంటూ…తట్టుకోలేక కాసేపు పక్కకు వెళ్లి […]
ఇక్కడ ఆహారానికి మతం ఉంది… కులం కూడా ఉంది…
Prasen Bellamkonda……… సుధా మూర్తి ఆహార అలవాట్ల గురించి వ్యాఖ్యానించే ముందు ఒకసారి… ఉంది. భోజనానికీ మతముంది.. ఆహారానికీ కులముంది. గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో చెవుల్లోంచి నెత్తురుకారేట్టు వినిపిస్తోన్న ఓ ప్రశ్నకు ఇది సమాధానం. నిజానికి ఆహారానికి కులముందా, భోజనానికీ కులముందా అనే ప్రశ్న అడిగేవాళ్ల ఇంటిగ్రిటీ మీదే నాకు సందేహాలున్నాయి. వాళ్లు తమ చుట్టూ జరుగుతున్నసంఘటనల లోతుపాతులు గమనించలేని వారైనా అయుండాలి లేదూ ఈ ప్రశ్న అడగడం ద్వారా తమను తాము […]
ఆమె తినే ఆహారం ఆమె ఇష్టం… ఏమిటీ దిక్కుమాలిన ట్రోలింగ్…
Sai Vamshi……… సుధామూర్తి గారి కామెంట్లు – ఒక పరిశీలన….. కొన్ని రోజుల నుంచి FBలో సుధామూర్తి గారి ‘మాంసాహార ఛాయిస్’పై చర్చ నడుస్తూ ఉంది. ఆమె ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, రచయిత్రి, సామాజికవేత్త, దేశంలో అనేకమందికి తెలిసిన వ్యక్తి. నటుడు, ఆహార విశ్లేషకుడైన కునాల్ విజయ్‌కర్‌తో కలిసి ‘ఖానే మే కౌన్ హై’ అనే కార్యక్రమంలో ఇటీవల మాట్లాడుతూ శాకాహారురాలిగా తనకుండే ప్రాధాన్యాలు వివరించారు. తాను మాంసాహారం తిననని, వెల్లుల్లి కూడా వాడనని చెప్పారు. విదేశాలకు […]
ఇదేం తిరకాసు..? ఎప్పుడూ వాపస్ ఇవ్వబోమని రాసిస్తేనే అవార్డులిస్తారట.. !!
No Return: ఇంగ్లీషులో అవార్డు అనే మాటకు పురస్కారంతో పాటు విధించడం, తీర్పు ఇవ్వడం అని కూడా విస్తృత అర్థాలున్నాయి. మాట్లాడే మాటలన్నిటికీ భావార్థాలు వెతుక్కుంటూ పోతే…వెయ్యేళ్ల ఆయుస్సు ఉన్నా సగం పదాలను కూడా పూర్తి చేయలేం. ఎప్పుడయినా, ఎవరికయినా గుర్తింపు ముఖ్యం. ప్రశంస, అభినందన, సన్మానం, పదోన్నతి, నగదు బహుమతి, బిరుదు ప్రదానం…అన్నీ గుర్తింపులో ప్రధానమే. అవార్డులు ఎన్ని రకాలు? ప్రభుత్వ, ప్రయివేటు అవార్డులు గ్రహించడానికి (గ్రహించడం మాటకు వ్యుత్పత్తి అర్థం ‘తీసుకోవడం’ అనే పాజిటివ్ మీనింగ్ తో పాటు […]
హీరోలూ, దేవుళ్లు కానవసరం లేదు… జస్ట్, మనుషులుగానైనా స్పందించండి…
వరద నీరు ముంచెత్తినప్పుడు ఒక బాధ… వరద నీరు తగ్గాక జరిగిన నష్టం చూసుకుని మరో బాధ… పాత వరంగల్ జిల్లాలోని అనేక గ్రామాల పరిస్థితి అదే… ప్రత్యేకించి మోరంచపల్లి వంటి పల్లెలు దారుణంగా దెబ్బతిన్నాయి… అంతెందుకు..? హిస్టారిక్ భద్రకాళి చెరువుకు గండి సహా ఇప్పటికీ అనేక కాలనీలు వరదనీటిలోనే ఉన్నాయి… ఒక్కొక్క ఇంట్లో మూణ్నాలుగు అడుగుల నీరు, బురద… తిరిగి ఈ జీవితాలు యథాస్థితికి రావడానికి ఎంతకాలం పడుతుందో..? ప్రభుత్వ సాయం ఎలా ఉంటుందో అందరికీ […]
మణిపురిలో జాతివైరం… ఓ తెలుగు జర్నలిస్టుతో మొయితీల బతుకు చెలగాటం…
Ashok Vemulapalli…….. … వందలాది మంది జనం కత్తులు, కర్రలు,రాడ్లు పట్టుకుని బయట అరుస్తున్నారు-వాడిని మాకొదిలేయండి పొడిచిపొడిచి చంపుతామంటున్నారు (మణిపురి భాషలో).. అందులో ఆడవాళ్లున్నారు-మగవాళ్లు-పిల్లలు ఉన్నారు..నేను కూర్చున్న కుర్చీకి అటూఇటు ఇద్దరు కుర్రాళ్లు తుపాకులు పట్టుకుని నిల్చున్నారు.. అప్పటికే నన్ను,కెమేరామ్యాన్ ను చేతులు వెనక్కి విరిచి కట్టేసి కుర్చీలో కూర్చుబెట్టారు.. బయట ఉన్నజనం విపరీతమైన ఆగ్రహంతో అరుస్తూనే ఉన్నారు..అదో స్కూల్ బిల్డింగ్..వరండాకు మొత్తం గ్రిల్ ఉంది.దాని డోర్ కి తాళాలు వేసేశారు..లోపల మేము..బయట జనాలు.. జనమంతా కర్రలు, […]
బ్రో సినిమా చెప్పే అసలు ఫిలాసఫీ ఇదే బ్రో… ఓ డిఫరెంట్ రివ్యూ…
Prasen Bellamkonda…….. ఒకసారి పుట్టి ఒకసారి గిట్టి తెంచుకోవాలి బంధం. చావనేది జీవితానికో అందం… అనే తాత్వికత జీర్ణం కావడం కష్టం . ఆ జీర్ణం కావాల్సింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కైతే మరీ మరీ కష్టం బ్రో. విపశ్యన అని ఓ పదం ఉంది. టేకింగ్ ది థింగ్స్ యాజ్ దే ఆర్ అని ఇంచుమించు అర్ధం. మానవ జీవితానికి ఈ పదాన్ని అన్వయించినపుడు ‘జరిగేదే జరుగుతది ‘ అని అర్ధం చేసుకోవాలి. మనమేదో ఉద్దరించాం, […]
- « Previous Page
- 1
- …
- 94
- 95
- 96
- 97
- 98
- …
- 126
- Next Page »