Sai Vamshi……… వరకట్నంపై వందేళ్ల కిందటి సమ్మెటపోటు… వరకట్నం సాంఘిక దురాచారం. ఎన్నాళ్లయింది దాని మీద ఒక గట్టి సినిమానో, నాటకమో వచ్చి? ‘వరవిక్రయం’ నేటికీ ఆ లోటు తీరుస్తూ ఉంది. పశ్చిమగోదావరి జిల్లావాసి కాళ్లకూరి నారాయణరావు గారు వందేళ్ల క్రితం రాసిన నాటకం ఇది. ఆయన గనుక ఇది రాయకపోయి ఉంటే తెలుగు నాటకరంగపు ముత్యాలదండలో ఒక మణిపూస ఉండకపోయేది కదా? ఎల్లకాలాలకూ తట్టుకొని నిలిచే ఈ నాటకాన్ని చేజార్చుకునేవాళ్లం గదా? ఎన్ని వేల నమస్సులు […]
ఆ మరణం తీరని లోటు… ఈ ప్రపంచంలో అతి పెద్ద హిపోక్రటిక్ స్టేట్మెంట్…
ఎవరైనా రాజకీయ నాయకుడు మరణిస్తే .. ఆ వార్తలు చదివితే పత్రిక ఏదైనా కావచ్చు , నాయకుడు ఎవరైనా కావచ్చు , ప్రకటన ఇచ్చింది ఎవరైనా కావచ్చు ఒక వాక్యం అన్నింటిలో కామన్ గా కనిపిస్తుంది . ఆ నాయకుడి మరణం తీరని లోటు అనే మాట లేకుండా వార్త ఉండదు . అలానే జర్నలిస్ట్ మరణిస్తే సిటీ పేజీలో , జిల్లాల్లో ఐతే జిల్లా పేజీలో తప్పని సరిగా కనిపించే మాట . మరణించిన కుటుంబానికి […]
నార్త్ ఇండియన్స్ అనుకున్నాం కానీ… ఓహ్, ఈ తాజ్ మన వాళ్లదేనా…
అబిడ్స్ సెంటర్లో….. అందాల ” తాజ్ ” !! తాజ్ లో టిఫిన్/భోజనం చేయడం ఓ ప్రివిలేజ్..!! మీరు ఎన్నయినా చెప్పండి. హైదరాబాద్ లో ఎన్ని హోటళ్ళున్నా….. అబిడ్స్ ‘తాజ్ మహల్’ సంగతే వేరు. అక్కడి టిఫిన్ ముఖ్యంగా బటన్ ఇడ్లీ, చిట్టి వడల్లో సాంబారు, వెన్న వేసుకొని….. తింటుంటే ఆ రుచే వేరబ్బా! అలాగే.. ఏసి ఛాంబర్ లో సౌత్ ఇండియన్ థాలీ భోజనం ఎక్స్ట్రార్డినరీ గా వుంటుంది. ముఖ్యంగా అక్కడి తాజా చట్నీ, ఊరగాయ […]
హిందూ పండుగలపై ఈ తిథి వివాదాలు ఎందుకొస్తున్నయ్..? ఏం చేయాలి..?
ప్రతిసారీ పండుగల మీద వివాదాలు ఎందుకు తలెత్తుతున్నాయి..? ఎందుకు పండితులు వేర్వేరు అభిప్రాయాలు, లెక్కలతో ప్రజల్ని గందరగోళంలోకి నెట్టేస్తున్నారు… అసలు గ్రహస్థితుల గమనం మీద మనకంటూ ఓ ఏకీకృత గణన ఎందుకు కరువైంది..? పండుగలకు ప్రామాణికంగా తీసుకోవాల్సిన తిథుల విషయంలో ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి… వచ్చే దసరా ఎప్పుడు అనే విషయంలో తాజాగా మరో వివాదం… తలా ఓ లెక్క… ఈ స్థితిలో, ఈ నేపథ్యంలో ఓసారి లోతుగా ఈ గణన పద్ధతుల్లోకి వెళ్దాం… (ఇది […]
ఊరూరా శంకుస్థాపనల జాతర… శిలాఫలకాలకు డబుల్ గిరాకీ…
ఒక ఉత్తర తెలంగాణ ఎమ్మెల్యే… ఒకరోజు 36 చోట్ల శిలాఫలకాలు వేయించాడు… మరుసటిరోజు తన రికార్డును తనే బ్రేక్ చేస్తూ 41 శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశాడు… ఏదేని ప్రభుత్వ భవనం, రోడ్డు, ప్రాజెక్టు, పైప్లైన్ ఎట్సెట్రా పనులకు శిలాఫలకాలు వేయడం పరిపాటే… కానీ ఇప్పుడు మరీ దారుణంగా చివరకు లక్ష రూపాయల పనులకు సైతం శిలాఫలకం వేసేస్తున్నారు… ఎందుకు..? ఎన్నికలొస్తున్నయ్… మస్తు ప్రచారం కావాలి… ఊళ్లలో తిరగాలి… ఆ పని చేశాను, ఈ పని చేశాను, ఇదీ […]
జూదగాళ్ల ముందస్తు తెలివితేటలు… పేకాడేవాళ్ల బుర్రలే బుర్రలు…
Super Smart: ధర్మరాజు జూదవ్యసనం గురించి యుగం మారినా చర్చ జరుగుతూనే ఉంది. సప్త మహా వ్యసనాల్లో జూదం ఒకటి. తానోడి నన్నోడెనా? నన్నోడి తానోడెనా? అని ద్రౌపది అడిగిన ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోయింది. “కులము నీరుజేసె గురువును జంపించె పొసగ యేనుగంత బొంకు బొంకె పేరు ధర్మరాజు పెను వేప విత్తయా విశ్వదాభిరామ… వినుర వేమ!” అని మన వేమన అందుకే తెగ విసుక్కున్నాడు. రాతి అరుగుల మీద సుద్ద ముక్క, బొగ్గు ముక్కలతో గళ్లు గీసుకుని చింత పిక్కలు, […]
రాజకీయ ఉపన్యాసం ఓ కళ… మన తెలుగు లీడర్లకు అంత సీన్ లేదు…
Padmakar Daggumati…… ” మంచి ఉపన్యాసం ఒక కళ” … నాలెడ్జ్ అనేది సాపేక్షం. అందులో ఎవరి స్థాయి వారిది. జ్ఞాపకశక్తి కూడా సాపేక్షమే. ఎవరి కెపాసిటీ వారిది. సరే ఇదలా ఉంచుదాం. చక్కటి ఉపన్యాసం ఇవ్వగలగడం ఒక కళ, ఒక నైపుణ్యం. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు, లేదా ఇతర ప్రధాన బాధ్యులు తాము అనేక సందర్భాలలో మాట్లాడవలసి వస్తుంది. పార్టీ ముఖ్యుల సమావేశంలో మాట్లాడాలి. పార్టీ ఇతర నాయకులతో మాట్లాడాలి. పార్టీ కార్యకర్తలతో మాట్లాడాలి. పార్టీ […]
ఆలోచించాలే గానీ… మన సొంత భాషలోనే ఎన్నో అందమైన పేర్లు…
ఒక సెలవు రోజు విజయవాడ వీధుల్లో బలాదూర్ గా తిరగడానికి బయలుదేరితే కుంభవృష్టి మొదలయ్యింది. చలికాలంలో కూడా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేసే బ్లేజ్ వాడ లో వర్షంలో తిరగడం మంచిదే అనుకుని…అదే విజయవాడకు మహోన్నత జ్ఞానపీఠం తెచ్చిపెట్టిన తెలుగు సాహితీ వేయి శాఖల కల్పవృక్షం విశ్వనాథ చెప్పిన- “నిష్ఠావర్ష దమోఘ మేఘపటలీ నిర్గచ్ఛ దుద్యోతిత…” నేలకు దిగి స్థిరంగా కురుస్తున్న నల్ల మబ్బులు తెచ్చిన చిరు చీకటిలో…మబ్బుల అంచుల్లో వెలిగే మెరుపుల అందాన్ని ఆస్వాదిస్తూ తిరుగుతుంటే…అక్కడక్కడా “విడిది […]
మరో గ్యాంగ్స్టర్ కాల్చివేత… అసలు ఏం జరుగుతోంది కెనడాలో…
పార్ధసారధి పోట్లూరి …….. పంజాబ్ కి చెందిన మరో గ్యాంగ్స్టర్ కెనడాలో హత్యకి గురయ్యాడు! అది రెండు సిక్కు గ్రూపుల మధ్య ఉన్న వైరం వల్లనే జరిగింది! RAW ని ఇండియన్ మొస్సాద్ గా పిలుస్తున్నారు ఇప్పడు! ఎందుకంత హైప్ వచ్చింది? ఇంగ్లాండ్, పాకిస్థాన్, కెనడా ఇలా ఒక దేశానికి పరిమితం కాలేదు RAW! 2014 కి పూర్వం కేవలం పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్, శ్రీలంకలకే పరిమితం చేశారు పూర్వ పాలకులు. అది కూడా ఇంటిలిజెన్స్ ని […]
బట్టలిప్పుకుని బజారులో బరిబాతల డాన్స్ ఆడుతున్న చానెళ్లు…!!
రాష్ట్రాల్లో , జాతీయ స్థాయిలో ఢిల్లీలో కూడా ఒక పార్టీ మీడియాను మరో పార్టీ బహిష్కరించడం ఇప్పుడు సర్వసాధారణం . ఆ రోజుల్లో కూడా బహిష్కరణ ఉండేది కానీ ఇప్పటిలా కాదు . జర్నలిస్ట్ లంతా కలిసి తప్పు చేసిన నాయకుడిని బహిష్కరించేవారు . అన్ని పార్టీల మీడియా ఏకాభిప్రాయానికి రావడం ఎలా సాధ్యం అని ఇప్పటి వారికీ అనిపించవచ్చు . కానీ అప్పటి పరిస్థితి వేరు . 1987లో తొలిసారిగా మెదక్ జిల్లాలో జర్నలిస్ట్ గా […]
బిగుసుకున్న ఇందిర చేతివేళ్ళు… సిరులు ఒలికించిన పంట చేలు…
భారత దేశంలో సమృద్ధిగా పంటలు పండుతున్నాయి. దేశంలో ఆకలి చావులు అన్నవే లేవు. కనీసం మరో మూడేళ్లకు సరిపడా ఆహార ధాన్యాలు దేశంలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గిడ్డంగులలో ఎప్పుడూ నిల్వ ఉంటున్నాయి. చాలాసార్లు అలా నిల్వ చేసిన ఆహార ధాన్యాలు పాడైపోవడంతో వేల టన్నుల గోధుమలు, వరి సముద్రంలో పారబోస్తున్న ఉదంతాలు అప్పుడప్పుడూ చూస్తునే ఉన్నాం. దేశంలోని పోర్టుల నుంచి విదేశాలకు రోజూ ఆహార ధాన్యాలు ఎగుమతి అవుతునే ఉన్నాయి. ఇవన్నీ ఒక 30 […]
పితృపక్షం అంటే ఏమిటి..? పితృదేవతలకు మనం ఏం చేయాలి..?
Venu Swamy Parankusham పితృ పక్షం అంటే ఏమిటి..మహాలయ పక్షమున పితృదేవతలకు ఏం చేయాలి..? మహాలయ పక్షం 30సెప్టెంబర్ నుండి ప్రారంభమై అక్టోబర్ 14 మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది. ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి, మీ పితృదేవతలను స్మరించి వారికి నమస్కారము చేస్తూ నేను పితృ పక్షము పాటించుటకు అశక్తుడను. కావున నన్ను మన్నించి మీ దీవెనలు అందచేయండి అని మనస్సులో ప్రార్ధన చేయడం ద్వారా […]
నారాతో నేను… ఒక విస్తృత దేవతా వస్త్రాల కథ…
why this hallow agitations on chadrababu arrest
ఆశలు ఉన్నచోట ఆశాభంగాలు… అలాగే లక్ష్యాలు కూడా..!!
ఆశ, లక్ష్యం ఉన్నచోట ఆశాభంగం, అసంతృప్తి, ఒత్తిడి, నిరాశ, పరుగు ఉంటాయి…
1.26 కోట్లు ఒక లడ్డూ… ఓ విల్లా ధరలా బాగా ఖరీదైన భక్తి…
in hyderabad one ganesha laddoo prasadam auctioned for 1.26 crores
తలుపు తట్టిన చప్పుడు… డెయిలీ పేపర్ కింద పడిన చప్పుడు… నేనింకా బతికే ఉన్నాను…
వార్తాపత్రిక డెలివరీ బాయ్ చెప్పిన కధ హృదయాన్ని హత్తుకుని నా మనస్సుని కదిలించింది *”సౌండ్ ఆఫ్ నాకింగ్”* *పేపర్ బాయ్* : నేను వార్తాపత్రికను డెలివరీ చేస్తున్న ఇళ్లలో ఒక ఇంటి మెయిల్బాక్స్ తాళం వేసి ఉంది, అందువలన నేను వారి తలుపు తట్టాను. మిస్టర్ ప్రసాద్ రావు, అస్థిరమైన అడుగులతో నడుస్తున్న వృద్ధుడు, నెమ్మదిగా తలుపు తెరిచాడు. నేను అడిగాను, “సార్, మీ మెయిల్ బాక్స్ ఎంట్రన్స్ ఎందుకు బ్లాక్ చేయబడింది?” ఉద్దేశపూర్వకంగానే బ్లాక్ చేశాను […]
వయస్సును వెనక్కి మళ్లించి… మళ్లీ యవ్వనంలోకి తిరుగు ప్రయాణం…
మీకు యయాతి కథ తెలుసు కదా… ఏదో శాపానికి గురై వృద్ధాప్యం మీదపడితే… తన కొడుకుల్ని తమ యవ్వనాల్ని ఇవ్వమని ప్రాధేయపడతాడు… ఎవడూ ఇవ్వడు… చిన్న కొడుకు సరేనని ఇస్తాడు… యయాతి నవ యవ్వనుడు అవుతాడు… మిగతా కథ జోలికి పోవడం లేదు గానీ ఈ యవ్వనంలోకి రావడం వరకే పరిమితం అవుదాం ఇక్కడ… పొద్దున్నే ఓ మిత్రుడి పోస్టు చూడగానే ఈ కథే గుర్తొచ్చింది ఎందుకో గానీ… రేఖ పారిస్ వెళ్లి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని […]
భలే భలే… 955 అసలు ధరట… 1000 సబ్సిడీ అట… అద్దిరిపోయే స్కీమ్…
పొద్దున్నే ఓచోట… ఎక్కడ దొరికిందో గానీ ఒకాయన ఆంధ్రప్రభ పట్టుకున్నాడు… పక్కవాడిని అడుగుతున్నాడు… ‘‘కేసీయార్ ఒక్కో సిలిండర్ మీద 1000 రూపాయల సబ్సిడీ ఇస్తాడట… ఈ పేపరోడు రాసిండు… ఇప్పుడు సిలిండర్ రేటే 955… అంటే సిలిండర్ బుక్ చేస్తే 45 రూపాయలు ఉల్టా మనకే ఇస్తారా..? భలే ఉంది కదా స్కీమ్..?’’ ఆ పక్కన కూర్చున్నాయన తెల్లమొహం వేశాడు… ఏం సమాధానం ఇవ్వాలో తెలియడం లేదు… వెయ్యి రూపాయల సబ్సిడీ అని వార్త రాసిన విలేఖరి, […]
Right to Sit… సేల్స్ గరల్స్ కూర్చోకూడదా..? గంటల కొద్దీ నిలబడే ఉండాలా..?
(ప్రభాకర్ జైనీ)……. ఇయ్యాల నాకు చాన సంతోషంగ ఉన్నది. ఇంటర్మీడియట్ పరీక్షల ఫస్ట్ క్లాసుల పాసయిన. ఇంటర్నెట్ సెంటరుల ఇచ్చిన కాగితాన్ని తీసుకోని బయటకొచ్చి ఇంటి ముఖం పట్టిన. కనీ, దూరం పంటి కూలిపోయేటట్టున్న మా ఇల్లు చూసెటాలకు, నాకు నా భవిష్యత్తు ఎట్లుంటదో అర్థమయింది. పై చదువులు చదివించే స్థోమత మా ఇంట్లోల్లకు లేదని నాకర్థమైంది. మనసు చంపుకున్న. పై చదువులు చదువాలనే ఆశను మొగ్గల్నే తుంచేసుకున్న. మా ఊరు, పట్నం గదే, హైద్రాబాదుకు నలభై రెండు […]
నాయకుడు పదే పదే గట్టిగా చెప్పాడంటే… దానికి వ్యతిరేక దిశలో వెళ్తున్నట్టు లెక్క…
జర్నలిస్ట్ లు అవకాశం ఉన్నంత వరకు చదవాలి . 87 నుంచి 94 వరకు జిల్లాల్లో పని చేసేప్పుడు చాలా మంది జర్నలిస్ట్ లు జిల్లా పేజీలు మాత్రమే చదివేవారు . ఆ తరువాత మనం రాసిన వార్త మనం చదివితే పేపర్ చదివినట్టే అనే దశకు చేరుకున్నాం . ఇప్పుడు ఆ దశ కూడా దాటి పోయి టివిలో న్యూస్ చూడడమే తప్ప చదవడం అనే అలవాటు తగ్గిపోయింది .నాయకుల మాటల్లో మర్మం అర్థం చేసుకోవడానికి […]
- « Previous Page
- 1
- …
- 93
- 94
- 95
- 96
- 97
- …
- 124
- Next Page »