Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వావ్… బాబు గారు ఆల్రెడీ ఎల్‌నినో సంక్షోభాన్ని దాటేశారట..!

August 11, 2026 by M S R

.

Despite El Niño crisis Andhra Pradesh records 10.7 per cent growth in Q2 of 2025-26 … Agriculture registers highest growth of 13.5 per cent, industry 10.6 per cent and service sector 9.9 per cent… అని ప్లానింగ్ శాఖ చంద్రబాబుకు ఓ నివేదిక సమర్పించిందని తాజా వార్త… (వాట్సప్ న్యూస్ గ్రూపుల్లో కనిపిస్తోంది..)

అంటే, ఎల్‌నినో సంక్షోభం ఉన్నప్పటికీ 2025-26 రెండో త్రైమాసికంలో (జూలై- సెప్టెంబరు) 10.7 శాతం వృద్ధి నమోదైందట… అందులో 13.5 శాతం వాటా వ్యవసాయ రంగానిదేనట…
.
చంద్రబాబు పాలన అంటేనే ప్లానింగ్ శాఖ వింత నివేదికలు, విజయ గీతకలు, చంద్రబాబు కేరింతలు అని తనను చాన్నాళ్లుగా గమనించే ఉన్నతాధికారులు, జర్నలిస్టులందరికీ తెలుసు… తను అంకెల ప్రియుడు… జనం కళ్లకు గంతలు కట్టడంలో తన ప్లానింగ్ అధికారులు, తను భలే పోటీపడుతుంటారు…
.
ఎల్‌నినో సంక్షోభం ఉన్నప్పటికీ 2025- 2026, అంటే 2025 జూలై – సెప్టెంబరు త్రైమాసికంలో 10.7 శాతం గ్రోత్ చూపించిందట… అసలు ఎల్‌నినో సంక్షోభమే ఈ సంవత్సరం కదా, మరి గత సంవత్సరం ఎల్‌నినో సంక్షోభాన్ని తట్టుకుని గ్రోత్ సాధించడం ఏమిటి..? పైగా వ్యవసాయ రంగంలోనే 13.5 శాతం అధిక వృద్ధి అట…
.
అయ్యా, బాబూ… ఇప్పుడిప్పుడు ఎల్‌నినో ముదురుతోంది… ఇది ఈ సంవత్సరం బాపతు సంక్షోభం, గత ఏడాది ఇది లేదు… మరొకటీ తాజా వార్తలో కనిపించిన అంశం…
.
The State’s real Gross State Domestic Product (GSDP) growth rate increased from 6.5 per cent in 2023-24 to 9.9 per cent in the 2025-26 financial year…
.
అంటే జగన్ దిగిపోయినప్పుడు జస్ట్ 6.5 శాతం జీఎస్డీపీ ఉంటే, చంద్రబాబు దాన్ని రెండేళ్లలో 9.9 శాతానికి లాక్కొచ్చాడట… అలా జాతీయ సగటును దాటేశారట… భలే ఉంది, ప్లానింగ్ శాఖ వాళ్లు భలే ప్లానింగుతో భజిస్తారు, చంద్రబాబు అమందానంద కందళిత హృదయారవిందుడు అయిపోతాడు… భళి భళి…

Ads

ఇదేం లెక్క అని అడిగాం అనుకొండి, ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ మరో వంద పేజీల సమర్థన నివేదికను ఇవ్వగలదు..!!



  • ఎల్‌నినో ఆరంభం: ఈ ఏడాది వేసవి కాలం (మే-జూన్) నుంచే పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ఎల్‌ నినో సంకేతాలు కనిపించాయి.
  • తీవ్రత పెరిగే సమయం: ఆగస్టు నుంచి అక్టోబర్ 2026 మధ్య ఈ ప్రభావం గరిష్ఠ స్థాయికి (సూపర్ ఎల్‌ నినోగా) చేరుకుంటుంది.
  • ముగింపు: ఈ వాతావరణ పరిస్థితులు రాబోయే 2027 వసంతకాలం (మార్చి-ఏప్రిల్) వరకు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వావ్… బాబు గారు ఆల్రెడీ ఎల్‌నినో సంక్షోభాన్ని దాటేశారట..!
  • మధ్యవర్తిత్వం చేసిన- ఆ జర్నలిస్టులు, లాయర్లపైనా కేసు ?!
  • బాపు అంటే..? ఇదుగో ఈ కథ చదివితే అర్థమవుతుంది ఆ పదం విలువ..!!
  • మొత్తం 1000 – రెండు లివర్లు ఎక్స్‌ట్రా… ఈ మీల్స్ ఆంటీ ఇక సినిమా ఆంటీ !!
  • పిచాయ్ భార్య కోపం- మ్యాప్స్ పుట్టుకకు బీజం..! ఈ కథ నిజమా? అబద్ధమా?
  • పాడిందే పాటరా ! మోదీ పేరెత్తలేక… రేవంత్ మీద పెడ శోకాలు !!
  • రావణాయణం – ఒక ‘విలన్’ వెనుక పది తలల మేధో వైభవం !
  • KCR ఆ మాట అనకపోయినా రాసి ఉంటే మాత్రం ఆంధ్రజ్యోతి తప్పే !!
  • ఒకప్పటి కుర్రకారు ‘ధడకన్’… అండర్ వరల్డ్ దెబ్బకు అజ్ఞాతవాసం!
  • Nalsar ! న్యాయ విద్యార్థుల అసాధారణ లేఖను ఇలా అర్థం చేసుకోవాలి..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions