Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రాభవం కోల్పోతున్న చై-నా… ప్రచారాలే తప్ప ఒకప్పటి ర్యాంకులేవి..?!

June 16, 2025 by M S R

.

ఒకప్పుడు మెడికల్, ఇంజనీరింగ్ ఎంట్రన్సులు, ఇంటర్ ఫలితాలు వచ్చినప్పుడల్లా పత్రికల్లో ఫుల్ పేజీల్లో నారాయణ, చైతన్య ఫస్ట్ పేజీ, జాకెట్ యాడ్స్ కుమ్మేసేవి… మార్కులు, ర్యాంకులు… అసలు మేం తప్ప వేరే దిక్కులేదు ఈ జనానికి అన్నట్టుగా…

సరే, ఆ ర్యాంకుల ప్రకటనల్లో బోలెడు బాగోతాలున్నాయి, గతంలో చెప్పుకున్నాం, ఇంకా చెప్పుకుంటాం కూడా… అది కార్పొరేట్ ప్రపంచం… యాడ్స్‌తో ఎరవేసి వేల కోట్ల టర్నోవర్ సాధించడమే లక్ష్యం… తప్పుడు ప్రకటనలు చట్టరీత్యా తప్పు… కానీ పట్టించుకునేవాడెవడు చెప్పు…

Ads

ఇంటర్ బోర్డు సహా ఎవరికీ కొరడా పట్టుకోవడం చేతకాదు, ముఖ్యల చేతులు ఆల్రెడీ తడిసి ఉంటాయి కాబట్టి, కొరడా జారిపోతుంటుంది ఎప్పుడూ… దాదాపు రెండున్నర దశాబ్దాలు దాటి… ఆ రెండు ఎన్ని వేల కోట్లను పోగేసుకున్నాయో లెక్క తేలడం కష్టం… అఫ్‌కోర్స్, ఆ విద్యా విధానం, ఆ జైలు హాస్టళ్లలో, ఆ ర్యాంకులు, ఆ మార్కుల ఒత్తిళ్లు భరించలేక ఎందరో పిల్లలు ప్రాణాలు వదిలారు, అది మరో విషాదం…

హైదరాబాదులోనే ఈ రెండు కాలేజీల శాఖలు దాదాపు 200… దాదాపు ప్రతి ముఖ్య నగరంలోనూ బ్రాంచులు… అసలు ర్యాంకులు అంటే వీళ్లవే ఒకప్పుడు… ప్రతిష్టాత్మకమైన ఐఐటీ ర్యాంకులు కూడా… మీరు నిన్న నీట్ ఫలితాలు గమనించారా..?

మొదటి 17 ర్యాంకుల్లో తెలుగు పిల్లలు లేరు… సరే, ఎప్పటిలాగే యాడ్స్‌లో ఏవో ర్యాంకులు చెప్పుకున్నారు… ఆ యాడ్స్‌లో నిజాల సంగతి మనకు తెలిసిందే కదా… ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో క్వాలిఫై అయిన పిల్లల శాతం బాగా తగ్గింది… ఇది దేనికి సంకేతం..? చైతన్య, నారాయణ ప్రాభవం పతనావస్థ వైపు అని…

ఈ గొప్ప సంస్థలు రెండూ కలిసి, ఇంకెవడూ పోటీకి రాకుండా… చైనా అనే సంయుక్త సంస్థ పెట్టి, కొన్నేళ్లు రాజ్యమేలారు… చైనా సరుకు అంటేనే నాసిరకం కదా… ఈ చైనా కూడా అంతే, ఏమైందో ఏమో విడిపోయారు… మళ్లీ ఎవరి దుకాణం వాళ్లదే…

సామ్రాజ్య విస్తరణలాగా చిన్న చిన్న కాలేజీలను కలిపేసుకుని విస్తరించిన ఈ రాజ్యాలు ఇప్పుడు తమ కళను కోల్పోతున్నాయి… మీరు ఈమధ్య పత్రికల యాడ్స్ గమనిస్తే వేరే కాలేజీల యాడ్స్, ర్యాంకులు బాగా కనిపిస్తున్నాయి… అలెన్, రెజోనెన్స్, ఫిజిక్స్‌వాలా, ఎస్ఆర్, అల్పోర్స్ ఎట్సెట్రా… సరే, ఆకాశ్ ఎప్పట్నుంచో ఉన్నదే… గతంలో వేరే జిల్లా కేంద్రాల్లో బలంగా ఉన్న కాలేజీలు ఇప్పుడు హైదరాబాద్‌కు వచ్చేశాయి… స్కూళ్లు కూడా…! బోలెడు ఇంటర్నేషనల్ స్కూళ్లు… ప్రమాణాల గురించి కాసేపు పక్కన పెట్టేయండి…

నారాయణ, చైతన్య గుత్తాధిపత్యాన్ని ఎక్కడికక్కడ బ్రేక్ చేస్తున్నాయి.., అంతేకాదు, ఈ రెండు సంస్థల్లో పనిచేసిన సీనియర్లు కూడా కొలువులు మానేసి, జిల్లా కేంద్రాల్లో సొంత ‘కంపెనీలు’ పెట్టుకుంటున్నారు… రెండేళ్లుగా నారాయణ, చైతన్య సంస్థల్లో అడ్మిషన్ల సంఖ్య కూడా బాగా తగ్గిందని సమాచారం… రాను రాను తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ విద్య ఇంకా మార్పులకు గురికానుందనేది నిజం…

ఐనా… ప్రైవేటు యూనివర్శిటీలు ఎన్నో… మార్కులు, ర్యాంకులు ఏమీ పట్టించుకోకుండా, అడిగిన డబ్బు చేతిలో పెడితే చాలు… సీట్లు ఇచ్చేస్తున్న వాతావరణంలో… ఇంటర్ మార్కులకు ఏ విలువా లేని రోజుల్లో… ఇంజనీరింగ్ ప్రవేశపరీక్షల ర్యాంకులకు విలువేముంది..? కాకపోతే మెడిసిన్ సీట్లకు మాత్రం తప్పడం లేదు… అఫ్‌కోర్స్, డబ్బున్న అసాములకు అవీ బజారులో దొరికే సరుకులే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్రొఫెషనల్ ఆందోళనకారుల మ్యాపింగ్… ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ యాక్షన్…
  • జగమంత హాస్పిటల్ మాది… ఐసీయూ జీవితం మాది…
  • Konkona Sen … అమ్మతనానికి పెళ్లితే పనేంటి..? ప్రేమకు వయస్సుతో పనేంటి..?
  • ఈ దళపతి సీఎం జోసెఫ్ విజయ్ కాదు… రజినీకాంత్…
  • Drone Warfare … 5 లక్షల మందితో ‘డ్రోన్ ఆర్మీ’… ప్రత్యేక శిక్షణ…
  • నాటి ఆ స్వాతికిరణం గంగాధరం ఇప్పుడేం చేస్తున్నాడు..?
  • SCCL … సింగరేణి కుటుంబాలకు కోటి రూపాయల భరోసా…
  • ‘ఓటీటీలపై ఆశలు పెట్టుకుని సినిమాలు తీయకండి’… అల్లు ఉద్బోధ…
  • బాబును ఏమీ అనలేడు- పవన్‌ తప్పనలేడు- జగన్‌ను అనకుండా ఉండలేడు…
  • సీజేపీ ధర్నా… బొద్దింకల పేరిట ‘యాంటీ మోడీ’ సెక్షన్ హంగామా…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions