Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చిన్న చిన్న ఆశ ! కొందరికి అస్సలు నచ్చదు – వాళ్లు చూడొద్దు !!

July 31, 2026 by M S R

.

Prabhakar Jaini … మనసును ఒక మర యంత్రంలో వేసి తిప్పినప్పుడు ఎంతలా విలవిలలాడుతామో, ఈ సినిమా ముగిసిన తరువాత కొంత మంది సున్నిత హృదయులకు అలా అనిపిస్తుంది. అందరికీ కాదు సుమా.

జీవితమంతా నిర్లక్ష్యానికి గురయిన ఒక మధ్య వయసు వితంతువు, ఒక గ్రూపుతో కాశీ వస్తుంది. ఎందుకు వస్తుందంటే చిన్నప్పుడు వాళ్ళ నాన్న ఒక కథ చెబుతూ ‘మనం వీళ్ళందరికీ దూరంగా కాశీ వెళ్ళిపోయి దేవుణ్ణి పూజించుకుందాం.’ అంటాడు. ఆ మాట మనసులో నిలిచి పోతుంది.

Ads

భర్త చనిపోయిన తర్వాత సంవత్సరంన్నరకు, లీల (మధుబాల- రోజా ఫేమ్) తంజావూరు నుండి కాశీ వస్తుంది. ఆమెకు ఆ గ్రూపు మనుషులు నచ్చరు. ఇంతలో, ఆమె బ్యాగు దొంగ కొట్టేస్తాడు. గ్రూపు నుండి విడిపోతుంది. తమిళం తప్ప మరో భాష రాదు. ఢిల్లీలో ఉండే సవతి కొడుకు ఆమెను కాశీలోనే వదిలేసి పొమ్మని గ్రూపు ఆర్గనైజర్ కు చెపుతాడు.

అలా, కాశీ మెట్ల మీద కూర్చుని కుమిలి కుమిలి ఏడుస్తుంటే, తెలుగు మాస్టారు, మాధవన్ (ఇంద్రాన్స్) కలుస్తాడు. కాశీ ఎంత పవిత్రమైన క్షేత్రమో, అంత ప్రమాదకరమైన ప్రదేశం కూడా. అందుకే, ఆమె అవస్థను గమనించి ఆమెకు తోడుగా నిలుస్తాడు.

ఆమె ‘నేను మిమ్మల్ని నమ్మొచ్చా?’ అని అడిగితే, ‘అది మీ ఇష్టం’ అంటాడు. మాటల్లో, మాధవన్ మార్చిలో మేము ‘సిమ్లా వెళ్తున్నాం’ అని చెబితే, “అక్కడ ‘పని’ ఉంటుందా?” అని అడుగుతుంది ఆశగా. ‘పని’ అంటే ‘మంచు’. మాధవన్” ‘పని’ ఉంటుంది. మీరూ వొస్తారా మాతో?” అని అడుగుతాడు.

chinni chinni asai

  • ఆమె ముఖం ఒక్క క్షణం వెలిగిపోతుంది. “కానీ నేనెలా రాగలను మీతో!” అని నిరాశగా అంటుంది. అదే #ఆమె_చిన్న_చిన్న_ఆశ. అటువంటివే ఎన్నో కోరికలు ఆమె మనసులో సమాధి అయిపోయాయి. అందులో నాట్యం ఒకటి, లస్సీ తాగడం ఒకటి, నౌకలో విహరించడం, గంగా హారతి చూడడం… ఇటువంటివే.

మాధవన్ వాటినన్నింటినీ తీరుస్తానంటాడు. కూతురి పుట్టినరోజు కోసం పట్టు చీరె కొంటే అక్కడ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంటుంది. లీలకు కూడా కొంటాడు. ఆ చీరె కట్టుకున్నప్పుడు పరుగున వెళ్ళి మల్లెపూలు కొనుక్కొస్తాడు. అది #మాధవన్_చిన్న_చిన్న_ఆశ అన్న మాట.

కానీ, ఇద్దరూ బయటపడరు. ఇంతలో గ్రూపు వాళ్ళు కలుస్తారు. వాళ్ళతో కలిసి వెళ్ళడం లీలకు ఇష్టం ఉండదు. మాధవన్ను “నువ్వూ నాతో తంజావూరు వస్తావా?” అని అడుగుతుంది. ”ఎందుకు?” అంటే ఆమె చెప్పిన సమాధానం మనసును రంపపు కోతకు గురి చేస్తుంది.

  • తరువాత ఏం జరిగిందో సినిమా చూడండి. ఇప్పటికే కథ ఎక్కువగా చెప్పాను.

చిన్న చిన్న ఆశ

ఇటువంటి సినిమాలు తీయాలంటే మంచి నటులు దొరకాలి. డబ్బులు పోయినా ఫర్వాలేదనే నిర్మాత దొరకాలి. ఇటువంటి సున్నితమైన దృశ్యకావ్యాన్ని ప్రతీ రాత్రి మనసులో దర్శించుకుంటూ ఇంప్రూవైజ్ చేసే దర్శకుడు కావాలి. ఈ సినిమా చూసి, గుండె లోతుల్లో సమాధి చేసుకున్న కోరికలను తీర్చుకోలేక, యాంత్రిక జీవనం గడుపుతున్న వారు ఒక కన్నీటి చుక్క కారిస్తే, ఈ సినిమా తీసిన వారి కృషి, కష్టం సార్థకమైనట్టే.

ఈ రొడ్డకొట్టుడు, మాస్ మసాలా చిత్రాలు, రక్తపాతాలు, మాసిన బట్టలు, మురికి గడ్డాలు, చీకటి సామ్రాజ్యాలు, పురాణాలను, చరిత్రను బూతులుగా మార్చే కథలకు, ఐటెం సాంగులకు అలవాటు పడ్డ బురదగుంట మనస్తత్వాలున్న మనుషులకు ఈ సినిమా నచ్చదు. మీరు చూడకండి కూడా! – ప్రభాకర్ జైనీ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అనుబంధాల పలకరింపు కోసం ఓ ముసలి మనసు తన్లాట… అంతే…
  • తప్పు పైలట్లలో లేదు – బోయింగ్ విమానాల్లోనే లోపాలు- ప్రమాదాలు !!
  • ఆర్మీ జవాన్లు జెన్-జీ కాదా? ఈ పిల్లది మరీ ముదురు పైత్యం !!
  • అమిత్ షా కూర్చునే భంగిమ ! ఇలా చాలా ఈక్వేషన్లను పట్టిస్తుంది…!!
  • తెలంగాణ కాంగ్రెస్‌లో హరా‘కిరికిరి’ బ్యాచ్ ! సోయి లేని హైకమాండ్ !!
  • చిన్న అల్లుడు… ఇతరుల దర్శకత్వంలోనూ దాసరి నటించెను !
  • 4 వేల కోట్లు కాదు – 8 లక్షలు- 50 దేశాలు- మన తొలి పాన్ వరల్డ్ జెండా !!
  • భారం- ప్రేక్షకుడు ఇంకా దూరం- కూర్చున్న కొమ్మ నరుక్కునే టాలీవుడ్ !
  • జలధికన్నా లోతైన ప్రేమ ! ఓ పట్టాన నమ్మలేని వాస్తవ కథ !!
  • ‘నాన్నా… ఈసారి బామ్మ దగ్గరికి నేనొక్కడినే వెళ్తాను ప్లీజ్…’

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions