.
Nàgaràju Munnuru & రవి ఈయన్వీ …. స్టాక్ మార్కెట్ అనబడు జూదగృహం/ వేశ్యాగృహం.
తుగ్లక్ సంస్థ ఒక వారం పది రోజుల క్రితం లేని సమస్యను నెత్తికెత్తుకుని, CAS అన్న విధానాన్ని తెచ్చింది. Closing Auction Session. ఇదేంటి అని ఇదివరకటి పోస్ట్ లలో వ్రాశాను.
నిన్న సెన్సెక్స్ ఎక్స్పైరీ రోజు ఈ CAS వికృతరూపం బయటకొచ్చింది.
స్టాక్ మార్కెట్ లో ఆప్షన్ ట్రేడింగ్ 3:30 కు ముగుస్తుంది. ఈ మధ్య మాత్రం, కొత్త సవరణల ప్రకారం 3:27 నుంచి కాసేపు నిలిచిపోయి, తిరిగి 3:30 కు మొదలై, పది నిముషాల పిదప 3:40 కి ముగుస్తోంది.
ఎక్స్పైరీ రోజు సాధారణంగా సూచీ ఎక్కడ క్లోజ్ అవుతుందో, అక్కడకు పైన ఉన్న కాల్స్, క్రింద ఉన్న పుట్స్ సున్న అవుతాయి.
Ads
ఉదాహరణకు: నిన్న సెన్సెక్స్ 3:25 కు 77860 వద్ద ఉంది. మామూలుగా అయితే చివరి కొద్ది నిముషాల్లో పెద్దగా పెరగటం తరగటం ఉండదు. దరిమిలా 78000 వద్ద అంటే చివర్న తచ్చాడుతున్న 77860 కి 140 పాయింట్స్ ఎగువన ఉన్న “కాల్” కేవలం 2 రు. వద్ద ఉంది.
ఎవరైనా ట్రేడర్ ఒక పది ఇరవై రోజుల ముందు 78000 కాల్ ను 40 రూ. వద్ద అమ్మాడనుకోండి. అతడికి 40 – 2 = 38 రు. అనగా, 38 * 10 (లాట్ సైజ్) = 380 రూ. లాభం. (అతడు వెచ్చించిన సొమ్ము 1.50 లక్షలు.)
అయితే ఆ లాభం ఎప్పుడు? తన పొజిషన్ క్లోజ్ చేసుకుంటే.
అలా పొజిషన్ క్లోజ్ చేసుకోకపోతే బ్రోకర్ ఆటో క్లోజ్ చేస్తాడు తర్వాత రోజు.
నిన్న చివరి 3:29 తో 3:31 మధ్యన 2 నిముషాల్లో 2 రూ. ఉన్న కాల్ కాస్తా 0 అవవలసింది పోయి, 80 కి పెర్గింది.
అంటే 380 రూ. లాభం వచ్చేవాడు 42 * 10 = 420 రూ. నష్టం చూడాల్సి వచ్చింది.
తన తప్పు ఏ మాత్రం లేకపోయినా!
3:38 నుంచి 3:31 మధ్యలో 2 మిలియన్ల ఆర్డర్లు ఉన్నది 6 మిలియన్లకు పెరిగినట్లు ఓపెన్ ఇంటరెస్ట్ సూచించింది. (ఓపెన్ ఇంటరెస్ట్ అన్నది లావాదేవీలను సూచించే స్క్రీన్).
అంటే, “ఎవరో” చివరి నిముషాన 4 మిలియన్ల ఆర్డర్లు పెట్టారు, 2 నిముషాల్లో వ్యాపారం ముగుస్తుంది అనగా.
ఆ అదనపు 40 లక్షల “ఎవరో” గారికి, ఒక రెండు నిముషాలలో వచ్చిన లాభం = 40 లక్షలు * 10 = నాలుగు కోట్లు.
అఫ్ కోర్స్ ఆ పొజిషన్స్ కు డబ్బు పెట్టుబడి పెట్టాలి.
2 నిముషాల్లో, రెండే రెండు నిముషాల్లో ఒక 400 కోట్ల పెట్టుబడితో 40 కోట్లు ఈజీగా సంపాదించవచ్చు అని తెలిస్తే, ఆ సొమ్ము ఎవరు పెట్టగలరు?
డబ్బు అప్పనంగా బ్లాక్ మనీ మూలుగుతున్న లేదా జూద ప్రియుడైన ధనవంతుడు – వీడు పెడతాడు.
నిన్న అలాగే 78000 వద్ద ఉన్న పుట్, 160 రుపాయలది కాస్తా 0 అగిపోయింది. ఒక లాట్ కు అంటే లక్షా యాభై వేలకు 1600 ఒక్క నిముషంలో లాభం.
చక్కగా ముచ్చటగా నడుస్తున్న ఒక సంసారాన్ని, గృహం లాంటి స్టాక్ మార్కెట్ ను వేశ్యాగృహంగా, జూదానికి అడ్డాలాగా, పెద్ద తలలు దోచుకుపోవడానికి వీలుగా చేసింది తుగ్లక్ SEBI.
ఇదేదో ఆ చివరి రెండు నిముషాలకు చెందినది కాదు, ఈ వ్యవహారంతో వచ్చే నష్టాలు ఇంకా బోల్డు!
ఒకపక్క సామాన్య ట్రేడర్లు మదుపరులు నష్టపోతుంటే, వారిని ఎడుకేట్ చెయ్యడం అటుంచి, ఉన్న వ్యవస్థను జూదంలా మార్చడానికి పూనుకొంటున్నది SEBI.
వాడు, వాడు చేస్తున్న పెంటను వెనక్కు తీసుకొమ్మని మొన్న 12 వ తేదీ రీటెయిల్ ట్రేడర్లు చాలామంది ఒక రోజు బంద్ పాటించారు.
ఇప్పుడు ఒకటి. 3:20 తర్వాత ఆప్షన్ ట్రేడర్లు కొంచెం జాగ్రత్తగా – ముందుగానే తమ పొజిషన్స్ క్లోజ్ చేసుకోవాలి. అది తప్పనిసరి. లేపోతే భారీ నష్టాలు…
Share this Article