.
Srini Journalist …. మీకు తెలియని ఒక అంతర్జాతీయ పొలిటికల్ మిస్టరీ: విద్యార్థులను ముందు పెట్టి దేశాలను తలకిందులు చేసే ఆ ‘సెర్బియా మాస్టర్ ప్లాన్’ కథ!
మన చుట్టూ, ప్రపంచ దేశాల్లో అకస్మాత్తుగా స్టూడెంట్స్ రోడ్లపైకి రావడం, నిరసనలు ఉధృతం కావడం, ప్రభుత్వాలు కూలిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇదంతా ఏదో యాదృచ్ఛికంగా జరుగుతుందని అందరూ అనుకుంటారు. కానీ దీని వెనుక ఒక పక్కా ప్లాన్, ఒక అంతర్జాతీయ “కలర్ రివల్యూషన్ బ్లూప్రింట్” (Color Revolution Blueprint) ఉందనే విషయం చాలా మందికి తెలియదు.
Ads
ఆ కథ సెర్బియాలో మొదలై, మొన్నటి బంగ్లాదేశ్ వరకు ఎలా సాగిందో, అలాగే మన దేశంలో కూడా ఇది ఎలా ఎంట్రీ ఇచ్చి ఆగిపోయిందో ఇక్కడ పూర్తిగా చూద్దాం. అసలు ఏంటి ఈ బ్లూప్రింట్? ఎక్కడ మొదలైంది?
అమెరికాకు చెందిన జీన్ షార్ప్ అనే రాజకీయ శాస్త్రవేత్త రాసిన సిద్ధాంతాల ఆధారంగా ఈ విప్లవ బ్లూప్రింట్ పుట్టింది. ఒక హింసాత్మక సైనిక తిరుగుబాటు కాకుండా, యువతను, విద్యార్థులను ముందు పెట్టి శాంతియుత నిరసనల ద్వారా ఒక ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టవచ్చో ఇందులో రాసి ఉంది. వ్యవస్థలోని కీలక స్తంభాలైన పోలీసులు, government ఎకానమీలను దెబ్బతీయడం దీని ముఖ్య ఉద్దేశం.
దీనిని మొదటిసారిగా సెర్బియా (Serbia) దేశంలో 1998- 2000 మధ్య కాలంలో ప్రయోగించారు. అక్కడ స్లోబోదాన్ మిలోసెవిచ్ అనే పాలకుడికి వ్యతిరేకంగా “ఓట్పోర్!” (Otpor! – అంటే ప్రతిఘటన) అనే విద్యార్థి సంఘం ఏర్పాటయింది. వారు ఒక బిగించిన పిడికిలిని తమ లోగోగా పెట్టుకుని, జోకులు, వీధి నాటకాలు, మీమ్స్ ద్వారా ప్రభుత్వాన్ని అపహాస్యం చేశారు.
దీనిని “లాఫ్టివిజం” (Laughtivism) అంటారు. చివరికి 2000లో ‘బుల్డోజర్ విప్లవం’ ద్వారా ఆ ప్రభుత్వాన్ని కూల్చేశారు. ఆ తర్వాత ఈ సెర్బియా యువకులే ‘క్యాన్వాస్’ (CANVAS) అనే సంస్థను పెట్టి, ఈ విప్లవ బ్లూప్రింట్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టూడెంట్స్ గ్రూపులకు ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించారు.
ఉక్రెయిన్, అరబ్ స్ప్రింగ్ నుండి బంగ్లాదేశ్, నేపాల్ వరకు ఈ హంగామా!
ఉక్రెయిన్…: ‘పోరా!’ అనే విద్యార్థి గ్రూప్ సెర్బియా బ్లూప్రింట్‌ను వాడి, ఆరెంజ్ రంగును తమ విప్లవ చిహ్నంగా మార్చుకుని, భారీ టెంట్ సిటీలు వేసి ప్రభుత్వాన్ని మార్చేశారు. దీనినే ‘ఆరెంజ్ రివల్యూషన్’ అంటారు.
ఈజిప్ట్ / అరబ్ స్ప్రింగ్…: ఇక్కడి ‘ఏప్రిల్ 6 యూత్ మూవ్‌మెంట్’ యువకులు సెర్బియా వెళ్లి ట్రైనింగ్ తీసుకున్నారు. ఫేస్‌బుక్ ద్వారా రాత్రికి రాత్రే వేలాది మందిని తహ్రీర్ స్క్వేర్‌లో పోగు చేసి, 30 ఏళ్ల హోస్నీ ముబారక్ పాలనను ముగించారు.
బంగ్లాదేశ్…: కేవలం స్టూడెంట్స్ రిజర్వేషన్ల (కోటా) కోసం మొదలైన గొడవ, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా ‘యాంటీ- డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మూవ్‌మెంట్’ గా మారింది. ప్రభుత్వం ఇంటర్నెట్ ఆపేసినా ఈ జెన్-జీ (Gen-Z) విద్యార్థులు డిజిటల్ టూల్స్ వాడి దేశాన్ని స్తంభింపజేశారు. చివరికి ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం విడిచి పారిపోయేలా చేశారు.
నేపాల్ (కేపీ శర్మ ఓలీ హయాంలో ‘జెన్-జీ’ తిరుగుబాటు)…: ఇక్కడ కూడా సరిగ్గా బంగ్లాదేశ్ తరహా బ్లూప్రింట్ అమలులోకి వచ్చింది. ప్రధాని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం సోషల్ మీడియాపై అకస్మాత్తుగా నిషేధం విధించడంతో, ‘జెన్-జీ’ (Gen-Z) విద్యార్థులు ఉగ్రుడయ్యారు.
ప్రభుత్వ అవినీతి, నిరుద్యోగంపై సోషల్ మీడియా వేదికగా సాగిన ఈ డిజిటల్ ఉద్యమం, క్షణాల్లో వీధుల్లోకి చేరి ఉధృత రూపం దాల్చింది. విద్యార్థుల నిరసనలతో కాఠ్మండు అతలాకుతలమైంది. పరిస్థితి పూర్తిగా చేతులు దాటిపోవడంతో, తీవ్ర ప్రజా ఒత్తిడికి తలొగ్గి ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
గతంలో సెర్బియాలో కరపత్రాలు, గోడ పత్రికల ద్వారా సాగిన ఈ బ్లూప్రింట్, నేడు జెన్-జీ చేతుల్లో స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌ల ద్వారా ప్రతి దేశంలోని యువతకు చేరువవుతోంది.
సోషల్ మీడియా ఆయుధీకరణ…: టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఏఐ (AI) ద్వారా మీమ్స్, చిన్న వీడియోలను సృష్టించి భావోద్వేగాలను వేగంగా రెచ్చగొట్టడం.
వికేంద్రీకృత సమూహాలు (Decentralized Swarming): ఎన్‌క్రిప్టెడ్ యాప్స్ ద్వారా ఒక నిర్దిష్ట నాయకుడు లేకుండానే, అకస్మాత్తుగా వేలాది మంది విద్యార్థులు ఒక చోట గుమిగూడడం (Flash Mobs). దీనివల్ల పోలీసులకు ముందే సమాచారం అందడం కష్టమవుతుంది.
భారతదేశంలో ఈ బ్లూప్రింట్ ఎందుకు ఫెయిల్ అయింది?
ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. సరిగ్గా ఇదే బ్లూప్రింట్‌ను మన దేశంలో కూడా ప్రయోగించడానికి ఒక ప్రయత్నం జరిగింది. సోషల్ మీడియా వేదికగా “కాక్రోచ్ జనతా పార్టీ” (Cockroach Janata Party – CJP) అనే ఒక వెటకారపు ఆన్‌లైన్ స్టూడెంట్/ యువజన ఉద్యమం డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్ మీద చాలా వేగంగా వ్యాపించింది.
సెర్బియాలోని ‘ఓట్పోర్’ లాగే వీరు కూడా మీమ్స్, కామెడీ, వ్యంగ్యాస్త్రాల ద్వారా ప్రస్తుత మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తిని పెంచి, యువతను పెద్ద ఎత్తున రోడ్లపైకి లాగాలని చూశారు. కానీ, మిగతా దేశాల్లో వర్కవుట్ అయిన ఈ బ్లూప్రింట్ భారతదేశంలో ఎందుకు ఆగిపోయిందంటే: సరిగ్గా ఎగ్జాక్ట్ టైమ్‌లో మాస్టర్ స్ట్రోక్ (Strategic Resignation)…
ఉద్యమం ఉధృత రూపం దాల్చుతూ, పరిస్థితి ఇక పూర్తిగా చేతులు దాటిపోతుంది అనుకున్న అత్యంత కీలకమైన తరుణంలో మోదీ ప్రభుత్వం ఒక ఊహించని వ్యూహాత్మక అడుగు వేసింది. విద్యార్థులు డిమాండ్ చేస్తున్న విధంగానే, అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించారు.
అతి త్వరగా స్పందించి కాకుండా, కరెక్ట్ టైమ్‌లో తీసుకున్న ఈ నిర్ణయంతో నిరసనల్లోని ప్రధానమైన తీవ్రత ఒక్కసారిగా తగ్గిపోయింది. ప్రభుత్వం తమ డిమాండ్‌కు లొంగిపోవడంతో, ఆ తర్వాత ఏం చేయాలో, ఏ ముఖం పెట్టుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలో అర్థం కాక CJP వెనక్కి తగ్గక తప్పలేదు…
Share this Article