యానిమల్ వంగా సందీప్‌రెడ్డి తనను ఎవరు విమర్శించినా భలే కౌంటర్లు ఇస్తున్నాను అని ఆనందపడుతున్నాడేమో తెలియదు గానీ తను మరో కోణంలో విశ్లేషించుకోవల్సిన అవసరం కనిపిస్తోంది… ఎలాగంటే..?
తనను రచయిత జావేద్ అక్తర్, కంగనా, తాప్సీ, కొంకణా సింగ్, కిరణ్ రావు తదితరులు గతంలోనే సినిమా తీరును విమర్శించారు… చివరకు ఆ సినిమా టీంలో పనిచేసిన నటుడు ఆదిల్ హుస్సేన్ అసలు ఆ సినిమా ఎందుకు అంగీకరించానురా బాబూ అన్నట్టు మాట్లాడాడు…
దీనికి వంగా సందీప్‌రెడ్డి ఉగ్రుడైపోయి, అసలు నిన్ను తీసుకున్నందుకు నేను బాధపడాలి, నీకెందుకు బాధ, నిన్ను తీసుకున్నందుకు నీ పోర్షన్ మొత్తం ఎఐ సహకారంతో మార్చేస్తాను ఏమనుకుంటున్నావో… అన్నట్టు కౌంటర్ వేశాడు… అలాగే జావేద్ తదితరులకు కూడా ఏవేవో సమాధానాలు ఇచ్చాడు… అది ఒక కోణం… కానీ…?
Ads
సాధారణంగా బయటివారు విమర్శించడం వేరు… అది ప్రతి సినిమాలకూ ఉండేదే… సినిమాలకే కాదు, క్రియేటివ్ ఫీల్డులోనే కామన్… కానీ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఏం నచ్చినా నచ్చకపోయినా బయటపడిపోయి కామెంట్లు చేయరు… చేస్తే తరువాత తమ కెరీర్‌కు ఇబ్బందులొస్తాయనే సంకోచం ఉంటుంది… ప్రత్యేకించి దర్శకులు, సక్సెస్‌లో ఉన్న క్రియేటర్స్ జోలికి అసలే పోరు…
కానీ యానిమల్ మీద బయట బాగా దుమ్మురేగింది, అది సరే, ఇండస్ట్రీ లోపల కూడా ఓ ఏవగింపు, ఓ వ్యతిరేకత కనిపిస్తోంది… నేను చేసేదే కరెక్టు, నాపై విమర్శను యాక్సెప్ట్ చేయను, చేయలేను అనుకునే చాలామంది తరువాత కాలంలో నేల మీదకు దిగివచ్చేలా చేస్తుంది కాలం… చాన్నాళ్లు పట్టదు… వంగా వారి సినిమాలన్నీ ఇప్పటికి సేమ్ టైప్… మొరటుతనం, వెకిలితనం మూర్తీభవించిన పాత్రలు…
సరే, దాన్ని వదిలేస్తే… డైరెక్టర్ హరీశ్ శంకర్ మీద సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయకుడు చేసిన విమర్శ మరోరకం… ఎప్పుడో పదేళ్ల నాటి సినిమాను ప్రస్తావిస్తూ ఏవో కామెంట్స్ చేశాడు… పదే పదే నా పనికి అడ్డుపడుతున్నా సరే డైరెక్టర్ హరీశ్ శంకర్ అప్పగించిన పని చేస్తూ పోయానని చెప్పాడు ఎక్కడో… అది కాస్తా హరీశ్ శంకర్‌కు చర్రుమంది…
అసలే కాస్త టెంపర్ ఉన్న కేరక్టర్ కదా… వెంటనే రియాక్టయ్యాడు… బహిరంగలేఖ పేరిట ఏదేదో కౌంటర్ ఇచ్చాడు… నిన్ను ఓ దశలో తీసేస్తామనే ప్రస్తావన వస్తే నేను అడ్డుకున్నాను తెలుసా అన్నాడు… బహిరంగచర్చకూ రెడీ అంటూ ఓ పిచ్చి సవాల్ విసిరాడు…
డైరెక్టర్లు అనగానే పెద్దగా భయభక్తులు చూపే కాలం పోతోంది… తమకు నచ్చని అంశాల్ని ఇతర క్రాఫ్ట్స్ వాళ్లు బహిరంగంగానే విశ్లేషిస్తున్నారు.., ఇదీ ఇంట్రస్టింగు… గతంలో సౌత్ స్టార్ హీరోల ధోరణి మీద రాధిక ఆప్టే, టాప్ దర్శకుడు రాఘవేంద్రరావు మీద తాప్సి తదితరులు కామెంట్స్ చదివినవే…
అంతెందుకు..? గతంలో హీరోయిన్లు ఒకసారి కమిటైపోతే ఇక ఆయా ప్రాజెక్టుల నుంచి ఎన్ని ఇబ్బందులొచ్చినా సరే తప్పుకునేవాళ్లు కాదు… అలా తప్పుకుంటే ఇండస్ట్రీలో పెద్దలు తొక్కేస్తారనే భయం… కానీ ఇప్పుడు సింపుల్‌గా క్రియేటివ్ డిఫరెన్సెస్ పేరుతో అలా బయటికి వచ్చేస్తున్నారు… ఇదీ ఓ ఇంట్రస్టింగ్ పరిణామమే… దిల్ రాజు తొక్కివేత స్ట్రాటజీలకు వెరవకుండా హనుమాన్ టీం ధైర్యంగా నిలబడిన తీరు కూడా చెప్పుకోవచ్చు…!
Share this Article