.
పిల్లవాడు ఏమీ కాదు… పిడుగు! అదొక క్రికెట్ అద్భుతం! వైభవ్ సూర్యవంశీ గురించి వరల్డ్ స్పోర్ట్స్ మీడియా చెబుతున్న ఒక మాట… వండర్ బాయ్!
నిన్న (నవంబర్ 24, 2026) దోహాలో యూఏఈ (UAE) తో జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ లిస్ట్-A మ్యాచ్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 53 బంతుల్లోనే 204 పరుగులు (28 సిక్సర్లు, 7 ఫోర్లు) చేసి మొత్తం 5 ప్రధాన ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు… ఇదీ వార్తల సారాంశం…
Ads
కానీ అయిదు కాదు, సరిగ్గా లెక్కేస్తే ఎనిమిది రికార్డులు తేలుతాయి… అవేమిటో చెప్పుకుందాం… కాకపోతే కొన్ని రకరకాల వ్యాఖ్యానాలు… ఇదేదో ఆ డర్టీ పాకిస్థాన్ మీద చేసి ఉంటే ఇండియా పండుగ జరుపుకునేది…. అబ్బే, నాసిరకం యూఏఈ జట్టు మీద చేసిన రికార్డులకు విలువ ఏముంది..? ఐనా ఇది సీనియర్ క్రికెట్ పోటీ కాదు కదా, ఈ రికార్డులకు గుర్తింపు ఏముంది..? యూఏఈ బౌలర్లు మరీ పేలవమైన బంతులు వేశారు..?
కానీ తప్పు… పాకిస్థాన్ మీద ఈ రికార్డులు క్రియేట్ చేసి ఉంటే మజా ఉండేదనే మాట కరెక్టే… కానీ యూఏఈ బౌలర్లు మరీ పేలవమైన బంతులు వేశారనేది కరెక్టు కాదు… ఇదే సూర్యవంశీ ఒకసారి స్టంప్ ఔట్ తృటిలో తప్పించుకున్నాడు… రెండుమూడుసార్లు అడ్డంగా బీటయ్యాడు… కొన్ని బాల్స్ తప్పనిసరై డిఫెన్స్ ఆడాల్సి వచ్చింది… యూఏఈ బౌలర్లు అభిషేక్ శర్మ, ప్రభ్ సిమ్రన్ సింగ్‌లను కూడా త్వరగానే ఔట్ చేశారు… రింకూ కూడా తడబడ్డాడు…
సో, యూఏఈ మరీ తీసిపారేసేలా ఏమీ ఆడలేదు… కాకపోతే సూర్యవంశీ వెలుతురు ముందు మరీ చెత్త రికార్డులను నమోదు చేసుకుంది… సీనియర్ క్రికెట్ అయితేనే రికార్డులకు గుర్తింపు అనే వ్యాఖ్యానమూ సరికాదు… ఇది కూడా ప్రొఫెషనల్ క్రికెట్ మ్యాచ్ కిందకే వస్తుంది… సరే, వైభవ్ రికార్డులు వరుసగా ఇవీ…
ఫాస్టెస్ట్ లిస్ట్-A డబుల్ సెంచరీ (200 ) 52 బంతుల్లో103 బంతుల్లో — గతంలో చాడ్ బౌస్ (2024)
ఫాస్టెస్ట్ లిస్ట్-A సెంచరీ (100) 28 బంతుల్లో29 బంతుల్లో — గతంలో జేక్ ఫ్రేజర్- మెక్‌గుర్క్ (2023)
ఫాస్టెస్ట్ లిస్ట్-A 150 పరుగులు 40 బంతుల్లో59 బంతుల్లో — గతంలో ఈ రికార్డు వైభవ్ సూర్యవంశీదే (2025)
లిస్ట్-A సెంచరీ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్ 384.90 (53 బంతుల్లో 204) … గతంలో 338.63 — ఏబీ డివిలియర్స్ (44 బంతుల్లో 149, 2015)
ప్రొఫెషనల్ క్రికెట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు 28 సిక్సర్లు … గతంలో 26 సిక్సర్లు — తన్మయ్ అగర్వాల్ (రంజీ ట్రోఫీ, 2024)
లిస్ట్-A ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు 28 సిక్సర్లు… గతంలో 23 సిక్సర్లు — డార్సీ షార్ట్ (2018)
వీటికి అదనంగా, అతి పిన్న వయసులో (15 ఏళ్ల 242 రోజులు) లిస్ట్-A డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు…
అలాగే ఇండియా-A జట్టు 10 ఓవర్లలోనే 183 పరుగులు (లిస్ట్-A చరిత్రలో 10 ఓవర్లలో అత్యధిక టీమ్ స్కోరు) చేయడంలోనూ వైభవ్ కీలక పాత్ర పోషించి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు…
అందరూ ఈ వైభవం గురించే మాట్లాడుతున్నారు… కానీ తన ధాటికి ఎదుటిజట్టు ఆటగాళ్లు కూడా కొన్ని చెత్త రికార్డులను తమ పేరిట రాసుకున్నారు… ఈ వైభోగం వెనుక కనిపించని వాళ్ల విషాదం అది… అవీ చెప్పుకుందాం…
1. జట్టు పరంగా చెత్త రికార్డులు (Team Bowling Lowlights)
-
5 ఓవర్లలోనే 100 పరుగులు సమర్పించుకోవడం: లిస్ట్-A క్రికెట్ చరిత్రలో ఇన్నింగ్స్ ఆరంభమైన తొలి 5 ఓవర్లలోనే 100 పరుగులు ఇచ్చిన జట్టుగా యూఏఈ నిలిచింది (గతంలో న్యూజిలాండ్, భారత్-A పేరిట 6.3 ఓవర్ల రికార్డు ఉండేది).
-
10 ఓవర్లలో అత్యధిక పరుగులు ఇవ్వడం: తొలి 10 ఓవర్లలో ఏకంగా 183 పరుగులు సమర్పించుకొని లిస్ట్-A క్రికెట్‌లో అత్యంత ఖరీదైన ఆరంభాన్ని నమోదు చేసింది.
-
అత్యధిక జట్టు ఎకానమీ రేటు (17.72): 250 పరుగుల లక్ష్యాన్ని కేవలం 14.2 ఓవర్లలోనే (214 బంతులు మిగిలి ఉండగానే) సమర్పించుకుంది. పూర్తి ఇన్నింగ్స్‌లో యూఏఈ బౌలర్ల సగటు ఎకానమీ 17.72 గా నమోదైంది.
-
ప్రతి బౌలర్ 10+ ఎకానమీ: మ్యాచ్‌లో బౌలింగ్ చేసిన ఐదుగురు యూఏఈ బౌలర్లూ కనీసం 11 లేదా అంతకంటే ఎక్కువ ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకోవడం మరో చెత్త రికార్డు.
2. యూఏఈ బౌలర్ల వ్యక్తిగత చెత్త గణాంకాలు
ముఖ్యంగా పేసర్ ఇబ్రార్ షా అహ్మద్, స్పిన్నర్ ఉద్దీష్ సూరి ఓవర్కు 23 కంటే ఎక్కువ పరుగులు ఇచ్చి చెత్త రికార్డుల్లో చేరారు…
ఉద్దీష్ సూరి 2 ఓవర్లు, 48 పరుగులు, ఎకానమీ రేటు 24… మ్యాచులో అత్యంత దారుణమైన ఎకానమీ రేటు
ఇబ్రార్ షా అహ్మద్ 3 ఓవర్లు, 71 పరుగులు, ఎకానమీ రేటు 23.67… లిస్ట్ ఏ క్రికెట్‌లో 3 ఓవర్ల స్పెల్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్లలో ఒకడిగా నిలిచాడు…
బాసిల్ హమీద్ (కెప్టెన్) 3.2 ఓవర్లు, 59 పరుగులు… ఎకానమీ రేటు 17.70 (వైభవ్ వికెట్ తీసింది తనే)…
Share this Article