Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫస్ట్ నుంచీ దానం జర్నీ అంతే … అదృష్టం- దురదృష్టం సమాంతరంగా!

September 19, 2026 by M S R

.

హైకోర్టు తనపై అనర్హత వేటు వేశాక, ఇక సుప్రీంకు వెళ్లబోననీ, ప్రజాక్షేత్రంలో తిరిగి పోటీచేస్తానని దానం నాగేందర్ ప్రకటించాడు… నిజానికి కాంగ్రెస్ బీఫాంతో ఎంపీగా పోటీచేయడం అనే ఒక్క పాయింట్ చాలు, తను సుప్రీంలో కూడా గెలవడు అని చెప్పడానికి..! ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మరీ ఎంపీగా పోటీకి నిలబడి ఉండాల్సింది… ఈ వేటు కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నదే…

2004లో చేసిందదే… 2024లో మాత్రం అలా చేయకుండా భంగపాటు… ఐతే ఈ అంశంలో స్పీకర్‌గా తన నిర్ణయాన్ని కొట్టేస్తూ హైకోర్టు తీర్పు చెప్పడంపై స్పీకర్ సుప్రీంకు వెళ్తాడా..? వేచిచూడాలి… నిజానికి దానం నాగేందర్ సుదీర్ఘ రాజకీయ జీవితం మొత్తం ఇలాగే కాస్త వింతగా… అంటే తన విజయం, రాష్ట్రంలో తన పార్టీ అధికారం పరస్పరం భిన్నంగా సాగడం… ఒకటీరెండుసార్లు మినహా…

Ads

ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే… తను గెలుస్తాడు, తన పార్టీ అధికారంలోకి రాదు, లేదా తను ఓడిపోతాడు, తన పార్టీ అధికారంలోకి వస్తుంది…

1989 – ఆసిఫ్‌నగర్ సీటు… ఓడిపోయాడు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది…

1994 – ఆసిఫ్‌నగర్ సీటు… తను గెలిచాడు, కానీ టీడీపీ పవర్‌లోకి వచ్చింది…

1999 – ఆసిఫ్‌‌నగర్ సీటు… తను గెలిచాడు, టీడీపీ పవర్‌లోకి వచ్చింది…

2004  – ఆసిఫ్‌నగర్ సీటు… తను టీడీపీ నుంచి గెలిచాడు, కానీ కాంగ్రెస్ పవర్‌లోకి వచ్చింది…

2004 – వెంటనే రాజీనామా చేశాడు, ఉపఎన్నికలో కాంగ్రెస్ నుంచి నిలబడ్డాడు, కానీ మజ్లిస్ చేతిలో ఓడిపోయాడు…

2009 – ఖైరతాబాద్ సీటు… తను గెలిచాడు… కాంగ్రెస్ పవర్‌లోకి వచ్చింది… (తన రొటీన్ దురదృష్టానికి మినహాయింపు … తన గెలుపు, పార్టీ పవర్‌లోకి రావడం…) వైఎస్ కేబినెట్‌లోకి కూడా తీసుకున్నాడు…

2014 – తను ఓడిపోయాడు, బీజేపీ గెలిచింది… టీఆర్ఎస్ పవర్‌లోకి వచ్చింది… తను కూడా టీఆర్ఎస్‌లోకి మారాడు…

2018 – తను గెలిచాడు, టీఆర్ఎస్ కూడా పవర్‌లోకి వచ్చింది… (ఇక్కడా తన రొటీన్ దురదృష్టానికి మినహాయింపు)…

2023 – తను బీఆర్ఎస్‌ నుంచి గెలిచాడు… కానీ పార్టీ పవర్ కోల్పోయింది…

2024 – లోకసభ సీటులో కాంగ్రెస్ నుంచి నిలబడ్డాడు, ఓడిపోయాడు, తన ప్రత్యర్థి గెలిచాడు, ఏకంగా కేంద్ర మంత్రి అయ్యాడు…

…… ఇప్పుడు అనర్హత వేటుకు గురయ్యాడు… మళ్లీ ఉపఎన్నిక… ఫలితం దైవా‘దానం’…



మరి అనర్హత వేటు పడింది కదా… ఉపఎన్నికలో పోటీకి ఏ అడ్డంకీ ఉండదా..? ఇదీ ప్రశ్నే… యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం అనర్హత వేటు పడింది కదా, తిరిగి పోటీచేయొచ్చా..? ఈ చట్టం పదో షెడ్యూల్ ప్రకారం… ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని కానీ, కూలింగ్ పీరియడ్ నాలుగేళ్లో ఆరేళ్లో పోటీచేయకూడదని కానీ ఏమీ లేదు… అంటే చట్టప్రకారం దానం నాగేందర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయటానికి అర్హుడు…

2019లో కర్ణాటకలో అనర్హత వేటుపడిన 15 మంది రెండేళ్లపాటు పోటీచేయకుండా స్పీకర్ నిషేధం విధిస్తే, వాళ్లు సుప్రీంకు వెళ్లి, గెలిచారు… ఆ 15 మందిలో 13 మందికి బీజేపీ టికెట్లు ఇచ్చింది… 11 మంది గెలిచారు కూడా… దానం కేసులో కోర్టు ఇన్నేళ్లు పోటీచేయకూడదని నిషేధం విధించలేదు… (ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు…) అందుకే తిరిగి నిలబడతాను అని చెబుతున్నాడు దానం… సో, కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా..? బీఆర్ఎస్, బీజేపీ ఏకమై ఓడిస్తాయా..? ఇవీ వేచిచూడాల్సిన అంశాలు.,.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫస్ట్ నుంచీ దానం జర్నీ అంతే … అదృష్టం- దురదృష్టం సమాంతరంగా!
  • ఆస్కార్‌కు గొందల్ ! భారీ పోటీ నడుమ ఈ మూవీయే ఎందుకు ఎంపిక?!
  • మమతకు దెబ్బ మీద దెబ్బ… డెస్టినీ ఎదురుతంతే… అంతే…
  • ఫస్ట్ కెప్టెన్ ఝాన్సీ! సరైన ఫలితమే! కానీ యాదృచ్ఛికమేనా?!
  • మీనాక్షి నటరాజన్! వదలక వెంటాడుతున్న ఆ రెండు కేసులూ !!
  • తెలంగాణ అమరుల కథలు వేర్వేరు- ఏ సోయీ లేని పార్టీల ప్రముఖులు…
  • ఇవేం కక్కుర్తి పనులురా బాబూ..! వీసా కోసం 13 ఏళ్ల బాలికతో పెళ్లి ?
  • ‘రాముడి’పై ఇదేం కొత్త లొల్లి… పాత వీడియోను పట్టుకుని రచ్చ!
  • శ్రీచక్రం మధ్యలో సమంత..! తంత్రమా? అపచారమా? ఏది నిజం!!
  • అంతటి గండరగండడు కూడా ఆ డైలాగ్ దగ్గర ఇరుక్కుపోయాడు!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions