Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పెదవి కొరికే పెదవి కొరకే… వేటూరి సుఖాలాపనలు బోలెడు…

May 17, 2026 by M S R

.

Subramanyam Dogiparthi … ఫక్తు బాలకృష్ణ మార్క్ రొమాంటిక్ ఏక్షన్ సినిమా 1992 లో వచ్చిన ఈ ధర్మక్షేత్రం . కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ , దివ్యభారతిల మీద డ్యూయెట్లన్నీ కాటా కుస్తీలు లాగానే ఉంటాయి . రాఘవేంద్రరావుని దాటేసారు .

టూకీగా చెప్పాలంటే దుష్టశిక్షణ సినిమా . పరుచూరి బ్రదర్స్ నేసిన ఈ కధ : ఓ నగరంలో రెండు రౌడీ/ గూండా ముఠాల ఆధిపత్య పోరు , కాలేజీ కుర్రాళ్ళను పావుల్లాగా వాడుకోవటం , ఆ పోరులో నగర ప్రజలు సతమతం కావటం , ఆ ప్రజల్ని రక్షించే లాయర్ బెనర్జీ (బాలకృష్ణ) , కాలక్రమంలో ఇద్దరు గూండాలు ఏకం కావటం , విలన్లను శత్రువు సినిమాలో లాగా రూల్స్ ప్రకారం తుదముట్టించటం , క్లైమాక్స్ కోర్ట్ హాల్లో హీరో బాలకృష్ణ గారి సుదీర్ఘ ప్రసంగంతో సినిమా ముగుస్తుంది .

Ads

బాలకృష్ణ చాలా ఎనర్జిటిక్ గా నటించారు . సరసన దివ్యభారతి, ముఖ్యంగా పాటల్లో అదరగొట్టేసింది . ఇతర ప్రధాన పాత్రల్లో జగ్గయ్య , నాజర్ , జ్యోతి , రామిరెడ్డి , దేవన్ , శ్రీహరి , బ్రహ్మాజీ , జయలలిత , సాక్షి రంగారావు , సుధారాణి , పోసాని  తదితరులు నటించారు .

సినిమా ప్రేక్షకులకు గుర్తుండిపోతానికి కారణం ఇళయరాజా సంగీతం , వేటూరి , సిరివెన్నెల పాటలు , బాలసుబ్రమణ్యం , జానకమ్మ , చిత్ర , మనో గాత్రం . వీటిని మించి డాన్సుల్ని కంపోజ్ చేసిన తార , సుందరం , ప్రభుదేవాలు ; కోదండరామిరెడ్డి అందమైన చిత్రీకరణ .

అన్ని పాటలు హీరోహీరోయిన్ల మీదనే . వాటిల్లో రెండు గ్రూప్ డాన్సులు . బాగుంటాయి . కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య ఒకటి . ఈ జలపుష్పాల గురించి సిరివెన్నెల వారు ఎలా ఔపాసన పట్టారో ! మరొకటి అరె ఇంకా జంక జింక పెంకితనంగా పాట . ఇదీ బృంద నృత్యమే .

పెళ్ళికి ముందే ఒక్కసారి చూపించవా ప్యారీ తేరీ , ఎన్నో రాత్రులొస్తాయి గాని రాదీ వెన్నెలమ్మ , చెలి నడుమే అందం నడకే నాట్యం , ముద్దుతో శృంగార బీటు కొట్టగానే అంటూ సాగే డ్యూయెట్లు బాలకృష్ణ అభిమానులను ఊపేస్తాయి .

కె సి రెడ్డి నిర్మాత . చాలా భాగం విశాఖపట్నంలో షూట్ చేసారు . సినిమా యూట్యూబులో ఉంది . దివ్యభారతి అభిమానులు కూడా ట్రై చేయవచ్చు …

(తొడిమ తెరిచే తొనల రుచికే అంటాడు ఓచోట వేటూరి… ఇది కాస్త బాలేదు గానీ… మరోచోట అదే పాటలో పెదవి కొరికే పెదవి కొరకే అనే ప్రయోగం రొమాంటిక్‌గా బాగుంది… ఈ సినిమాలో పాటలన్నీ శృంగార- కాదు, కాదు, సంభోగ ఆలాపనలు, మూలుగులే…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చైనా జిన్‌పింగ్‌కు ఏమైంది..? ఏదో భారీగానే తేడా కొడుతోంది!!
  • ఎవరినీ కాదనలేం- ఎవరినీ హత్తుకోలేం! బ్రిక్స్‌తో భారత్‌కు లాభమేంటి?
  • జస్ట్, సెక్యూరిటీ కాదు- రాష్ట్రపతి పక్కన నడక అంత ఈజీ కాదు!
  • సంపన్నుల లగ్జరీ కొనుగోళ్లు – సిస్టమ్‌కు నష్టమా? లాభమా?
  • ఒకప్పటి తిరుగులేని సామ్రాజ్యం- ఇప్పుడు 4 ముక్కల విచ్ఛిన్నం అంచుల్లో!!
  • దేబ్‌జానీ! నాగార్జున వీకెండ్ ఫ్లాప్ షోలో ఈమె ఒక్కతే కాస్త మెరుపు!!
  • పోనీ, మీ కేసీయార్‌తో ఒక్క హామీ ఇప్పించు చాలు… నాట్లు వేసేద్దాం…
  • విజయవాడ నాయకులందరికీ నిజంగా ఒక అవమానం…
  • ఆ బిన్ లాడెన్ వారసుడు హమ్జా ఇంకా బతికే ఉన్నాడా ।?
  • మా ఓట్లు పోయినట్లేనా ‘సర్’?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions