Jagan Rao ….. అనిల్ అంబానీ కుటుంబ సభ్యుడిగా కాకుండా ఒక అతిధిలాగా తన అన్న ముకేష్ అంబానీ కొడుకు పెళ్లికి రావటం చూసి ఎందుకో బాధ వేసింది. ముఖ్యంగా అనామకుడిలా బ్యాగ్ లో బట్టలు పెట్టుకొని, వాటిని తన ఇద్దరు కొడుకులు మోసుకుంటూ రావటం…
2005 లో అన్నదమ్ములు ఇద్దరూ సమానంగా పంచుకున్నారు. 2008 లో ప్రపంచంలోనే 6 వ అత్యంత ధనవంతుడు అనిల్ అంబానీ. ప్రస్తుతం ఆల్ మోస్ట్ జీరో.
ప్రధానంగా సౌత్ ఆఫ్రికా టెలీ కమ్యూనికేషన్ కంపనీతో ఒప్పందం, ఆ తర్వాత చైనా కంపనీలతో న్యాయపరమైన చిక్కులు అతని పతనానికి కారణం కానీ అత్యంత ప్రధానంగా అతని పతనానికి కారణం – సినిమా వాళ్లు & తన వ్యక్తిగత రాజకీయ మోజు.
Ads
మనం తోపు అయితే సినిమా వాళ్లు వచ్చి మన పిల్లల బర్త్ డే, పెండ్లి ఫంక్షన్స్ లల్లో డ్యాన్స్ లు వేయాలి, మనం వాళ్లతో రాసుకు పూసుకు తిరగకూడదు. పార్లమెంట్ లో 6 నెలల తర్వాత పెట్టబోయే బిల్ ఈ రోజు మన టేబుల్ మీద ఉండాలి, మనమే ఆ పార్లమెంట్ లో ఉండాల్సిన అవసరం లేదు. మనం లేదా మన వాడు గెలవాల్సిన అవసరం లేదు, ఎవడు గెలిచినా వాడు మన దగ్గరికి రావాలి, మనవాడు కావాలి.
పంపకాల తర్వాత ముకేష్ అంబానీకి సాంప్రదాయ ఆయిల్ రీటైల్డ్ గట్రా వస్తే… తల్లి చాటు బిడ్డ కాబట్టి కోకిలా బెన్ గారు, అనిల్ కోరుకున్న అత్యంత ఎక్కువ భవిష్యత్ మరియూ గ్రోత్ ఉన్న టెలీ కమ్యూనికేషన్స్, పవర్, ఎనర్జీ మొదలగునవి తన వాటాకు వచ్చాయి… ఐనా సరే ట్రేడ్ గేమ్ లో ఫెయిల్ అయ్యాడు.
ఒకప్పుడు ఇండియాలో రేమండ్స్ అధినేత ఇల్లు 30 అంతస్తుల్లో ఉండేది; దాని విలువ 6 వేల కోట్లు. ఆ తర్వాత రెండో ఖరీదైన ఇల్లు ఇండియాలో అనిల్ అంబానీదే; దాని విలువ 5 వేల కోట్లు. 17 అంతస్తుల్లో కట్టాడు, 1+7=8. దాని అధిపతి శని ( అందుకే పూర్తిగా సంక నాకిపోయాడు, జాగ్రత్త గా ఉంటే బిల్ గేట్స్, ఇవాంకా ట్రంప్, మార్క్ జుకర్ బర్గ్ – అనిల్ అంబానీ గేట్ దగ్గర అతని అపాయింట్ మెంట్ కోసం 6 నెలలు ఎదురు చూడాల్సిన పరిస్తితి ఉండేది.
జీవితంలో ఇళ్ళు, పెండ్లి – మనిషి మీద చాలా ప్రభావం చూపుతాయి. ఏది ఎమైనా అనిల్ అంబానీ కొడుకులు అయినా నంబర్ వన్ స్థితిలో ఉండాలని ఆశిస్తూ..!
(ఎస్, ఎంత వద్దనుకున్నా ఇద్దరు సోదరుల స్థితిగతుల నడుమ పోలిక వస్తుంది… చర్చ జరుగుతుంది… అన్న ఆకాశంలో ఎగురుతుంటే తమ్ముడు నేల మీద పాకుతున్నాడు… అదే డెస్టినీ…)
Share this Article