Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓహో… తెలంగాణ నటులు తెలుగు ఇండస్ట్రీకి పనికిరాని మొహాలా..?!

September 25, 2026 by M S R

.

ఒక ఇంటర్వ్యూ… ఒక్కసారిగా నాలో ఓ విభ్రమ… తెలుగు సినిమా జర్నలిజం ఇంత ఎదిగిపోయిందా..? దీన్ని జర్నలిజం అనాలా..? అదేదో టీవీ, పేరు ప్రస్తావించడం కూడా అనవసరం… ప్యారడైజ్ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఓ వీర జర్నలిస్టుడు సంపూర్ణేష్ బాబును అడుగుతున్నాడు…

‘నీకు సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదు. అసలు హీరో అయ్యేంత నీలో ఏముంది? అసలు సినిమాల్లోకి ఎందుకు వచ్చావు? ఎందుకు అంత దురద నీకు? ‘ది ప్యారడైజ్’లో అవకాశం రావడం నీ కెరీర్‌లో ఊహించని మలుపు. ఇలాంటి సినిమాల్లో నీకు ఎవరు అవకాశం ఇస్తారు అసలు? పిల్లి కూడా నీ మొహం చూడదు, నిన్నెవరు చూస్తారు సినిమాలో…’

Ads

…. ఇలా తేలికగా తీసిపారేస్తూ… దీన్ని బాడీ షేమింగ్ అనాలా..? ఏరియా షేమింగ్ అనాలా..? బ్యాక్ గ్రౌండ్ షేమింగ్ అనాలా..? లేక షేమింగ్ జర్నలిజం అనాలా..? బలుపు జర్నలిజం, వాపు జర్నలిజం, బరితెగింపు జర్నలిజం, వెగటు జర్నలిజం, డొల్ల జర్నలిజం అనే రకరకాల ఫిలిమ్ జర్నలిజం ధోరణుల్లో దీన్ని దేనిగా గుర్తించాలి..? (ఈ వాక్యాలు పరుషంగా, కటువుగా ధ్వనిస్తున్నా, ఆ ప్రశ్నల ధోరణి చూస్తే ఇలా రాయడం సబబే అనిపిస్తోంది…)

సంపూర్ణేష్ బాబు ఓ నటుడు… పూర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాడు… కులం పేరుతో, ప్రాంతం పేరుతో, ఎవడి పాదసేవ చేసుకునో ఇండస్ట్రీలో ఉండటం లేదు… తెలంగాణ నడిబొడ్డు నుంచి సినిమా కెరీర్‌ను నమ్ముకుని వచ్చాడు… డౌన్ టు ఎర్త్, మనిషిగా మంచోడు… ఇవన్నీ పాపం ఆ జర్నలిస్టుకు తెలియవా..? లేక ఈ లక్షణాలే మైనస్ అనే భ్రమలా..?

ఈ ప్రశ్నల్ని ఒక ఆంధ్రా నటుడిని… కుప్పలుతెప్పలుగా హీరోలను ప్రొడ్యూస్ చేస్తున్న ఓ మెగా ఫ్యాక్టరీ నుంచి వచ్చిన నటుడిని… తెలుగు ఇండస్ట్రీ మీద గుత్తాధిపత్యం వహిస్తున్న ఆ రెండుమూడు కులాలకు చెందిన ఓ నటుడిని ఈ ప్రశ్న వేయగలడా..? వేస్తాడా..? ఇదీ తలెత్తిన సందేహం…

సో వాట్..? సంపూర్ణేష్ బాబు ఇదే తెలుగు సినిమాలపై మంచి సెటైరిక్ పాత్రలు కూడా చేశాడు, అది వినోదం… ఏదైనా సినిమాలో రెండు నిమిషాలు, రెండు డైలాగుల పాత్ర లభిస్తేనే వెర్రిమొర్రి వేషాలు వేస్తూ, ఛాతీ బోరవిరుచుకుని తిరిగే ఈరోజుల్లో… లీడ్ రోల్స్ చేసి కూడా సంపూర్ణేష్ బాబు… ప్యారడైజ్ సినిమాలో ఓ మామూలు పాత్ర (బిర్యానీ) చేశాడు, అది తనిష్టం…

తెలంగాణ నేపథ్యం పనికిరాదా ఈ ఆంధ్రా జర్నలిస్టుకు..? ఓ పేదరిక నేపథ్యం అంటే  చిన్నచూపా..? వాళ్లు ఇండస్ట్రీకి అనర్హులా..? గతంలో జర్నలిస్టు జాఫర్ కమెడియన్ కమ్ కేరక్టర్ ఆర్టిస్ట్ సునీల్‌ను ఇలాగే అడిగాడు… ‘నువ్వు హీరోవా, అద్దంలో చూసుకున్నావా’ అని… అది గుర్తొస్తోంది…

సంపూర్ణేష్ ఒక కోణంలో నచ్చలేదు… ఆ ప్రశ్నల్ని వెంటనే అక్కడే ఖండించి ఉండాల్సింది, ఇది ప్రసారమైతే బాగుండదు అనే మాట కఠినంగా, కచ్చితంగా చెప్పి ఉండాల్సింది… అంగీకరించకుండా ఉండాల్సింది… మరో కోణంలో నచ్చాడు… ఆ వివక్షాపూరిత, అవమానించే ప్రశ్నలకూ తనదైన పద్ధతిలో ఓపికగా జవాబులు చెప్పాడు… ఎక్కడా టెంపర్ కోల్పోలేదు…

జూచి అట, సదరు జర్నలిస్టు పేరు… అంటే జూనియర్ చిరంజీవి అట… (పాపం అనవసరంగా చిరంజీవి ఇజ్జత్ కూడా తీయబడుతోంది)… ఈ ఇంటర్వ్యూ బిట్ నిన్న విపరీతంగా వైరల్ అయింది… నెటిజనం కూడా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు, సంపూర్ణేష్ సహనాన్ని ప్రశంసించారు… ఆర్థిక, ప్రాంత నేపథ్యాల మీద ఇదేం వివక్ష అనే విమర్శలూ వచ్చాయి… అవునూ, ప్యారడైజ్ సినిమా కథ ఏళ్లతరబడీ వివక్షను ఎదుర్కున్న సవారీ జాతి గురించి కదా… ఈ ప్రశ్నలు ఆ వివక్షకన్నా తక్కువేమీ కాదు… ఆ సోయి సదరు జర్నలిస్టుకు, ఆ చానెల్‌కు ఉందా..?

మీ కులాలు, మీ ప్రాంతాలు, మీ హీరోల భజన చేసుకొండి, పాదతీర్థ సేవనంతో తరించండి, బతుకు ధన్యంగా పరవశించిపొండి… కానీ ఓ చిన్న నటుడిని కించపరచకండి… అవునూ, సంపూర్ణేష్ తత్వానికి, బ్యాక్ గ్రౌండ్‌కు, ప్రాంతీయతకు భిన్నమైన ఓ నటుడికి ఇవే ప్రశ్నలు ఇదే జర్నలిస్టు గనుక వేసి ఉంటే… ఆ నటుడు ఎలా రియాక్టయ్యేవాడు..? ఓసారి గెస్ చేయండి..!!



అప్ డేట్ ::: నెటిజనం బూతులకు దిగేసరికి ఈ జర్నలిస్టుడు దిగొచ్చాడు… ఓ వివరణ వీడియో విడుదల చేశాడు… 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కట్టి, కూల్చి, మళ్లీ కట్టి… కేసీయార్ మార్క్ ‘ఇంజినీరింగ్ అద్భుతం’…
  • మళ్లీ తెరపైకి బనకచర్ల ! చంద్రబాబు తమిళనాడు నుంచి నరుక్కొస్తున్నాడా..!?
  • జాతీయ పరీక్షల్లో AI సాయం ! నందన్ నీలేకని ప్రతిపాదన భేష్ !!
  • గజల్ శ్రీనివాస్ అంటేనే… గజలియత్‌కు ఓ అవమానం, ఓ కళంకం !!
  • ఓ సామాజిక కథతో మళ్లీ కలిసిన సీతారాముల జంట!
  • ఈ జెండాలు స్పష్టంగానే కుట్ర హెచ్చరికల్ని జారీ చేస్తున్నయ్!!
  • పొలిటికల్ రిపోర్టింగ్ ఎన్నో జీవితసత్యాల్ని ‘అక్షరాలా’ కళ్లకుగట్టింది !!
  • 40 ఏళ్ల కిందటే ఉమ్మడి పౌరస్మృతి, విదేశీ నిధులు, మతమార్పిడిపై చర్చ!
  • ఇది సొంత గడీ కాదు సార్… బాత్రూం రిపేర్లకు కోటి రూపాయలా..?!
  • అర్ధరాత్రి- అందరూ నిశ్శబ్దం- గుప్త తాంత్రిక పూజ- ఎక్కడంటే?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions