.
జగన్ పాలన… దానికి దశ, దిశ ఉండదు కదా… దిక్కుమాలిన పాలన విధానం, తెలుసు కదా… కరుణాకర్‌రెడ్డి, ధర్మారెడ్డి, భాస్కర్‌రెడ్డి అనబడే తదితర హిందూ ద్వేషులు తిరుమలను భ్రష్టుపట్టించారనే విమర్శలూ బోలెడు… నిజం కూడా…
అంతకుముందు చంద్రబాబు ఇలాగే వ్యవహరించి అలిపిరిలో దెబ్బతిన్నాడు… సరే, పాఠం నేర్చుకున్నాడా లేదా వేరే సంగతి, అది మహామహామహా ముదురు కేసు… అలాంటి దెబ్బే వైఎస్‌కూ పడింది… ఆ శిక్ష కథ అందరికీ తెలిసిందే…
Ads
జగన్‌కు కాస్త గుణపాఠం,… 11 స్థానాలకు ఘోరంగా దిగజారిపోవడం… ఏమో, అప్పుడే అయిపోయిందని అనుకోలేం… తన హయాంలో పరమ హిందూ ద్వేషులతో టీటీడీ ఓ సదస్సు పెట్టింది రెండేళ్ల క్రితం… అదే చదువుతుంటే అసలు వెంకన్నకు శిక్షించే సోయి లేదానిపించింది… సరే, ఆ అధర్మారెడ్డి అనే వెధవ… ఉద్దేశపూర్వకంగానే అంటున్నాను… ఆ వెధవ సంగతి పక్కన పెడితే, అవే చదువుతుంటే తాజాగా ఓ తమిళ మంత్రి కథ కనిపించింది…
తన పేరు పొన్ముడి… వెధవ అనే పేరు సరిపోదులెండి… తను అన్ని మతాలు, కులాలకు మంత్రిని అని మరిచిపోయాడు… పోతాడు… స్టాలిన్ మంత్రి కదా… నాస్తికత్వం వేరు, కేవలం హిందూ ద్వేషం వేరు… నువ్వు నాస్తికుడిగా ఉండు, కనిమొళిలాగా గుడ్… తనకు ఓ రీజనింగ్ ఉంటుంది… జస్టిఫికేషన్ ఉంటుంది…
కానీ పొన్ముడి వంటి వాడు జస్ట్, హిందూ ద్వేషం… అచ్చం స్టాలిన్ కొడుకు ఉదయనిధి టైపు… సరే, ఈ పొన్ముడి అనేవాడు రీసెంటుగా ఓ బహిరంగ కార్యక్రమంలో … ఒక వేశ్య, ఒక విటుడితో కూడిన అసభ్యకరమైన కథను గుర్తుచేసుకున్నాడు…
అక్కడ 74 ఏళ్ల అతను పవిత్ర హిందూ చిహ్నాలను అసభ్యకరమైన లైంగిక దుష్ప్రవర్తనలుగా ఎగతాళి చేశాడు. శైవ సమాంతర తిలకాన్ని “పడుకునే స్థానం”గా మరియు వైష్ణవ నిలువు తిలకాన్ని “నిలబడి ఉండే స్థానం”గా పేర్కొన్నాడు…
ఇంతకుమించి చెప్పడం కష్టం… తమిళం అర్థమైతే పైన లింక్ చూసి అర్థం చేసుకొండి… వాడు… ఎస్, వాడు… రెండు ప్రధాన హిందూ ఆధ్యాత్మిక ధోరణులను కలిపి మరీ నీచంగా అవమానించాడు… కోట్లాది మంది హిందూ విశ్వాసులను కించపరచడమేనా స్టాలిన్ ప్రభుత్వ పోకడ… అలాంటోళ్లేనా స్టాలిన్‌కు కావల్సింది…
పొన్ముడి వివాదం ఇదే మొదటిసారి కాదు. 2022లో, అతను తమిళనాడులో హిందీ మాట్లాడేవారిని లక్ష్యంగా చేసుకుని, వారిని పానీపూరి విక్రేతలుగా తక్కువ చేసి మాట్లాడాడు… చెబుతూ పోతే… ‘వాడి’ వాచాలత అంతా ఇంతా కాదు…
పొన్ముడి వ్యాఖ్యల మీద బీజేపీ విరుచుకుపడింది… అన్నాడీఎంకేలో పాత జీతగాళ్లు తప్ప నాయకులు లేరు కదా… ఇక్కడ చెప్పుకోవాల్సింది అది కాదు… పరమ నాస్తికురాలైన కనిమొళి, ఎస్, అదే స్టాలిన్ సోదరి పొన్ముడి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టింది… గుడ్… నాస్తికత్వం అంటే కేవలం హిందూ మతాన్నే ద్వేషించడం కాదు… దేవుడిని, మతాన్ని నమ్మకపోవడం, అంతే తప్ప ఒక మతానికి వత్తాసుగా, మరో మతాన్ని ద్వేషించడం కాదు… కనిమొళికి క్లారిటీ ఉంది…
స్టాలిన్‌కు చురుకు పుట్టింది… సదరు పొన్ముడిని పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ పదవి నుంచి తొలగించాడు… లేకపోతే యావత్ హిందూ సమాజం థూత్కరిస్తుందేమో అనుకున్నాడు… చివరకు సోదరి కూడా ఛీఛీ అనేసింది…
కానీ… వాడు… ఎస్, వాడు అదే మంత్రి పదవిలో అలాగే ఉన్నాడు… వాడిని పదవి నుంచి తీసేసే సాహసం స్టాలిన్‌కు కూడా లేదు… ఇదే డీఎంకే కూటమిలో సభ్యత్వం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి… రాహుల్ గాంధీ కూడా సేమ్ వేవ్ లెంత్ కాబట్టి అర్థం చేసుకుందాం… కానీా డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్య ఎట్సెట్రా…?! షర్మిలను వదిలేయండి ఫాఫం..!!
Share this Article