.
Pardha Saradhi Upadrasta …… రాహుల్ గాంధీ – “బ్రిటిష్ పౌరసత్వం” కేసు
అసలు నిజం ఏంటి? కోర్టుల్లో ఏమి జరుగుతోంది?
సోషల్ మీడియాలో “రాహుల్ గాంధీకి బ్రిటిష్ పౌరసత్వం ఉంది”, “త్వరలో ఎంపీ పదవి పోతుంది” అంటూ విపరీతంగా ప్రచారం జరుగుతోంది.
కానీ చట్టపరంగా, వాస్తవంగా ఇప్పటివరకు జరిగినది ఇది.
Ads
కేసు నేపథ్యం (Timeline)
🔹 2015–2019
రాహుల్ గాంధీ UK లో ఉన్న ఒక కంపెనీలో (Backops Ltd) డైరెక్టర్‌గా ఉన్నారనే విషయం బయటకు వచ్చింది.
ఆ కంపెనీ ఫైలింగ్స్‌లో “Nationality: British” అని నమోదు అయిందని కొందరు ఆరోపించారు.
🔹 2019
ఈ అంశంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీం కోర్టు స్పష్టంగా తిరస్కరించింది – “బ్రిటిష్ పౌరసత్వం ఉందని నిరూపించే ఆధారాలు లేవు” అని తెలిపింది.
🔹 2023–2024
కొందరు ఫిర్యాదులపై కేంద్ర హోంశాఖ (MHA) వివరణ కోరింది. UK ప్రభుత్వంతో దౌత్య మార్గంలో సమాచారం కోరారు. పబ్లిక్‌గా రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడని ఎక్కడా నిర్ధారణ కాలేదు.
🔹 2025 మధ్యలో
ఎస్. విఘ్నేష్ శిశిర్ అనే వ్యక్తి రాయబరేలీ MP/MLA కోర్టులో క్రిమినల్ కంప్లైంట్ వేశారు.
ఆరోపణలు:
• రాహుల్ గాంధీకి బ్రిటిష్ పౌరసత్వం ఉంది
• ఎన్నికల సమయంలో తప్పుడు డిక్లరేషన్ ఇచ్చారు
🔹 డిసెంబర్ 2025
అలహాబాద్ హైకోర్టు కేసును రాయబరేలీ నుంచి లక్నో MP/MLA కోర్టుకు బదిలీ చేసింది (న్యాయమైన విచారణ కోసమని)
🔹 జనవరి 2026 (ప్రస్తుత స్థితి)
✔ లక్నో కోర్టులో రోజువారీ విచారణ
✔ కోర్టు సరైన చట్టపరమైన అనుమతితోనే ఆధారాలు ఇవ్వాలని ఆదేశం
❗ ఇప్పటివరకు FIR లేదు
❗ ఇప్పటివరకు తీర్పు లేదు
⚖️ రెండు వైపుల వాదనలు
పిటిషనర్ వాదన:
• UK కంపెనీ పత్రాల్లో “British Nationality” ఉందని
• భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 ఉల్లంఘన జరిగిందని
• పౌరసత్వ చట్టం & ఎన్నికల చట్టాల ఉల్లంఘన జరిగిందని
FIR నమోదు చేసి క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్
రాహుల్ గాంధీ వాదన:
• నేను ఎప్పుడూ బ్రిటిష్ పౌరసత్వం తీసుకోలేదు
• కంపెనీ ఫైలింగ్‌లో వచ్చిన ఎంట్రీ టెక్నికల్ లోపం మాత్రమే
• వ్యాపార సంబంధాలు ≠ పౌరసత్వం
• నిజమైన ఆధారం అంటే: UK పాస్‌పోర్ట్ లేదా, నాచురలైజేషన్ సర్టిఫికేట్ ఇవేవీ లేవు
ముఖ్యమైన చట్టపరమైన నిజం
భారత్‌లో డ్యూయల్ సిటిజన్‌షిప్ అనుమతి లేదు
కానీ…
❌ ఆరోపణ = సాక్ష్యం కాదు
❌ కంపెనీ డాక్యుమెంట్ = పౌరసత్వం కాదు
పౌరసత్వాన్ని నిరూపించేది ఒక్క అధికారిక ప్రభుత్వ రికార్డు మాత్రమే
ఇప్పటి వరకు కోర్టు స్థితి
✔ కేసు ఇంకా విచారణలోనే ఉంది
✔ కోర్టు కేవలం “FIR అవసరమా?” అన్న దశలో ఉంది
❌ రాహుల్ గాంధీని బ్రిటిష్ పౌరుడిగా ప్రకటించలేదు
❌ ఎంపీ పదవి పోయినట్టు లేదు
❌ క్రిమినల్ కేసు నమోదు కాలేదు
సారాంశం:
> ఇది తీర్పు కేసు కాదు. ఇది దర్యాప్తు కూడా కాదు. ఇది కేవలం ప్రాథమిక ఫిర్యాదు దశలో ఉన్న అంశం మాత్రమే. కాకపోతే సాక్ష్యాలు వున్నాయి అని చెపుతున్న డాక్యుమెంట్ లను కోర్టు అధికారికంగా పరిశీలించడానికి అనుమతించింది. అంతకు ముందు అది కూడా లేదు.
టేబుల్ మీద ఒక్కో ఆధారం. స్క్రీన్ మీద ఒక్కో వీడియో. ఫైళ్లలో ఒక్కో డాక్యుమెంట్.
లండన్, వియత్నాం, ఉజ్బెకిస్తాన్ లలో ఇమిగ్రేషన్ వీడియోలు, ఎయిర్ టికెట్లు. యునైటెడ్ కింగ్డమ్ ఓటర్ లిస్ట్ అన్నీ ఒకే పెన్‌డ్రైవ్‌లో కలిపి కోర్టులో సాక్ష్యాలుగా సమర్పించారు.
కోర్టు పరిశీలించి సాక్ష్యాలు వున్నాయి FIR నమోదు చేసి దర్యాప్తు చేయండి అని చెపుతోందో లేక ఇంకా సాక్ష్యాలు కావాలి అని అడుగుతుందో లేదో తదుపరి చర్య. —– ఉపద్రష్ట పార్ధసారధి
#RahulGandhi #CitizenshipCase #IndianPolitics #CourtFacts #LegalTruth #NoDualCitizenship #PoliticalAwareness #FactCheck #pardhatalks
Share this Article