Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సూపర్‌స్టార్ కృష్ణకు సరైన జత’ప్రద… తెలుగు తెరపై సోకాల్డ్ స్ట్రాంగ్ కెమిస్ట్రీ…

October 3, 2024 by M S R

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మనీ రెమ్మరెమ్మకు . ఇంత భావుకత కలిగిన పాట దేవులపల్లి కాక మరెవరు వ్రాస్తారు ?! యస్ రాజేశ్వరరావు , దేవులపల్లి , సుశీలమ్మ అలా దిగిపోతారు ఈ పాటలో . తగ్గట్టుగానే జయప్రదా నటించింది . 1977 లో వచ్చిన ఈ ఈనాటి బంధం ఏనాటిదో సినిమా ఈ పాట వలన కూడా పాపులర్ అయింది .

ఈ సినిమా కధ , స్క్రీన్ ప్లే అంతా నిర్మాత బాలయ్యదే . కృష్ణ – జయప్రద జోడీ బాగుంటుంది . విజయనిర్మల తర్వాత కృష్ణ అత్యధికంగా 45 సినిమాల్లో నటించింది జయప్రదతోనే . బహుశా మనలో చాలామందికి ఈ విషయం తెలవక పోవచ్చు . వీరిద్దరితో పాటు బాలయ్య , సత్యేంద్రకుమార్ , అల్లు రామలింగయ్య , సాక్షి రంగారావు , నాగభూషణం , రావి కొండలరావు , ఫటాఫట్ జయలక్ష్మి , పండరీబాయి , ఝాన్సీ , రాధాకుమారి ప్రభృతులు నటించారు .

సినిమా ఏవరేజ్ గా ఆడింది . కమర్షియల్ గా కూడా సక్సెస్ అయింది . దర్శకుడు కె యస్ ఆర్ దాస్ అయినా స్క్రీన్ ప్లే బాలయ్యది కావటం వలన స్క్రీన్ ప్లేలోనే మెతక ఉంది . దాన్ని బిర్రు చేసుకుని ఉంటే ఇంకా బాగా ఆడేదేమో !

Ads

krishna

సినిమాలో పాటలన్నీ బాగుంటాయి . బాలయ్య కూడా ఓ పాటను వ్రాసారు . ఎవరికి చెప్పేది ఏమని చెప్పేది అనే పాట . జయప్రద మీద చిత్రీకరించబడింది . సి నారాయణరెడ్డి వ్రాసిన నేననుకున్నది కాదు ఇది పాట కూడా శ్రావ్యంగా ఉంటుంది .

కొసరాజు వ్రాసిన నారసింహుడొచ్చెను వీధి నాటకం చాలా బాగుంటుంది . కృష్ణ చాలా చలాకీగా నటించారు . ఆయన వ్రాసిందే మరొక పాట మారింది జాతకం మారింది అనే పాట అల్లు రామలింగయ్య మీద చిత్రీకరించబడింది .అల్లు బాగా నటించారు ఈ పాటలో .

చూడబుల్ సినిమాయే . జయప్రద , కృష్ణ అభిమానులు చూసి ఉండకపోతే తప్పక చూడండి . యూట్యూబులో ఉంది . ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు వీడియో మాత్రం అస్సలు మిస్ కావద్దు . తప్పక ఆస్వాదించవలసిన పాట . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు   ….. (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చంద్రబాబు ప్రమోట్ చేశాడు… టేస్ట్ అట్లాస్ కూడా తప్పనిసరై గౌరవించింది…
  • ఇద్దరు వీరోయిన్లతో చిరంజీవి కిందామీదా పడి దొర్లినా… ప్చ్, పాపం..!!
  • 82వ ర్యాంకు కాదు…! 2, 3 ఏళ్లలో వరల్డ్ టాప్-20 లిస్టులోకి హైదరాబాద్..!!
  • ధర్మేంద్ర కుటుంబానికి బ్రిటిష్ రాజవంశంతో చుట్టరికం..! ఎలా..?!
  • సాంబ, మూర్తి, వెంకటకృష్ణ… వీళ్లే హైదరాబాద్ ప్రేక్షకులకు ఇష్టులు..!!
  • అడ్డగోలు దందా బీఆర్ఎస్ హయాంలో..! బురద జల్లేది ఈ ప్రభుత్వంపై..!!
  • మీడియా జీవితాలను, కుటుంబాలను నిలబెట్టగలదు… ఇవి అవే స్టోరీస్…
  • సర్‌ప్రయిజ్ అప్పియరెన్స్..! ఈ తెలంగాణ ‘బతుకమ్మ’ గుర్తుందా మీకు..?!
  • యాక్షన్ లేదు, ఆధార్ బ్లాకూ లేదు… ఈ వివాదం పూర్వపరాలు ఇవీ…
  • మిస్టర్ కీరవాణీ… ఈ వారణాసి లవ్ సాంగ్ వీడియో నువ్వైనా చూశావా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions