వజ్రం లాంటి పేరు… వంచన తీరు?
సామాజిక సేవ పేరుతో వ్యవస్థల్ని
లోబరచుకోవడo ఆధునిక వ్యాపార సూత్రo..
Ads
“యమ”రాల్డ్..
ఈ సంస్థ యజమాని.. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో అంటే సుమారుగా 2001-02 సంవత్సరం కాలంలో నాకు పరిచయం. నాల్గు అక్షరం ముక్కలు తప్ప పొట్ట పోసుకోవడానికి మరేమీ తెలీని నాకు అప్పట్లో కాపీ రైటింగ్ అవకాశం ఇచ్చారు. కనీసం 2, 3 గంటలు నా చేత క్యాప్షన్స్ రాయించుకుని రూ.100, రూ.200 చేతిలో పెట్టి పంపేవాడు.
ఏదైతేనేం హైదరాబాద్ వచ్చిన కొత్తలో నేను కలిసిన వాళ్ళు ఆ తర్వాత నా కళ్ళ ముందే హైదరాబాద్ లాగే రిచ్ గా మారిపోవడాన్ని నేను కళ్ళు విప్పార్చుకుని చూస్తూ ఉండిపోయిన చాలామందిలో ఈయన ఒకరు.
ఆమీర్ పేట్ లో చిన్న షాప్ తో మొదలుపెట్టి ఆ తర్వాత బంజారాహిల్స్ లాంటి రిచ్ లొకేషన్స్ లో ఈయన వ్యాపారం విస్తరించారు. ఆర్గానిక్ కి అమ్మ మొగుడు లాంటి ఉత్పత్తులుగా ఆయన ప్రవచించిన మాటలు బాగా తలకెక్కిన నాతో సహా ఎందరో రూపాయి ఎక్కువైనా రోగాలు రావు కదా అని ఈయన షాపులకు క్యూ కట్టారు. విపరీతమైన రేట్లను భరిస్తూ ఆరోగ్యకరమైన (?) స్వీట్లు తిన్నారు.
నిజానికి ఆయన ఎదుగుదలలో వ్యాపారంలో క్వాలిటీ కన్నా ఆయన వ్యక్తిగత జీవితంలో ప్రవచించిన ఫ్యూరిటీ పెద్ద పాత్ర పోషించింది మీడియా సహా అనేకమంది నెత్తికెత్తుకుని అలంకరించిన కిరీటాలు కీలకపాత్ర పోషించాయి… ఆయన మోసం చేయడు అనే నమ్మకాన్ని పెంచి పోషించిన మీడియా ప్రతినిధుల్లో నాబోటి వాళ్ళెందరో..
నగరంలో ఎన్నో రెస్టారెంట్లు జనం ఆరోగ్యానికి తూట్లుగా మారాయని వెల్లడవుతున్నా రానంత ఆగ్రహం ఈయన ఉదంతంలో రావడానికి కారణం… మీడియా ప్రతినిధిగా వినియోగదారుల ప్రతినిధిగా కూడా మోసపోవడం, అబద్దాలతో అమ్మకం కాదు వమ్మయిన నమ్మకం.. సో, ఫ్రెండ్స్ బికేర్ ఫుల్, వ్యాపారం కోసం ముందస్తుగా మంచి లేబుల్ తగిలించుకుని వస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త…. ( By Satya Sakshi )
Share this Article