.
నిన్నటి లెక్కలే ఇవి… సంక్రాంతికి వస్తున్నాం సినిమా 2.44 లక్షల టికెట్లతో దేశంలోనే టాప్ ప్లేసులో కొనసాగుతోంది… (పర్ డే)… గేమ్ ఛేంజర్, డాకూ మహారాజ్ సినిమాల మీద స్పష్టమైన ఆధిపత్యం ఇది…
వసూళ్లలో కూడా డాకూ మహారాజ్‌ను అధిగమించేసింది… బాలయ్య సినిమా డౌనయిపోతోంది… గేమ్ ఛేంజర్ సినిమా గురించి ఇక చెప్పుకోవడం వేస్ట్… అది పాన్ ఇండియా సినిమా అయినా సరే, రేపో మాపో సంక్రాంతికి వస్తున్నాం సినిమా *నాన్ పాన్ ఇండియా రేంజులోనే గేమ్ చేంజర్ వసూళ్లను రీచ్ కాబోతోంది…
Ads
(గేమ్ ఛేంజర్ సినిమా 10 రోజుల్లో 180 కోట్లు… డాకూ మహారాజ్ సినిమా 8 రోజుల్లో 110 కోట్లు… సంక్రాంతికి వస్తున్నాం సినిమా 6 రోజుల్లో 160 కోట్లు…)
ఫాఫం, కంగనా రనౌత్ అని మొన్న చెప్పుకున్నాం కదా… మరీ 2.2 కోట్ల తొలిరోజు కలెక్షన్లతో డీలా పడిపోయింది అని… కానీ స్లో స్టార్ట్, పుంజుకోవచ్చు అనీ అనుకున్నాం కదా… ఇప్పుడు 63 వేల టికెట్లతో సెకండ్ ప్లేసులోకి వచ్చింది… 3 రోజుల్లో 12 కోట్ల వరకూ వసూళ్లు టచయ్యాయి…
(పుష్ప-2 రన్ ఎండింగ్‌కు వచ్చినట్టే ఇక… తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల బ్రేక్ ఈవెన్ కాలేదని సమాచారం… పాపం బయ్యర్లు… పేరుకు 1800 కోట్ల రికార్డులు, కానీ కొందరు బయ్యర్ల నెత్తిన తుండు గుడ్డలు…)
హిందీ బెల్టులో ఎమర్జెన్సీ సినిమా పుంజుకుంటోంది… కంగనాకు కాస్త రిలీఫ్… శని, ఆదివారాలు కలిసొచ్చాయి తనకు… తరువాత స్థానాల్లో ఉన్న సినిమాలు (బుక్ మై షో వివరాల ప్రకారం)…
రేఖచిత్ర: 47.84 వేలు
మద గజ రాజ: 42.79 వేలు
పుష్ప- 2: 23.13 వేలు
గేమ్ ఛేంజర్ : 19.54 వేలు
ఆజాద్: 15.89 వేలు
ముఫాసా: ది లయన్ కింగ్: 12.2 వేలు
యే జవానీ హై దీవానీ రీ-రిలీజ్: 10.23 వేలు
ఫతే: 7.67 వేలు
సినిమా సరిగ్గా తీయాలే గానీ పాన్ ఇండియాలు అవసరం లేదు, మన తెలుగు రాష్ట్రాల్లో 100 నుంచి 200 కోట్ల వసూళ్లు పెద్ద కథేమీ కాదు… ఈ లెక్కలు చూపించే సత్యం ఇదే..!!
Share this Article