ధృవ్ రాఠీ… పర్యావరణం, పర్యాటకం తదితరాంశాలపై తన వీడియోల మాటెలా ఉన్నా… వర్తమాన రాజకీయాలపై పెట్టే వీడియోలు మాత్రం సెన్సేషన్… 2 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు, ఆల్రెడీ 3 కోట్ల వీక్షణలు… మామూలు సక్సెస్ స్టోరీ కాదు తనది… ట్రెమండస్ హిట్…
మొన్నామధ్య అమెరికాలో కొందరి ఇళ్లకు వెళ్లినప్పుడు వాళ్ల ఇళ్లల్లో కూడా ఈయన వీడియోల పట్ల విపరీతమైన ఆరాధన చూసి ఆశ్చర్యమేసింది… వోకే, ఒపీనియన్ బేస్డ్ వీడియోలే… తప్పులేదు, పక్కగా తన వాదనకు తగిన చార్టులు, ఫోటోలు, వీడియోలు, వార్తలు, ఇతర ఆధారాలను సమకూర్చుకుని బలంగా ప్రజెంట్ చేస్తాడు… అదీ తన వీడియోల బలం…
కాకపోతే యాంటీ మోడీ పాలసీ తను తీసుకున్న పొలిటికల్ లైన్ అనిపిస్తుంది… పాలకుల విధానాలను నిశితంగా విశ్లేషించడంలో కూడా తప్పులేదు, కానీ బయాస్డ్ అనిపించింది కొన్ని వీడియోలు… సో, తనెప్పుడో బీజేపీ క్యాంపుకి టార్గెట్ అవుతాడని అనిపించేది తన వీడియోలు చూస్తే… జరిగింది, అదే జరిగింది… మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు తనపై ఓ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు… కానీ ఇక్కడ ఓ ట్విస్టుంది…
Ads
విషయమేమిటంటే… తన పేరిట ఎవరో ఫ్యాన్ పేరడీ అకౌంట్ క్రియేట్ చేసి లోకసభ స్పీకర్ ఓం బిర్లా కూతురు అంజలి బిర్లా అసలు యూపీఎస్సీ పరీక్షలు రాయకుండానే ఐఎఎస్ కొట్టిందనే ట్వీట్లు కొట్టారు… అది ధృవ్ రాఠీ (పేరడీ) అనే పేరుతో ఉంటుంది ఖాతా… నిజానికి ఇదే విమర్శల్ని చాలా సైట్లు రాసుకొచ్చాయి… కానీ అవన్నీ తప్పు… దీనిపై ముచ్చటలో కథనం లింక్ ఇదీ… నీట్ మీద దుమార ప్రచారంలో స్పీకర్ బిర్లా బిడ్డనూ లాగుతున్నారు..!!
ఎవరో ఓం బిర్లా బంధువు కంప్లయింట్ చేసేసరికి మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు… దీనిపై టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇతర పత్రికలు, టీవీలు వార్తలు ఇచ్చాయి… ఓరి నాయనో, అది నా ఖాతా కాదు, అలా ఎలా రాస్తారు అని ధృవ్ రాఠీ ఓ ట్వీట్‌లో ప్రశ్నించాడు… ఇలా… (ఇది కూడా వైరలయింది…) (అదే పేరడీ ఖాతాలో మహారాష్ట్ర పోలీసుల ఆదేశాల మేరకు ఆ పోస్టులన్నీ డిలిట్ చేసినట్టు కూడా మరో ట్వీట్ కనిపించింది…)
https://twitter.com/dhruv_rathee/status/1812066899858948262?ref_src=twsrc%5Egoogle%7Ctwcamp%5Eserp%7Ctwgr%5Etweet
ఈరోజు మిగతా మీడియా కూడా రాసుకొచ్చింది… అసలు ఆ ఖాతా ధృవ్ రాఠీది కాదట కదాని మీడియా అడిగితే మహారాష్ట్ర ఇన్వెస్టిషన్ ఆఫీసర్ ‘అదీ దర్యాప్తు చేస్తాం’ అని సింపుల్‌గా తేల్చేశాడుట… సో, తనది కాని ఖాతా మీద కేసు పెడితే ఆ కేసు ఎలా నిలబడుతుంది అసలు..? కాకపోతే ధృవ్ రాఠీకి ఓ హెచ్చరిక అన్నమాట…
చాలా బెదిరింపులు వచ్చాయి, ఇదేమీ కొత్త కాదు అంటున్నాడు ధృవ్ రాఠీ… తనకు తన వీడియోల ద్వారా బాగా రెవిన్యూ కూడా వస్తోంది కాబట్టి మంచి టీంను ఏర్పాటు చేసుకున్నాడు, కాకపోతే తెరపై తనే కనిపిస్తాడు… తన అఫిషియల్ ఎక్స్ ఖాతా కూడా వేరు… కానీ అర్థం చేసుకోవల్సింది ఏమిటంటే..? ఇది కాకపోతే మరొకటి… ధృవ్ రాఠీని ఇంకెక్కడో ఇరికిస్తారు… ష్యూర్..!!
Share this Article