Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వస్తావు కలలోకి… రానంటావు కౌగిలికి… ఓ నవ్వుల సరదాల సినిమా…

January 4, 2025 by M S R

.

. (  దోగిపర్తి సుబ్రహ్మణ్యం  ) ..    …. A tale of mischievous and prejudicial misperceptions . ఎవరి గోల వారి కధ . వంద రోజులు ఆడిన ఈ గోపాలరావు గారి అమ్మాయి సినిమా మూడు జంటల సినిమా అని చెప్పవచ్చు .

మొయిన్ కుర్ర జంట చంద్రమోహన్- జయసుధ . రెండో అనుమానాల జంట రావుగోపాలరావు- షావుకారు జానకి . మూడో చెవిటి మేళం జంట చక్రవర్తి- ఝాన్సీ . కె వాసు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అంతా వినోదం , నవ్వుల పువ్వులు . సరదాగా కుటుంబం అంతా కలిసి చూడతగ్గ సినిమా . కమర్షియల్ గా కూడా సక్సెస్ అయిన సినిమా .

Ads

ఓ బడాయి రాజా వారి కూతుర్ని బడా ధనవంతుడు గోపాలరావు గారి అమ్మాయిగా పొరపాటు పడటంతో మొదలవుతుంది సినిమా . మరోవైపు గోపాలరావు టింగురంగా అని షోకులోడిగా తిరగటం మీద ఆయన వయసుడిగిన భార్యకు చచ్చేంత అనుమానం .

వెరశి రావు గోపాలరావుని షావుకారు జానకి , భార్య షావుకారు జానకిని రావు గోపాలరావు అనుమానించుకుంటూ ఉంటారు . క్లైమాక్సులో రాజా వారి కుమార్తె అని తెలుస్తుంది . ఆ రాజా వారి సాయంతోనే గోపాలరావు కోటీశ్వరుడు అయ్యాడనే విషయం ప్రేక్షకులకు చెప్పబడుతుంది . కుర్ర జంట పెళ్ళితో సినిమా ముగుస్తుంది .
చక్కటి వినోదాత్మక కధ . ( ఈ సినిమాలో గోలను 2004 లో వచ్చిన మరో సినిమాలో కూడా పెట్టాడు దర్శకుడు కె వాసు . అల్లు అరవింద్ సినిమా ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి సినిమాలో ఇలాంటి గోలే గోలగోలగా ఉంటుంది . కధ వేరు . కానీ సేం గోల ఉంటుంది . రెండు సినిమాలకూ దర్శకుడు కె వాసే . ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ , ఊర్వశి , శ్రీకాంత్ , ఆర్తి , ప్రభుదేవా , బ్రహ్మానందం ప్రభృతులు నటించారు)

చక్రవర్తి సంగీతంలో పాటలన్నీ బాగుంటాయి ఈ సినిమాలో . ముఖ్యంగా టైటిల్సుతో పాటు రన్ అయ్యే సాంగ్ . గోపి వ్రాసిన పాట . గోపాలరావు గారి అమ్మాయి లోకం తెలియని పాపాయి దేవులపల్లి కవితల్లే బాపు గీసిన బొమ్మల్లే . చాలా బాగుంటుంది .

మరో హిట్ పాట ఆరుద్ర వ్రాసిన సుజాతా ఐ లవ్ యూ . గోపి వ్రాసిందే మరో పాట కలలోకి వస్తావు రానంటావు కౌగిలికి కూడా చాలా బాగుంటుంది . ఇంకో పాట వేటూరి వ్రాసారు . మనవే వినవా పాట . ఇదీ బాగుంటుంది . మూడు పాటలూ కుర్ర జంట మీదే .

ఈ సినిమాలో అసలు మెయిన్ హీరోహీరోయిన్లు రావు గోపాలరావు , షావుకారు జానకిలే అని చెప్పాలి . రావు గోపాలరావు బొమ్మల చొక్కాలు , పడుచోడి లాగా కనపడాలనే తహతహ ప్రేక్షకులకు సరదాగా ఉంటుంది . షావుకారు జానకికి ఇలాంటి పాత్రలు చిన్నవే . బాగా చేసింది . ఆ తర్వాత చెప్పుకోవలసింది చక్రవర్తి చెవిటి మేళం . అతన్ని అప్పుడప్పుడు ఆట పట్టించే పెళ్ళాం ఝాన్సీకి డిఫరెంట్ రోల్ .

రాజ్యాలు పోయినా రాజసం పోని బడాయి తండ్రిగా నాగభూషణం , బలాదూర్ బేవార్సుగా కొడుకు మోహన్ బాబు జంట కూడా సినిమాను ఉల్లాసంగా ముందుకు తోస్తూ ఉంటుంది . ఇతర పాత్రల్లో కె విజయ , సారధి ప్రభృతులు నటించారు . నాకో ఉద్యోగం కావాలని రాజా వారి ఉద్యోగ ప్రయత్నాలు నవ్వు , రాజా వారి మీద సానుభూతి కలుగుతాయి .

ఇంక కుర్ర జంట . లాయర్ తల్లిదండ్రుల జంట చక్రవర్తి- ఝాన్సీల మీద ఛాలెంజ్ చేసి రోడ్డు మీద పడ్డ కొడుకుగా , హీరోయిన్ వెంటపడే హీరోగా చంద్రమోహన్ బాగా నటించాడు . ఇలాంటి పాత్రలు ఆయన అలవోకగా చేసేస్తాడు .

ఇంక జయసుధ . ఆమెకూ ఇది చిన్న పాత్రే . ఆమె స్థాయి బరువైన పాత్ర కాదు . పైగా కాస్త గ్లామరస్ గా కూడా చూపలేకపోయాడు దర్శకుడు . దేవులపల్లి కవితల్లే , బాపు గీసిన బొమ్మల్లే అని పాట పెట్టాక కాస్తయినా ఆ రేంజిలో చూపాలిగా ! ఆయిననూ అలవోకగా బాగా నటించింది జయసుధ .

సత్యానంద్ డైలాగులు బాగానే ఉంటాయి . సినిమా , సినిమాలోని కామిక్ సీన్లు , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . చంద్రమోహన్ , జయసుధ , రావు గోపాలరావు అభిమానులు చూడవచ్చు . A watchable , comedy-filled , feel good entertainer . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ‘కల్కి భగవాన్’ కన్నుమూత!
  • దేశంలోకెల్లా నంబర్ వన్ కమెడియన్ చంద్రబాబు!
  • సిగ్గులేదు; గిదేం చరిత్రరా? – ఒరే, ఓదెల, నానీ ఎవుర్రా మీరంతా..?
  • కసబ్ ఇండియాకు ఎందుకొచ్చాడు – వాడి వయస్సెలా నిర్ధారించారు ?
  • పెళ్లికి సగం రోజు పెరోల్… పెళ్లయిపోగానే మళ్లీ జెయిల్ !
  • బీజేపీ- బీఆర్ఎస్ ‘పొత్తుపొడుపు’..! అమిత్ షా రాక సంకేతాలివే !!
  • ఒకటి పాయె – ఇంకొకటీ పాయె – సాయిపల్లవి చేజారిన పాత్రలు !!
  • అంతా మాయ- కల్కి మాయ! ఆమె తప్పుకుంటే… మొత్తం పాత్రే లేపేస్తారా?
  • Love & War … ఆలియా భట్ రెడ్ లుక్ వెనుక అసలు కథేంటి..?
  • రక్తికడుతున్న ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు – పాత సీన్ మారిపోయింది !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions