Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘నా కొడకా’ … హెడింగుల్లో పత్రికలకు పబ్లిషింగ్ ఎటికేట్ అక్కర్లేదా..?

April 21, 2026 by M S R

.

నిన్న కేసీయార్ జగిత్యాల ప్రసంగంలోని కొన్ని మాటల్ని తెలుగు పత్రికలు యథాతథంగా హెడింగులు పెట్టేశాయి… పరుషమైనవీ, బూతుల్లా ధ్వనించేవి నాయకులు గానీ ఇంకెవరైనా గానీ వాడితే పత్రికలు వాటిని యథాతథంగా ప్రచురించాలా..? అలా చేస్తే ఇక పాత్రికేయ ప్రమాణాలు, ఫిల్టరింగ్, పాఠకోచిత భాష ఏమైపోయినట్టు..? ఇదీ తాజాగా తెలుగు జర్నలిస్టుల్లో ఆసక్తికరంగా సాగుతున్న ఓ చర్చ…

నిజానికి మొదట ఏపీ పాలిటిక్స్, తరువాత తెలంగాణ పాలిటిక్స్… నాయకులనేకమంది బజారు భాషను, మరీ వీథికుళాయి భాషను వాడేస్తున్నారు… నాయకుల ప్రసంగాలు, వ్యాఖ్యల్లో విజ్ఞత, వివేచన, వివేకం గట్రా మాయమై చాలారోజులైంది కదా… ఈ దుర్భాషలకు రోజురోజుకూ పదును పెడుతున్నారే తప్ప అడ్డుకట్ట పడటం లేదు…

Ads

సరే, పబ్లిషింగ్ ఎటికేట్ (Etiquette), ‘నైతిక సంకటం’ (Ethical Dilemma) దగ్గరకొద్దాం… నిన్నటి కేసీయార్ ప్రసంగంలోని రెండు వాక్యాలు రెండు పత్రికల్లో రెండు హెడింగులు… 1) నేను చావను నా కొడకా (పేరు పెట్టకపోయినా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి…) 2) లాగులు పలిగేదాకా కాంగ్రెస్‌ను ఉరికిద్దాం… రేవంత్ రెడ్డి కూడా తన ప్రసంగంలో ఎప్పటిలాగే తన శైలిలో ‘లాగూలు- తొండల’ భాషను వాడాడు… కాకపోతే ఆ హెడింగుల్ని పెట్టే ధైర్యం ఏ పత్రిక చేయలేదు…

https://www.facebook.com/share/v/1AxxsjV8c2/?mibextid=wwXIfr



ముందుగా సీనియర్ జర్నలిస్టు Ramu Suravajjula పోస్ట్ ఓసారి చదవండి… ‘‘సారు అన్నడు సరే, మనం శీర్షికలో వాడుడేనా?

భాష ఎంత ప్రమాదకరమైనది?
“My Son” అని ఇంగ్లిష్ లో అంటే ఒక లెక్క.
“बच्चा है तू मेरा” (Baccha hai tu mera) అని దురంధర్ లోలాగా హిందీలో అంటే ఒక లెక్క.
“నా కొడకా…” అని తెలుగులో అంటే ఒక లెక్క.

కుబేర సినిమాలోని పాటలోలాగా… తల్లి కొడుకును…”పచ్చ పచ్చని చేలల్లో…
పూసేటి పువ్వుల తావుల్లో…
నవ్వులు ఏరుతు నడిచేద్దాము…
చేతులు పట్టుకో నా కొడుకా” అంటే పూర్తిగా ఓకే.

“కొడకా… కోటేశ్వరరావు… కరుసై పోతవురో…”
అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పాడితే సరదాకు ఓకే. కానీ ఒక మాజీ సీఎం, రూలింగ్ సీఎంను కొడకా అంటే… అస్సలు బాగోదు.

ఏ నాయకులైనా పబ్లిక్ మీటింగ్స్ లో అట్లా అనకపోవడం మంచిది. అన్నా సరే… పత్రికలో తాటికాయంత శీర్షికలో వాడకపోవడం, టీవీలలో పదేపదే చూపకపోవడం మంచిది.



నిజమే… నేడు క్లిక్-బైట్ (Click-bait) సంస్కృతి వల్ల, సంచలనం కోసం అవే బూతు పదాలను తాటికాయంత అక్షరాలతో వేస్తున్నారు… ఈ అభిప్రాయంతో విభేదించేవాళ్లూ ఉంటారు… ఎలాగంటే..? ఓ నాయకుడి భాషలోని టోన్ అండ్ టెనర్ (Tone and Tenor), విజ్ఙత, తీవ్రత, ఉద్దేశం యథాతథంగా పాఠకులకు చేరవేయాలంటే ఆ వాక్యాలు అలాగే వాడితే తప్పేముందనేది ఒక వాదన…

‘‘ఆల్రెడీ టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాల్లో ఆ మాటలు జనానికి చేరుతూనే ఉన్నాయి… సోషల్ మీడియా, యూట్యూబ్ జర్నలిజంలో మరింత మసాలాలూ అద్దుకుని జనంలోకి వెళ్తున్నాయి… పత్రికలు మాత్రమే ఎందుకు ఆ వాక్యాల్ని దాచిపెట్టి లేదా సంస్కరించి ప్రచురించాలి… సదరు నాయకుల సంస్కార స్థాయిని పాఠకులే విశ్లేషించుకుంటారు, సో, యథాతథంగా ఇవ్వడమే బెటర్’’… ఇదీ ఆ వాదనల సారాంశం…

చర్చ మంచిదే… జరగనియ్… (అన్నట్టు, రేవంత్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హేట్ స్పీచ్’ బిల్లులో ఈ బూతులు కూడా శిక్షార్హమేనా అధ్యక్షా..?)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రెండాకుల్లో ఒక ఆకు చీల్చిన షణ్ముగం ఎవరు..? ఏమిటీ నేపథ్యం..?!
  • ఈ టీవీ ద్రౌపది వెన్నుచూపలేదు…! నిలిచింది – గెలిచింది…!
  • పాలమూరు, పోలవరంతో రేవంత్ లింకులు… ‘చంద్రబాబు’ ఉక్కిరిబిక్కిరి…
  • ఆటగాళ్లపై వలపువల..? సోషల్ పోస్టులపైనా కొత్త ఆంక్షలు..!!
  • బ్రాండెడ్ బతుకు కావాలి… భారీ భరణం ఇప్పించండి యువరానర్…
  • ఆ రోజు నా రాణి చిరునవ్వు చూసి… అనుకున్నా ఏదో నవ్వని…
  • తనికెళ్ల భరణి ‘ఆరాధన’ వెనుక అసలు మానసిక కారణం ఏమిటి..?!
  • సీఎం విజయ్ భార్య సంగీత గైర్హాజరు… సరైన నైతిక నిర్ణయం…
  • దేవుడి దగ్గర కూడా రాజస పోకడలే..! సుధారెడ్డి ఆడంబర ప్రదర్శన..!!
  • రెండుగా చీలనున్న రెండాకులు..! అన్నాడీఎంకేలో ముసలం..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions