.
ఇజ్రాయేల్ Vs హెఙబొల్లా part 4
హెజ్బొల్లా చీఫ్ హాసన్ నజారల్లా ( Hassan Nasrallah ) బాంబు దాడిలో చనిపోయాడు!
Ads
‘‘దక్షిణ లెబనాన్ లోని దహియే (Dahiyeh ) సబ్ అర్బన్ ప్రాంతంలో ఉన్న హెజ్బొల్లా ప్రధాన కేంద్రం మీద ఇజ్రాయేల్ జరిపిన వైమానిక దాడిలో నజారల్లాహ్ చనిపోయినట్లు ఇజ్రాయేల్ చీఫ్ అఫ్ స్టాఫ్ ఒక ప్రకటనలో తెలిపాడు!
లెబనాన్ రాజధాని బీరూట్ మధ్యలో ఉన్న హెజ్బొల్లా హెడ్ క్వార్టర్ మీద దాడి చేయాలని చాలా నెలల ముందే నిర్ణయం తీసుకున్నాం! సమయం కోసం వేచి చూస్తున్నాము అది నిన్న కుదిరింది!
హాసన్ నాజరల్లాహ్ హెఙబొల్లా హెడ్ క్వార్టర్ లోకి ప్రవేశించాడు అనే సమాచారం కోసం ఇన్నాళ్ళు వేచి చూశాము…’’
******
హెఙబొల్లా హెడ్ క్వార్టర్ ఒక పలు అంతస్థుల భవనంలోని అండర్ గ్రౌండ్ లో ఉంది! ముందు జాగ్రత్తగా ఎంత మందం సిమెంట్ స్లాబ్ అవసరం ఉంటుందో దానికి ఒకటిన్నర రెట్లు మందంతో స్లాబ్ వేశారు.
కొంచెం స్థలం వదిలేసి అంతే మందంతో మరో స్లాబ్ వేశారు.
అంటే అండర్ గ్రౌండ్ కి రెండు స్లాబులు, ఒక దాని తరువాత ఇంకో స్లాబు రెండు పొరలుగా నిర్మించారు.
అక్కడితో ఆగకుండా ఆ రెండు కాంక్రీట్ స్లాబుల కింద మరో కాంక్రీట్ సొరంగం ( Tunnel ) నిర్మించింది హెజ్బొల్లా!
ఆ సొరంగం నుండీ బయటికి వెళ్ళడానికి ( ఒక వేళ బాంబు దాడి జరిగితే ) మరో మూడు సోరంగాలు నిర్మించారు సురక్షితంగా బయటికి వెళ్ళడానికి!
ఆ టన్నెల్ లోనే హాసన్ నజరల్లాహ్ దాక్కున్నాడు!
వాళ్లకి తెలుసు ఇజ్రాయేల్ కనుక దాడి చేస్తే మామూలు స్లాబ్ లు ఆగవు అని! ఇంత ముందు జాగ్రత్తగా సిమెంట్ స్లాబ్ వేసినా ఎలా ధ్వంసం చేయగలిగింది ఇజ్రాయేల్?
********
Joint Direct Attack Munition – JDAM
– జాయింట్ డైరెక్ట్ ఎటాక్ మ్యూనిషన్.
JDAM GBU -28 ఎయిర్ టూ సర్ఫెస్ బాంబ్!
ఇది ఫైటర్ జెట్ నుండీ ఆకాశం నుండీ భూమి మీద టార్గెట్ మీదకి ప్రయోగిస్తారు!
ఈ JDAM GBU -28 బాంబుని ప్రయోగంలో భాగంగా ఉపయోగించినపుడు 100 అడుగులు ( 30.5 మీటర్లు ) లోతులోకి దూసుకెళ్లగలిగింది.
అదే కాంక్రీట్ స్లాబ్ మీద ప్రయోగించగా 20 అడుగుల (6 మీటర్లు ) లోకి దూసుకెళ్లగలిగింది!
JDAM GBU – 28,31,32,38 ఇలా పలు వెరియంట్స్ తో తయారు చేశారు.
వీటిని క్లుప్తంగా బంకర్ బస్టర్ (Bunker Buster ) బాంబులు అంటారు!
******
హాసన్ నజరల్లాహ్ బీరూట్ లోని తన హెడ్ క్వార్టర్ లోకి వెళ్లి తలదాచుకున్నాడు అన్న సమాచారం రాగానే IAF ని అలెర్ట్ చేశారు.
HATZERIM AIR BASE దక్షిణ ఇజ్రాయేల్ లో ఉంది!
ఈ ఎయిర్ బేస్ నుండీ 6 F-15 లు గాల్లోకి లేచాయి.
అన్ని F-15 లు కూడా JDAM GBU బంకర్ బస్టర్ బాంబులు మోసుకెళ్లాయి.
JDAM GBU ల బరువు ఎక్కువగా ఉండడం వలన అవి మిగతా ఎలాంటి మిసైల్స్ ని తీసుకెళ్ళ లేవు కనుక భూమి నుండీ కానీ ఎయిర్ TO ఎయిర్ మిసైల్స్ నుండీ కానీ రక్షణ కోసం మరో రెండు F -35లు వెంట వెళ్లాయి. కొద్ది నిముషాలలోనే లెబనాన్ రాజధాని బీరూట్ చేరుకున్న F-15 లు సరిగ్గా పెద్ద పెద్ద రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ మధ్యలో ఉన్న భూ గర్భ బంకర్ మీద దాడి చేశాయి.
మొత్తం 6 JDAM GBU బంకర్ బస్టర్ బాంబులని వేసాయి F-15 లు.
ఆరు బాంబులు కూడా ఒకదాని వెనుక కొద్ది సెకన్ల విరామంలో బంకర్ మీద పడ్డాయి.
మొదటి బాంబు 20 అడుగుల కాంక్రీట్ ని తోలుచుకుంటూ పేలితే దాని వెనుకే వచ్చిన రెండో బాంబు మరింత లోతుగా వెళ్లి పేలింది.
మొత్తం 6 JDAM GBU బంకర్ బస్టర్ బాంబులు ఒకదాని వెనుక ఇంకొకటి ప్రయోగించడం తెలివైన పని. ఎందుకంటే హెజ్బొల్లా 80 అడుగుల మందంతో కాంక్రీట్ స్లాబ్ వేసినా 4 JDAM లు ఒక దాని వెనుక వెళతాయి కాబట్టి అవి కాంక్రీట్ ని తొలుచుకుంటూ వెళ్లి మిగతా రెండు బాంబులకి త్రోవ చూపిస్తాయి అడుగు భాగానికి!
6 JDAM GBU లు పేలిన విధం ఎలా వుంది అంటే ఆ ప్రాంతంలో భూమి ప్రకంపనలు రిక్టర్ స్కెల్ మీద 3.2 గా నమోదు అయ్యాయి!
దుమ్ము, ధూళితో కూడిన పొగ మేఘాలు కమ్ముకున్నయి ఆ ప్రాంతం అంతటా!
భూగర్భ బంకర్ లో ఉన్న వాళ్ళు ఎవరూ బ్రతికే అవకాశం లేదు సరికదా కనీసం ఎముకలు కూడా వేడికి కనపడకుండా పోయాయి!
HATZERIM AIR BASE కమాండర్ బ్రీగేడియర్ జెనరల్ అమిచాయ్ లెవిన్ ( Brig. Gen. Amichai Levin ) మాట్లాడుతూ ఇది చాలా టెక్నీకల్ గా సంక్లిష్టమైన మిషన్. ప్రతీ సెకన్ కూడా విలువైనది మరియు కష్టమైనదే. ఎందుకంటే F-15 ఫ్లీట్ ఎలాంటి రక్షణ లేకుండా దాడికి వెళ్లాయి కానీ బీరూట్ లో మాకు ఎలాంటి ప్రతిఘటన ఎదురవ్వలేదు.
హాసన్ నజారల్లా మరణంతో హెజ్బొల్లా అంతరించి పోయినట్లే!
మధ్య ప్రాచ్యంలోని జియో పాలిటిక్స్ అనేవి అనూహ్యమైన మార్పులకి లోనవతాయి అనడంలో సందేహం లేదు…. (పొట్లూరి పార్థసారథి)
Share this Article