Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చెలరేగిపోతున్న హిజ్రా మాఫియా ! చెక్కగాళ్లు కనిపిస్తే చాలు వణుకే !!

August 31, 2026 by M S R

.

‘‘హైదరాబాద్‌లో మా పక్కింట్లో పెళ్లి. ట్రాన్స్ జెండర్లు పది మంది వచ్చి పెళ్లి ఇంట్లో నానా యాగీ చేశారు. పెళ్లి ఇంటి గోడల మీద అభ్యంతర గుర్తులు గీసారు. యాభై వేలు ఇస్తే కానీ వెళ్ళమని తలుపుకి అడ్డుగా నిలుచున్నారు. ఇరవై వేలు ఇస్తాం అంటే, ఫోన్లు చేసి ఇంకొక పది మందిని పిలిచి, అందరూ బూతులకి దిగారు. చివరికి 35 వేల రూపాయలు తీసుకొని వెళ్ళారు. పోలీసులు ఈ అరాచకాన్ని ఎందుకు అడ్డుకోరు? కేసులు ఎందుకు పెట్టరు? అరెస్టు ఎందుకు చెయ్యరు?’’

……. ఇదీ సోషల్ మీడియాలో ఓ పోస్టు, ఓ ఆవేదన… నిజానికి లక్షలాది మంది ‘రోదన’… ఎవరు వాళ్లు..? ఎందుకు శుభకార్యాలకు అంత భారీ మొత్తాల్లో టాక్సులు కట్టాలి… హైదరాబాద్ మాత్రమే కాదు, అన్నిచోట్లకూ విస్తరించింది… ఇదొక మాఫియా, అండర్ వరల్డ్ నెట్‌వర్క్ స్థాయిలో పెరుగుతోంది…

Ads

పెళ్లిళ్లే కాదు, చిన్న షాపుల ఓపెనింగ్స్, ఎంగేజ్‌మెంట్స్, రిసెప్షన్స్, చివరకు సీమంతం, పెద్దమనిషి వేడుకలు… ఇంకా చెప్పాలంటే సత్యనారాయణవ్రతం అయినా సరే వీళ్లు వదలడం లేదు… వేలకువేలు… వస్తారు, డబ్బులిస్తే ఇంటి గోడ మీద ఓ మార్క్ వేస్తారు, వేరేవాడు రాడు ఇక… అంటే, అంత బలంగా ఆర్గనైజ్ అవుతున్న మాఫియా…

అనేక షాపులకు రెగ్యులర్‌గా వెళ్తారు, రౌడీ మామూలు వసూలు చేసుకుంటారు… చివరకు పర్మిట్ రూముల్లో కూర్చున్న మందుబాబులకూ ఈ బెడద తప్పడం లేదట… కానీ ఎవడూ మాట్లాడడు, పోలీసులతో ఏం లాలూచీయో తెలియదు, వాళ్లకూ పట్టదు…

ఇంకా ఘోరం ఏమిటంటే..? ఫంక్షన్ హాళ్లు, టెంట్ హౌజులు కూడా మిలాఖతై వాటాలు తీసుకోవడం..!! అత్యంత నీచంగా ఉంది ఈ యవ్వారం… వీళ్లు పెద్ద పెద్ద పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు, హైప్రొఫైల్ పొలిటిషియన్స్, జడ్జిలు, లోకల్ లీడర్ల జోలికి పోరు, మరీ ధనిక వ్యాపారవేత్తలు అయితే బౌన్సర్లను పెట్టి తన్నిస్తారు కదా, వాళ్ల జోలికి కూడా వెళ్లరు… అందుకే ఈ నొప్పి వీళ్లెవరికీ అర్థం కాదు…

అసలు టార్గెట్ మధ్య, ఎగువ మధ్యతరగతి… శుభకార్యం వేళ పరువు పోవద్దని తాపత్రయపడే వర్గం… వాళ్లే కదా అందరికీ టార్గెట్… చివరకు చేతులెత్తేసిన లా అండ్ ఆర్డర్… పైగా శుష్క మేధావులు ఈ హిజ్రాలకు సపోర్టుగా పేద్ద పేద్ద కథనాలు… అందుకే చెప్పేది, తగిలేవాడికే నొప్పి తెలిసేది…

(ఓ షాపు ఓనర్ చెప్పాడు… ఈ వసూళ్ల హిజ్రాల్లో సగం మంది ఫేక్ అట… మగ వెధవలే ఆ వేషాలు వేసుకుని, సంపాదిస్తున్నారు అట…)

సోకాల్డ్ పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఏవేవో ప్రాపంచిక విషయాల మీద అపారమైన జ్ఞానాన్ని ప్రదర్శిస్తారు… తెలుగులో ఒక ఆంటీ, ఒక అంకుల్ జస్ట్ ఆస్కింగ్ అని మస్తు జ్ఞానబోధ చేస్తారు కదా… ఇక్కడ నోరు పెగలదు… పెగిలితే వాళ్ల ఇళ్ల ముందు రచ్చ రంబోలా తప్పదు కాబట్టి…

ఏరియాలవారీగా ఈ సిండికేట్ పంచుకున్నా సరే, లోకల్ గుండాలకు హఫ్తా చెల్లిస్తుంటారు… వాళ్లు పోలీసులకు చెప్పి ఏమైనా సమస్యలు వస్తే సెటిల్ చేస్తుంటారు… వాళ్లలోవాళ్లకు కొన్నిచోట్ల గ్యాంగ్ వర్స్ కూడా… ఇదొక పెద్ద నేర సామ్రాజ్యం… పోలీసు యంత్రాంగం డిజాస్టరస్ ఫెయిల్యూర్…

ఈ నేపథ్యంలో ఓ చిన్న నటి, బిగ్‌బాస్ ఫేమ్, రాంగోపాల్ వర్మ బ్యాచ్ అరియానా గ్లోరి ధైర్యంగా మాట్లాడింది… ఆమెకున్న సోయి మిగతా వాళ్లకు లేకపాయె… యాంకర్ రవి ప్రారంభించిన పాడ్‌కాస్ట్ స్టూడియో ఓపెనింగ్‌కు అతిథిగా హాజరైన ఆమె, ఆ సందర్భంలో తాను చూసిన, గతంలో అనుభవించిన కొన్ని సంఘటనలను ప్రస్తావిస్తూ హిజ్రాల తీరుపై తీవ్ర భావోద్వేగంతో మాట్లాడింది…

‘‘రూపాయి రూపాయి కూడబెట్టుకుని, ఓ ఇల్లు కట్టుకుంటే, ఓ పెళ్లి చేస్తుంటే వీళ్లు వస్తారు, పంచాయితీ… ఆనందకరమైన సందర్భాలను కూడా అమంగళం చేసి, మనశ్శాంతి లేకుండా నెగెటివ్ వైబ్స్ మిగిల్చుతున్నారు… నేనూ బాధితురాలినే… పూజ జరుగుతుంటే, బంధుమిత్రులున్నచోట వీళ్ల అరాచకం ఓ చేదు అనుభవాన్ని ఓ మరకగా మిగిల్చుతోంది…’’

పెద్ద పెద్ద డ్రగ్స్, వ్యభిచార, సైబర్, ఇతర క్రైమ్ సిండికేట్లను కంట్రోల్ చేయడం ఎలాగూ చేతకాదు, కనీసం హిజ్రాల సిండికేట్లు, మాఫియాలను కూడా కంట్రోల్ చేయలేరా మన ఖాకీ పెద్దలు..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దేశంలోనే మొట్టమొదటిసారి ఒక విలేకరిపై టాడా కేసు…
  • గాఢనిద్రలో ఉన్న చంద్రబోస్ తెలంగాణతనం సోయి తెచ్చుకుంది !!
  • మీరూ మాలాగే దారితప్పారా పుష్పా? హీరో అంటేనే అన్‌వాంటెడ్ ఎలిమెంటా?
  • గుడ్ రిజల్ట్ ! గుడ్ ఫీడ్ బ్యాక్ ! – రేవంత్ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌పై ఓ సర్వే !!
  • సరే, అంతరిక్షంలోనే తలపడదాం – మస్క్ మాటలకు అంబానీ చేతల జవాబు !!
  • కామెడీ కళ్యాణ్ ! రెనిగేడ్ కళ్యాణ్ ! నక్సలైట్లూ కామెడీ సరుకైపోయారా ?!
  • పాపం రాహుల్ ! మాటల్లో, వ్యవహార శైలిలో ఏదో భారీగానే తేడా కొడుతోంది !
  • ఈ అందాల జాస్మిన్ యువరాణి! మూలాలు వెతుక్కుంటూ ముంబైకి !!
  • న్యూయార్క్ సిటీ నిద్రపోదు.. టైమ్ స్క్వేర్ అస్సలు అలసిపోదు! 
  • బ్రాడ్‌వే షో – ఓ రంగస్థల అబ్బురం..! సురభి నాటకాలకు వంద మెట్లు పైన !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions