Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

IMDB ర్యాంకులు పెద్ద డొల్ల యవ్వారం… ఈ బోల్డ్ నటి టాప్ వన్ అట…

December 7, 2024 by M S R

.

అసలు ఐఎండీబీ రేటింగ్స్ అంటేనే ఓ పెద్ద ఫార్స్… దాని సినిమా రేటింగ్స్ సంగతి తెలుసు కదా…

ఇప్పుడది 2024 టాప్ స్టార్స్ అని ఓ జాబితా రిలీజ్ చేసింది… అది ఇంకా ఫార్స్… మరీ ఆర్మాక్స్ మీడియాకన్నా దారుణంగా తయారైంది ఈ ఐఎండీబీ కూడా…

Ads

సినిమా రేటింగులకు ఓ ప్రాతిపదిక లేదు, నమ్మబుల్ కావు… కనీసం ఈ టాప్ స్టార్స్ ఎంపిక కూడా అంతేనా..? అంతే… అసలు ఆ రేటింగుల ప్రాతిపదికలోనే లోపముంది… సరే, వాడిష్టం, మన ఖర్మ అందామా..?

చూడండి… తృప్తి దిమ్రి అనే ఓ బోల్డ్ నటి ఉంది తెలుసు కదా… అదేనండీ, యానిమల్‌లో హీరోకు దీటుగా అత్యంత బోల్డ్‌గా, సదరు సందీప్‌రెడ్డి పైత్యవిశేషాలకు అనుగుణంగా నటించింది కదా… ఆమే టాప్ స్టార్ అట… (మరి సన్నీ లియోన్ సంగతేమిటి అంటారా..? సారీ ఆమె బోల్డ్‌నెస్ ఎందుకూ సరిపోదట…)

ఇదేం లెక్కరా బాబూ… బోల్డ్‌నెస్ మాత్రమే పరిగణనలోకి తీసుకునే ప్రామాణికమా అనడిగితే… ఎంతమంది ఎవరి పేజీలు ఓపెన్ చేసి చూశారో అదే లెక్క అంటాడు ఐఎండీబీ వాడు… అవునుర భయ్, ఇంత బోల్డ్ నటి ఎవరబ్బా అని లక్షల మంది ఇదే చెత్తా ఐఎండీబీ పేజీలు, డిటెయిల్స్ సెర్చ్ చేసి ఉంటారు, దాంతో ఆమే టాప్ స్టార్ అవుతుందా..?

భూల్‌భులయ్యా3, బ్యాడ్ న్యూజ్ కూడా చేసింది కదా అంటాడు వాడు… మరి ఆ లెక్కన మా రష్మిక అదే యానిమల్‌లో అంతే బోల్డ్‌నెస్ చూపించింది, పుష్ప2లో కూడా బోలెడంత వెకిలితనాన్ని డాన్సుల్లో ఆరబోసింది, మరి ఆమె కదా ఫస్ట్ రావల్సింది..?

రెండో ప్లేస్ దీపిక పడుకోన్ అట… తల్లి కావడంతోపాటు ఈ ఏడాది సింగమ్ అగెయిన్, లేడీ సింగమ్, కల్కి ఎట్సెట్రా ఉన్నాయి ఆమె ఖాతాలో… ఒకరకంగా ఈ ప్లేసింగ్ వోకే… ఆలియాభట్, ఆమే ఇప్పుడు హైలీ పెయిడ్ తారలు… అన్నట్టు ఆలియా భట్ తొమ్మిదో ప్లేసు అట… మరి నాలుగో ప్లేసు..?

ఇషాన్ ఖతీర్ అట… విన్నారా పేరు ఎప్పుడైనా..? ది పర్‌ఫెక్ట్ కపుల్ అని నెట్‌ఫ్లిక్స్ సీరీస్‌లో యాక్ట్ చేసిందట… క్లారిటీ వచ్చింది కదా, ఈ ఐఎండీబీ రేటింగ్స్ ఎంత డొల్ల యవ్వారమో… ఫాఫం, అంతటి షారూక్ ఖాన్ ఐదో ప్లేసు,.. చివరకు ఇంత బతుకూ బతికి…?

ఆరో ప్లేసు మరో పెద్ద జోక్… నాగచైతన్యను పెళ్లి చేసుకున్న శోభిత ధూళిపాళ… సరే, నాగార్జున కోడలు అట, చైతూ భార్య అట, ఇంతకీ ఎవరీమె అని పదే పదే సెర్చ్ చేసుంటారు జనం… దాంతో ఏకంగా ఆరో ప్లేసులోకి వచ్చి నిల్చుందట… మంకీ మ్యాన్ అని హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది, కల్కిలో దీపికకు డబ్బింగ్ చెప్పి, ఏకంగా దీపికతోనే టాప్10 జాబితాను పంచుకుంది…

తరువాత ప్లేస్ శార్వరి అట… ఎవరీమె..? విన్నారా ఎప్పుడైనా..? ముంబై నటి, చేసింది పట్టుమని మూడే సినిమాలు… ఐనా టాప్ టెన్ జాబితాలోకి వచ్చేసింది… ఫాఫం ఆమె తరువాతే అంతటి ఐశ్వర్యారాయ్… నిజానికి ఆమె కూడా పెద్దగా వార్తల్లో లేదు ఈ ఏడాది, అభిషేక్‌తో విడాకులు, విభేదాల వార్తలు తప్ప…

తరువాత సమంతా… ఆమెకూ పెద్ద చెప్పుకోదగ్గ ఏడాది కూడా కాదు… అదేదో సిటాడెల్ అనే ఓ పిచ్చి సీరిస్ చేసింది, అదీ ఫ్లాప్… వీళ్లందరి తరువాతే ఆలియా భట్… నిజానికి ఆమే హయ్యెస్ట్ డిమాండ్ ఉన్న నటి ప్రస్తుతం… సరే, సరే, అక్కడికే వస్తున్నా… ఈ మొత్తం జాబితాలో మగ పురుష్ ఎవరూ లేరు అనేదే కదా మీ ప్రశ్న… షారూక్ ఖాన్ ఉన్నాడు కదా… ఐదారు వేల కోట్ల విలువైన సినిమాల్లో పనిచేస్తున్న ప్రభాస్ ఫాఫం… పదో ప్లేసు అట..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మీరు జ్ఞానులే…. కానీ మన బ్యూరోక్రాట్లతో పోలిస్తే.., జస్ట్, చలిచీమలు…
  • ఇండియా వదిలేసి, లక్షల మంది దేశదేశాలకు వలస.., ఎందుకు..?!
  • SIR … వోట్ల ప్రక్షాళన తరువాత ఏమిటి..? ఇదీ ఓ క్లారిటీ..!
  • అసలు ఏమిటి ఈ ఉన్నావో కేసు..? ఎవరు ఆ నొటోరియస్ క్రిమినల్..?
  • వెండి, బంగారం…! ఎందుకీ పరుగు..? ఎక్కడి దాకా..? సేఫేనా..?
  • ‘సేటూ, ప్రాణాలు పోతాయని డబ్బుల్లేకపోయినా తిన్నాను… ఇక నీ దయ..’
  • వీడొక డర్టీ ఫెలో… అగ్లీ కేరక్టర్… తగిన శాస్తి చేయండి… అర్హుడే..!!
  • ముక్కోటి ఏకాదశి అంటే ఒకటే తిథి కదా.., మరి పదిరోజుల దర్శనాలు..?!
  • కురువాపురం వెళ్లొచ్చాం… శ్రీపాద వల్లభుడి గుడిలో దివ్యానుభూతి…
  • సంస్కారం, మర్యాద, పరిణతి… రేవంత్ రెడ్డి తలెత్తుకున్నాడు కేసీయార్ ఎదుట..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions