Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చూడ చూడ టీవీక్షకులందు హైదరాబాద్ వీక్షకుల టేస్టులు వేరయా… 

August 4, 2023 by M S R

ఓహో… మేం తోపులం… అంతటి టీవీ9 చానెల్ మెడలు వంచాం… తొక్కేశాం… మేం నంబర్ వన్ ప్లేసులో నిలిచాం… అని ఎన్టీవీ చెప్పుకుంటుంది తెలుసు కదా… ఏదైనా ఒకవారం పొరపాటున మళ్లీ టీవీ9 గనుక ఫస్ట్ ప్లేసులోకి వస్తే ఇక టీవీ9 ఆఫీసుల్లో సంబరాలు, కేకు కటింగులు, ఊరంతా హోర్డింగులు… దీపావళి జరిపేసుకుంటుంది… కానీ ఇప్పుడిక టీవీ9 పూర్వ వైభవం సాధించే సీన్ కనిపించడం లేదు… ఎన్టీవీ చాలా ముందంజలోకి వెళ్లిపోయింది…

అరెరె, ఆగండి… టీవీ9 చానెల్‌కు ఓ కంటితుడుపు ఉంది… హైదరాబాద్ బార్క్ రేటింగ్స్‌లో మాత్రం ఇప్పటికీ టీవీ9 చానెలో తోపు… వీర తోపు… ఎన్టీవీని హైదరాబాద్ న్యూస్ ప్రేక్షకులు పెద్దగా ఇష్టపడరు… ‘దేకరు’… రెండు కాదు, ఏకంగా మూడో ప్లేసు దానిది… టీవీ9 కూ ఎన్టీవీకి నడుమ బోలెడంత గ్యాప్… సో, ఇప్పట్లో హైదరాబాద్ మార్కెట్‌లో టీవీ9ను కొట్టేయడం ఎన్టీవీకి సాధ్యం కాదు…

(అసలు ఈ రేటింగ్స్‌కు విశ్వసనీయత ఉందా..? అన్నీ మేనేజ్డ్ అంటారు కదా అనేదేనా మీ డౌట్… టీవీ వీక్షణల్ని కొలవడానికి ఉన్నది ఒకటే బార్క్ రేటింగ్స్… మరేటి సేస్తాం, ఆ లెక్కల ఆధారంగానే చెప్పుకోవాలి)… ఇదీ హైదరాబాద్ మార్కెట్ రేటింగ్స్… సాక్షి టీవీ ఏకంగా పదో ప్లేసు… మరీ ఘోరమైన టీఆర్పీలు… ఫాఫం, చెప్పుకోవడానికి కనీసం ఏబీఎన్ పరిసరాల్లో కూడా లేదు…

Ads

trp

మిగతా రూరల్ ప్రాంతాల్లో, ఏపీ తెలంగాణ పట్టణ ప్రాంతాల్లో ఎన్టీవీ టాప్ ప్లేసులో ఉండి, టీవీ9 ఎందుకు దెబ్బతినిపోయింది..? ఇది ఓ పెద్ద ప్రశ్న… మరీ ముంబై పోలీసులు దర్యాప్తు చేయాల్సిన అవసరమేమీ లేదు… టీవీ సర్కిళ్లలో చాలామందికి చాలా డౌట్లున్నయ్… సరే, ఆ లోతుల్లోకి వద్దులే గానీ… హైదరాబాద్ ప్రేక్షకుల టేస్టు ఈ న్యూస్ చానెళ్ల కోణంలోనే డిఫరెంటా..? వినోద చానెళ్లలోనూ ఇంతేనా..? ఇంతే… ఇక్కడా హైదరాబాద్ టేస్ట్ డిఫరెంట్…

మామూలుగా వినోద చానెళ్లలో స్టార్ మాటీవీ టాప్… రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కొన్నిసార్లు దేశంలోని అన్ని టీవీలకన్నా ఎక్కువ రేటింగ్స్ ఉంటాయి దానికి… దీని దెబ్బకు అంతటి ఈటీవీ కూడా కుదేలైపోయింది… జీతెలుగు మాత్రం మాటీవీకి కాస్త పోటీ ఇవ్వడానికి విఫల ప్రయత్నం చేస్తోంది… కానీ హైదరాబాద్ మార్కెట్‌లో స్టార్ మాటీవీని పెద్దగా దేకరు… ఈ మార్కెట్‌లో జీతెలుగే తోపు…

మచ్చుకు హైదరాబాద్ మార్కెట్ ఫిమేల్ కేటగిరీ తీసుకుంటే… జీతెలుగు రేటింగ్స్ 1204… కానీ స్టార్ మాటీవీ రేటింగ్స్ జస్ట్ 900… ఈటీవీ మరీ ఘోరంగా 529 మాత్రమే… ఈటీవీ దురవస్థకు కారణాల్ని మనం గతంలోనూ చెప్పుకున్నాం కాబట్టి మళ్లీ ఇప్పుడు, ఇక్కడ అక్కర్లేదు… కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వినోద చానెళ్ల ప్రేక్షకులకన్నా హైదరాబాద్ ప్రేక్షకులు జీతెలుగును ఎందుకు అభిమానిస్తున్నారు..? ప్రత్యేకించి సీరియళ్ల వీక్షణంతో చానెళ్లను పోషించే మహిళా ప్రేక్షకులు హైదరాబాద్‌లోనే స్టార్ మాటీవీని ఎందుకు తిరస్కరిస్తున్నారు..? ఒక బ్రహ్మముడికన్నా ఒక త్రినయనినే ఎందుకు చూస్తున్నారు..? ఏమో మరి, రేటింగ్స్ మేనేజ్ చేసేవారికి ఎరుక..!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • “చచ్చావా… బతికావా?”…. చైనాలో సెన్సేషన్ సృష్టిస్తున్న కొత్త యాప్…!
  • ప్రజారాజ్యం పార్టీ పెట్టింది అక్కినేని..! ఎన్నికల్లో పోటీ కూడా చేశాడు..!!
  • భారత్‌కు చరిత్రాత్మక విజయం … అమెరికాకు వ్యూహాత్మక దెబ్బ…
  • కుంతి కోసం, నెత్తుటి మూలాల కోసం… ఓ డచ్ కర్ణుడి అన్వేషణ…
  • పండుగ స్పెషల్ షో అయినా సరే… అదే జబర్దస్త్ మార్క్ బూతు స్కిట్…
  • రాహుల్ ద్వంద్వ పౌరసత్వం… కోర్టులో ప్రస్తుత స్థితి… ఫ్యాక్ట్ చెక్…
  • ఈసారి నిజంగానే చంద్రుడిపై కాలు పెడతారట అమెరికన్లు..!!
  • అమెరికా చుట్టూ అసాధారణ లక్ష్మణరేఖ… 75 దేశాలకు వీసాల నిలిపివేత…
  • వెంకటేశ్ ‘ఒంటరి పోరాటం’… చిరంజీవి సినిమా కథే కాస్త అటూ ఇటూ…
  • కలంయములు..! తెలంగాణ పోలీసులు చెబుతున్న పాఠమేమిటంటే..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions