.
కొన్ని అలా జరిగిపోతుంటాయి… It Happens… కానీ ఏదో వైపరీత్యంలాగా కలుక్కుమనిపిస్తాయి… ఇదీ అంతే… మీకు అత్యంత అవమానకరమైన ఓటములు చాలా తెలుసు, మన క్రికెట్ జట్టు చరిత్రలో కోకొల్లలు… కానీ అత్యంత అవమానకరమైన గెలుపు తెలుసా…? ఇదీ అంతే…
ఈరోజు జపాన్ వర్సెస్ ఇండియా క్రికెట్ మ్యాచ్… పరిస్థితులు అనుకూలించలేదు, టీ20 మ్యాచ్ కాస్తా ఐదు ఓవర్ల మ్యాచ్‌గా కుదించారు… అదేదో సూపర్ ఓవర్ అన్నట్టుగా… సూపర్ 5 అన్నమాట…
Ads
నిజానికి అలా చేయడమే తప్పు… ఐదు ఓవర్లకు ఓ మ్యాచ్ ఏమిటి..? వన్డే, టెస్టు, టీ20 ఏ నిబంధనలు దానికి వర్తింపజేయాలి..? సరే, ఆ డిబేట్ పక్కన పెడితే… జపాన్ వరల్డ్ క్రికెట్‌లో పసికూన… ఓనమాలే సరిగ్గా తెలియవు… కానీ ఇండియా… వరల్డ్ ఛాంపియన్స్ వర్తమాన చరిత్రలో…
కానీ… ఏం జరిగింది..? ఏడు సముద్రాలు ఈదిన గజ ఈతగాడు ఇంటి ముందటి మురికి కాల్వల్లో పడినట్టు… సరే, సరే, పడి కాలరెగరేసినట్టు…. వివరంగా చెప్పుకుందాం… ఫస్ట్ బ్యాటింగు ఇండియా… అందరూ తోపులే కదా, కాగితాల మీద…
ది గ్రేట్ అభిషేక్ శర్మ డకవుట్… సంజూ శాంసన్ 9 పరుగులు, ఔట్… బ్యాట్ ఊపడమే స్ట్రాటజీ అన్నట్టుగా ఆడి వికెట్ పారేసుకోవడం… తరువాత ఇషాన్ కిషన్ ఆరు బాల్స్ ఎదుర్కుని చచ్చీచెడీ 3 రన్స్ చేశాడు… ఒక్క శ్రేయాస్ అయ్యర్ కాస్త నయం, కుదురుగా 12 బాల్స్‌లో 16 రన్స్ చేశాడు… తిలక్ వర్మ, దూబే హోప్‌లెస్… వెరసి 4 వికెట్లకు 32 పరుగులు… (ఒక దశలో 14 పరుగులకు 3 వికెట్లు)…

అయిపోయింది, ఓ చరిత్రాత్మక ఇజ్జత్ పంచనామా ఓటమి చూడబోతున్నాం అనుకున్నాం… కానీ… రవి బిష్ణోయ్ ఒకే ఓవర్‌లో పది పరుగులు ఇచ్చాడు… వాషింగ్టన్ సుందర్ సగటున 6.50 పరుగులు ఇచ్చాడు… చివరి ఓవర్‌లో ఇక 8 పరుగులు తీస్తే చాలు, జపాన్ జయకేతనం…
అక్షర్ పటేల్… వైడ్స్‌కు ప్రసిద్ధి కదా… కానీ ఈసారి తెలివిగా బౌల్ చేశాడు… నాలుగే రన్స్, ఒక వైడ్… వెరసి 2 పరుగులతో ఇండియా గెలుపు… తలవంచుకుని సిగ్గుతో… లైవ్ క్రికెట్ సైట్స్ ఏ దశలోనూ ఇండియా గెలుస్తుందని అంచనా వేయలేదు… అదీ సిట్యుయేషన్…
అఫ్‌కోర్స్, తమదైన రోజు ఎవరైనా ఏ ఆటలోనైనా తోపులే… కానీ మరీ ఇలాంటి అవమానకరమైన గెలుపు మాత్రం చెప్పుకోవాల్సిందే… అవునూ, చెప్పనేలేదు కదూ… మన మగ పురుష్ గతి ఇలా ఉంటే, పూర్తి భిన్నంగా మన ఆడ వుమెన్ క్రికెటర్లు మాత్రం తమ భీకర ఫామ్ కొనసాగిస్తూ శ్రీలంకను మట్టికరిపించి ఆసియా క్రీడల్లో గోల్డ్ కొట్టారు… మన నేషనల్ క్రష్ స్మృతి మరోసారి మెరిసింది..!!
Share this Article