.
ఇంగ్లండ్‌కు వన్డే సిరీస్‌ను ఇండియా అప్పగించింది… ఈ విజయానికి ఇంగ్లండ్ ప్లేయర్లు ఖచ్చితంగా అర్హులే… మొదటి రెండు మ్యాచుల్లో పెద్దగా ఇంప్రెసివ్ ఆటతీరు చూపించని రోహిత్- కోహ్లీ ఈ మ్యాచులో బాగా ఆడారు… కానీ మిగతా ప్లేయర్ల నుంచి బలమైన సపోర్ట్ దొరకలేదు… ప్రత్యేకించి ఇషాన్, శ్రేయాస్, రాహుల్ తీవ్రంగా నిరాశపరిచారు…
ఏమాటకామాట ఇది చివరి వన్డే మ్యాచ్ అని ప్రచారం జరిగింది కదా… రోహిత్ రెచ్చిపోయి ఆడాదు… లార్డ్స్‌లో వడ్డే సెంచరీ చేసిన మొదటి ఇండియన్… అదీ 40 ఏళ్ల వయస్సులో…! ఒత్తిడిలో దూకుడుగా ఆడే కోహ్లీ కూడా ఒకవైపు రిక్వైర్డ్ రన్ రేట్ బాగా పెరిగిపోవడంతో, భారీ షాట్లకు ప్రయత్నిస్తూ ఔటయిపోయాడు…
Ads
నిజానికి ఇంగ్లండ్ 388 పరుగులు ఓ అసాధారణ రికార్డు… ఇండియా మీద ఇదే హయ్యెస్ట్ స్కోర్… ఇంత స్కోర్‌ను గతంలో ఎవరి మీదా, ఎప్పుడూ ఇండియా చేధించలేదు… సో, మొదటి నుంచీ గెలుపు మీద సందేహమే… కానీ రో-కో ఉన్నంతసేపు ఇండియన్ ప్రేక్షకులకు ఎక్కడో చిన్న ఆశ… ఎప్పుడైతే గిల్, కోహ్లీ, రోహిత్ అవుటయిపోయారో, ఇక మ్యాచ్ కోల్పోయాం, సిరీస్ కోల్పోయాం…
ఇంగ్లండ్ కెప్టెన్ కూడా ఏకంగా ఏడుగురు బ్యాటర్లను వాడాడు… విశేషమే… శామ్ కరణ్ నాలుగు వికెట్లు తీసి ఇండియా వెన్ను విరిచాడు… మన బౌలర్ల విషయానికి వస్తే… బుమ్రా లేడు, ఆడిన ప్రసిద్ధ, అర్షదీప్, ప్రిన్స్ యాదవ్, అక్షర్ పటేల్, గుర్నూర్ ఇంగ్లండ్ మీద ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు… భారీగా పరుగులు ఇచ్చారు… ఇండియా ఓటమికి మన వీక్ బౌలింగే ప్రధాన కారణం…
మరీ గుర్నూర్ అయితే ఓవర్‌కు 9.70 రన్స్ ఇచ్చేశాడు… కానీ ఏమాటకామాట… ఇన్ని బలహీనతల నడుమ కూడా ఇండియా మరీ అంత తేలికగా చేతులెత్తేయలేదు… చివరిదాకా ఫైట్ ఇచ్చింది… 388 రన్స్ చేధన దిశలో 360 రన్స్ చేయడం కూడా బహుశా ఇదే తొలిసారి… గతంలో 2013లో ఆస్ట్రేలియాపై 361 రన్స్ చేధించిన చరిత్ర ఉంది..
Share this Article