Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చిన్న ఆవిష్కరణలే… చెప్పరాని అవస్థల్ని తీరుస్తాయి… ఇలా…!!

January 16, 2026 by M S R

.

అవసరమే అన్వేషణకు, ఆవిష్కరణకు తల్లి… కానీ కొన్ని ఆవిష్కరణలు అన్ నోటీస్డ్‌గా వెళ్లిపోతుంటాయి… అవి నిజానికి చిన్నవి కాదు, సాధారణంగా మనం రోజువారీ చూసే సమస్యలను చాలామంది పట్టించుకోరు  కూడా…

కానీ, ఒక డిజైనర్‌కు ఆ సమస్యే ఒక కొత్త ఆవిష్కరణకు పునాది అవుతుంది… పుణెకు చెందిన సత్యజిత్ మిట్టల్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది… మన దేశంలో కోట్లాది మంది ఉపయోగించే భారతీయ శైలి టాయిలెట్లలో (Indian Squat Toilets) ఉన్న అసౌకర్యాన్ని గమనించిన ఆయన, దాని రూపురేఖలనే మార్చేసి ‘స్క్వాట్ ఈజ్’ (SquatEase) అనే అద్భుతాన్ని సృష్టించాడు…

Ads

సమస్య ఎక్కడ ఉంది?

సాంప్రదాయ ఇండియన్ టాయిలెట్లలో కూర్చున్నప్పుడు శరీర బరువు మొత్తం కాలి వేళ్లపై పడుతుంది… దీనివల్ల మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవారు, వృద్ధులు, గర్భిణీలు చాలా ఇబ్బంది పడతారు… సరిగ్గా బ్యాలెన్స్ లేక కింద పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది… కూర్చోవడం, లేవడం కూడా కష్టమే… పుణెలోని ‘ఎంఐటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్’ పూర్వ విద్యార్థి అయిన సత్యజిత్, ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపాలనుకున్నాడు…

వెస్టరన్ కమోడ్లను ఉపయోగించడం బాగా అలవాటైనవాళ్లు ఎక్కడికైనా వెళ్తే, ఈ ఇండియన్ స్టయిల్ టాయిలెట్లను ఉపయోగించడానికి పడే అవస్థ అంతా ఇంతా కాదు కూడా…

toilet

‘స్క్వాట్ ఈజ్’ ప్రత్యేకతలు ఏంటి?

సత్యజిత్ రూపొందించిన ఈ డిజైన్ కేవలం ఒక టాయిలెట్ సీటు మాత్రమే కాదు, అది ఒక ఎర్గోనామిక్ అద్భుతం… 

  • మడమలకు సపోర్ట్…: ఇందులో ఉండే ఫుట్‌రెస్ట్ ఒక ప్రత్యేకమైన కోణంలో ఉంటుంది… దీనివల్ల బరువు వేళ్లపై కాకుండా మడమల మీద సమానంగా పంపిణీ అవుతుంది….

  • మోకాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది…: ఫ్లాట్-ఫుట్ పొజిషన్‌లో కూర్చోవడం వల్ల మోకాళ్లు, నడుము,  వెన్నెముకపై ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది…

  • సురక్షితమైన డిజైన్…: వృద్ధులు లేదా దృష్టి లోపం ఉన్నవారు బ్యాలెన్స్ తప్పి ముందుకు లేదా వెనక్కి పడిపోకుండా ఇది సరైన ‘సెంటర్ ఆఫ్ గ్రావిటీ’ని అందిస్తుంది….

  • పరిశుభ్రత…: ఈ డిజైన్ వల్ల యూజర్ ఒకే దిశలో కూర్చునేలా ఉంటుంది… దీనివల్ల ఫ్లషింగ్ పక్కాగా జరిగి, తక్కువ నీటితో టాయిలెట్‌ను సులభంగా శుభ్రం చేయవచ్చు…

aretto

అంతర్జాతీయ గుర్తింపు.. కొత్త ప్రయాణం!

ఈ వినూత్న ఆవిష్కరణకు గాను సత్యజిత్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నాడు… అయితే ఆయన ప్రస్థానం ఇక్కడితో ఆగిపోలేదు… చిన్న పిల్లల పాదాలు వేగంగా పెరుగుతుంటాయి.., కానీ వారి షూస్ మాత్రం పెరగవు… ఈ సమస్యను గుర్తించిన సత్యజిత్ ‘అరెట్టో’ (Aretto) అనే స్టార్టప్‌ను ప్రారంభించాడు… ఇది పిల్లల పాదాల పరిమాణానికి అనుగుణంగా సాగే (Expanding footwear) బూట్లను తయారు చేస్తోంది…


ముగింపు…: సమస్య చిన్నదా పెద్దదా అన్నది ముఖ్యం కాదు.., దానికి మనం చూపే పరిష్కారం ఎంతమంది జీవితాలను మారుస్తుంది, ఎంతమంది అవస్థల్ని తీరుస్తుంది అన్నదే ముఖ్యం అని సత్యజిత్ మిట్టల్ నిరూపించాడు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చిన్న ఆవిష్కరణలే… చెప్పరాని అవస్థల్ని తీరుస్తాయి… ఇలా…!!
  • గొర్లు, బర్ల దాకా…! కేసీయార్ కరప్ట్ చేయని రంగం ఏమైనా మిగిలిందా..?!
  • “చచ్చావా… బతికావా?”…. చైనాలో సెన్సేషన్ సృష్టిస్తున్న కొత్త యాప్…!
  • ప్రజారాజ్యం పార్టీ పెట్టింది అక్కినేని..! ఎన్నికల్లో పోటీ కూడా చేశాడు..!!
  • భారత్‌కు చరిత్రాత్మక విజయం … అమెరికాకు వ్యూహాత్మక దెబ్బ…
  • కుంతి కోసం, నెత్తుటి మూలాల కోసం… ఓ డచ్ కర్ణుడి అన్వేషణ…
  • పండుగ స్పెషల్ షో అయినా సరే… అదే జబర్దస్త్ మార్క్ బూతు స్కిట్…
  • రాహుల్ ద్వంద్వ పౌరసత్వం… కోర్టులో ప్రస్తుత స్థితి… ఫ్యాక్ట్ చెక్…
  • ఈసారి నిజంగానే చంద్రుడిపై కాలు పెడతారట అమెరికన్లు..!!
  • అమెరికా చుట్టూ అసాధారణ లక్ష్మణరేఖ… 75 దేశాలకు వీసాల నిలిపివేత…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions