Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హోర్ముజ్ మాత్రమే కాదు – జిబ్రాల్టర్ జలసంధీ జియోపాలిటిక్స్ కేంద్రమే!!

September 6, 2026 by M S R

.

Pardha Saradhi Potluri … ఇజ్రాయేల్ కి సరఫరా ( సప్లైస్ – ఆయుధాలు, మందులు, ఆహారం, రా మెటీరియల్ లాంటివి ) జీబ్రాల్టార్ జలసంధి (gibraltar strait ) ద్వారా మధ్యధర సముద్రంలోకి ప్రవేశించి ఇజ్రాయేల్ లోని హైఫా పోర్టుకి చేరుతాయి!

జీబ్రాల్టార్ జలసంధి అట్లాంటిక్ సముద్రాన్ని మధ్యధరా సముద్రంతో కలుపుతుంది!
రోజుకి 300 నౌకలు జీబ్రాల్టర్ స్ట్రెయిట్ ద్వారా ప్రయాణిస్తుంటాయి!
స్పేయిన్ లోని సియుట నగరం జీబ్రాల్టార్ స్ట్రైట్ ఒడ్డున ఉంది! స్పేయిన్ నుండి మోరాకోకి వెనక్కి వెళ్లినట్లే వెళ్లిన మోరాకో యువకులు మళ్ళీ సియుటాలోకి ప్రవేశించారు! మొత్తం 70 వేల మంది మోరాకో యువకులు ప్రస్తుతం స్పెయిన్ లో ఉన్నారు!

Ads

ఇదెలా జరిగింది?
స్పెయిన్ కనుక జీబ్రాల్టర్ జలసంధిని మూసేస్తే ఇజ్రాయల్ కి సప్లైస్ ఆగిపోతాయి! ముందు జాగ్రత్తగా ఇజ్రాయేల్ మోరాకో నుండి యువకులని స్పెయిన్ లోకి పంపిస్తున్నది! స్పెయిన్ కనుక జీబ్రాల్టార్ స్ట్రెయిట్  మూసేయాలని ప్రయత్నిస్తే మోస్సాద్ డబ్బు, ఆయుధాలు ఇచ్చి స్పెయిన్ కి వ్యతిరేకంగా పోరాటం చేయిస్తుంది!

ఇజ్రాయేల్ ని వ్యతిరేకిస్తే స్పెయిన్ లాగానే అవుతాయి మిగతా యూరోప్ దేశాలు. ఇప్పటికే స్పెయిన్ నుండి ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్ దూరంగా జరిగేసాయి. స్పెయిన్ నుండి వచ్చే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతి ఇస్తున్నాయి.

మూర్ఖులు అంతా భారత ఉపఖండంలో ఉన్నారు.
ISIS, అల్ ఖైదా, CIA, మోస్సాద్ చెప్పినట్లు చేస్తాయి. ముస్లిం బ్రదర్ హుడ్ వీటిని కంట్రోల్ చేస్తుంటాయి. పాకిస్తాన్, బాంగ్లాదేశ్, భారత్ లోని ముస్లిమ్స్ ఇజ్రాయేల్ కి వ్యతిరేకంగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు! పాలస్తినాలో జరుగుతున్న దాని మీద అరబ్ దేశాలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయో ఈ మూర్ఖులకి తెలియదు!

ఇజ్రాయేల్ కి వ్యతిరేకంగా ఉండకుండా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని చాలా లౌక్యంగా ప్రవర్తిస్తున్నది. ఇటలీ కూడా స్పెయిన్ నుండి దూరంగా జరుగుతున్నది!
స్పెయిన్ లోని ప్రధాన నగరాలలలో ముస్లిం వలసలని వ్యతిరేకిస్తూ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారు!

సెక్యులరిజమ్?
సెక్యులరిజం పేరుతో రాజ్యాంగం వ్రాసుకొని ఇప్పుడు ఏడుస్తున్నారు!
స్పెయిన్ సుప్రీం కోర్టు తీర్పు స్పెయిన్ ప్రజల పాలిట శాపం అయి కూర్చున్నది!
స్పెయిన్ సుప్రీం కోర్ట్ తీర్పు : ఇతర దేశాలనుండి స్పెయిన్ లోకి శరణార్థులుగా వచ్చే వారిని వెంటనే వెనక్కి పంపడానికి వీల్లేదు! వాళ్లకి తిండి, గూడు ఏర్పాటు చేసి వాళ్ళు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశంతో సంప్రదింపులు జరిపి అప్పుడు వెనక్కి పంపాలి! ఇది సరిహద్దులు దాటి వచ్చిన శరణార్థులకి వర్తిస్తుంది.
మరి సముద్రం ద్వారా పడవలలో, ఈదుకుంటూ వచ్చిన వాళ్ళైతే?

ఇలా వచ్చిన వాళ్ళని దయతో చూడాలి! వెంటనే తిరిగి పంపకూడదు! యూరోపియన్ యూనియన్ చట్టాల ప్రకారం స్పెయిన్ ఎంత మంది శరణార్థులని తీసుకోవచ్చో అంతమందికి ఆశ్రయం ఇవ్వాలి. కాల్పులు జరపడం చేయకూడదు!

స్పెయిన్ లోని హై కోర్టు తీర్పు ఎలా ఉందో చూడండి! స్పెయిన్ లోని హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం స్థానిక ప్రభుత్వాలు శరణార్థులని నిరోధించే ఎలాంటి చట్టాలు చేయడానికి వీల్లేదు. యూరోపియన్ యూనియన్ చట్టాలతో పాటు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం నడుచుకోవాలి!

అటు యూరోపియన్ యూనియన్ చట్టాలు, స్పెయిన్ సుప్రీం కోర్టు, హై కోర్టులు ఇచ్చిన తీర్పులతో స్పెయిన్ ప్రభుత్వం, ప్రజలు భరించాల్సి వస్తున్నది.
ఉన్నత న్యాయస్థానాలు భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకొని తీర్పులు ఇవ్వాలి లేకపోతే ఇలానే అవుతుంది!
అమెరికా, ఇజ్రాయేల్ అన్నిదేశాల చట్టాలు, న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులని నిత్యం స్టడీ చేస్తుంటాయి. ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి!

సముద్రమార్గం ద్వారా స్పెయిన్ లోకి వెళ్లాలని యువకులకి చెప్పి మరీ పంపించింది ఇజ్రాయేల్!
మోరాకో రాజరిక వ్యవస్థ ఉన్న దేశం!
మోరాకో రాజు మొహమ్మద్ VI. 1999 నుండి మోరాకోకి రాజుగా వ్యవహరిస్తున్నాడు. ఇక ప్రధానమంత్రి కమ్ అధ్యక్షుడిగా అజిజ్ అఖనౌజ్ వ్యవహరిస్తున్నాడు!

అజిజ్ ధనవంతుడైన బిజినెస్ మాన్. మోరాకోలో అవినీతికి కొదువలేదు. ఏకంగా అజిజ్ కి వ్యాపారాలు ఉన్నాయి కాబట్టే స్పెయిన్ లొకి యువకులని పంపిస్తే, అతని బిజినెస్ కి సహకరిస్తామని ఇజ్రాయేల్ చెప్పడమే కాదు చేసి చూపించింది కూడా… To be continued ….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హోర్ముజ్ మాత్రమే కాదు – జిబ్రాల్టర్ జలసంధీ జియోపాలిటిక్స్ కేంద్రమే!!
  • మన గుండెలు రాళ్లు… నవ్వినా, ఏడ్చినా వాటికి పెద్ద ఫరక్ పడదు…
  • Just డేటా సెంటర్ కాదు… తెలంగాణ భవిష్యత్తుకు ‘కంప్యూట్ పవర్’!
  • సారూ, ఒక్కరిని… ప్లీజ్ ఇలాంటి ఒక్క గురువును చూపించండయ్యా…
  • ఈసారి బిగ్‌బాస్ ఎంపికలు- వైవిధ్యం తక్కువ ! తెలిసిన మొహాలూ తక్కువ !
  • ఉండవల్లి అంటే ఉడుంపట్టు ! కానీ పోరాటమార్గాలు ఏం మిగిలాయి !?
  • అమెరికా ఆధిపత్యానికి అంతిమరోజులు – చైనా నోస్ట్రడామస్ జోస్యం
  • పాపం టాక్సిక్ – ఈ హాలీవుడ్ అద్దకం మరింత వికటించింది !
  • ఈ సినిమా తరువాత ‘రష్మి’ మళ్లీ ఏ సినిమాలోనూ కనిపించినట్టు లేదు!!
  • ఉచ్చకు హిమాలయాలే కరిగిపోతున్నాయట! ఓ స్టడీ చెబుతోంది!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions