.
ఏపీ పొలిటికల్ సర్కిళ్లే కాదు, సౌత్ పాలిటిక్స్‌లో కూడా ఓ చర్చ జరుగుతోంది… జగన్‌ను లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు చేస్తారా..? బెయిల్‌పై ఉండి, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడనే కారణంతో పాత బెయిల్ రద్దు చేసి, ఇంకా బిగిస్తారా..? ఇదీ చర్చ…
కానీ జగన్ బీజేపీకి లాంగ్ టరమ్ ఫ్రెండ్… చంద్రబాబులు, పవన్ కల్యాణ్‌లు వస్తుంటారు, పోతుంటారు… అప్పుడే తిడతారు, అప్పుడే కలుస్తారు… కానీ బీజేపీతో ఏ కూటమితో లేకపోయినా, ఏ బహిరంగ అవగాహన లేకపోయినా జగన్- బీజేపీ గుప్త స్నేహం కొనసాగుతూనే ఉంది…
Ads
సరే, తన కేసుల నుంచి రక్షణ కోసం అవసరార్థం జగన్ దోస్తీ అనే విమర్శలున్నా సరే… ఏపీ పాలిటిక్స్‌కు సంబంధించి జగన్ పట్ల ఈరోజుకూ బీజేపీకి కోపం లేదు, దూరం చేసుకోవాలనీ లేదు… కానీ… మొన్న ఏబీఎన్ రాధాకృష్ణ రాసుకొచ్చాడు కదా…
‘‘జగన్ తన పాలనలో విపరీతంగా మతమార్పిళ్లను ప్రోత్సహించాడు, ఇకపై తన సంపాదనలో పది శాతం చర్చిల కోసం ఖర్చు పెట్టబోతున్నాడు… మరోవైపు తమిళనాడులో విజయ్‌తో దోస్తీ పెరిగింది… విజయ్ రాగానే తమ రాజ్యం వచ్చిందని క్రిస్టియన్లు ఆనందపడుతున్నారు… తెలంగాణలోనూ మతమార్పిళ్లు పెరిగాయి, ఇలా పెరుగుతున్న క్రిస్టియన్లను వోటు బ్యాంకులుగా చేసుకుని, ఇంకా దూకుడుగా వెళ్లే తంత్రం జగన్ ప్లస్ విజయ్‌ది…‘‘
ఈ పరిణామాలు రాను రాను దక్షిణాన తమ రాజకీయ ఆకాంక్షలకు ప్రతికూలం అవుతాయనే భయంతో ఉన్న బీజేపీ… ముందుగా విజయ్ ప్రబల ప్రత్యర్థిగా మారిన, కాంగ్రెస్ ఇండికూటమి నుంచి బయటపడిన డీఎంకే స్టాలిన్‌తో సయోధ్య ప్రయత్నాల్లో పడిందనే విశ్లేషణ వినిపిస్తున్నదే… గతంలో కరుణానిధి హయాంలో ఒకటీరెండుసార్లు బీజేపీతో మితృత్వం కొనసాగిన పాత ఉదాహరణలు కూడా ఉన్నాయి…
తెలంగాణలో పీఠం దక్కించుకోవాలనే తహతహ ఉన్న బీజేపీకి ఒకవేళ జగన్ తన వల్ల పెరిగే క్రిస్టియన్ వోట్లతో గనుక బలం పెంచుకుంటే, అవి కేసీయార్‌కు వోట్ల చీలిక ద్వారా ఉపయోగపడుతుందనే భావనలూ ఉన్నవే… సో, ఏరకంగా చూసినా జగన్ కొరకరాని కొయ్యగా మారుతాడనే ఆందోళన కొత్తగా బీజేపీలో మొదలైందనీ, పైగా జగన్‌ను జైలులో వేయాలనే డిమాండ్‌ను పవన్ కల్యాణ్, చంద్రబాబు పదే పదే మోదీ దగ్గర పెడుతున్నారనే వార్తలు కూడా చదువుతున్నవే…
‘‘లిక్కర్ స్కామ్‌లో పెద్ద తలకాయలు (పెద్ద చేప) అరెస్ట్ కాబోతున్నాయని’’ ఏపీ బీజేపీ చీఫ్ పి.వి.ఎన్. మాధవ్ చెబుతుండటంతో… ఈ పొలిటికల్ డిబేట్ ఇంకాస్త పెరిగింది… బహుశా బీజేపీ హైకమాండ్ అనుమతితోనే జగన్‌ను బహుముఖంగా ఫిక్స్ చేయాలనేది కూటమి ప్రయత్నం కావచ్చు… పైగా ఇంత సుదీర్ఘ రాజకీయ జీవితంలో మొదటిసారి జగన్ వల్ల తాను జైలుపాలయ్యాననే కోపం చంద్రబాబులో ఉండే ఉంటుంది… బయటికి కనిపించకపోయినా సరే…
ఎలాగూ సుప్రీం కోర్టు ప్రజాప్రతినిధులపై కేసుల్ని త్వరగా డిస్పోజ్ చేయాలని చెబుతోంది, సో, ఏదో ఓ కేసులో శిక్ష విధింపునకు గురైతే జగన్‌ను ఏకంగా పోటీకే అనర్హుడిని చేయాలనే ప్లాన్ కూడా ఉందంటున్నారు…
మరోవైపు విజయమ్మనే ముందుబెట్టి… చెల్లెలు షర్మిలతో ఆస్తి తగాదాలను కూడా జగన్ ఓ కొలిక్కి తెచ్చుకుంటున్నాడనీ, సయోధ్య కుదిరినట్టేనని కూడా చెబుతున్నారు… అదే జరిగితే ఆమె పాలిటిక్స్‌లో కొనసాగకపోవచ్చు కూడా… ఏమో, జగన్ ఇండి కూటమి వైపు కదిలినా ఆశ్చర్యపడనక్కర్లేదు… సో, ఏపీ పాలిటిక్స్‌లో రాబోయే రోజుల్లో ఆసక్తికరమైన, సంచలన పరిణామాలను మనం చూడబోతున్నామా..?
Share this Article