పార్ధసారధి పోట్లూరి …… ఉత్తరప్రదేశ్ : అజామ్ ఖాన్ తో పాటు అతని. భార్య, కొడుకుకి 7 సంవత్సరాల కారాగార శిక్ష పడ్డది! ఉత్తరప్రదేశ్ రాజకీయానికి వస్తే 90 వ దశకంలో ములాయం సింగ్ యాదవ్, అజాం ఖాన్ పేర్లు ప్రముఖంగా వినపడేవి, కనపడేవి! అజాం ఖాన్ అంటే సమాజ్ వాదీ పార్టీ లేదా లాల్ టోపీ పార్టీగా అభివర్ణించేవారు! అప్పటి ముఖ్యమంత్రి ములాయoసింగ్ యాదవ్ తరువాత నంబర్ 2 అజాం ఖాన్ . అఖిలేష్ యాదవ్ అప్పటికే రాజకీయాలలో ఉన్నా, పార్టీలో అజాం ఖాన్ నంబర్ టూ అనే పిలిచేవి పత్రికలు.
**********************
ములాయం సింగ్ యాదవ్ ఎక్కడ ఉంటే అక్కడ అజాం ఖాన్ ఉండేవాడు, అది ప్రభుత్వ కార్యక్రమం అయినా పార్టీ కార్యక్రమం అయినా… సుదీర్ఘకాలం ఉత్తరప్రదేశ్ ని పాలించిన సమాజ్వాదీ పార్టీలో అజాం ఖాన్ పాత్ర ఎలాంటిది అంటే …… పారిశ్రామికవేత్తలు, IAS, IPS, వ్యాపారవేత్తలు ఇలా ఎవరికయినా పని కావాలంటే అజాం ఖాన్ ని కలిస్తే చాలు వాళ్ళకి కావాల్సిన పని చేసిపెట్టేవాడు అజాం ఖాన్. ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం ఉండేది కాదు ఎవరికీ! చివరికి అఖిలేష్ యాదవ్ వల్ల కూడా కాని పనిని అజాం ఖాన్ చేసిపెట్టేవాడు.
Ads
********************
పోలీస్ డిపార్ట్మెంట్ అయితే DGP నుండి SHO వరకు అజాం ఖాన్ నుండి ఫోన్ వస్తే చెప్పిన పని చేసేవాళ్ళు. ఇక పరిపాలనా విభాగం అయితే చీఫ్ సెక్రటరీ నుండి తహశీల్దార్ వరకు ఒక్క ఫోన్ కాల్ తో పన్చేయించుకునే వాడు అజాం ఖాన్! కానీ కాలం యోగి ఆదిత్యనాధ్ రూపంలో కాటు వేసింది!అజాం ఖాన్ అతని కుటుంబం మొత్తం జైలు పాలయ్యారు. ఫోర్జరీ, చీటింగ్, ఫ్రాడ్ మరియు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేసారంటూ IPC సెక్షన్లు 420 / 467 / 468 / 471 / 120B కింద అభియోగాలని మోపి వాటిని నిరూపించిన కారణంగా 7 ఏళ్ళు జైలు శిక్ష విధించింది రామ్ పూర్ కోర్టు.
*****************
ఇక అజాం ఖాన్ భార్య అయిన తాన్ సేన్ ఫాతిమా, కొడుకు అబ్దుల్లాలు ఇద్దరూ తమ పుట్టిన రోజు ధ్రువీకరణ పత్రాలని ఫోర్జరీ చేసి తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారు. 1990 లో రామ్ పూర్ మునిసిపాలిటీ ఎన్నికలలో ఇచ్చిన అఫిడవిట్ లో తమ పుట్టినరోజు ధృవ పత్రాలలో ఇచ్చిన తేదీ ఒకటయితే, 1993 లో లక్నో మునిసిపల్ ఎన్నికల కోసం ఇచ్చిన అఫిడవిట్ లో వేరే తేదీలు ఉన్నాయి. కానీ రెండుచోట్ల ఇచ్చిన పుట్టిన రోజు తేదీలు అసలువి కాదు. అబ్దుల్లా నకిలీ పాస్పోర్ట్ తో విదేశాలకు వెళ్లి వచ్చాడు.
*****************
అజాం ఖాన్ కి 2019 లో రెండేళ్ల జైలు శిక్ష, 2022 లో మూడేళ్ళ జైలు శిక్ష విధించింది మొరాదాబాద్ కోర్టు వివిధ నేరాల మీద. అప్పట్లో MLA గా ఉన్న అజాం ఖాన్ తన పదవిని కోల్పోయాడు. ఇదే అజాం ఖాన్ 2014 లో మోదీ ప్రధానమంత్రి అయ్యాక ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది ‘ అంటూ ప్రకటన చేశాడు. ఇప్పుడు 7 ఏళ్ళు రాంపూర్ జైల్లో నిజమయిన ప్రజాస్వామ్యాన్ని అనుభవించబోతున్నాడు!
******************
ఇంతా చెప్పుకొని అసలు విషయం చెప్పుకోక పోతే దర్జా తగ్గిపోతుంది! మన బుల్డోజర్ బాబా పేరు ఇప్పుడు ఇటలీ దేశంలో మారుమోగుతున్నది!ఇటలీ ప్రధాని జార్జ్ మెలోనీ ఇటలీ దేశంలో ఉంటున్న అక్రమ వలసదారులని అరెస్ట్ చేసి దేశం నుండి వాళ్ళ వాళ్ళ దేశాలకి పంపించే పనిలో ఉంది! ఇప్పటికే బుల్డోజర్లతో అక్రమ నివాసాలని కూల్చి వేస్తున్నది. ఒకే కార్యక్రమం… అది అక్రమ వలసదారులని గుర్తించడం ,అరెస్ట్ చేయడం, వాళ్ళ నివాసాలాని కూల్చివేయడం వాళ్ళని వాళ్ళ దేశాలకి పంపించడం !
‘నేను ఇటలీని మరో మధ్యప్రాచ్యం కానివ్వను’ :: జార్జ్ మెలోని! గత సంవత్సరం ఎన్నికల ముందు జార్జ్ మెలోని చెప్పింది మరో సారి గుర్తు చేసుకుందాము! నేను అధికారంలోకి వస్తే అక్రమంగా కట్టిన ప్రార్థన స్థలాలను కూలగొడతా! సిరియా, ఆఫ్ఘనిస్థాన్ నుండి వచ్చి అక్రమంగా ఇటలీలో ఉంటున్న వారిని దేశం నుండి వెళ్ల గొడతా! రైట్ వింగ్ నేషనలిస్ట్ అయిన జార్జ్ మెలోని గెలిచి ప్రధాని అయ్యింది. కానీ హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ మీద చేసిన దాడి చూసి అక్రమ వలస దారుల మీద కఠిన చర్యలకు ఉపక్రమించింది జార్జ్ మెలోని! బుల్డోజర్ బాబా మోడల్ ని అనుసరిస్తున్న జార్జ్ మెలోని అంటూ ఇటాలియన్ మీడియా వార్తలు వ్రాస్తోంది…!
Share this Article