.
Subramanyam Dogiparthi …. Hats off to EVV and Divakara Babu Madabhushi . అసలు ఇవివి గారికి ఈ జంబలకిడి పంబ కాన్సెప్ట్ బుర్రలోకి రావటమే ఓ వండర్ . ఆయన కాన్సెప్టుకి దగ్గరగా మాదిరెడ్డి సులోచన గారు ఓ నాటకం వ్రాసారట . ఈ రెండింటినీ కలిపి దివాకర్ బాబు గారి సహకారంతో ఈ జంబలకిడి పంబ సినిమా కధను రూపొందించారు .
బహుశా ఇలాంటి కాన్సెప్టుతో దీనికి ముందు ఏ సినిమా వచ్చి ఉండదు . It’s a fantasy . ఆడాళ్ళు మగాళ్లు కావటం ఏంటి మగాళ్లు ఆడాళ్ళు కావటం ఏంటి !! పిల్లలు పెద్దోళ్ళలా ప్రవర్తించటం పెద్దోళ్ళు పిల్లల్లాగా ప్రవర్తించటం !! ఒకరి అవయవాలు మరొకరికి రావటం !! డబ్బింగ్ జానకి మందు కొట్టడం !! మా గుంటూరు మిత్రుడు సుభాష్ ని మా గుంటూరు వగలరాణి జయలలిత నిర్దాక్షిణ్యంగా రేప్ చేయటం !! వాయ్యో ఏంటి ఈ అఘాయిత్యాలు ? ఏంటి ఈ అకృత్యాలు ?
Ads
- ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఈరోజుకీ rarest of rare సినిమాలలో ఒకటిగా నిలబడింది . మొదట 1992 లో విడుదల చేసారట . ప్రేక్షకులు అసలు గమనించనే లేదంట . తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి మరలా 1993 జూలైలో రిలీజ్ చేస్తే దుమ్ము దులిపిందట .
విశాఖపట్టణంలో ఓ యువతి మగాళ్ళు ఆడాళ్ళ మీద చేసే దాష్టికాలతో చిరాకేసింది . ఆమెకు ఒక యోగిని జంబలకిడి పంబ అనే మందుని నగర ప్రజలు తాగే నీటిలో కలపమని చెపుతుంది . ఆ యోగిని శిష్యుడు కళ్ళు చిదంబరం పంబలకిడి జంబ అనే మందుని కూడా కలిపి ఇస్తాడు .
ఆ నీటిని తాగిన విశాఖ ప్రజలు అటూ ఇటూ మారిపోతారు . ఈ గొడవను ఛేదిస్తానికి వచ్చిన పోలీస్ ఇనస్పెక్టర్ నరేష్ విషయాలను కనిబెట్టి ఆమనిని ప్రేమిస్తున్నట్లు నటించి రంగం లోకి దింపుతాడు . ఆమెకు బుధ్ధి తెప్పించి విరుగుడు మందుని నీళ్ళల్లో కలిపి అందరినీ సాధారణ స్థితికి తీసుకుని రావటంతో సినిమా శుభాంతం అవుతుంది .

ఈ సినిమాలో హాస్య నట బృందం అంతా ఇరగతీసేసారు . వీరు కాకుండా అదరగొట్టేసింది తూటాల రాణి , గంటల రాణి జయలలిత . పిచ్చెక్కనున్న విశాఖను దోచుకోవటానికి తన సైన్యంతో స్టువార్టుపురం నుండి విశాఖకు వచ్చి చేసే హడావుడి గోలగోలగా ఉంటుంది . Can only be enjoyed .
ప్రధాన పాత్రల్లో నరేష్ , ఆమని , బ్రహ్మానందం , శ్రీలక్ష్మి , కోట శ్రీనివాసరావు , డబ్బింగ్ జానకి , ఆలీ , ఐరన్ లెగ్ శాస్త్రి , చిడతల అప్పారావు , మహర్షి రాఘవ , మల్లికార్జున రావు , ఆలపాటి లక్ష్మి , కల్పనారాయ్ , జయప్రకాష్ రెడ్డి , బాబూమోహన్ , మాస్టర్ ఆదిత్య తదితరులు నటించారు .
Black comedy అయినా చెప్పుకోక తప్పని కొన్ని సీన్లలో ఒకటి మల్లిఖార్జున రావు భార్యకు ప్రసవం అయితే బ్రహ్మానందానికి పురిటి నొప్పులు రావటం . ఈ కాన్సెప్ట్ మీద పూర్వం కొన్ని జోకులు ఉండేవి . ఒకసారి ఆడవాళ్లు అందరూ దేవుడిని వరం అడిగారట . పురిటి నొప్పులు ఎలా ఉంటాయో మగ పుంగవులకూ తెలవాలి కాబట్టి నొప్పులు తమకు కాకుండా మగవారికి వచ్చేలా వరం ఇవ్వమన్నారట . దేవుడు తధాస్తు అన్నాడట . ఈ సినిమాలో జరిగినట్లు జరగటం , శాల్తీలు లేచిపోవటం జరగటంతో మళ్ళా ఆడవాళ్లు మగవాళ్ళు జాయింటుగా తపస్సు చేసి దేవుడి చేత ఆ వరాన్ని తీసేపించుకున్నారట . హమ్మయ్య !

అలాగే male brothels house . నిర్వాహకుడిగా మా మరో గుంటూరు నటుడు జయప్రకాష్ రెడ్డి . ఇవన్నీ కాస్త black comedy యే అయినా ఈ సినిమాకు ఇవన్నీ తప్పవు . అసలు కాన్సెప్టే అది కదా ! రివర్స్ గేర్ .
రాజ్ కోటి సంగీత దర్శకత్వంలో భువనచంద్ర వ్రాసిన పాటలు బాగుంటాయి . హైలైట్ రీమిక్స్ & పేరడీ పాట నిలవరా వాలు కనుల వాడా . చాలా పాత పాటల్ని సందర్భోచితంగా బాగా ఉపయోగించుకున్నారు . మరో పాట అలాంటిదే వినరా కనరా అంటూ సాగేది .
నేనే సూపర్ మేన్ అంటూ సాగే టీజింగ్ సాంగ్ , నరేష్ ఆమనిల మీద డ్యూయెట్లు మదనా తగునా , యమ్మా యమ్మా యమ్మా ఇవివి చాలా రొమాంటిగ్గా చిత్రీకరించారు . బాలసుబ్రమణ్యం , మనో , చిత్ర , శైలజ , శుభ , రాధిక శ్రావ్యంగా పాడారు .
కన్నడంలోకి రీమేక్ అయింది . సినిమా యూట్యూబులో ఉంది . బహుశా చూడనివారు ఉండరేమో ! ఒకరూ అరా ఉంటే చూసేయండి . Excellent entertainer .
Share this Article